వీడు నటించగలడు అని నమ్మింది నానినే : నితిన్‌ | Hero Nithiin About nani | Sakshi
Sakshi News home page

Nithiin: నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్‌ నాని : నితిన్‌

Nov 26 2026 8:14 PM | Updated on Nov 26 2026 8:20 PM

Hero Nithiin About nani

హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్‌ రుక్మిణీ’. నేచురల్‌ స్టార్‌ నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘దండోరా’ ఫేమ్‌ మురళీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆఫియా సయీద్‌ కథానాయికగా నటిస్తోంది. డిసెంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న నితిన్‌.. నిర్మాత నాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చాలా థ్యాంక్స్‌ నాని
నితిన్‌ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు చాలా సినిమాలు లెక్కలు వేసుకొని చేశాను. కానీ తొలిసారి ఎలాంటి లెక్కలు వేసుకోకుండా మనసుతో ఈ సినిమా చేశాను. ఇందులో పాటలు ఉన్నాయా? ఫైట్లు ఉన్నాయా? అనే విషయాలను కూడా పట్టించుకోలేదు. నాని లేకపోతే ఈ సినిమా లేదు. ఇప్పటివరకు కమర్షియల్‌ సినిమాలు చేస్తూ వచ్చిన నన్ను.. ఇలాంటి కంటెంట్‌ ఉన్న చిత్రంలో నితిన్‌ నటించగలడని నమ్మింది నానినే. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్‌ నాని’ అని అన్నారు. 

(ఇదీ చదవండి: రేపే ‘భోగి’ రిలీజ్‌.. అనుపమ సంచలన పోస్ట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement