సమంత రీఎంట్రీ.. హీరో విశాల్‌ ఆశలు..! | Vishal Abhimanyudu 2 Samantha Re Entry In Movies | Sakshi
Sakshi News home page

సమంత రీఎంట్రీ.. హీరో విశాల్‌ ఆశలు..!

Nov 26 2026 3:02 PM | Updated on Nov 26 2026 3:02 PM

Vishal Abhimanyudu 2 Samantha Re Entry In Movies

కోలీవుడ్ హీరో విశాల్, డైరెక్టర్ పీఎస్ మిత్రన్ కాంబోలో 2018లో వచ్చిన చిత్రం ‘అభిమన్యుడు’. అప్పట్లో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

‘అభిమన్యుడు 2’ కోసం..
‘అభిమన్యుడు 2’ కోసం విశాల్, పీఎస్ మిత్రన్ సిద్ధమయినట్లు తెలుస్తోంది.  ఫస్ట్ పార్ట్‌లో ఫోన్ హ్యాకింగ్, డేటా చోరీ లాంటి అంశాలను చూపించిన మిత్రన్.. ఈసారి ఏఐ చుట్టూ తిరిగే ఓ స్టోరీని రెడీ చేశారని సమాచారం. ఈ భారీ ప్రాజెక్టును నిర్మించడానికి పలు సంస్థలతో చర్చలు కూడా జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

అయితే సమంత రీసెంట్‌గా తల్లి కావడంతో సినిమాలకు కాస్త దూరంగా ఉంది. ఆమె తిరిగి సినిమాల్లోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది. దీంతో ఆమె స్థానంలో వేరే హీరోయిన్‌ను తీసుకునే ఆలోచన చేయకుండా సమంత ఎప్పుడు రీఎంట్రీ ఇస్తే అప్పుడే షూటింగ్ మొదలుపెట్టాలని విశాల్, మిత్రన్ డిసైడ్ అయ్యారట.  దీంతో ఈ సినిమాపై ఉన్నఆశలన్ని సమంత వచ్చాకే నెరవేరేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

(ఇదీ చదవండి: అందుకే అమ్మాయిల గురించి బోల్డ్‌గా చూపించా: స్టార్‌ డైరెక్టర్‌ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement