breaking news
shocking details
-
నల్లగొండ: కన్నకూతురే రాసిన రక్తచరిత్ర ఇది!
నల్లగొండ పట్టణాన్ని కుదిపేసిన నాలుగు హత్యల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం కన్నకూతురు, అల్లుడే.. హసీనా కుటుంబాన్ని దారుణంగా హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను నియమించారని.. ఆ గ్యాంగ్ అత్యంత కిరాకతంగా ఆ నలుగురిని హతమార్చిందని తేల్చారు.నల్లగొండ జిల్లాలో సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో నాలుగు హత్యల ఘటన మిస్టరీ వీడింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దారుణ ఘటనలో హసీనా అనే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ముగ్గురు ఘోరంగా హత్యకు గురయ్యారు. మొదట ఇది గుర్తుతెలియని దుండగుల దాడిగా అనుమానించగా.. దర్యాప్తు ముందుకు సాగిన కొద్దీ కేసు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. హసీనా పేరుపై ఉన్న ఆస్తుల విషయంలో కుటుంబంలో తీవ్ర వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆస్తులు తనకు దక్కడం లేదన్న అక్కసుతోనే ఆమె కూతురు(మొదటి భర్త ద్వారా జన్మించిన సంతానం), అల్లుడు కలిసి ఈ హత్యలకు పథకం వేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణానికి వారు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించారు.దర్యాప్తులో మరో కీలక కోణం వెలుగులోకి వచ్చింది. ఘటనకు కొన్ని రోజుల ముందే నిందితులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి లోపలికి వెళ్లే మార్గాలు, కుటుంబ సభ్యుల కదలికలు అన్నీ ముందుగానే గమనించి పక్కా ప్లాన్‌తో హత్యలకు పాల్పడ్డారని సమాచారం.ఘటన జరిగిన రాత్రి.. నిందితులు ఇంటి తలుపు తట్టి హసీనాను బయటకు రప్పించినట్లు సమాచారం. తలుపు తెరిచిన వెంటనే ఆమెపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. హసీనా కుమారుడు ముజమ్మీల్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతనిపైనా తీవ్రంగా దాడి చేసి గొంతు కోసి, ఆపై కత్తితో పొడిచి హతమార్చారు.ఆ అలజడికి మెలుకువ వచ్చి వచ్చిన సుల్తాన్‌పై(హసీనా మూడో భర్త) కూడా దుండగులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు తేలింది. దాడి సమయంలో భయంతో బెడ్ కింద దాక్కున్న సుల్తాన్ కుమార్తె అక్సరాను బయటకు లాక్కొచ్చిన దుండగులు.. గోడకేసి బలంగా బాదారు. అనంతరం కత్తులతో పొడిచి హతమార్చారు.దర్యాప్తు ప్రకారం, ఈ మొత్తం కుట్రలో సుపారీ గ్యాంగ్ సహా మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న కూతురు, అల్లుడి సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.ఇదే కేసులో మరో కీలక అంశంగా, హత్యలకు ఉపయోగించిన ఆయుధాలను ఘటన అనంతరం వివిధ ప్రాంతాల్లో దాచినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో దాడి ఎంత క్రూరంగా జరిగిందో వివరాలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.హసీనా(40)కు గతంలో రెండు వివాహాలు జరిగాయి. సుల్తాన్‌ను మూడో వివాహం చేసుకున్నారు. ఇక సుల్తాన్‌కు కూడా హసీనా మూడో భార్య. మొదటి భార్య ద్వారా కలిగిన సంతానం ముజమ్మీల్, అక్సరాలతో ఆ భార్యభర్తలు కలిసే ఉంటున్నారు. హసీనా పేరు మీద కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇల్లులు ఉన్నాయి. ఆ ఆస్తిని సుల్తాన్ పిల్లల మీద వీలునామా రాస్తున్నట్లు హసీనా చెప్పడంతో కక్ష పెంచుకొని, హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. -
అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలు
మహారాష్ట్రలోని లోహగడ్ కోట హత్య కేసులో వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ సినిమా లాంటి సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భార్య సియా గోయల్ చేతిలో హత్యకు గురైన రియల్ ఎస్టేట్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) కేసు దర్యాప్తులో పోలీసుల విచారణ ద్వారా మరికొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో సి ప్రియుడు చేతన్ చౌదరి సంచలన విషయాలను వెల్లడించాడు.హత్య కుట్రకు గల కారణంపోలీసుల విచారణలో నిందితుడు చేతన్ చౌదరి అసలు విషయాన్ని అంగీకరించాడు. "కేతన్‌ను చంపే బదులు, మీరిద్దరూ పెళ్లి రద్దు చేసుకుని ఎక్కడికైనా పారిపోవచ్చు కదా?" అని పోలీసులు ప్రశ్నించగా చేతన్ సమాధానం విని పోలీసులు విస్తుపోయారు. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని, చేతన్‌తో కలిసి పారిపోవడం సియా గోయల్‌కు ఇష్టం లేదనీ, అలా చేస్తే తమ కుటుంబ పరువు పోతుందని, సమాజంలో అవమానం జరుగుతుందని ఆమె భయపడిందని తెలిపాడు. కుటుంబ పరువు కోసం పెళ్లి ఆపలేక, ప్రియుడితో కలిసి జీవించడం కోసం కేతన్‌ను పూర్తిగా వదిలించుకోవడమే దారి అని భావించి ఈ హత్యకు ప్లాన్ చేశామని వెల్లడించాడు. ఇదీ చదవండి : కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!జూన్ 18న కేతన్ లోహగఢ్ కోట పైనుంచి కాలుజారి పడిపోయాడని సియా అందరినీ నమ్మించింది. తన కాబోయే భర్త మరణం తర్వాత సియా ప్రవర్తనలో ఎలాంటి విచారం కనిపించకపోవడం, పొంతన లేని సమాధానాల కారణంగా కేతన కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అలా మొదలైన దర్యాప్తులో సియా, చేతన్ కుట్ర బట్టబయలైంది. కోట టికెట్ కౌంటర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల దర్యాప్తును పూర్తిగా మార్చేసింది.33 డిగ్రీల సెల్సియస్ ఎండలో హుడీ ధరించిన వ్యక్తి కదలికలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సియా, చేతన్ ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే కేతన్‌ను వెంబడించి హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులను జూన్ 29 వరకు పోలీస్ కస్టడీకి తరలించారు. ఇదీ చదవండి : ఆ ఒక్కడి వల్ల ముగ్గురు బలి : గాయని చిన్మయి ఫైర్ -
కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్, కిద్వాయ్ నగర్లో చోటుచేసుకున్న దారుణ ఘటన సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భార్య మీద అనుమానంతో 11 ఏళ్ల కవల కుమార్తెల గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనలో మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యల కోసం అతను ఒక రోజు ముందే కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం తల్లి మరణించినప్పటి నుండి శశి రంజన్ తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడు. మద్యానికి , నిద్రమాత్రలకు బానిసయ్యాడు. దీనికితోడు భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భార్యమీద అనుమానం పెంచుకున్నాడు. భార్యను ఇంటి నుండి వెళ్ళిపోమని, కుమార్తెలను తనే పెంచు కుంటానంటూ తరచూ గొడవ పడేవాడు. ఆర్థిక ఇబ్బందులునిందితుడు ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. భార్య కూడా నిరుద్యోగి కావడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.UP man kiII twin daughters, wife demands death penalty Shashi Ranjan Mishra, a resident of UP's Kanpur slit throat and kiIIed his 11-year-old twin daughters- Riddhi and Siddhi. He has a 6-year-old son who was sleeping with her mother in separate room. Domestic dispute is… pic.twitter.com/X86b4vvxSC— Piyush Rai (@Benarasiyaa) April 19, 2026ఉరితీయండి - తల్లి కన్నీరుమున్నీరుసీతాకోక చిలుకల్లా కళ్లముందే తిరుగాడే 11 ఏళ్లు ఎదిగిన ఆడపిల్లల్ని పోగొట్టుకున్న తల్లి తీరని శోకంతో తల్లిడిల్లిపోతోంది. "అతన్ని వెంటనే ఉరి తీయండి" అంటూ తల్లి రేష్మ కన్నీరుమున్నీరవుతోంది. గతంలోనే అతను పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని వాపోయింది. ఘటన పూర్వాపరాలు కాన్పూర్‌కు చెందిన శశి రంజన్ మిశ్రా (45), రేష్మ దంపతులకు 11 ఏళ్ల కవల కుమార్తెలు రిద్ధి, సిద్ధి, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. రాత్రి అందరూ కలిసి భోజనం చేసి, ఎప్పటిలాగానే నిద్రపోయారు. కానీ తెల్లవారేసరికి తన బిడ్డలు ప్రాణాలతో లేరన్న వార్త తల్లి గుండెల్ని బద్దలు చేసింది. తన కుమారుడితో కలిసి వేరే గదిలో పడుకోగా, తెల్లవారుజామున పోలీసులు తలుపు తట్టే వరకు ఇంట్లో ఇంతటి ఘోరం జరిగిందన్న సంగతి తెలియదు.నిందితుడు శశి రంజన్ తన కుమార్తెల ఆహారంలో నిద్రమాత్రలు కలిపి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత మొదట గొంతు పిసికి, ఆపై మాంసం కోసే కత్తితో (Cleaver) వారి గొంతులు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత, అతనే స్వయంగా ఉదయం 4:30 గంటలకు 112 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులుసీసీటీవీ నిఘా, దృశ్యాలు మరో షాకింగ్ విషయం ఏమిటంటే భార్యపై అనుమానంతో శశి రంజన్ ఇల్లంతా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. వీరి కుమార్తెలకు సాధారణంగా తండ్రితోనే నిద్రపోవడం అలవాటు. అయితే తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో నిందితుడు ఒక కుమార్తెను బాత్రూమ్కు తీసుకెళ్లి, తిరిగి వచ్చి గదిలో లైట్లు ఆపివేయడం భార్య తన గదిలోని సీసీటీవీ ఫీడ్‌లో చూసింది. ఆ తర్వాత ఆమె నిద్రపోయింది. కానీ ఇంత ఘోరం జరుగు తుందని ఊహించలేదు.మనసెలా ఒప్పింది..ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కన్న కూతుళ్లను మట్టు బెట్టేందుకు మనసెలా ఒప్పిందిరా నాయనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. నిందితుడు ఏదైనా మానసిక చికిత్స పొందుతున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి : విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్ కన్నుమూత -
కర్నూలు ఘటన.. మరో షాకింగ్ ట్విస్ట్!
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. బైక్.. బస్సునుగానీ, బస్సును.. బైక్ గానీ ఢీ కొట్టలేదని తెలుస్తోంది. అయితే బైక్ ప్రమాదానికి గురైన తర్వాతే.. బస్సు దానిని ఈడ్చుకెళ్లిందని, ఈ క్రమంలోనే ఘోర ప్రమాదం జరిగిందని తాజాగా పోలీసులు నిర్ధారించుకున్నట్లు సమాచారం. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతని నుంచి పోలీసులు సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి..శివశంకర్‌తోపాటు అతని స్నేహితుడు ఎర్రి స్వామి ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక వర్షంలో వెళ్తుండగా.. చిన్నటేకూరు వద్ద బైక్ స్కిడ్ అయ్యి ఇద్దరూ పడిపోయారు. డివైడర్‌కు బలంగా తల ఢీ కొట్టడంతో శంకర్ బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి.. రోడ్డు పక్కనే కూర్చుని పోయాడు. సరిగ్గా అదే సమయంలో.. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్‌ను వీ కావేరీ ట్రావెల్స్ బస్సు ఈడ్చుకెళ్లింది. కాస్త దూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. అది చూసి భయపడిపోయిన శివశంకర్ స్నేహితుడు ఎర్రి సామి అక్కడి నుంచి పోరిపోయాడు. సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా అతన్ని పట్టుకున్న పోలీసులు.. అతని స్టేట్మెంట్ ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎర్రి స్వామిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఎర్రిస్వామిని రహస్యంగా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఎర్రిస్వామి ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: కర్నూలు ఘటన.. ఎట్టకేలకు డ్రైవర్ అరెస్ట్ -
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరెస్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్ బీ దయానంద్ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ స్వస్థలం బిహార్‌లోని చంపారన్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది. -
పాము కాటు కాదు.. భార్య నిర్వాకమే!
