‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు నటుడు విశ్వక్ సేన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన బ్లాక్‌బస్టర్ వేడుకలో విశ్వక్ సేన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
‘కాలేజీ రోజుల్లో నాతో గొడవపడిన ఓ వ్యక్తి.. ఆడిషన్స్‌లో అవకాశం రాకపోవడంతో నాపై కక్ష పెంచుకున్నాడు. ఓ అమ్మాయి పేరుతో నకిలీ జీమెయిల్ ఖాతా సృష్టించి తరుణ్ భాస్కర్‌కు బెదిరింపు మెయిల్ పంపించాడు. ఆ మెయిల్ చూసిన తరుణ్ భాస్కర్ తొలుత తనను సినిమా నుంచి తప్పించాడు’ అని తెలిపాడు.
భాస్కర్‌తో మాట్లాడా..
అయితే ఈ విషయంపై తర్వాత భాస్కర్‌తో మాట్లాడాను. ‘నాకు సినిమా వద్దు. కానీ ఆ మెయిల్ నాకు పంపించు. నేను నిర్దోషినని నిరూపించుకుంటాను అని అడిగాను. ఆ రోజు తరుణ్ నా మాట నమ్మి మెయిల్ పంపించారు. కేవలం 24 గంటల్లోనే అది ఓ వ్యక్తి చేసిన నకిలీ పని అని తేలిపోయింది. ఆ రోజు తరుణ్ నా మాట నమ్మకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేదో తెలీదు.
పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే. నా కన్నతల్లిదండ్రులు, మా అక్క నాకు 50 శాతం సంస్కారం నేర్పిస్తే.. మిగిలిన 50 శాతం తరుణ్ దగ్గరే నేర్చుకున్నాను. ఆయన నా రక్తసంబంధం లాంటి సోదరుడు’’ అంటూ విశ్వక్ భావోద్వేగానికి లోనయ్యారు.
(ఇదీ చదవండి: ‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ)
#VishwakSen about Tharun: Industry లో మర్యాద తగ్గిపోతుంది మళ్ళీ పాతాళం లోకి పడిపోయే time లో నన్ను బయటికి తీసావ్ #TharunBhascker https://t.co/KybAqL7PSa
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) November 24, 2026


