‘‘భోగి’ మొదలవడానికి నా చైల్డ్‌హుడ్ మెమోరీస్ ఒక కారణం. మా ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో రామగిరి గుట్ట అని ఒక చోటు ఉండేది. అక్కడ ఒక పర్టిక్యులర్ వ్యక్తి గురించి చాలా విషయాలు చెప్పేవారు. ఆ గుట్ట దగ్గర మూఢ శక్తుల కోసం ఒక వ్యక్తి ఏదో చేస్తున్నాడని అనేవారు. ఆ వ్యక్తి వస్తే మేమంతా చిన్న పిల్లలం పరిగెత్తేవాళ్లం. ఆ వ్యక్తి ఎందుకు వచ్చేవాడు? మేమంతా ఎందుకు పరిగెత్తేవాళ్లం? అనేది నేను ఇప్పుడే చెప్పను.
కాకపోతే ఆ ఇన్సిడెంట్ నా మనసులో నిలిచిపోయింది. కమర్షియల్‌గా ఒక సినిమా చేద్దామనుకున్నప్పుడు, ఇలా రూటెడ్‌గా ఒక కథ చేయాలని అనిపించింది. ‘భోగి’లో యాక్షన్, వయలెన్స్ అందరూ చూడగలిగేలా ఉంటాయి. ఎమోషనల్‌గా ప్రేక్షకులకు అద్భుతంగా కనెక్ట్ అవుతుంది’ అన్నారు దర్శకుడు సంపత్ నంది. ఆయన దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోగి’. నవంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సంపత్ నంది మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ శర్వానంద్‌కి ఈ కథను ఒక 15 నిమిషాల పాటు చెప్పాను. మనం కలిసి చేస్తే ఇలాంటి అద్భుతమైన కథ చేయాలని ఆయన చెప్పారు. వెంటనే ఓకే అన్నారు. తర్వాత మా జర్నీ మొదలైంది. ఇందులో ఆయన లుక్‌ను సెట్ చేయడానికి దాదాపు రెండు నెలలు పట్టింది. ఈ సినిమా కోసం ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ కావాలి. అప్పటి మనుషులు తినే దానికంటే ఎక్కువగా కష్టపడేవాళ్లు. అలాంటి లుక్ కావాలి. శర్వా పూర్తిగా సన్నబడ్డారు. ఇందులో మీసాలు, గడ్డాలు కూడా కావాలి. అలా ఆ పాత్రకు తగ్గట్టుగా ఎంతో కేర్ తీసుకుని ఆయనను మలిచాం. నాలుగైదు లుక్ ట్రయల్స్ తర్వాత ఫైనల్‌గా ఒక లుక్ సెట్ అయింది.
→ ఈ సినిమా కోసం 15 ఎకరాల్లో బొగ్గుల గుట్ట విలేజ్ సెట్ నిర్మించాం. అప్పట్లో చెట్లు, అన్ని వసతుల మధ్య గ్రామాలు ఉండేవి. అలాంటి ఒక ప్రాంతాన్ని చూసుకుని అక్కడ ఈ సెట్ నిర్మించాం. బడ్జెట్ పరంగా మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అయింది. అలాగే టైమ్ కూడా ఎక్కువ పట్టింది. ఇది మూడేళ్ల ప్రాజెక్ట్. నిర్మాత రాధమోహన్ గారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.
→ రక్తపాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ సినిమా సెన్సార్ రివైజింగ్ కమిటీకి వెళ్లింది. ఈ కథకు అలాంటి రక్తపాతం అవసరం. నేను తీసుకున్న కథలో రక్తపాతానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. రివైజింగ్ కమిటీలో కూడా మా సన్నివేశాల్ని ఏమీ తొలగించలేదు. మేము ఏదైతే తీశామో అది అలాగే ఉంది. కాకపోతే కొన్ని మ్యూట్స్ చెప్పారు. ఇందులో మూఢనమ్మకం అంశం కూడా ఉంది. అది మీరు థియేటర్‌లోనే చూడాలి.
→ ఇది అందరూ చూడగలిగే సినిమా. ట్రైలర్‌లోనే వైలెన్స్ ఉంటుందని చెప్పాను. ఒక మాస్ యాక్షన్, విలేజ్ రూటెడ్ కథ చేశాం. ఇప్పటివరకు శర్వానంద్ గారు ఇలాంటి సినిమా చేయలేదు. నేను కూడా చేయలేదు. శర్వానంద్ మంచి కథలు చేస్తుంటారు. ఆయన ఇలాంటి హై వయలెన్స్ ఉండే యాక్షన్ సినిమా చేయడంతో ఆయన లుక్, ఆయన మాట్లాడే ప్రతి మాట కొత్తగా అనిపిస్తాయి. ఈ సినిమాలో శర్వా గారు తెలంగాణ యాసను అద్భుతంగా, పర్ఫెక్ట్‌గా మాట్లాడారు.
→ ‘భోగి’ టైటిల్ చూసి సంక్రాంతి ముందు వచ్చే పండగ అనుకుంటున్నారు. ఇది సంక్రాంతికి ముందు వచ్చే భోగి కాదు. పాత విషయాల్ని, చెడును పాతరేసి, చంపిన తర్వాత వచ్చిన భోగి. ఆ ఊరు కొన్ని విషయాలను నమ్మింది. అవి కరెక్ట్ కాదని ప్రూవ్ చేయడమే కథానాయకుడి లక్ష్యం.ఇది రూటెడ్ కథ. అన్నాచెల్లెళ్ల కథ. అన్నాచెల్లెళ్ల ఎమోషన్ చుట్టూ తిరిగే కథ.
→ చంద్రబోస్ సినిమా చూశారు. ఆయనకు చాలా నచ్చింది. ఈ సినిమాలో సింగిల్ కార్డ్ అంతా ఆయనతోనే రాయించాను. ప్రతి అక్షరం ఆయనే రాశారు. కథ విని లొకేషన్‌కు వచ్చి, ఆఫీస్‌కు వచ్చి ఈ సినిమాతో చాలా జర్నీ చేశారు.
→ మొన్న ఒక స్నేహితుడు ఐటెం సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావని అడిగాడు. నా గత సినిమాలను పరిశీలించి ఆయన అలా అని ఉండవచ్చు. కాకపోతే ఈ సినిమా ఆ మీటర్‌లో ఉండదు. నా మీటర్‌కు కాస్త భిన్నంగా చేసిన సినిమా ఇది. చాలా కొత్తగా చేసే ప్రయత్నం చేశాను. నిజానికి ఇందులో ఒక ప్రత్యేకమైన గీతం ఉంది. కానీ అది కథకు అడ్డొస్తుందని భావించి చిత్రీకరించలేదు. కాకపోతే నా నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉంటాయి. మంచి కమర్షియల్ యాక్షన్ సినిమానే తీశాను. కాకపోతే ఇది నా వైపు నుంచి చాలా కొత్త సినిమా.
→ డింపుల్ హయాతి, అనుపమ ఇద్దరూ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆ పాత్రలు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. ఇందులో అనుపమ పాత్రకు స్వయంగా తనే డబ్బింగ్ చెప్పింది.
→ నిజానికి ఒకప్పుడు ఉర్దూ భాష కలవని తెలంగాణ ఉండేది. అలాంటి స్వచ్ఛమైన తెలంగాణ యాసలో మాట్లాడించే ప్రయత్నం చేశాను. నేను స్వతహాగా తెలంగాణ వాసిని. చిన్నప్పటి నుంచి నాకు ఆ భాష, యాస మీద పట్టు ఉంది. సాహిత్యం మీద కూడా పట్టు ఉంది. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా డైలాగ్స్ అన్నీ రాశాను.
→ బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ సక్సెస్ అయ్యాయి. తనలో చాలా ప్రతిభ ఉంది. గంటకో ట్యూన్ ఇవ్వగలడు. తను ఈ సినిమాకు ప్రాణం పెట్టాడు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లోని ఇంటిని అమ్మేసిన అనుష్క.. టాలీవుడ్‌కి గుడ్‌బై!


