వైవా హర్ష, విజయ్‌కుమార్, ఆర్విన్, నిఖిల్, ఎల్లయ్య
‘‘బాల 369’ కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది. థియేటర్‌లో కూర్చుని ప్రపంచ యాత్ర చేయాలంటే ఈ సినిమాకు వస్తే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ తెలి పారు. ఆర్విన్ తేజ్ హీరోగా ‘వెన్నెల’ కిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘బాల 369’. వైవా హర్ష సమర్పణలో విజయ్‌కుమార్ కలివరపు, ఎల్లయ్య నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజ్ కానుంది.
గురువారం జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యారు నిఖిల్ సిద్ధార్థ. విజయ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘అల్లసాని పెద్దన రచించిన ‘మనుచరిత్ర’లోని ‘అటజని కాంచే’ పద్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రకథ రాశాను’’ అని చెప్పారు. ‘‘మా అబ్బాయి ఆర్విన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు’’ అని ఎల్లయ్య పేర్కొన్నారు.


