నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా మాత్రం మంచి జోరు చూపిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలోని యాక్షన్ సన్నివేశాలకు మాస్ ఆడియన్స్ నుంచి స్పందన కనిపిస్తోంది. సంపూర్ణేష్ బిర్యాని పాత్ర, అలాగే కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమాలో బాబు మోహన్ కూడా నటించారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించానని టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బాబు మోహన్, గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో ఈ వార్తకు కాస్త బలం చేకూరుతోంది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
బాబు మోహన్ రోల్?
‘నాని సినిమా ది ప్యారడైజ్‌లో నటిస్తున్నాను. ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుంది. నేను మొదటిసారి ఈ సినిమా కోసం ఫోటోషూట్‌లో పాల్గొన్నాను. ఐదు రకాల గెటప్స్‌లో అనుకున్నారు.. కానీ ఫస్ట్ గెటప్ చూసి డైరెక్టర్ ఒకే అనేశారు. ఏ గెటప్ వేసినా నా మొఖానికి సూట్ అవుతుంది. ఈ సినిమా అంటూ బాబు మోహన్ గతంలో ఓ ఇంటర్యూలో చెప్పాడు. ఇప్పుడీ వైరల్ కావడంతో బాబు మోహన్‌కు సంబంధించిన సన్నివేశాలను తొలగించారా? లేక ఆయన నటించలేదా? అని నెటిజన్లలో సందిగ్ధత నెలకొంది. అయితే దీనిపై చిత్రబృందం గానీ.. అటు బాబు మోహన్‌గానీ ఎటువంటి స్పందన ఇవ్వలేదు.
ఇదీ చదవండి: సెహ్వాగ్‌కు కొత్త తలనొప్పి..! దుస్తులు చింపి.. ఆపై..