ప్రియుడికి తనకు మధ్యలో అడ్డుగా ఉన్నాడని భర్తను ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో కుక్కింది ఓ భార్య. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారి తీసిందో తెలిసిందే. ఈ క్రమంలో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ చూశాం. ఇప్పుడు అదే ప్రాంతంలో మరో ఘోరం చోటు చేసుకుంది.రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని. రాత్రంతా ఆ పాము అలాగే పక్కలోనే ఉండిపోయింది. ఉదయం దానిని తొలగించి అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. దీంతో ‘పాపం’ అనుకున్నారంతా. అయితే బుధవారం సాయంత్రం ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో షాకింగ్ విషయం ఒకటి వెలుగు చూసింది.మీరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని పాము కాటేయడంతో మరణించాడని ప్రచారం చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.రవితకు అమర్జీత్ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసి అమిత్ తన భార్యను మందలించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఆ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియుడు అమర్జీత్తో కలిసి భర్తను కడతేర్చాలని రవిత స్కెచ్ వేసింది. అమర్జీత్ సాయంతో అమిత్ నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిపి ఊపిరి ఆడకుండా చేసి చంపింది. ఆపై రోజుకి రూ.వెయ్యి ఖర్చు అద్దెతో తెచ్చిన ఓ పామును మంచం మీద పడేసింది. పాము కాటు వల్లే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికుల సాయంతో పాములు పట్టేవాడిని తెచ్చి దానిని తొలగించింది. దీంతో జనం కూడా పాము కాటు వల్లే అతను చనిపోయాడని నమ్మి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రవితతో పాటు అమర్జీత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఇంకా వేరే ఎవరి ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
సంగారెడ్డి, సాక్షి: అమీన్పూర్ చిన్నారుల మృతి కేసు(Ameenpur Children Death Case)లో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే ముగ్గురు పిల్లలను కన్నతల్లి రజితనే కడతేర్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో మొదట భర్త చెన్నయ్యపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు.. లోతైన దర్యాప్తులో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత(Rajitha) కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు. కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం.రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూయగా.. భర్త చెన్నయ్యకు అనుమానం రావొద్దని కడుపు నొప్పి నాటకం ఆడి ఆస్పత్రిలో చేరిందామె. -
భూకంపం వచ్చిందన్నట్లుగా SLBC టన్నెల్ ప్రమాదం!
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదం భారీ స్థాయిలోనే జరిగిందని తెలుస్తోంది. టన్నెల్ ప్రమాదంపై మంత్రులు ఉత్తమ్, జూపల్లి అధికారులతో సమీక్ష జరిపారు. ఆ భేటీలో Tunnel Collapse ప్రమాదం జరిగిన తీరును అధికారులు వారికి వివరించారు.నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట(Domalapenta) సమీపంలో.. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ వద్ద పైకప్పు ఒరిగిపోయింది. అయితే ప్రమాదం జరిగిన దృశ్యం.. భూకంపం వచ్చినట్లుగా ఉందని అధికారులు మంత్రులతో అన్నారు. భారీ శబ్ధంతో ప్రమాదం జరిగిందని, ఆ తీవ్రత వల్ల వెయ్యి క్యూబిక్ మీటర్లు రాళ్లు, మట్టి పేరుకుపోయాయి. దీంతో ఆందోళన చెందిన కార్మికులు, ఇంజినీర్లు మిషనరీ వదిలేసి బయటకు పరుగులు తీశారు. 150 మీటర్ల వరకు ప్రమాద తీవ్రత కనిపించింది అని అధికారులు తెలిపారు. ఇక సహాయక చర్యలపై మంత్రులు ఆరా తీశారు. ఉదయం నుంచి 40 మందిని టన్నెల్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని, గాయపడినవాళ్లను ఆస్పత్రికి తరలించామని వివరించారు. మరికొందరిని బయటకు తేవాల్సి ఉందని చెప్పారు. టన్నెల్లో భారీగా నీరు చేరిపోవడంతో.. సింగరేణి నుంచి సహాయక బృందాన్ని రప్పించినట్లు వివరించారు. అయితే ఇంకా ఎనిమిది మంది టన్నెల్లో చిక్కుకుపోయినట్లు నిర్ధారణ అయ్యింది . అందులో నలుగురు కూలీలు కాగా, మిగతా వారు అధికార సిబ్బంది అని సమాచారం. ఐదేళ్ల కిందట.. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యే తిరిగి ఈ పనులను మొదలుపెట్టాలని నిర్ణయించింది. నిలిచిన పనులను మళ్లీ కొనసాగించేందుకు సన్నాహాక పనులు జరుగుతుండగా.. ఈలోపు ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.ఎస్సెల్బీసీ సొరంగ మార్గం వివరాలునల్లగొండ, పాలమూరు జిల్లాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రారంభం అయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులుదివంగత నేత వైఎస్సార్ హయాంలో 2004 లో రూ. 2,200 కోట్లతో సొరంగం ప్రారంభంప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద సొరంగం పనులకు వైఎస్సార్ శంకుస్థాపనఅరవై నెలల్లో పనులు పూర్తి కావాల్సిన సొరంగంవివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోన్న పనులుమధ్యలో వచ్చిన ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో సొరంగం ఆలస్యంశ్రీశైలం ఎడమగట్టు కాల్వపై 44 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉందిమిగతా పనుల పూర్తి కోసం ఇటీవలే నిధుల కేటాయింపు2010 నుంచి ఇప్పటి వరకు సొరంగం పూర్తి కోసం ఆరుసార్లు డెడ్ లైన్2026 జూన్ నాటికి సొరంగాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యం2017 లో సొరంగం అంచనా వ్యయం రూ. 3,152.72 కోట్లు పెంపుఈమధ్యే మరోసారి రూ.4,637 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం ఇదీ చదవండి: ఎల్ఎల్బీసీ టన్నెల్లో ఉదయం 8.20కి అసలేం జరిగిందంటే.. -
వివేకా రెండో భార్య వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు.. లైవ్‌లో చదివి వినిపించిన యాంకర్
-
సంచలన విషయాలు చెప్పిన ప్రత్యూష ఫ్రెండ్స్
బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె సన్నిహితులు, స్నేహితులు నమ్మలేకపోతున్నారు. ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్తో ఆమెకు విబేధాలున్నాయని చెప్పారు. రాహుల్, ప్రత్యూషల అనుబంధం గురించి మీడియా సమావేశంలో సంచలన విషయాలను వెల్లడించారు. ప్రత్యూషకు ఇటీవల ఓ ఆఫర్ ఇచ్చిన నిర్మాత వికాస్ గుప్తా మాట్లాడుతూ.. రాహుల్‌తో సంబంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని ప్రత్యూష భావించిందని చెప్పాడు. రాహుల్ అందరిముందు ఆమెను కొట్టాడని వెల్లడించాడు. ప్రత్యూష సన్నిహితులు ఇంకా ఏం చెప్పారంటే.. రాహుల్ తనను మోసం చేశాడని ప్రత్యూష చెప్పింది - కామ్యా పంజాబీ ఆర్థిక సమస్యల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు - శశాంక్ వ్యాస్ ప్రత్యూష ఎత్తు చాలా తక్కువ. ఐదు అడుగులా రెండు అంగులాల పొడవు ఉంది. ఆమె ఎలా ఉరి వేసుకోగలదు? - కామ్యా పంజాబీ పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నా. సలోని (రాహుల్ మాజీ గర్ల్ ఫ్రెండ్) తనను బెదిరించిందని మరణించడానికి ముందు రోజు ప్రత్యూష చెప్పింది - న్యాయవాది ఫాల్గుణి రాహుల్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో కలసి ప్రత్యూషను మోసం చేశాడని, చాలాసార్లు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడని చాలా మంది చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు రాహుల్‌ను సుదీర్ఘంగా విచారించారు. గత శుక్రవారం ముంబైలోని ప్లాట్‌లో ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.


