బాహుబలికి మించిన ‘ఏకలవ్య’ టీజర్‌.. తెరపైకి ఏఐ హీరో | Eklavya web series introducing ai actor | Sakshi
Sakshi News home page

Lionsgate Play- Eklavya: సరికొత్తగా ఏఐ హీరో.. నేరుగా ఓటీటీలోకే..

Nov 25 2026 4:48 PM | Updated on Nov 25 2026 5:04 PM

Eklavya web series introducing ai actor

సినిమా రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే చిత్రీకరణ, గ్రాఫిక్స్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వంటి విభాగాల్లో ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా నటీనటుల స్థానంలోనూ ఏఐ ప్రవేశిస్తోంది. తొలిసారిగా ఏఐతో రూపొందించిన ఓ నటుడిని ప్రధాన పాత్రలో పరిచయం చేస్తూ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.

ఏకలవ్యుడి పాత్ర ఆధారంగా..
ప్రముఖ ఓటీటీ సంస్థ లయన్స్‌గేట్‌ ప్లే (Lionsgate Play) ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. మహాభారతంలోని ఏకలవ్యుడి పాత్ర ఆధారంగా ‘ఏకలవ్య’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తోంది. ఇందులో ప్రధాన పాత్రధారిని పూర్తిగా ఏఐ సాంకేతికతతోనే తీర్చిదిద్దారు. ఈ ఏఐ నటుడికి ‘యుగ్‌ ఆర్‌.ఏఐ’ (YUG R.Ai) అని పేరు పెట్టారు.

తాజాగా ఈ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. విభు పురి ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు రానుంది.

(ఇదీ చదవండి: ‘వారణాసి’కి భారీ ఓటీటీ డీల్‌..! ఇన్ని వందల కోట్లా..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement