'ఐ హేట్ మ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | I Hate Marriage movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

'ఐ హేట్ మ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Nov 26 2026 9:24 PM | Updated on Nov 26 2026 9:33 PM

I Hate Marriage movie Review And Rating In Telugu

టైటిల్‌: 'ఐ హేట్ మ్యారేజ్'
నటీనటులు: సుగి విజయ్, జుప్సి భద్ర, హారిక రాజేందర్, సాహితి కృష్ణ, పృథ్వీరాజ్, రవివర్మ.. తదితరులు
నిర్మాతలు: దయానంద్ మదం, కార్తీక్ వెంపటి..
దర్శకత్వం: పరమేష్ రేణుకుంట్ల
సంగీతం: వరికుప్పల యాదగిరి
సినిమాటోగ్రఫీ: విజయ్ C కుమార్
విడుదల తేది: నవంబర్‌ 27, 2026

ఐ హేట్ మ్యారేజ్ అనే టైటిల్ తో బోల్డ్ డైలాగ్స్ ఉన్న ట్రైలర్ తో చిన్న సినిమా అయినా ప్రమోషన్స్ చేయడంతో మరో యూత్ సినిమా వస్తుంది అని తెలిసింది. ప్రమోషన్స్ లో దర్శకుడు రియల్ లైఫ్ లో అమ్మాయిలు ఇలా ఉన్నారంటూ చేసిన కామెంట్స్ తో ఈ సినిమా రెండు రోజులుగా వైరల్ అయింది. మరి ఈ ఐ హేట్ మ్యారేజ్ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. 

కథేంటంటే.. 
జాహ్నవి(జుప్సి భద్ర), మీనాక్షి(హారిక రాజేందర్), భారతి(సాహితి కృష్ణ) ఈ ముగ్గురు అమ్మాయిలు ఒక లేడీస్ హాస్టల్ లో ఉంటారు. మీనాక్షి జాబ్ చేస్తూ ఉంటుంది. ఎవరు ప్రపోజ్ చేసినా నో చెప్తూ పెళ్లి ఇష్టం లేదు అంటూ తనకు నచ్చినట్టు బతుకుతుంది. భారతి ఎన్నో ఆశలతో జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిన పల్లెటూరి అమ్మాయి. జాబ్ కోసం డబ్బులు కట్టి మోసపోయి జాబ్ ట్రైల్స్ వేస్తూ ఉంటుంది. ఇక జాహ్నవికి బాయ్ ఫ్రెండ్ ఉండాలి, తనతో తిరగలి, రొమాన్స్ చేయాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి అని కోరికలు ఉంటాయి. కానీ పెళ్లి మాత్రం తండ్రి(రవివర్మ) చూపించిన అబ్బాయినే చేసుకుంటాను అని మాట ఇస్తుంది. దాంతో పెళ్లి ముందు వరకు ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ లేకుండా తనతో తిరిగే అబ్బాయికోసం వెతుకుతూ ఉంటుంది. జాహ్నవికి అలాంటి అబ్బాయిగా సినిమా డైరెక్టర్ ప్రయత్నాలు చేసే రామ్(సుగి విజయ్) దొరుకుతాడు. అతనితో ప్రయాణం ఎలా సాగింది? భారతికి జాబ్ వచ్చిందా?మీనాక్షి పెళ్లి చేసుకుంటుందా? వీరి ముగ్గురు జీవితాలు ఎలా మారాయి? హైదరాబాద్ లో హాస్టల్స్ లో ఉంటూ అమ్మాయిలు ఏం చేస్తున్నారు.. అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

ఎలా ఉందంటే..
ట్రైలర్, టీజర్స్, సాంగ్స్ తోనే ఈ సినిమా ఎలా ఉంటుందో ముందే హింట్ ఇచ్చేసారు. గతంలో 3G లవ్, బస్ స్టాప్, ఈ రోజుల్లో, ఇపుడు కాక ఇంకెప్పుడు.. లాంటి సినిమాలు గుర్తొస్తాయి ఈ సినిమా చూస్తుంటే. సినిమా అంతా ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు ఎలా ఉంటున్నారు, ఎలా మారిపోతున్నారు అని కాస్త బోల్డ్ గా చూపించి చివర్లో ఒక మెసేజ్ ఇవ్వడం లాంటి కథ ఇది. 

ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు పాత్రల పరిచయం, జాహ్నవి - రామ్ మధ్య కథగా అసాగుతుంది. అక్కడక్కడ బోల్డ్ డైలాగ్స్, రియాలిటీలో జాబ్స్ అని చెప్పే మోసాలు.. ఇవన్నీ చూపిస్తూ కాస్త సాగదీశారు. పృథ్వీరాజ్ లేడీస్ హాస్టల్ వాచ్ మెన్ పాత్రలో హాస్టల్ లో ఉండే అమ్మాయిల మీద సెటైర్లు వేస్తూ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. సినిమాలో హీరో సినిమా డైరెక్షన్ కోసం ప్రయత్నాలు చేయడం, కథ రాయడం.. అనే పాత్రతో సినిమా టచ్ ఇచ్చారు. హీరో సినిమా సీన్స్ అంటూ ఇంటర్వెల్ ఇంటర్వెల్ అని కొన్ని సీన్స్ డిస్కస్ చేసి నిజంగానే రొటీన్ సీన్ తో ఇంటర్వెల్ ఇస్తారు. 

ఇక సెకండ్ హాఫ్ అంతా రామ్ - జాహ్నవి ప్రేమ, ఎమోషన్ తో, కొన్ని రొమాంటిక్ సీన్స్ తో సాగుతుంది. మీనాక్షి, ఆమె తల్లి పాత్రతో పెళ్లి గురించి చెప్పే డైలాగ్స్ కొంత షాకింగ్ గానే అనిపిస్తాయి. బయట ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. భారతి లాంటి పాత్ర కొన్ని వందల సినిమాల్లో చూసేసాము. భారతి పాత్రతో పేరెంట్స్ కలలు నిజం చేయడానికి, జాబ్ కోసం అమ్మాయిలు ఎలా కష్టపడతారు, బాధపడతారు అనే మెసేజ్ చెప్పే ప్రయత్నం చేసారు. క్లైమాక్స్ సరైన ముగింపు లేకుండానే రామ్ - జాహ్నవి ప్రేమ సీన్స్ తో నడిపించారు. 

బయట సమాజంలో ఇటీవల వింటున్న కొన్ని సంఘటనలు, అమ్మాయిలు మారుతున్న తీరుపై సెటైరికల్ గా ఈ సినిమా కథ రాసుకున్నట్టు ఉంటుంది. రొటీన్ పాయింట్ అయినా కాస్త బోల్డ్ గా చెప్పే ప్రయత్నం చేసారు. ఫైనల్ ఏం మెసేజ్ యుద్ధం అనేది మాత్రం క్లారిటీ లేకుండానే కొంతమంది అమ్మాయిలు ఇలా ఉంటున్నారు అని చెప్పడానికే ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ సినిమా స్ర్టింగ్ లో జాబ్ వచ్చింది అంటుంది, మళ్ళీ కాలేజీలో చదువుతున్నట్టు చూపిస్తారు. ఇలా కొన్ని లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి. హీరో డైరెక్టర్ ప్రయత్నాలు చేయడం, కథ కోసం హీరోయిన్ తో ట్రావెల్ చేసి ఆమెతో ప్రేమలో పడటం, హీరోయిన్ తండ్రి ప్రేమని వ్యతిరేకించి చివర్లో ఒప్పుకోవడం.. లాంటి రొటీన్ సీన్స్, చివర్లో హాస్టల్ లో ఉండే అమ్మాయిలు అంతా అలా ఉండరు అని లెక్చర్ ఇప్పించడం లాంటి రొటీన్ కథనంతో కొత్తదనం ఏమి అనిపించదు. 

ఎవరెలా చేశారంటే.. 

హీరోయిన్ గా జుప్సి భద్ర మెప్పిస్తుంది. మోడ్రన్ పాత్రలో, సింపుల్ గా రెండు వేరియేషన్స్ లో బాగా నటించింది. సుగి విజయ్ దర్శకుడు అవ్వాలి అనే పాత్రలో పర్వాలేదనిపించారు. హారిక రాజేందర్ కాస్త బోల్డ్ పాత్రలో బాగానే నటించింది. సాహితి కృష్ణ ఎమోషన్ పండించే ప్రయత్నం చేసింది. వాచ్ మెన్ గా పృథ్వీరాజ్ కొత్త పాత్రలో కనిపించారు. రవి వర్మ, ప్రభావతి రొటీన్ తల్లితండ్రుల పాత్రలు. ఇందు, ఆశ్రీత వేముగంటి, శ్రీదేవి ఆర్రోజు, రాధ రాయసం, లోహిత్ కుమార్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో ఓకే అనిపిస్తారు. 

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అక్కర్లేకపోయినా కొన్ని చోట్ల హెవీగా ఇచ్చినట్టు అనిపిస్తుంది. సన్నివేశాలను మ్యూజిక్ డామినేట్ చేస్తుంది. పాటలు యావరేజ్. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను చూపించాలని రియాలిటీగా రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement