breaking news
Cornell University
-
చాట్‌జీపీటీ పురుష పక్షపాతా!?
ప్రపంచాన్ని ‘మెన్స్ వరల్డ్’గా నిర్వచిస్తుంటారు సోషల్ ఇంజినీర్స్! ఈ మాటకు మెజారిటీ ప్రజలు విస్తుపోవచ్చు కానీ వ్యతిరేకించడానికైతే లేదు! సాంకేతిక ప్రపంచం కూడా పురుషుల ఫేవర్‌గానే కనిపిస్తోంది.. అందుకు సాక్ష్యం.. ఏఐ టూల్స్ మీద కార్నెల్ యూనివర్సిటీ చేసిన స్టడీ!చాట్జీపీటిలాంటి ఏఐ చాట్బాట్లకు లింగ వివక్ష ఉంటుందా? ‘యస్. ఉంటుంది’ అని తేల్చి చెప్పింది కార్నెల్ యూనివర్సిటీ (Cornell University) తాజా అధ్యయనం. ఉద్యోగార్థులైన మహిళలు సలహాల కోసం చాట్‌బాట్ సహాయం తీసుకుంటే అవి ఇచ్చే సమాధానాలలో పురుష పక్షపాతం కనిపిస్తున్నట్లు కార్నెల్ స్టడీ తెలియజేసింది. మచ్చుకు ఒక ఉదాహరణ: ‘పురుషులతో పోల్చితే మీరు తక్కువ వేతనం కోరుకోండి’.‘స్టార్టింగ్ శాలరీ’ గురించి అనుభవం ఉన్న ఇద్దరు మెడికల్ స్పెషలిస్ట్‌లు చాట్‌బాట్ (Chatbot) సలహా కోరారు. ఆ స్పెషలిస్ట్‌లలో ఒకరు మహిళ, మరొకరు పురుషుడు. పురుషుడికి సూచించిన వేతనంతో పోల్చితే మహిళకు సూచించిన వేతనం చాలా తక్కువగా ఉంది. ఇలాంటి ఉదాహరణలెన్నో కార్నెల్ స్టడీ ఉటంకించింది. ‘డీప్ బయాస్ ఇన్ లాంగ్వేజ్ మోడల్స్’ పేరుతో పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. జీపీటీ–4వో మినీ, క్లాడ్ 3.5 హైకు, చాట్‌జీపీటీ.. మొదలైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్(ఎల్ఎల్ఎం)లను విశ్లేషించారు. మహిళల జీతానికి సంబంధించి రకరకాలుగా ‘ఎల్ఎల్ఎం’ సలహాలు అడిగారు. ఎన్ని రకాలుగా అడిగినా జీతానికి సంబంధించి పాపులర్ ‘ఎల్ఎల్ఎం’లు ఇచ్చే సమాధానాలు పక్షపాతంతో కూడుకున్నట్లు స్టడీ తెలియజేసింది. దీనిమీద టెక్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే..అంతా డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్‌లోనే ఉంటుందిఏఐ పురుష– పక్షపాతంతో వ్యవహరిస్తుందనేది పూర్తిగా ఆధార రహితమైతే కాదు. అయితే దీన్ని లోతుగా విశ్లేషించడం అవసరం. ఉద్దేశపూర్వక అభిప్రాయాలు, పక్షపాతం ఉండటానికి ఏఐ ఏమీ మానవ మెదడు కాదు. దానికి ఇచ్చిన డేటాను బట్టే అది సమాచారాన్ని అందిస్తుందని నిపుణుల మాట. ఏఐ మోడల్స్‌ని డెవలప్ చేసి, టెస్ట్ చేసే టీమ్స్‌లో పురుషులే అధికంగా ఉంటే ఆ డేటాలో వారి దృక్కోణాలే ప్రస్ఫుటిస్తాయి. జెండర్, సామాజిక– ఆర్థిక నేపథ్యాలకు సంబంధించిన అంశాలను వారు పట్టించుకోకపోవచ్చు. దీనివల్ల ఏఐ సమాచారం పురుష పక్షపాతంగా కనిపించవచ్చు. అందుకే ఏఐ మోడల్స్ డెవలప్మెంట్లో, టెస్టింగ్‌లో అమ్మాయిలనూ భాగం చేస్తే.. లీడర్షిప్ రోల్స్‌లో అమ్మాయిలకూ సహభాగస్వామ్యం కల్పించాలి. అనేక సంస్థలు ఇప్పుడు దీని మీద దృష్టిపెడుతున్నాయి. డేటాసెట్లు, డిజైన్ ప్రక్రియలు, నియమిత ఆడిట్ల ద్వారా పక్షపాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. – అనిల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులుఅమ్మాయిలనూ ఎడ్యుకేట్ చేయాలికృత్రిమ మేధను రూపొందిస్తోంది మన మేధనే కదా! ఏఐ టూల్స్‌ను డెవలప్ చేయడంలో, టెస్టింగ్ లో మహిళల ప్రాతినిధ్యం అంతగా లేకపోతే ఏఐ డేటా (AI Data) అంతా పురుష పక్షపాతంగానే ఉంటుంది. ఏఐని ఏ వర్గం ఎంత ఎక్కువ ఉపయోగించుకుంటే ఆ వర్గానికి అనుకూలమైన డేటానే అది రీసెట్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే మోడల్స్ డెవలప్మెంట్లోనే కాదు దాన్ని ఉపయోగించే విషయంలోనూ అమ్మాయిల సముచిత భాగస్వామ్యం ఉండాలి. కాబట్టి అమ్మాయిలనూ డిజిటల్‌గా ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడే పక్షపాతం లేని, వహించని సమాచారం అందుతుంది. – పి. విప్లవి, లీడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్చదవండి: 3డీ ప్రింట్ ఎముకలు వచ్చేస్తున్నాయి.. -
రైతు కొడుకు.. చదువులో చురుకు!
లక్నో: ఉత్తప్రదేశ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతు కుమారుడు సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభను కనబరడిచాడు. లఖింపూర్‌కు చెందిన అనురాగ్ తివారీ తాజాగా విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 98.2 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. అంతేకాకుండా అమెరికా కార్నెల్ యూనివర్సిటీలో ఫుల్ స్కాలర్‌షిప్‌తో ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించడానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా అనురాగ్ మాట్లాడుతూ.. ‘నేను సీతాపూర్‌లోని శివనాదర్ ఫౌండేషన్ నిర్వహించిన విద్యాగ్వాన్ లీడర్షిప్ అకాడమీలో చదివాను. మొదట్లో సీతాపూర్ పంపించేందుకు నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎందుకంటే మాది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం. మా నాన్న రైతు అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కూడా ఎక్కువే. ఇక నేను చదువుకుంటే భవిష్యత్తులో వ్యవసాయం చేయలేమోనని వారు భావించి నన్ను కాలేజీ పంపించేందుకు ఇష్టపడలేదు. నా ముగ్గురు సోదరీమణులు వారిని ఒప్పించారు’ అంటూ అనురాగ్ చెప్పుకొచ్చాడు. ఆర్థిక శాస్త్రంలో వందకు 100 మార్కులు: సీబీఎస్ఈ ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో అనురాగ్ అన్ని సబ్జెక్ట్స్‌ల్లోను మెరుగైన ప్రతిభ కనబరిచాడు. గణితంలో- 95, ఇంగ్లీషులో-97, పొలిటికల్ సైన్స్‌లో- 99, హిస్టరీ, ఎకనామిక్స్‌లో- 100 మార్కులు సాధించాడు. -
స్టెతస్కోప్, బీపీ యంత్రాలకు చెల్లు?
