టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై నిర్వహించిన భీకర వైమానిక దాడుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు ఇరాన్ మతగురువు, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సభ్యుడు అయతుల్లా మొహ్సెన్ హైదరీ అలెకాసిర్ సంచలన విషయాలు వెల్లడించారు.
ఖతార్‌కు చెందిన ప్రముఖ ‘అల్ అరబీ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను బయటపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’లో భాగంగా టెహ్రాన్‌లోని అధికారిక కేంద్రాలు, నివాస సముదాయాలపై యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లు, టోమహాక్ క్షిపణులతో మెరుపు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు.
శిథిలాల కింద చిక్కుకున్న మోజ్తాబా ఖమేనీ
అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వైద్య కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. ఈ దాడుల సమయంలో మూడో ఆసుపత్రిలో ఉన్న మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడి భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది శిథిలాలను తొలగించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ని రక్షించి అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అలెకాసిర్ తెలిపారు.
ఇదీ చదవండి: అయతుల్లా అలీ ఖమేనీ ఒంటి చేయి రహస్యం ఇదేనా?
అజ్ఞాతంలో ఖమేనీ.. పొంతన లేని ప్రకటనలు
మార్చి 8న ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తాబా ఖమేనీ ఎన్నికైనప్పటికీ, ఆ తర్వాత ఆయన భౌతికంగా లేదా మీడియా ముందు బహిరంగంగా కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వర్గాల సమాచారం ప్రకారం.. వైమానిక దాడుల్లో ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన శరీరంపై బలమైన గాయాలైనట్లు నివేదికలు వచ్చాయి. మరోవైపు, గత వారం ‘ఫాక్స్ న్యూస్’తో మాట్లాడిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మాత్రం మోజ్తాబా ఖమేనీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.
సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ
శత్రు దేశాల దాడుల ముప్పును ఎదుర్కొంటూనే అత్యంత గోప్యంగా ఈ ఎంపిక జరిగిందని అలెకాసిర్ వెల్లడించారు. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ నిర్వహించిన ఓటింగ్‌లో మొత్తం 59 ఓట్లకు గానూ మోజ్తాబా ఖమేనీ 50 ఓట్లు సాధించి ఘన విజయం సాధించగా, మరో ఎనిమిది మంది అయతుల్లా అలీరేజా అరఫీకి ఓటు వేశారు. దేశాన్ని చట్టపరంగా, మతపరంగా నడిపించేందుకు ఖమేనీ మాత్రమే తగిన నాయకుడని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.
🇮🇷 🇮🇱 Detalles publicados por primera vez: Durante la guerra, el MOSSAD estuvo muy cerca del asesinato de Mujtaba Khamenei, el hijo de Ali Khamenei. Mohsen Heydari, miembro de la Asamblea iraní de expertos, afirmó que Mojtaba Jamenei fue rescatado de los escombros tras el ataque al hospital de Teherán. Heydari añadió que Jamenei resultó herido durante el ataque. Otros tres hospitales de Teherán fueron bombardeados después de que se supo que su estado se había estabilizado en el hospital. Según Heydari, cuando Jamenei estaba siendo tratado en el tercer hospital, el mismo centro médico también fue atacado y luego fue rescatado de los escombros.
— Señor del caos visual ☭ 🇨🇱 (@Darwin_48) September 27, 2026


