బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తన కార్ల కలెక్షన్‌లో మరో లగ్జరీ కారును చేర్చుకున్నారు. ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ ల్యాండ్ రోవర్‌కు చెందిన డిఫెండర్ 110 ఆక్టా మోడల్‌ను తాజాగా కొనుగోలు చేశారు. అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ కారు కోసం ఆయన రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే షాహిద్ కపూర్ గ్యారేజీలో పలు ఖరీదైన ప్రీమియం కార్లు ఉన్నాయి. తాజాగా కొనుగోలు చేసిన డిఫెండర్ 110 ఆక్టా వాటి సరసన చేరింది. కాగా.. కొత్త కారులో ఆయన డ్రైవ్ చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
(ఇదీ చదవండి: కూతురు కొత్త ప్రయాణం..! రామ్ చరణ్‌కు స్పెషల్ మూమెంట్..?)
Shahid Kapoor with his new beast! 🔥 Land Rover Defender Octa 🖤🚙 #ShahidKapoor #DefenderOcta #LuxuryCars #CelebrityCars #CarLovers https://t.co/BviFaFHYue
— Mobility Leadership Journal (@MLJindia) November 19, 2026


