breaking news
Sheraz Mehdi
-
పుట్టినరోజు వేళా హీరో షిరాజ్ మెహదీ ఆవేదన
పుట్టినరోజు వేడుకల వేళ ఆనందంగా ఉండాల్సిన హీరో, దర్శకుడు షిరాజ్ మెహదీ.. తన సినిమా విడుదలకు ఎదురవుతున్న అడ్డంకులను ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంతో కష్టపడి రూపొందించిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రానికి థియేటర్లు కేటాయించడం లేదని, చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని ‘అఆ సినీ స్టూడియోస్’లో మీడియా ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు, ప్రెస్మీట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వివరించారు.ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని షిరాజ్ మెహదీ అన్నారు. నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో శ్రమించి సినిమాలు రూపొందిస్తున్నా.. వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు సరైన అవకాశాలు లభించడం లేదని పేర్కొన్నారు. వంద సినిమాలు విడుదలైతే రెండు, మూడు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని, మిగిలిన సినిమాలు థియేటర్ల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. పెట్టుబడులు తిరిగి రాక నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇతర ఆదాయ మార్గాలు కూడా అందుబాటులో లేకపోవడంతో పరిశ్రమలో అనిశ్చితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.(చదవండి: అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా : త్రివిక్రమ్)తన సినిమా ‘ఓ అందాల రాక్షసి’ విడుదల కోసం గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించడం లేదని షిరాజ్ మెహదీ తెలిపారు. గత నాలుగైదేళ్లుగా చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపు కష్టంగా మారిందని, హైదరాబాద్‌లోనూ పరిమిత సంఖ్యలో స్క్రీన్లు మాత్రమే లభిస్తున్నాయని ఆరోపించారు. థియేటర్లలో ప్రదర్శనకు సంబంధించిన వివరాలు చివరి నిమిషం వరకు తెలియకపోవడం వల్ల నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తన చిత్రానికి ఆడియో, ఓటీటీ, శాటిలైట్, ఇతర భాషల హక్కుల విషయంలోనూ ఆశించిన అవకాశాలు లభించలేదని పేర్కొన్నారు.చిన్న సినిమాల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని షిరాజ్ మెహదీ విజ్ఞప్తి చేశారు. థియేటర్ల కేటాయింపు, సినిమా విడుదల, ఇతర హక్కులకు సంబంధించిన సమస్యలపై సమగ్రంగా పరిశీలించి, చిన్న నిర్మాతలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీకి అవకాశం కల్పించి, చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా విధానపరమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. మంచి సినిమాలు రూపొందించే వారికి సరైన అవకాశాలు లభించినప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. -
చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: హీరో షిరాజ్ మెహదీ
‘‘తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల పట్ల వివక్ష తీవ్రస్థాయికి చేరింది. కష్టపడి నిర్మించిన సినిమాలను విడుదల చేద్దామంటే థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు’’ అని ‘ఓ అందాల రాక్షసి’ మూవీ హీరో షిరాజ్ మెహదీ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ–‘‘అందరి సహకారంతో, మంచి సాంకేతిక నిపుణులతో ‘ఓ అందాల రాక్షసి’ వంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించాను.(చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురే) అయితే విడుదలకు థియేటర్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే 40కి పైగా ప్రెస్మీట్లు, 50కి పైగా ఇంటర్వ్యూల్లో మాట్లాడాను. క్యూబ్, యుఎఫ్ఓ వంటి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వారానికి రూ.2000 వసూలు చేయాల్సి ఉండగా రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తుండటంతో చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు. త్వరలోనే ‘ఓ అందాల రాక్షసి’ చిత్రాన్ని రిలీజ్ చేస్తాను’’ అని పేర్కొన్నారు. -
కన్నడలో హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న తెలుగు సినిమా
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీకి చిత్ర పరిశ్రమలో ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కెఎస్ 100, ఆమ్లెట్, ఇంకా ఏమీ అనుకోలేదు, పార్సిల్ వంటి చిత్రాలతో మెప్పించాడు. ఇక మల్టీ టాలెంటెడ్ అయిన షెరాజ్ మెహదీ రీసెంట్గా ‘ఓ అందాల రాక్షసి’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇక ఈ ఇదే మూవీని కన్నడలోనూ రిలీజ్ చేశారు. కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నట్టుగా షెరాజ్ మెహదీ తెలిపారు.అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాలు చేసే వారికి ఎలాంటి శిక్షలు వేయాలి.. అమ్మాయిల జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే కథాంశంతో షెరాజ్ మెహదీ ‘ఓ అందాల రాక్షసి’ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రంలో హీరోగా, దర్శకుడిగా షెరాజ్ మెహదీ అందరినీ మెప్పించారు. ఈ మూవీలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా వచ్చిన ‘ఓ అందాల రాక్షసి’ ఇప్పుడు కన్నడ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది.