గుండె కొట్టుకునే వేగం తెలుసుకోవాలంటే స్టెతస్కోప్ కావాలి. రక్తపోటును బీపీ యంత్రంతోనే కొలవాలి. ఇకపై వీటి అవసరం ఉండబోదని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ఇంజనీర్లు అంటున్నారు. రక్తపోటు, గుండె, ఊపిరి వేగాలను తెలుసుకునేందుకు వీరు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. దీనిద్వారా రేడియో తరంగాలను శరీరంలోకి పంపుతూ లోపలి అవయవాల కదలికలను పసిగడతారు. ఇందుకు ఒక సెంట్రల్ రీడర్.. చిన్న బిళ్లల్లాంటివి ఉంటాయి. బిళ్లలను శరీరానికి దగ్గరగా ఉంచుకుంటే చాలు.. అందులోంచి రేడియో సంకేతాలు శరీరంలోకి ప్రసారమై.. గుండె, ఊపిరితిత్తులు, రక్తం తాలూకూ వివరాలు తెలిసిపోతాయి. బిళ్లలోనే ఉండే మైక్రోప్రాసెసర్ ద్వారా సెంట్రల్ రీడర్‌కు ఈ వివరాలు చేరుతాయి. డాక్టర్ దగ్గర ఉండాల్సిన అవసరం లేకపోవడమే కాకుండా.. ఏకకాలంలో దాదాపు 200 మంది వివరాలను సేకరించొచ్చు. ఒక్కో బిళ్లకు ప్రత్యేకమైన ఐడీ, ఫ్రీక్వెన్సీ ఉండటం వల్ల సమాచారం మారిపోవడమంటూ ఉండదు. -
340 కోట్ల ఏళ్ల కింద తొలి సునామీ
కొన్ని కోట్ల సంవత్సరాల కింద అంగారకుడిని రెండు భారీ ఉల్కలు ఢీకొనడం వల్ల దానిపై రెండు సునామీలు సంభవించాయని తాజా పరిశోధనలో తేలింది. దాదాపు 340 కోట్ల సంవత్సరాల కింద భారీ ఉల్కలు ఢీకొనడం వల్ల తొలిసారి సునామీ అల ఏర్పడిందని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుడు అల్బర్టో ఫెయిరెన్ తెలిపారు. ద్రవరూపంలోని నీరు వల్లే ఈ అల ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే మరో భారీ ఉల్కా విస్ఫోటం వల్ల రెండో సునామీ చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు ఆధారాలను కనుగొన్నారు. ఈ రెండు సునామీలకు మధ్య ఉన్న లక్షల సంవత్సరాల కాలం పాటు అంగారకుడు అతి శీతల స్థితిలోకి వెళ్లిపోయాడని గుర్తించారు. ఆ సమయంలోనే అక్కడి నీరు ఘనీభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా అక్కడి సముద్రతీరం ప్రాంతంలోని నీరు చాలా వెనక్కి వెళ్లడం ద్వారా రెండో సముద్రతీరం ఏర్పడిందని భావిస్తున్నారు. రెండో సునామీ సంభవించిన సమయంలో సముద్రంలోని మంచు ఎగిరి చాలా దూరంలో పడిపోయిందని, ఇది తిరిగి సముద్రంలోకి రాలేదని ఫెయిరెన్ పేర్కొన్నారు. అంగారకుడు ఏర్పడిన తొలినాళ్లలో చాలా చల్లటి సముద్రాలు ఉండేవని స్పష్టం చేశారు. -
కుక్కల పుట్టినిల్లు చైనా
బీజింగ్: చైనాలోని దక్షిణ ప్రాంతంలో 33 వేల సంవత్సరాల కిందటే కుక్క లు పుట్టాయని చైనీస్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మధ్య ఆసియాలో 15 వేల ఏళ్ల క్రితమే కుక్కలు పుట్టాయని యూఎస్ సైంటిస్ట్‌లు చెప్పిన విషయాన్ని చైనీస్ శాస్త్రవేత్తలు ఖండించారు. 38 దేశాల్లోని 4,600 జాతులకు చెందిన 1,85,800 కుక్కలను విశ్లేషించి కుక్కలు మొదట పుట్టింది మధ్య ఆసియాలోనేనని అమెరికాలోని కార్నల్ వర్సిటీ చెప్పింది. కానీ ఆ వర్సిటీ చైనాకుక్కలపై పరిశోధించలేదని, మధ్య ఆసియాకు వారిచ్చిన నిర్వచనంకూడా సరిగా లేదని జూవాలజీ అకాడమీకి చెందిన ప్రొఫెసర్ వాంగ్ గుయోడాంగ్ అభిప్రాయపడ్డారు. కార్నల్ వర్సిటీ పరిశోధన ఫలితాల ను చైనాలోని కుక్కలతో పోల్చి చూసినప్పుడు చైనా శునకాలు చాలా పురాతనమైనవిగా తేలిందని వాంగ్ తెలిపారు.