దర్శకుడు కిరణ్ కర్నీడి మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. 2003లో ‘తొలి పరిచయం’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. దాదాపు 23 ఏళ్ల విరామం తర్వాత ‘స్ట్రైకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించారు.
కాగా యూనివర్సల్ మూవీస్ పతాకంపై కిరణ్ కర్నీడినే స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని.. థియేటర్లలో విడుదల చేసేందుకు అవసరమైన సాంకేతిక పనులు జరుగుతున్నాయని చిత్రబృందం వెల్లడించింది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ: నిత్యా మేనన్)


