ఆ ఒక్కడి వల్ల ముగ్గురు బలి : గాయని చిన్మయి ఫైర్‌ | Karnataka family tragedy 3 people passed away because of one Chinmayi slams | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కడి వల్ల ముగ్గురు బలి : గాయని చిన్మయి ఫైర్‌

Jun 24 2026 12:59 PM | Updated on Jun 24 2026 2:17 PM

Karnataka family tragedy 3 people passed away because of one Chinmayi slams

కర్ణాటకలోని మైసూరు జిల్లాలో పెళ్లికి ఒకరోజు ముందు 29 ఏళ్ల పెళ్లి కూతురు (రక్షిత), ఆమె తల్లిదండ్రులు (శివన్న, నాగరత్న) ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన  సంగతి తెలిసిందే. దీనిపై గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ విషాదంపై గాయని, సామాజిక కార్యకర్త చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఒక్కడి వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిజంగా అతను 'ఇన్సెల్స్' (స్త్రీల పట్ల ద్వేషం పెంచుకునే పురుషులు)కు హీరో లాంటివాడు.అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.  'నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు' అనే నీచమైన ఆలోచనకు నిదర్శనమే అతడి దుర్మార్గం. అస్సలు పుట్టడానికే అర్హత లేని ఇలాంటి పనికి రానివాళ్ల వైఖరి వల్ల ఇతరులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు.

అలాగే ఈ ఘటనపై సమాజం స్పందిస్తున్న తీరును ఆమె తప్పుపట్టారు. నిందితుడిని వదిలేసి వేరే విషయాలపై దృష్టి పెట్టడంపై ఆమె విమర్శలు గుప్పించారు.  ముగ్గుర్ని పొట్టన పెట్టుకున్న ఆ వ్యక్తి ఫోటో ఎక్కడా కనిపించడం లేదంటూ చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల జవాబుదారీతనంపై  కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడికి త్వరలోనే   వబెయిల్‌పై బయటకు వస్తాడు, మళ్లీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడతాడు, వేధిస్తాడు, ఆమె ప్రాణాలను కూడా తీస్తాడు.. ఇదే మళ్లీ మళ్లీ పునరావృత మవుతుందని  చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ముగ్గురికి గుడ్‌బై : వ్యాపారవేత్తతో 62 ఏళ్ల మోడల్‌ ఎంగేజ్‌మెంట్‌

కాగా ఉల్లాస్ గౌడ అనే వ్యక్తి ఆ యువతి ప్రైవేట్ ఫొటోలు, మెసేజ్‌లను కాబోయే వరుడికి పంపి వేధించడంతో, తీవ్ర మనస్తాపానికి గురై కుటుంబంలోని ముగ్గురూ విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. 

ఇక సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో  తనదైన   శైలితో  యాక్టివ్‌గా ఉంటారు.  ముఖ్యంగా మీటూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్‌ వ్యవహారంలో ఆమె పెద్ద పోరాటమే చేశారు.  చిన్నారులపై అఘాయిత్యాలు, అత్యాచార బాధితులు, పురుషాధిపత్యంపై ఘాటుగా, సూటిగా సమాజాన్ని ప్రశ్నించడం ఆమెకు అలవాటు.

ఇదీ చదవండి: 11 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం : ఆ తర్వాత తాపీగా క్యాబ్‌ డ్రైవింగ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement