అమెరికా- ఇరాన్ యుద్ధం ఇప్పట్లో అగేలా కనిపించడం లేదు. ఒకరికొకరు వార్నింగ్ ఇవ్వడం.. దాడులు చేయడం ఈ రెండు దేశాలకు కామన్ అయిపోయింది. అయితే ఈ హెచ్చరికలు కాస్తా కొత్త తరహాలో కనిపిస్తున్నాయి. సినిమాల్లోని సీన్స్‌ను జోడించి శత్రుదేశాలకు వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే ఫుల్ ఫన్నీగా అనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రభాస్- రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి మూవీ వీడియోను హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ట్విటర్‌లో పంచుకుంది. కాలకేయులతో బాహుబలి యుద్ధం చేస్తున్న వీడియో తెగ ఆకట్టుకుంటోంది. కాలకేయులకు ఎదురొడ్డి బాహుబలి పోరాడినట్లే.. మేం కూడా మా మాతృదేశం కోసం రక్తం చిందించి ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చింది. ఇటీవలే ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ పెజెష్కియన్ ఐరాస సమావేశంలో 'ఎవరికీ ఎన్నడూ తలవంచము.. మోకరిల్లము' అంటూ మాట్లాడారు. ఈ కామెంట్స్‌ను ఉద్దేశించి హైదరాబాద్‌లోని ఎంబసీ బాహుబలి వీడియోను షేర్ చేసింది.
(ఇది చదవండి: ప్రెగ్నెన్సీతో సమంత.. ఆ విషయంలో ఎక్కువ ఫోకస్..!)
Dr. Pezeshkian, President of I.R #Iran at UNGA: "Will never bow our head or bend the knee"
Like Baahubali standing against the Kalakeyas, we also shed our own blood in sacrifice for the homeland. pic.twitter.com/xc1S9H346Q— Iran In Hyderabad (@IraninHyderabad) September 27, 2026


