అమెరికన్ ర్యాపర్, సింగర్ రాజ కుమారి మ్యూజిక్ డైరెక్టర్‌గా మారుతోంది. విషయానికి వస్తే.. తల్లి శ్రీదేవి మల్లిపాములతో కలిసి వారాహి నిర్మించిన ఇండియన్ ఇంటర్నేషనల్ సినిమా 'ఇంప్యూర్'. ఈ చిత్రానికి ఆమె కథ అందించడంతో పాటు ఓ ప్రధాన పాత్రలో నటించారు. నిశాంతి ఇవని దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఇటీవల జరిగిన 'ఇంప్యూర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డైరెక్టర్ నందినీ రెడ్డి అటెండ్ అయ్యారు.
‘ఇంప్యూర్’ కోసం నిర్మాత శ్రీదేవి మల్లిపాముల మాట్లాడుతూ... 'కాలంతో పాటు సమాజంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను చూపిస్తూ మోడ్రన్ రిలేషన్షిప్స్ మీద తీసిన చిత్రమిది. మహిళలను సమాజం చూసే కోణాన్ని సున్నితంగా ప్రశ్నిస్తుంది. మానవ సంబంధాల నేపథ్యంలో, మోడ్రన్ జనరేషన్.. అంతకు ముందు తరం మధ్య ఎటువంటి అనుబంధం ఉండాలనేది చెబుతూ తీశాం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది.’ అని చెప్పారు.
కొత్త ప్రయాణం..
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ‘జవాన్’ మూవీలో టైటిల్ ట్రాక్ పాడి, విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది రాజ కుమారి. ఆ తర్వాత రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీలో ‘ధోప్’ సాంగ్ పాడింది. ఈ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ కల్యాణ్‘ఓజీ’ మూవీలో ఫైర్ స్ట్రోమ్’‘సాంగ్ పాడిన రాజ కుమారి.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా మారుతోంది. తెలుగులో తెరకెక్కుతున్న ‘ఇంప్యూర్’ సినిమాతో సంగీత దర్శకురాలిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టనుంది.


