‘‘తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల పట్ల వివక్ష తీవ్రస్థాయికి చేరింది. కష్టపడి నిర్మించిన సినిమాలను విడుదల చేద్దామంటే థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు’’ అని ‘ఓ అందాల రాక్షసి’ మూవీ హీరో షిరాజ్ మెహదీ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ–‘‘అందరి సహకారంతో, మంచి సాంకేతిక నిపుణులతో ‘ఓ అందాల రాక్షసి’ వంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించాను.
(చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురే)
అయితే విడుదలకు థియేటర్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే 40కి పైగా ప్రెస్‌మీట్లు, 50కి పైగా ఇంటర్వ్యూల్లో మాట్లాడాను. క్యూబ్, యుఎఫ్‌ఓ వంటి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వారానికి రూ.2000 వసూలు చేయాల్సి ఉండగా రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తుండటంతో చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు. త్వరలోనే ‘ఓ అందాల రాక్షసి’ చిత్రాన్ని రిలీజ్ చేస్తాను’’ అని పేర్కొన్నారు.


