తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాతలకు జరుగుతున్న అన్యాయం, థియేటర్ల కేటాయింపులో వివక్ష, పారదర్శకత లోపంపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
గత ఏడాదిన్నరగా తాను నిర్మించిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రానికి తగినన్ని థియేటర్లు, షోలు లభించకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. షెరాజ్ మెహదీ, తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై వివక్ష పెరిగిపోయిందని ఆరోపించారు. కలెక్టర్‌ను కలిసి అన్ని వివరాలు, డాక్యుమెంట్లు అందజేశామని, ఈ విషయంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తమ పోరాటం కోర్టులోనూ కొనసాగుతోందని, త్వరలోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: నటుడిగా 51 ఏళ్లు.. మోహన్‌బాబు వేడుకలో తారల సందడి)


