అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్‌ చెప్పిన షాకింగ్‌ నిజాలు | Ketan Agarwal tragedy She feared disrespect to family by eloping: Lover reveals | Sakshi
Sakshi News home page

అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్‌ చెప్పిన షాకింగ్‌ నిజాలు

Jun 24 2026 3:35 PM | Updated on Jun 25 2026 1:21 PM

 Ketan Agarwal tragedy She feared disrespect to family by eloping: Lover reveals

మహారాష్ట్రలోని లోహగడ్ కోట హత్య కేసులో వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ సినిమా లాంటి సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భార్య  సియా గోయల్ చేతిలో హత్యకు గురైన రియల్‌ ఎస్టేట్‌ డైరెక్టర్‌  కేతన్‌ అగర్వాల్‌  (Ketan Agarwal) కేసు దర్యాప్తులో పోలీసుల విచారణ ద్వారా మరికొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో సి ప్రియుడు చేతన్‌ చౌదరి సంచలన విషయాలను వెల్లడించాడు.

హత్య కుట్రకు గల కారణం
పోలీసుల విచారణలో నిందితుడు చేతన్ చౌదరి అసలు విషయాన్ని అంగీకరించాడు. "కేతన్‌ను చంపే బదులు, మీరిద్దరూ పెళ్లి రద్దు చేసుకుని ఎక్కడికైనా పారిపోవచ్చు కదా?" అని పోలీసులు ప్రశ్నించగా చేతన్ సమాధానం విని పోలీసులు విస్తుపోయారు. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని, చేతన్‌తో కలిసి పారిపోవడం సియా గోయల్‌కు ఇష్టం లేదనీ, అలా చేస్తే తమ కుటుంబ పరువు పోతుందని, సమాజంలో అవమానం జరుగుతుందని ఆమె భయపడిందని తెలిపాడు. కుటుంబ పరువు కోసం పెళ్లి ఆపలేక, ప్రియుడితో కలిసి జీవించడం కోసం కేతన్‌ను పూర్తిగా వదిలించుకోవడమే దారి అని భావించి ఈ హత్యకు ప్లాన్ చేశామని వెల్లడించాడు.  

ఇదీ చదవండి : కేతన్‌ అగర్వాల్‌ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్‌ ‘సి’ సిద్ధం!

జూన్ 18న కేతన్ లోహగఢ్ కోట పైనుంచి కాలుజారి పడిపోయాడని సియా అందరినీ నమ్మించింది.  తన కాబోయే భర్త మరణం తర్వాత సియా ప్రవర్తనలో ఎలాంటి విచారం కనిపించకపోవడం, పొంతన లేని సమాధానాల  కారణంగా కేతన కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అలా మొదలైన దర్యాప్తులో  సియా, చేతన్‌ కుట్ర బట్టబయలైంది.  

కోట టికెట్ కౌంటర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల దర్యాప్తును పూర్తిగా మార్చేసింది.33 డిగ్రీల సెల్సియస్ ఎండలో హుడీ ధరించిన వ్యక్తి కదలికలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సియా, చేతన్ ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే కేతన్‌ను వెంబడించి హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులను జూన్ 29 వరకు పోలీస్ కస్టడీకి తరలించారు. 

ఇదీ చదవండి : ఆ ఒక్కడి వల్ల ముగ్గురు బలి : గాయని చిన్మయి ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement