పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఎప్పుడూ చెప్పలేదని నటి నిత్యా మేనన్ స్పష్టం చేశారు. జీవితంలో పెళ్లి కంటే సరైన వ్యక్తితో మంచి బంధం ఏర్పరచుకోవడమే తనకు ముఖ్యమని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన వ్యక్తిగత జీవితం, పెళ్లిపై ఉన్న అభిప్రాయాలను పంచుకున్నారు.
నాకు సిగ్గు ఎక్కువ..
‘నేను పెళ్లి చేసుకోను అని చెప్పినప్పుడు.. చాలామంది పెళ్లికి వ్యతిరేకమని, అసలు చేసుకోవాలనే ఆసక్తి లేదని భావించారు. కానీ నా ఉద్దేశం అది కాదు. నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. అయితే ఎలాంటి వ్యక్తి కావాలి? మా మధ్య బంధం ఎలా ఉండాలి? అనే విషయాలపై నాకు స్పష్టత ఉంది. కేవలం పెళ్లి చేసుకోవడమే నా లక్ష్యం కాదు. సరైన వ్యక్తితో సరైన బంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నా.
నాకు సిగ్గు ఎక్కువ. అందరి ముందు కనిపించడం అంతగా ఇష్టం ఉండదు. కొన్నిసార్లు అది అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే అలా ఎందుకు అనిపిస్తోంది? దాని వెనుక కారణమేంటి? అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఇది మనల్ని మనం అంచనా వేసుకునే విధానానికి సంబంధించిన విషయం’ అని ఆమె వివరించారు.
(ఇదీ చదవండి: అనిరుధ్ దంపతుల గ్రాండ్ విందు.. వైరల్‌గా వీడియో)


