గ్రూపులో గలీజ్‌ మెసేజులు.. మత్తులో ముంచి గంటల తరబడి దారుణం! | Cornell Shocking Case: Woman Alleges Drugged Assaulted for Hours Chat | Sakshi
Sakshi News home page

గ్రూపులో గలీజ్‌ మెసేజులు.. మత్తులో ముంచి గంటల తరబడి దారుణం!

Sep 28 2026 12:54 PM | Updated on Sep 28 2026 1:19 PM

Cornell Shocking Case: Woman Alleges Drugged Assaulted for Hours Chat

అమెరికాలోని ప్రతిష్టాత్మక కార్నెల్‌ యూనివర్సిటీలో జరిగిన ఘోరం చర్చనీయాంశంగా మారింది. ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు మళ్లీ కోర్టును ఆశ్రయించింది. దీంతో రెండేళ్ల కిందటి ఈ సంచలన కేసుపై న్యూయార్క్‌లోని ప్రాసిక్యూటర్లు దర్యాప్తును పునఃప్రారంభించారు. అయితే ఈసారి నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అప్పట్లో.. 20 ఏళ్ల వయసున్న తనకు మత్తు పదార్థాలు ఇచ్చి, అనంతరం పలువురు ఒకరి తర్వాత మరొకరు వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. తాజాగా ఆమె కార్నెల్‌ యూనివర్సిటీతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు ఫ్రాటర్నిటీ సభ్యులపై దావా వేసింది. 2014లో కార్నెల్‌లోని చి ఫై ఫ్రాటర్నిటీ హౌస్‌కు ఓ స్నేహితుడిని కలవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె దావాలో పేర్కొంది. తాను మత్తులో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కెటమైన్‌ తీసుకోవాలని బలవంతం చేశారని, ఆ తర్వాత తనపై లైంగిక దాడి చేశారని ఆమె ఆరోపించింది.

తాను అపస్మారక స్థితిలో ఉండగానే ఫ్రాటర్నిటీకి చెందిన స్నాప్‌చాట్‌ గ్రూప్‌లో ఓ వ్యక్తి ‘ఫ్రీ సెక్స్‌’ అంటూ మెసేజ్‌ పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మెసేజ్‌కు మరికొందరు దుర్మార్గంగా స్పందించారని.. మరింత మంది అక్కడికి వచ్చి తనపై గంటల తరబడి లైంగిక దాడి చేశారని ఆమె దావాలో పేర్కొన్నారు.

ఘటన జరిగిన తర్వాత తాను మానసికంగా కుంగిపోయానని.. ఎటూ వెళ్లలేకపోయానని చెప్పింది. స్నేహితుల సహకారంతో మూడు వారాల తర్వాత బాధితురాలు యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించింది. కార్నెల్‌ అంతర్గతంగా విచారణ చేపట్టినప్పటికీ.. ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురిలో ఇద్దరిని మాత్రమే యూనివర్సిటీ నుంచి బహిష్కరించారని ఆమె వాపోయింది.

ఆమె తరఫు న్యాయవాది థామస్‌ గియుఫ్రా మీడియాతో మాట్లాఉడతూ.. మిగిలిన వారికి సస్పెన్షన్‌, వర్క్‌షాప్‌లు, వ్యాసాలు రాయడం వంటి వివిధ శిక్షలు విధించినట్లు దావాలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఒక్కరినీ అరెస్టు చేయలేదని బాధితురాలి న్యాయవాది పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత ఆమె చదువు మానేసినట్లు కూడా దావాలో వెల్లడించారు. కార్నెల్‌, ఫ్రాటర్నిటీ సభ్యులపై ఒప్పంద ఉల్లంఘన, నిర్లక్ష్యం, రాష్ట్ర చట్టాల ఉల్లంఘన వంటి ఆరోపణలతో ఆమె పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

‘క్రిమినల్‌ కేసుకు ఆధారాలు సరిపోలేదు’
మరోవైపు టాంప్‌కిన్స్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయం ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తును సమీక్షించినట్లు తెలిపింది. అయితే క్రిమినల్‌ కేసు నమోదు చేసి అభియోగాలు మోపేందుకు తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంది.

కార్నెల్‌ ఏం చెప్పిందంటే..
కార్నెల్‌ యూనివర్సిటీ తమ నిబంధనల ప్రకారం అంతర్గత విచారణ జరిపినట్లు చెబుతుండగా.. బాధితురాలి తరఫు న్యాయవాదులు మాత్రం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు, క్రిమినల్‌ కేసు నమోదు చేసి అభియోగాలు మోపేందుకు తగిన ఆధారాలు లభించలేదని టాంప్‌కిన్స్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుతం బాధితురాలు దాఖలు చేసిన సివిల్‌ దావాతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కోర్టు విచారణతో ఆరోపణలపై తదుపరి పరిణామాలు వెలుగులోకి రానున్నాయి.

ఇదీ చదవండి: అమెరికాలో మళ్లీ పేలిన గన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement