breaking news
Pune Lohagad Fort case
-
ముందే హెచ్చరించిన జ్యోతిష్యులు : సియా సోదరుడిపై అనుమానాలు
పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్ పాత్రపై కూడా ఇప్పుడు పోలీసుల నిఘా పెట్టారు. సియా-చేతన్ల ప్రేమ వ్యవహారం సాహిల్‌కు ముందే తెలుసా? అతను ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే కుటుంబ సభ్యుల నుండి దాచాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై ఇప్పటివరకు నోరు విప్పని సాహిల్, ఒక మీడియా ముఖంగా తొలిసారి స్పందించాడు. అయితే అతని వ్యాఖ్యలకు, పోలీసుల దర్యాప్తునకు మధ్య అనేక వ్యత్యాసాలు కనిపిస్తుండటంతో మరింత గందరగోళం నెలకొంది.సియాకు పెళ్లి ఇష్టమే..కానీతాను కేతన్ అగర్వాల్‌ను మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటున్నానని, చేతన్‌తో సంబంధాన్ని కొనసాగించే ఉద్దేశం తనకు లేదని సియా తనతో చెప్పిందని సాహిల్ తెలిపాడు. తమ మధ్య ఏమీ లేదని, ఇకపై చేతన్‌తో ఎలాంటి సంబంధం పెట్టుకోనని తనపై ఒట్టు వేసిందని కూడా చెప్పాడు అందుకే, సియా, చేతన్ గురించి తాను ఎవరికీ చెప్పలేదన్నాడు. వాళ్లు స్నేహితులుగా ఉంటారని భావించి, దీనిపై తల్లిదండ్రులకు చెప్పలేదని అతను చెప్పుకొచ్చాడు.కన్ఫ్యూజన్లో ఉంది : సియా తన బంధం విషయంలో కొంత గందరగోళంలో ఉందని, వయసు రీత్యా స్నేహాన్ని ప్రేమగా అనుకోవడం సహజమేనని, అందుకే తాను ఆమెకు నచ్చజెప్పానని సాహిల్ అన్నాడు. ఆమె కేతన్‌తో పెళ్లికి, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఎంతో సంతోషంగా ప్లాన్ చేసుకుందని చెప్పుకొచ్చాడు.డ్రైవర్ సాక్ష్యంతో అనుమానాలుసాహిల్ చెబుతున్న మాటలకు, పోలీసుల దర్యాప్తులో తేలుతున్న విషయాలకు అస్సలు పొంతన కుదరడం లేదు. సియాకు కేతన్‌తో పెళ్లి ఇష్టం లేదనే నిజాన్ని ఆమె సాహిల్‌కు ముందే చెప్పిందని, అయినా అతను సైలెంట్‌గా ఉన్నాడని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. డ్రైవర్ ఇచ్చిన కీలక సాక్ష్యం సాహిల్‌పై అనుమానాలను మరింత బలోపేతం చేస్తోంది.ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం బాలికి వెళ్లేందుకుగాను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడానికి సియా నిరాకరించినప్పుడు, సాహిల్ బలవంతంగా ఆమెను కారెక్కించాడని కారు డ్రైవర్ పోలీసులకు సాక్ష్యం ఇచ్చాడు.పాస్‌పోర్ట్ చింపేసినాబాలి ట్రిప్‌కు వెళ్లడానికి ముందే కేతన్ పాస్‌పోర్ట్‌ను సియా చింపేసిన విషయం సాహిల్‌కు తెలిసినప్పటికీ, అతను ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఎవరికీ చెప్పకపోవడం పోలీసులలో అనుమానాలను మరింత పెంచింది. ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్సాహిల్ ఎందుకు మౌనంగా ఉన్నాడు?ప్రస్తుతానికి సాహిల్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చకపోయినప్పటికీ, సోమవారం నాడు పోలీసులు అతన్ని దాదాపు 10 గంటల పాటు విచారించి, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసు కేవలం ఒక 'హత్య' మాత్రమే కాకుండా, దీని వెనుక పెద్ద 'ముందస్తు ప్లాన్ (కుట్ర)' ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కుట్రలో సాహిల్ కూడా సియా, చేతన్‌లకు ఏమైనా సహాయం చేశాడా? లేక అంతా తెలిసి కూడా మౌనంగా ఉన్నాడా? అని పోలీసులు తేల్చనున్నారు.ముందే హెచ్చరించిన కుటుంబ జ్యోతిష్యుడుసియా గోయల్, చేతన్ చౌదరిల జాతకాలను నలుగురు వేర్వేరు జ్యోతిష్యులు ద్వారా పరీక్షించినపుడు, వారిలో ముగ్గురు వారిద్దరికీ అనుకూల ఫలితాలను అందించారట. కేతన్ అగర్వాల్ తల్లిదండ్రుల వివాహానికి పురోహితుడిగా వ్యవహరించిన అగర్వాల్ కుటుంబ పురోహితుడు, వీరి పెళ్లికి సుముఖంగా లేదని చెప్పినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.కుటుంబ పురోహితుడు ఈ సంబంధంపై ఆందోళన వ్యక్తం చేశారని, సియా కేతన్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అతనికి శారీరకంగా హాని కలిగే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. ఇన్ని అభ్యంతరాలున్నప్పటికీ, తన తండ్రి మద్దతుతో కేతన్ సియాను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడని తెలుస్తోంది.(హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు)కాగా జూన్ 18న లోహగడ్ కోటపై కేతన్ అగర్వాల్‌ను సియా, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కిందకు తోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసు కస్టడీలో ఉన్నారు.ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ -
లోహగడ్ కోటపై ఏం జరిగింది?.. సీన్ రీక్రియేషన్
పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 10 రోజుల కిత్రం ఈ ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఇవాళ (ఆదివారం) నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను లోహగడ్ కోటపైకి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేశారు. జూన్ 18న జరిగిన ఈ హత్య ఉదంతంలో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి కేతన్‌ను కొండపై నుండి నెట్టేసిన సంగతి తెలిసిందే.పూణే రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. నిందితులను సరిగ్గా ఘటన జరిగిన లోహగఢ్ కోట ప్రాంతానికి తీసుకెళ్లి సీన్‌ను రీక్రియేట్ చేశాం. వారు కోటకు ఏ మార్గంలో వచ్చారు, ఎక్కడెక్కడ నిలబడ్డారు? కేతన్‌ను ఎలా నెట్టేశారు అనే పూర్తి వివరాలను నిందితుల ద్వారా అడిగి తెలుసుకున్నామని తెలిపారు.మరో సీనియర్ పోలీస్ అధికారి పిటిఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ.. బాధితుడిని ఏ పాయింట్ నుంచి అయితే కిందకు తోసేశారో.. సియా గోయల్‌ను సరిగ్గా అదే చోటుకి తీసుకెళ్లాం. ఆమె ప్రియుడు చేతన్‌ను విడిగా కోటపైకి తీసుకెళ్లి విచారించాం. సీన్ రీక్రియేషన్ ద్వారా నిందితులు చెబుతున్న వాదనల్లో నిజమెంత ఉందో తేలనుంది.క్రైమ్ సీన్ రీక్రియేషన్ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. నిందితులు కోటకు ఎలా చేరుకున్నారు? కేతన్‌ను తోసేయడానికి ముందు సియా తన ప్రియుడికి ఎలాంటి సిగ్నల్ ఇచ్చింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు చేతన్ చౌదరి అసలు టికెట్ తీసుకోకుండానే కోటలోకి ప్రవేశించి, ఈ జంటను వెంబడించాడా అనే కోణాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణ సజావుగా సాగడం కోసం లోహగఢ్ కోటలోకి పర్యాటకుల ప్రవేశాన్ని పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు.కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సియా పోలీసుల ఎదుట అంగీకరించింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే ప్రియుడితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. శనివారం.. సియా గోయల్ తల్లిదండ్రులు ప్రవీణ్, పూజలతో పాటు ఆమె సోదరుడు సాహిల్‌ను లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్లో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అంతకుముందు శుక్రవారం కూడా సాహిల్‌ను 10 గంటల పాటు ప్రశ్నించారు. కేతన్ అగర్వాల్ కుటుంబం నివసించే గహుంజే ప్రాంతంలో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు : సియా, తల్లి షాకింగ్ రియాక్షన్
మహారాష్ట్రలోని లోహగఢ్ కోటలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించిన విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేతన్ కాబోయే భార్య సియాకు ఈ పెళ్లి ఇష్టం లేక ప్రియుడు చేతన్ చౌదరితో తన బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సియా, చేతన్ ఇద్దరిపై హత్య, క్రిమినల్ ప్లానింగ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరూ రిమాండ్‌లో ఉన్నారు. వీరి విచారణలో భాగంగా కీలక విషయాలను పోలీసులు రాబట్టారు.పెళ్లి రద్దుకు ఒప్పుకోలేదు, పారిపోయినా వదలనన్నాడు : సియా పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే విషయాన్ని కేతన్ అగర్వాల్‌కు ముందే చెప్పానని సియా విచారణాధికారులకు తెలిపింది. చేతన్ చౌదరితో రిలేషన్షిప్లో ఉన్నానని చెప్పినట్టు వెల్లడించింది. అయితే ఇపుడు పెళ్లి రద్దు చేసుకుంటే, తమ ఫ్యామిలీ పరువు పోతుంతని చెప్పాడని, ఒకవేళ ఆమె పెళ్లి నుంచి తప్పించుకోవడానికి పారిపోవాలని చూసినా, వదిలిపెట్టేది లేదని కేతన్ బెదిరించాడని సియా క్లెయిమ్ చేసింది.అయితే, సియా చేస్తున్నఈ ఆరోపణలు/వాదనలు ఇంకా కోర్టు, పోలీసుల దర్యాప్తులోనే ఉన్నాయి. వీటిపై న్యాయపరమైన విచారణ జరగాల్సి ఉంది.నేరం రుజువైతే ఆమెను ఉరితీయండి!మరోవైపు తన కూతురి వ్యవహారంపై సియా తల్లి స్పందించారు. తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు రుజువైతే, ఆమెకు కఠినమైన శిక్ష పడాలని కూతురు సియా గోయల్‌ను ఉరితీయాలని ఒక తల్లిగా నేను ఈ మాట చెబుతున్నా అన్నారు.సియా తండ్రి ప్రవీణ్ గోయల్ కూడా ఇదే విధంగా స్పందించారు. నేరం రుజువైతే, తన కూతురైనా సరే, ఉరి తీయాల్సిందే అన్నారు. ఈ ఘటన తర్వాత జూన్ 23న ప్రవీణ్ గోయల్‌కు గుండెపోటు రావడంతో ప్రస్తుతం ఆయన పూణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇదీ చదవండి: కేతన్ హత్యలో మరో ట్విస్ట్ : మాట మారుస్తున్న కిలాడీలుజరిగిన కథపూణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ బాబూలాల్ చౌదరి కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని లోహగఢ్ కోటపై నుండి కిందకు నెట్టేసి హత్య చేశారు. మొదట దీనిని ట్రెకింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.పక్కా ప్లాన్‌తో హత్యకేఫ్ మీటింగ్: జూన్ 18 ఉదయం పూణేలోని ఒక కేఫ్‌లో సియా, చేతన్ కలిసి కేతన్‌ను ఎలా చంపాలో ప్లాన్ చేశారు. కోటలో ఏ ప్రాంతం నుండి నెట్టేయాలో కూడా వారు ముందే చర్చించుకున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు పోలీసులకు లభించాయి. ప్లాన్ ప్రకారం మధ్యాహ్నం సియా, కేతన్‌ను ట్రెకింగ్ కోసం కోటపైకి తీసుకెళ్లగా, చేతన్ వారిని రహస్యంగా వెంబడించాడు. అనుకూలమైన సమయం చూసి ఇద్దరూ కలిసి కేతన్‌ను లోయలోకి నెట్టేశారు.గత 6 నుండి 7 నెలల్లో సియా, చేతన్ ల మధ్య 2,004 సార్లు ఫోన్ కాల్స్ జరిగాయి. వారు దాదాపు 238 గంటల పాటు మాట్లాడుకున్నట్లు, కొన్ని కాల్స్ 2-3 గంటల పాటు సాగినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ 2025 దీపావళి పార్టీలో మొదటిసారి కలుసుకున్నారు.రూ. 17 కోట్ల ప్యాలెస్, ప్రైవేట్ జెట్స్కేతన్ అగర్వాల్ తమ కుటుంబానికి చెందిన 'సక్సెస్ గ్రూప్' రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్ మరియు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసేవాడు. సియా గోయల్ కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది. దాదాపు 35ఏళ్లుగా సంబంధాలున్న ఇరు కుటుంబాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరికి నిశ్చితార్థం జరిపించారు. నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక ప్యాలెస్ వేదికగా వీరి వివాహం ఘనంగా జరగాల్సి ఉంది. సియా, కేతన్‌లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో వీరి వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేశాయి. వివాహం కోసం జైపూర్‌లోని ప్యాలెస్‌ను రూ. 17 కోట్లకు బుక్ చేశారు. పెళ్లికి వచ్చే అతిథులను తీసుకురావడం కోసం ప్రత్యేకంగా రెండు ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంతలోనే కేతన్ హత్యోదంతం ఇరు కుటుంబాల్లో తీవ్ర అలజడి రేపింది. -
నా బిడ్డను కూడా అక్కడి నుంచే తోసేయండి: సియా తండ్రి
ముంబై: మహారాష్ట్రలో సంచలనం రేపిన లోహగడ్ కోట హత్యకేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తెపై ఆరోపణలు నిజమని కోర్టు తేల్చితే ఆమెకు అత్యంత కఠిన శిక్ష విధించాలన్నారు. ఇదే సమయంలో అవసరమైతే కేతన్ అగర్వాల్‌ను తోసేసిన అదే కోటపై నుంచి ఆమెను కూడా తోసేయాలని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ గోయల్..‘నా కుమార్తె ఇలాంటి ఘోరానికి పాల్పడిందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆమె ఎప్పుడూ నాతో అబద్ధం చెప్పలేదు. కానీ పోలీసులు చూపుతున్న ఆధారాలు చూసిన తర్వాత నేను కూడా దిగ్భ్రాంతికి గురయ్యాను. నిజం ఏదైనా కోర్టే తేల్చాలి. చట్టం ముందు అందరూ సమానమే. నేను ముందుగా ఒక పౌరుడిని, తర్వాత తండ్రిని. చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదు. నా కుమార్తె నేరం చేసినట్లు రుజువైతే ఆమెకు అత్యంత కఠిన శిక్ష పడాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. నా కూతురు అయినా న్యాయానికి అడ్డుకావద్దు. తండ్రిగా నాకు బాధ ఉన్నా, న్యాయం జరగాల్సిందే’ అని అన్నారు. కాగా, ఈ ఘటనతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, కుమార్తె అరెస్టు వార్త విన్న తర్వాత షాక్‌కు గురై ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చిందని కూడా ఆయన వెల్లడించారు.Ketan Agarwal Siya Goyal this video proves:Not everything you see on SOCIAL MEDIA is real. Filters hide flaws. Edits hide truth. pic.twitter.com/OvfbL3zrt3— बुलेट bhaiya (@bullet_bhaiya_) June 25, 2026కేసు ఏమిటి?మహారాష్ట్రలోని పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ జూన్ 18న తన నిశ్చితార్థమైన సియా గోయల్‌తో కలిసి లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయి మరణించినట్లు తొలుత భావించిన పోలీసులు, అనంతర దర్యాప్తులో ఇది పక్కా హత్య అని నిర్ధారించారు. సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ముందుగానే కుట్ర పన్ని కేతన్‌ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు ఆరోపించారు. ప్రస్తుతం ఇద్దరూ కస్టడీలో ఉన్నారు. దర్యాప్తు సందర్భంగా సియా, చేతన్ ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకుంటున్నారని, అయితే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు సియానే ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అనే దిశగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపగా, బాధిత కుటుంబం కూడా నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది. -
కేతన్ హత్యలో మరో ట్విస్ట్ : మాట మారుస్తున్న కిలాడీలు
పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ మృతి చెందిన ఘటనలో అరెస్ట్ అయిన కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి ఎవరో తెలియకుండా, ఇద్దరూ తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు.పోలీసుల సమాచారం ప్రకారం నిందితులిద్దరూ 'బ్లేమ్ గేమ్' ఆడుతున్నారు. సియా, చేతన్ ఇద్దరూ పక్కా ప్లాన్ ప్రకారం కేతన్‌ను నిర్దాక్షిణ్యంగా హత్య చేసి, ఇపుడు నేరాన్ని ఒకరిపై ఒకరు నెట్టేస్తున్నారు. తాను సియాతో కలిసి పారిపోవాలనుకున్నాను. కానీ కేతన్‌ను చంపమని సియానే ఒత్తిడి తెచ్చిందని చేతన్ మాట మారుస్తు న్నాడు. అటు సియా కూడా ఏం తక్కువ తినలేదు. అసలు ఈ హత్య ప్లాన్ అంతా చేతన్‌దే. జూన్ 14న జరిగిన మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు చేతన్ బోరున ఏడ్చాడు అంటూ సియా కొత్త నాటకానికి తీరతీసినట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: షాకింగ్ : ఆమె అలా సిగ్నల్ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు!అయితే పోలీసులు మాత్రం వారి ఎత్తులను సరిగ్గానే అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా బ్లేమ్ గేమ్ అనీ, వారి డిఫెన్స్ స్ట్రాటజీ (రక్షణ వ్యూహం) అని, కేతన్‌ను అంతం చేయాలనే కుట్రలో ఇద్దరూ సమానంగా భాగస్వాములని భావిస్తున్నారు.Pune - Chilling details have emerged in the sensational Lohagad Fort murder case, revealing that the conspiracy to kill 26-year-old Ketan Agarwal was allegedly finalised at a prominent cafe in Pune’s Kondhwa area. According to police investigations, accused Siya Goyal and her… pic.twitter.com/o4vBQVEDhB— NextMinute News (@nextminutenews7) June 25, 2026ఈ హత్యలో దర్యాప్తులో కీలకాంశాలను పోలీసులు సేకరించారు. తద్వారా వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని, కుట్రను తేట తెల్లం చేస్తున్నారు. మే 31 నుండి జూన్ 4 మధ్య పుణేలోని ఒక కేఫ్‌లో వీరిద్దరూ సమావేశమైనట్లు పోలీసులకు తెలిసింది. ఈ భేటీలోనే హత్యకు సంబంధించిన ప్లాన్ సిద్ధం చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కెఫేలో వారు కలుసుకున్న వీడియో కూడా వెలుగులోకివచ్చింది.సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ రికార్డులు, వారి మధ్య జరిగిన సంభాషణలు ఈ హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని ధృవీకరిస్తున్నాయి. జూన్ 14న కూడా కేతన్‌ను చంపడానికి ప్రయత్నించి వారు విఫలమయ్యారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరూ పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ కుట్రలో మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్ : కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు -
షాకింగ్ : ఆమె అలా సిగ్నల్ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు!
పుణేకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత దీన్ని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించినప్పటికీ, అతని కాబోయే భార్య (ఫియాన్సే) సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి పక్కా స్కెచ్‌తో చేసిన హత్య అని పుణే రూరల్ పోలీసులు వెల్లడించారు. మొదటి ప్రయత్నంలో ఒకసారి కొండంపై నుంచి తోసేసినప్పటికీ, కాబోయే భార్యను గుడ్డిగా నమ్మిన కేతన్ చివరకు ఆమె కుట్రకు బలికాక తప్పలేదు. వారు పక్కాగా అమలు చేసిన వారి ప్లాన్ గురించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గజానన్ టోంపే మరికొన్ని దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు.పక్కా ప్లాన్ ప్రకారం హత్యపోలీసుల విచారణ ప్రకారం జూన్ 18న సియా గోయల్ తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్‌ను లోహగఢ్ కోటకు తీసుకువెళ్లింది. సియా ప్రియుడైన చేతన్ చౌదరి, ఆ జంటను రహస్యంగా లోహగఢ్ కోట వరకు ఫాలో అయ్యాడు. అంతేకాదు తన ఫోన్‌ను రూంలోనే వదిలి వచ్చాడు. కోటపై ఉన్న ఒక నిర్దేశిత ప్రదేశానికి చేరుకున్నాక, సియా ముందుగా అనుకున్న సిగ్నల్ ఇచ్చింది. ఏంటా సిగ్నల్అందేంటి అంటే సడెన్ కూడా ఒకచోట కూర్చోవడం. అలా యాక్షన్‌కు "సమయం వచ్చింది" అని సైగ (సిగ్నల్) చేయాలి. అలా ఒకచోట కూర్చుని సియా సిగ్నల్ ఇవ్వగానే, వెనుక నుండి మాటు వేసిన చేతన్ చౌదరి, కేతన్‌ను ఒక్కసారిగా లోయలోకి తోసేసి అక్కడి నుండి పారిపోయాడు.దీనికి సంబంధిచి పోలీసులు కీలక ఆధారారాలను కూడా సేకరించారు. కోట కింద ఉన్న సీసీటీవీ విజువల్స్ పరిశీలించగా.. తలకి హుడీ (టోపీ) ధరించి పాలో అయిన వ్యక్తి చేతన్ చౌదరి అని పోలీసులు గుర్తించారు. చేతన్ చౌదరి కేవలం 50 నిమిషాల్లోనే కోట ఎక్కి, పని ముగించుకుని కిందకు దిగాడు. కోట పైన అతను గడిపింది కేవలం 10 నిమిషాలు మాత్రమే. ఎక్సర్సైజ్ కోసం వచ్చానని అక్కడ ఉన్నసెక్యూరిటీ గార్డుతో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డు పోలీసులకు ధృవీకరించాడు.ఇదీ చదవండి: అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలుసాధారణ రోజుల్లో (వీక్‌డేస్) పెద్దగా జనం ఉండరనే కారణంతో పవనా డ్యామ్ వైపు ఉండే 'వించు కాటా' (Vinchu Kata) అనే లోయ ప్రాంతాన్ని వారు ఎంచుకున్నారు.ఇది నాలుగో ప్రయత్నంఅంతేకాదు కేతన్‌ను చంపేందుకు సియా, చేతన్‌లు అంతకుముందు కూడా మూడుసార్లు విఫలయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి పాము నుండి రక్షిస్తున్నట్లు నటిస్తూ కేతన్‌ను తోసేయడానికి సియా ప్రయత్నించిందని విచారణలో తేలింది. అలాగే ఎలాగైనా కేతన్‌ను మట్టుబెట్టాలనే ఉద్దేశంతో తన పుట్టినరోజు వేడుకల పేరుతో జూన్ 18న లోహగడ్ కోటను సందర్శించేలా సియా, కేతన్‌ను ఒప్పించినప్పుడు ఆ అవకాశం లభించిందని పోలీసులు ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్ : కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు -
కుట్ర లవర్స్‌దే.. మరి తోసిందెవరు?
పెళ్లికి పెద్దల అంగీకారం.. ఒకరికొకరు ప్రేమలో మునిగి తేలడం.. బయటకు కనిపించిన కథ ఇదే. కానీ ఆ నవ్వుల వెనుక ఓ చీకటి కుట్ర నడిచింది. రహస్య ప్రేమ, కేఫ్‌లలో జరిగిన గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు, వేల ఫోన్ కాల్స్, వరుస విఫల హత్యాయత్నాలు... చివరకు లోహగడ్ కోట అంచున ఓ యువ వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. పుణేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కుట్ర వెనుక ఉన్న దాదాపు అన్ని కోణాలను పోలీసులు ఛేదించారు. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తొలుత కనిపించిన దృశ్యం ఒక సాధారణ ప్రమాదం. ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడు లోయలో పడి మృతి చెందాడు. కాబోయే భార్య కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కూడా ప్రమాద మరణంగానే కేసు నమోదు చేశారు. కానీ ఆ కథలో ఏదో తేడా ఉందనే అనుమానం మొదట కేతన్ కుటుంబ సభ్యులకే వచ్చింది. ముఖ్యంగా కేతన్ సోదరి సంజనా అడిగిన కొన్ని ప్రశ్నలకు.. నిందితురాలు సియా గోయల్ ఇచ్చిన సమాధానాలు దర్యాప్తును పూర్తిగా కొత్త దిశలోకి మళ్లించాయి. అక్కడి నుంచే ఒక్కొక్కటిగా బయటపడిన ఆధారాలు.. ప్రేమ, మోసం, కుట్ర, హత్యతో కూడిన భయంకర కథను వెలుగులోకి తీసుకొచ్చాయి.జూన్ 18న లోహగడ్ కోట వద్ద ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ సమయంలో జరిగిన ఘటన తర్వాత కేతన్ మృతదేహాన్ని వెలికితీశారు. తొలుత ప్రమాద మరణంగా కేసు నమోదైంది. అయితే అంత్యక్రియలు పూర్తైన నాలుగు రోజుల తర్వాత కేతన్ సోదరి సంజనా సియాకు ఫోన్ చేసింది. ఇంటికి రమ్మంటూ పిలిచింది. సోదరుడి గురించి మాట్లాడుకుంటూ ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. అలా.. అసలు ఆ రోజు ఏం జరిగిందని ప్రశ్నించింది. సియా చెప్పిన వివరాల్లో తేడాలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు మళ్లీ మొదలైంది.విచారణలో బయటపడిన అంశాలు ఒక్కొక్కటిగా సియాపై అనుమానాలను పెంచాయి. కేతన్ మరణానికి ముందు ఆమె పలుమార్లు లోహగడ్‌కు రావాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 31న మొదటిసారి అక్కడికి తీసుకెళ్లింది. ఆ తర్వాత జూన్ 4న కూడా వెళ్లాలని పట్టుబట్టిందని, కానీ కేతన్ తల్లి అనుమతి ఇవ్వకపోవడంతో అది జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మే 31న ప్రదేశాన్ని ముందుగా పరిశీలించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.జూన్ 14న మరోసారి ఇద్దరూ లోహగడ్‌కు వెళ్లారు. అక్కడే మొదటి హత్యాయత్నం జరిగి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. లోయ అంచు వద్ద కేతన్‌ను నెట్టినప్పుడు అతడు పొదలను పట్టుకుని బయటపడ్డాడని, వెంటనే సియా పాము కనిపించిందంటూ నాటకం ఆడి పరిస్థితిని చక్కబెట్టిందని పోలీసులు చెబుతున్నారు. అప్పట్లో అది ప్రమాదంగా కనిపించినా.. ఇప్పుడు అదే ఘటన హత్యా కుట్రలో భాగమని భావిస్తున్నారు.ఇదిలా ఉండగా, పెళ్లికి ముందు బాలి ట్రిప్ కూడా కేసులో కీలక అంశంగా మారింది. ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం కేతన్, సియా ఇండోనేషియా వెళ్లాల్సి ఉంది. అయితే ప్రయాణానికి ముందు కేతన్ పాస్‌పోర్ట్ కనిపించకుండా పోయింది. దీంతో ట్రిప్ రద్దయింది. ఈ ఘటన వెనుక కూడా సియా పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేతన్‌ను బాలి వెళ్లకముందే హత్య చేయాలన్న ఉద్దేశంతోనే పాస్‌పోర్ట్‌ను మాయం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.దర్యాప్తులో మరో కీలక మలుపు సీసీటీవీ ఫుటేజీలతో వచ్చింది. టికెట్ కౌంటర్ వద్ద కేతన్, సియా నడుచుకుంటూ వెళ్తుండగా.. కొంత దూరంలో హుడీ ధరించిన ఓ వ్యక్తి వారిని వెంబడిస్తున్న దృశ్యాలు కనిపించాయి. 33 డిగ్రీల ఉష్ణోగ్రత.. అంతా వేడిలోనూ కూడా ముఖం కనిపించకుండా హుడీ, హెడ్‌సెట్‌తో తిరగడం పోలీసులకు అనుమానం కలిగించింది. తర్వాత అతడే చేతన్ చౌదరి అని గుర్తించారు.చేతన్ తన మొబైల్‌ను ఇంట్లో వదిలేసి, ఒక ఉద్యోగి ఫోన్‌తో ప్రయాణించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. లోకేషన్ ట్రాకింగ్ నుంచి తప్పించుకోవడానికే ఈ ప్లాన్ వేసినట్లు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా ఫొటోలు, డిజిటల్ ఆధారాలను సరిపోల్చిన తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని కాల్ రికార్డులు మరింత బలపరిచాయి. జనవరి 1 నుంచి జూన్ 18 వరకు సియా, చేతన్ల మధ్య 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గంటల తరబడి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వ్యాపార పరిచయంతో మొదలైన సాన్నిహిత్యం ప్రేమగా మారిందని, కేతన్‌తో పెళ్లి విషయంలో సియా ఆసక్తి చూపకపోవడానికి ఇదే కారణమని దర్యాప్తులో తేలింది.పోలీసుల కథనం ప్రకారం.. సియా, చేతన్‌లు గత ఏడాది దీపావళి వేడుకల్లో పరిచయమయ్యారు. ఆ తర్వాత తరచూ కేఫ్‌లలో కలుస్తూ హత్యా ప్రణాళికను రచించినట్లు అనుమానిస్తున్నారు. సియా పెళ్లికి మానసికంగా సిద్ధంగా లేదని, కుటుంబ ఒత్తిడితో సంబంధాన్ని కొనసాగించిందని విచారణలో వెల్లడైంది. అయితే చేతన్‌తో పారిపోవడానికి కూడా ఆమె ఇష్టపడలేదని చెబుతున్నారు. నిశ్చితార్థం రద్దు చేసి ప్రేమికుడితో వెళ్లిపోతే కుటుంబ పరువు పోతుందని భావించిందని చేతన్ విచారణలో చెప్పినట్లు సమాచారం.కేతన్, సియా వివాహం నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లో జరగాల్సి ఉంది. కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ జూన్ 18న జరిగిన ట్రెక్కింగ్ ప్రయాణమే కేతన్ జీవితానికి చివరి ప్రయాణమైంది.పోలీసుల ప్రకారం, ఘటన రోజున చేతన్ ముందుగానే లోహగడ్‌కు చేరుకుని అక్కడ మాటు వేసి ఉన్నాడు. తర్వాత సియా, కేతన్‌లను అనుసరిస్తూ ఏకాంత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి కేతన్‌ను సుమారు 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టే ప్లాన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆపై సియా కేకలు వేస్తూ భద్రతా సిబ్బందిని పిలిచి, అది ప్రమాదంలా కనిపించేలా ప్రయత్నించినట్లు అభియోగాలు నమోదు చేశారు.ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. చేతన్ స్నేహితుడు నీరజ్‌ను కూడా అదుపులోకి తీసుకుని అతడి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, ఘటనాస్థల పరిశీలన కొనసాగుతోంది.అయితే ఈ కేసులో ఇప్పటికీ ఒక ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కేతన్‌ను చంపాలన్న కుట్ర ఇద్దరిదేనని పోలీసులు చెబుతున్నారు. కానీ చివరి క్షణంలో లోయ అంచున నిలబడ్డ కేతన్కు నెట్టేసి చంపింది ఎవరు?.. పక్కనే నడుస్తున్న సియానా?.. లేక మాటు వేసి ఎదురుచూస్తున్న చేతనా?.. లేదంటే ఇద్దరూనా?. వీళ్లకు సహకరించిన నీరజా? ఈ విషయంలో నిందితుల నుంచి మౌనమే పోలీసులకు ఎదురవుతోంది. అదే సమయంలో.. వాళ్ల తల్లిదండ్రులు ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు. దర్యాప్తు మొత్తం ఇప్పుడు ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగి.. ఆ సమాధానం బయటపడే వరకు ఈ కేసు అతిపెద్ద మిస్టరీ అలాగే కొనసాగనుంది. -
ఫైవ్ స్టార్ హోటల్లో 70 రూములు బుకింగ్!
పుణే: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే కోడలు సియా గోయల్ పుట్టినరోజును ఘనంగా జరపాలని అగర్వాల్ కుటుంబ సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, అదే సమయంలో ఆమె మాత్రం కాబోయే భర్తను హత్య చేయడానికి పథకం రచించినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ (Vishal Agarwal), జూన్ 20న సియా గోయల్ పుట్టినరోజును మహారాష్ట్రలోని ప్రముఖ హిల్‌స్టేషన్ మహాబలేశ్వర్‌లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఏకంగా 70 గదులను బుక్ చేశారు. రెండు కుటుంబాలు కలిసి వేడుకలు జరుపుకోవాలని భావించాయి. అయితే సియా, ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కేతన్‌ను ఒప్పించి, పుణే సమీపంలోని లోహగడ్ కోటకు ఇద్దరూ మాత్రమే వెళ్లేలా ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో తేలింది.నిశ్చితార్థం తర్వాత హత్యప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన కేతన్ అగర్వాల్, సియా గోయల్ (Siya Goyal) నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. నవంబరులో ఘన వివాహం జరగాల్సి ఉంది. అయితే జూన్ 18న లోహగడ్ కోట వద్ద ట్రెక్కింగ్ సందర్భంగా కేతన్ లోయలో పడి మరణించాడు. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించారు. సియా కూడా అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ పోలీసుల దర్యాప్తులో ఇది ముందుగానే పన్నిన హత్యగా బయటపడింది.చదవండి: హుడీతో దొరికిపోయారు ఇద్దరు!ప్రేమికుడితో కలిసి కుట్రవిచారణలో సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌధరి (22) కలిసి కేతన్‌ను చంపినట్టు తేలింది. నేరానికి కొన్ని రోజుల ముందు ఒక కేఫేలో సమావేశమై హత్య ప్రణాళికను ఖరారు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, సియా, చేతన్‌ను (Chetan Chaudhary) అరెస్ట్ చేసి హత్య, నేరపూరిత కుట్ర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. లోనావాల రూరల్ పోలీసు స్టేషన్లో వీరిని విచారిస్తున్నారు. Pune trekker's death case: Accused Siya Goyal, her lover Chetan Chaudhary taken to Lonavala Rural Police Station. pic.twitter.com/RVRZU8n5sG— News Arena India (@NewsArenaIndia) June 24, 2026 -
అంతా బాగానే ప్లాన్ చేసింది.. ఇదిగో ఇక్కడే దొరికిపోయింది?
పూణే: చేతన్ చౌదరి, సియా గోయల్ క్రైమ్ కథాచిత్రంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోహ్‌గఢ్ కోట కంటే ముందే గతేడాది దీపావళి తర్వాత కేతన్ అగర్వాల్‌ను హత్య చేయాలని సియా గోయల్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఓ కేఫ్‌లో సియా ఆమె ప్రియుడు చేతన్‌తో కలిసి మర్డర్ ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాటి నుంచి సుమారు ఏడు నెలల కాలంలో సియా-చేతన్ల మధ్య 2004 కాల్స్, 238 గంటల సంభాషణలు జరిగినట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం లోహగడ్ కోట సాక్షిగా జరిగిన ఒక యువ వ్యాపారవేత్త మరణం, కేవలం ఒక ప్రమాదం కాదు.. అది తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఒక పక్కా క్రైమ్ సినిమా అని పూణే రూరల్ పోలీసులు తేల్చారు. ప్రముఖ బిల్డర్ విశాల్ అగర్వాల్ కుమారుడు, 25 ఏళ్ల కేతన్ అగర్వాల్‌ను అతడికి కాబోయే భార్య 20 ఏళ్ల సియా గోయల్, తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి అత్యంత కిరాతకంగా లోయలోకి నెట్టి చంపేసింది.మొదట ట్రెకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడంటూ అందరినీ నమ్మించిన సియా అసలు రంగు, పోలీసులు జరిపిన లోతైన విచారణలో బయటపడింది. నవంబర్ 25న జైపూర్ రాజభవనంలో చార్టర్డ్ ఫ్లైట్లతో అత్యంత వైభవంగా జరగాల్సిన పెళ్లి, ఈ ఘాతుకంతో మరణానికి దారితీసింది.ఈ కేసులో మొదటి షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే.. జూన్ 18న కేతన్ చనిపోవడానికి కేవలం నాలుగు రోజుల ముందే.. అంటే జూన్ 14న కూడా అదే లోహగడ్ కోటపై అతడిని చంపేందుకు సియా ప్రయత్నించింది. కోట అంచున నిలబడిన కేతన్‌ను ఆమె బలంగా లోయలోకి నెట్టేసింది. కానీ అదృష్టవశాత్తు ఒక చెట్టు కొమ్మను పట్టుకోవడంతో కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో భయపడిపోయిన కేతన్‌తో.. ‘అక్కడ పాము కనిపించింది, నిన్ను కాపాడబోయే కంగారులో చెయ్యి తగిలింది’ అంటూ సియా నమ్మబలికింది.అయినప్పటికీ అనుమానం రాకుండా, జూన్ 19న తన పుట్టినరోజు వేడుకల కోసం మళ్లీ అదే కోటకు రావాలని కేతన్‌ను మొండిగా ఒప్పించింది. కేతన్ నిరాకరించినప్పటికీ, అతడి తల్లికి ఫోన్ చేసి మరీ ఒప్పించడం ఈ క్రైమ్ స్కెచ్‌లో భాగమేనని పోలీసులు గుర్తించారు.ఈ గుట్టు రట్టు కావడానికి ప్రధాన కారణం సియా గోయల్ వేసిన ఒకే ఒక్క తప్పుడు అడుగని తేలింది. కేతన్ అంత్యక్రియలు ముగిసిన నాలుగు రోజుల తర్వాత ఆమె అతడి ఇంటికి వెళ్ళింది. అక్కడ కేతన్ సోదరి అడిగిన కొన్ని సాధారణ ప్రశ్నలకు సియా తడబడింది. పొంతన లేని సమాధానం ఇచ్చింది. దీంతో సియాపై కేతన్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, 33 డిగ్రీల తీవ్రమైన ఎండలో ఒక వ్యక్తి ముఖం కనిపించకుండా మందపాటి హుడీ ధరించి, హెడ్సెట్ పెట్టుకుని కేతన్, సియాలను వెంబడించడం కనిపించింది. సియా వెనక్కి తిరిగినప్పుడల్లా అతడు కింద కూర్చోవడం పోలీసులకు స్పష్టమైన క్లూ ఇచ్చింది.పోలీసులు సాంకేతిక ఆధారాలను తవ్వడం ప్రారంభించాక మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి గత ఆరు నెలల్లో ఏకంగా 2,004 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. అంటే దాదాపు 238 గంటల సమయం వారు సంభాషించారు. అంతేకాదు, జూన్ 18 హత్య జరిగిన రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:40 వరకు చేతన్ తన మొబైల్ ఇంటర్నెట్ ఆఫ్ చేశాడు. పోలీసులు తన లొకేషన్‌ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు, తన సొంత ఫోన్‌ను దుకాణంలోనే వదిలేసి, తన ఉద్యోగి ఫోన్‌ను దొంగతనంగా వాడుతూ లోహగడ్ కోటకు చేరుకున్నాడు.ఈ పక్కా ప్లాన్‌తోనే కేతన్‌ను లోయలోకి నెట్టేసి హత్య చేశారు. పోలీసులు చేతన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, కేతన్ అంటే ఇష్టం లేనప్పుడు నిశ్చితార్థం ఎందుకు రద్దు చేసుకోలేదని ప్రశ్నించారు. దానికి అతడు ఇచ్చిన సమాధానం మరింత షాకింగ్‌గా ఉంది. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని పారిపోతే తన కుటుంబ గౌరవానికి భంగం వాటిల్లుతుందని, సమాజంలో పరువు పోతుందనే భయంతోనే సియా గోయల్ ఆ పని చేయలేదని, అందుకే కేతన్‌ను శాశ్వతంగా అడ్డుతొలగించాలని పథకం రచించినట్లు చేతన్ విచారణలో ఒప్పుకున్నాడు. ప్రస్తుతం లోనావాలా రూరల్ పోలీసులు నిందితులిద్దరిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కేతన్ అగర్వాల్ కుటుంబం నిందితులకు ఉరిశిక్ష పడేలా చేయాలని కన్నీటి పర్యంతమవుతూ డిమాండ్ చేస్తోంది. -
అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలు
మహారాష్ట్రలోని లోహగడ్ కోట హత్య కేసులో వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ సినిమా లాంటి సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భార్య సియా గోయల్ చేతిలో హత్యకు గురైన రియల్ ఎస్టేట్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) కేసు దర్యాప్తులో పోలీసుల విచారణ ద్వారా మరికొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో సి ప్రియుడు చేతన్ చౌదరి సంచలన విషయాలను వెల్లడించాడు.హత్య కుట్రకు గల కారణంపోలీసుల విచారణలో నిందితుడు చేతన్ చౌదరి అసలు విషయాన్ని అంగీకరించాడు. "కేతన్‌ను చంపే బదులు, మీరిద్దరూ పెళ్లి రద్దు చేసుకుని ఎక్కడికైనా పారిపోవచ్చు కదా?" అని పోలీసులు ప్రశ్నించగా చేతన్ సమాధానం విని పోలీసులు విస్తుపోయారు. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని, చేతన్‌తో కలిసి పారిపోవడం సియా గోయల్‌కు ఇష్టం లేదనీ, అలా చేస్తే తమ కుటుంబ పరువు పోతుందని, సమాజంలో అవమానం జరుగుతుందని ఆమె భయపడిందని తెలిపాడు. కుటుంబ పరువు కోసం పెళ్లి ఆపలేక, ప్రియుడితో కలిసి జీవించడం కోసం కేతన్‌ను పూర్తిగా వదిలించుకోవడమే దారి అని భావించి ఈ హత్యకు ప్లాన్ చేశామని వెల్లడించాడు. ఇదీ చదవండి : కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!జూన్ 18న కేతన్ లోహగఢ్ కోట పైనుంచి కాలుజారి పడిపోయాడని సియా అందరినీ నమ్మించింది. తన కాబోయే భర్త మరణం తర్వాత సియా ప్రవర్తనలో ఎలాంటి విచారం కనిపించకపోవడం, పొంతన లేని సమాధానాల కారణంగా కేతన కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అలా మొదలైన దర్యాప్తులో సియా, చేతన్ కుట్ర బట్టబయలైంది. కోట టికెట్ కౌంటర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల దర్యాప్తును పూర్తిగా మార్చేసింది.33 డిగ్రీల సెల్సియస్ ఎండలో హుడీ ధరించిన వ్యక్తి కదలికలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సియా, చేతన్ ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే కేతన్‌ను వెంబడించి హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులను జూన్ 29 వరకు పోలీస్ కస్టడీకి తరలించారు. ఇదీ చదవండి : ఆ ఒక్కడి వల్ల ముగ్గురు బలి : గాయని చిన్మయి ఫైర్ -
కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!
మహారాష్ట్రలోని లోహగఢ్ కోట సమీపంలో జరిగిన కేతన్ అగర్వాల్ (26) మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన.. అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పన్నిన క్రూరమైన హత్య కుట్రగా తేలడం అందర్నీ షాక్‌కు గురిచేసింది.తన కాబోయే భార్య సియాను ఎంతగానో ప్రేమించిన కేతన్ ఆమె పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆమెతో ఏడు అడుగులు వేయాలని కలలు కంటున్న తరుణంలో జూన్ 18న సియా చేతిలో హత్యకు గురయ్యాడు. మొదట అతడు కాలు జారి పడిపోయాడని అందరూ భావించారు.సోదరి అనుమానంతో గుట్టు రట్టుకానీ, కేతన్ అంత్యక్రియలు జరిగిన నాలుగు రోజుల తర్వాత సియా వారి కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చినపుడు అనుమానం మొదటైంది. ఆ సమయంలో ఆమె చెప్పిన వివరాలలో తేడాలు ఉండటాన్ని కేతన్ సోదరి గమనించింది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు సియా ఫోన్ రికార్డులను పరిశీలించడంతో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.6 నెలల్లో 2004 కాల్స్సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి గత ఆరు నెలల్లో ఏకంగా 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు. మొత్తం 238 గంటలకు పైగా ఫోన్ కాల్స్‌లో గడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కాల్ డేటానే ఈ హత్య కుట్రను ఛేదించడానికి కీలక ఆధారంగా మారింది.పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంఘటన జరిగిన రోజు చేతన్ చౌదరి తన లొకేషన్ దొరకకూడదని చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:40 గంటల వరకు తన ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఆపివేశాడు. తన మొబైల్ ఫోన్‌ను ఎవరూ ట్రాక్ చేయకుండా తన దుకాణంలోనే వదిలేశాడు.ఇదీ చదవండి : ఆ ఒక్కడి వల్ల ముగ్గురు బలి : గాయని చిన్మయి ఫైర్లోహగఢ్ కోటకు వెళ్లేటప్పుడు తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి మొబైల్ ఫోన్‌ను తీసుకు వెళ్లాడు. అయితే, పోలీసులు డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ/సర్వైలెన్స్ డేటా ద్వారా అతడు అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించారు. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరినీ కోర్టు జూన్ 29 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది.మండుటెండలో హుడీసీసీటీవీ ఫుటేజ్ ప్రకారం 33 డిగ్రీల సెల్సియస్ మండుటెండలో ట్రెకింగ్ చేస్తుండగా హుడీ ధరించిన వ్యక్తి అనుమానాస్పద కదలికలు,ఇంత ఎండలో హైకింగ్‌కు వెళ్లేటప్పుడు ఎవరైనా హుడీ ఎందుకు ధరిస్తారనే అనుమానమే ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. పోలీసుల కథనం ప్రకారం, కోట వద్ద కేతన్, అతని కాబోయే భార్య సియా కలిసి నడుస్తుండగా సీసీటీవీలో కనిపించింది. సియా ప్రియుడైన చేతన్ చౌదరిగా గుర్తించబడిన మరో వ్యక్తి, వారికి సుమారు 20 నుండి 30 అడుగుల దగ్గర నుండి వారిని ఫాలో అయ్యాడు. అతను షార్ట్స్, ముఖాన్ని కప్పివేసే హుడీ ధరించి కనిపించాడు. హుడీపై హెడ్సెట్ కూడా పెట్టుకున్నాడు.మరో సీసీటీవీ ఫుటేజ్‌లో, సియా అకస్మాత్తుగా హుడీ ధరించిన వ్యక్తి వైపు వెనక్కి తిరిగి చూసి, వెంటనే కూర్చుండిపోయింది. సియా, చేతన్ల మధ్య బలమైన సంబంధం ఉందని, పక్కా ప్రణాళికతో పన్నిన కుట్ర అని కూడా టెక్నికల్ డేటా ద్వారా తేలింది.ఇదీ చదవండి: 11 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం : ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్అపుడే తోసేసింది..కానీ కేతన్, సియాలు మే 31, జూన్ 14 , జూన్ 18 తేదీలలో మూడుసార్లు లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. కేతన్ హత్యకు కొన్ని రోజుల ముందు, అంటే గత నెలలో, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం కేతన్, సియా బాలికి వెళ్లాల్సి ఉంది. అయితే, ముంబై విమానాశ్రయంలో తన పాస్‌పోర్ట్ కనిపించడంలేదని డ్రామా ఆడింది. సియా కావాలనే పాస్‌పోర్ట్‌ను దాచిపెట్టి ఆ ప్రయాణాన్ని అడ్డుకుందని బాధితుడి తండ్రి ఆరోపించారు.ఆ తర్వాత లోహగడ్ కోటకు వెళ్ళినప్పుడు, జూన్ 14న సియా కేతన్‌ను హత్యకు తొలిసారి ప్రయత్నించి విఫలమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొండపై నెంచి అతణ్ని నెట్టేసింది. అయితే అతను కొండ అంచున ఉన్న పొదను పట్టుకుని ప్రాణాలు కాపాడుకో గలిగాడు. తన చర్యను కప్పిపుచ్చుకోవడానికి, పాము కనిపించిందని అరుస్తూ అందరి దృష్టి మళ్లించి, ఆపై అతన్ని వాటేసుకుని బావురుమంటూ నాటకం ఆడింది. అలా తొలి ప్రయత్నం విఫలం కావడంతో ఈసారి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసి కేతన్‌ను మట్టుబెట్టారు. అంతేకాదు ఒకవేళ అనుకున్నట్టు జరగకపోతే, 'ప్లాన్ సి' (మూడో ప్లాన్) కూడా సిద్ధం చేసుకున్నారట.మరోవైపు,చేతన్ తరపు న్యాయవాది రామ్ షహానే ఈ ఆరోపణలను ఖండించారు. ఎఫ్ఐఆర్లో చేతన్‌కు ఈ మరణంతో సంబంధం ఉన్నట్లు ఎక్కడా ప్రత్యక్ష ఆధారాలు లేవని, ఘటన జరిగిన సమయంలో అతడు లోహగఢ్ ప్రాంతంలో ఉన్నట్లు ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లేదా పత్రాలను పోలీసులు చూపించలేదని వాదించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో మరిన్ని డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. సియా ఒక బేకరీని నడుపుతుండగా, చేతన్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాడు.ఇదీ చదవండి: ముగ్గురికి గుడ్‌బై : వ్యాపారవేత్తతో 62 ఏళ్ల మోడల్ ఎంగేజ్మెంట్కాగా మహారాష్ట్రకు చెందిన ప్రముఖవ్యాపారవేత్త కుమారుడైన కేతన్, సియాల నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరిలోజరిగింది. ప్రైవేట్ జెట్లు, రాజభవనాల వేదికగా ఈ ఏడాది నవంబర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు కేతన్. కానీ అనూహ్యంగా అనంత లోకాలకు చేరడం విషాదం. -
'లోహగడ్ కోట' కేసులో.. కొత్త కోణం!
మండు వేసవిలో ఉక్కపోస్తుండగా ఎవరైనా హుడీ ధరిస్తారా? ఇదే అనుమానం పుణే పోలీసులకు వచ్చింది. వెంటనే ఈ దిశగా దర్యాప్తు సాగించడంతో అసలు నిజం బయటపడింది. అప్పటి వరకు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పరిగణించబడిన కేసు కొత్త మలుపు తిరిగింది. పథకం ప్రకారం హత్య చేశారని వెల్లడైంది.పుణే: మహారాష్ట్రలో సంచలనం రేపిన పుణే వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 18న లోహగడ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడిపోయి విశాల్ చనిపోయాడు. తనను ఫొటోలు తీస్తూ ప్రమాదవశాత్తు అతడు లోయలో పడిపోయాడని అతడికి కాబోయే భార్య సియా గోయల్ (Siya Goyal).. లూనావాలా రూరల్ పోలీసులకు చెప్పింది. అయితే ప్రియుడితో కలిసి విశాల్‌ను ఆమె లోయలోకి తోసేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.ఎలా కనిపెట్టారంటే.. ?కాబోయే భార్య సియా గోయల్‌తో కలిసి కేతన్ అగర్వాల్ (Ketan Agarwal).. ఈనెల 18న చారిత్రక లోహగడ్ కోటకు వెళ్లాడు. వీరిని కొంత దూరం నుంచి ఓ వ్యక్తి వ్యక్తి అనుసరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి షార్ట్, ముఖాన్ని పూర్తిగా కప్పే హుడీ ధరించి.. తలకు హెడ్సెట్ పెట్టుకున్నాడు. ఆ రోజు ఉష్ణోగ్రత సుమారు 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇలాంటి ఉక్కపోత వాతావరణంలో అతడు హుడీ ఎందుకు ధరించాడనే సందేహం పోలీసులకు వచ్చింది. వెంటనే ఈ దిశగా దర్యాప్తు సాగించారు. మరో వీడియోలో సియా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగా, వెంటనే హుడీ ధరించిన వ్యక్తి కూర్చోవడం కనిపించింది. దీంతో అనుమానం బలపడింది.మరోవైపు కేతన్ మరణించిన తర్వాత కూడా సియా ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోవడాన్ని పోలీసులు గమనించారు. పెళ్లి ఇష్టం లేనట్టుగా సియా గోయల్ కనిపించిందని కేతన్ మామ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. పెళ్లిని ఏడాది పాటు వాయిదా వేయవచ్చా అని ఒకసారి తనను అడిగిన విషయాన్ని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కుట్ర కోణంలో దర్యాప్తు మొదలుపెట్టడంతో అసలు నిజం బయటకు వచ్చింది. ప్రియుడు చేతన్ చౌధరి (Chetan Choudhary)తో కలిసి సియా గోయల్ తనకు కాబోయే భర్తను హత్య చేసిందని నిర్ధారణయింది.2,004 ఫోన్ కాల్స్ !సాంకేతిక ఆధారాలతో సియా, చేతన్ మధ్య సన్నిహిత సంబంధాలు బయటపడ్డాయి. చేతన్ సోషల్ మీడియా ఫోటోలను సీసీటీవీ దృశ్యాలతో పోల్చి చూడగా, ఫుటేజ్‌లో కనిపించిన వ్యక్తి అతడేనని పోలీసులు నిర్ధారించారు. ఇక గత ఏడు నెలల్లో సియా, చేతన్ మధ్య 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు, వాటి మొత్తం వ్యవధి 238 గంటలకుపైగా ఉన్నట్లు విచారణలో తేలింది. గతేడాది నవంబరు నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు తెలిసింది. సియా బేకరీ వ్యాపారం నిర్వహిస్తుండగా, చేతన్ డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్నాడు. తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి కేతన్‌తో పెళ్లికి సియా ఒప్పుకుందని సమాచారం. మొదటి హత్యాయత్నం విఫలం!కేతన్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సియా, చేతన్‌తో కలిసి అతడిని హత్య చేయాలని కుట్ర చేసింది. ఇందులో భాగంగా కేతన్‌ను సియా.. ఫొటో షూట్ పేరుతో లోహగడ్ కోటకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడికి వచ్చిన చేతన్‌తో కలిసి కేతన్‌ను లోయలోకి తోసేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొదటి హత్యాయత్నం విఫలమైందని వెల్లడించారు. జూన్ 14న కూడా లోహగడ్ కోట వద్ద సియా కేతన్‌ను లోయలోకి నెట్టేసి చంపేందుకు ప్రయత్నించింది. అయితే అతడు పక్కనే ఉన్న పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి అనుమానం రాకుండా ఉండేందుకు కట్టుకథ అల్లింది. పాము కనిపించడంతో భయంతో అతడి మీద పడ్డానని చెప్పడంతో కేతన్ నమ్మేశాడు.చదవండి: బంధం ముగిస్తే సరిపోదా.. బలి ఎందుకు?ప్లాన్- సీ కూడా సిద్ధం!మొదటి ప్రయత్నం విఫలం కావడంతో జూన్ 18న మళ్లీ పథకం అమలు చేసి కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రయత్నం కూడా విఫలమైతే అమలు చేసేందుకు మరో ప్రత్యామ్నాయ ప్రణాళికను ("ప్లాన్-సీ") సిద్ధం చేసుకున్నట్లు కేసు పత్రాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌధరిలను హత్య, నేరపూరిత కుట్ర కేసుల్లో అరెస్టు చేసిన పోలీసులు వారిని ఏడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
బంధం ముగిస్తే సరిపోదా?.. బలి ఎందుకు?
ఒకప్పుడు ప్రేమ విఫలమైతే దూరమయ్యేవారు. పెళ్లి బంధం సరిగా సాగకపోతే విడాకులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా?. ప్రేమించిన వారినే హత్య చేయడం, జీవిత భాగస్వామిని అంతమొందించడం, సంబంధానికి అడ్డుగా ఉన్నారని ప్రాణాలు తీయడం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు బంధాలు ‘బ్రేక్’ అవ్వడం కాకుండా ఎందుకు బలైపోతున్నాయి?. కాస్త లోతుల్లోకి వెళ్తే..మేఘాలయ హనీమూన్ కేసునే పరిశీలిద్దాం. ఇండోర్‌కు చెందిన జంట.. హనీమూన్‌కు వెళ్లింది. దంపతులు మిస్ కావడం.. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు.. భర్త చనిపోవం.. భార్య దీనావస్థలో రోడ్డు మీద కనిపించడం.. చివరకు భార్య&ప్రియుడి చేతిలోనే హత్యకు గురవడం తీవ్ర సంచలనం రేపింది. మరోవైపు ఇటు తెలంగాణలో సంచలనం సృష్టించిన సర్వేయర్ హత్య కేసులోనూ వివాహేతర సంబంధాల కోణం ప్రధానంగా చర్చకు వచ్చింది. అటు.. ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన మీరట్ "బ్లూ డ్రం" కేసులో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్తను హత్య చేశారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా పుణెలో పెళ్లికి సిద్ధమవుతున్న కేతన్ అగర్వాల్ ప్రమాదవశాత్తూ చనిపోలేదని.. అది హత్య అని తేలడం సంచలనం సృష్టించింది. ఫొటోషూట్ పేరుతో ఓ కోటకు తీసుకెళ్లి కాబోయే వధువు, ఆమె ప్రియుడే అతన్ని దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.These are Ketan Agarwal and Siya Goel. They were engaged and supposed to get married this year. Look how happy, in love, and comfortable they are with each other.They must have dreamed of a great future together, but cruel fate had other ideas. On June 18, Siya's birthday,… pic.twitter.com/4Av4OQvXuc— THE SKIN DOCTOR (@theskindoctor13) June 23, 2026ఈ ఘటనల్లో పరిస్థితులు, వ్యక్తులు, ప్రాంతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ఒక ఉమ్మడి అంశం కనిపిస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అదే.. సంబంధాన్ని ముగించడం కంటే వ్యక్తినే శాశ్వతంగా తొలగించాలనే ప్రమాదకర ఆలోచన.మనస్తత్వ నిపుణుల ప్రకారం.. నేటి కాలంలో కొందరు ప్రేమను పరస్పర గౌరవంతో కూడిన బంధంగా కాకుండా, స్వాధీన భావంతో చూస్తున్నారు. నువ్వు నాకే చెందాలి.. లేదంటే ఎవరికీ దక్కకూడదు అనే ఆలోచన తీవ్ర స్థాయికి చేరినప్పుడు హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.అలాగే, తిరస్కరణను అంగీకరించలేకపోవడం కూడా కీలక కారణమని నిపుణులు చెబుతున్నారు. సంబంధం కొనసాగకపోతే విడిపోవడం, చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడం వంటి మార్గాలు ఉన్నప్పటికీ, కొందరు వాటిని పరాజయంగా భావిస్తున్నారని అంటున్నారు. పరువు పోతుందనే భయం, ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతామనే ఆందోళన, కుటుంబమో.. సమాజమో ఏమనుకుంటుందో అనే ఒత్తిడి కొందరిని తీవ్ర నిర్ణయాల వైపు నెడుతున్నాయని విశ్లేషిస్తున్నారు.మరోవైపు సోషల్ మీడియా ప్రభావం కూడా సంబంధాలపై పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ రిలేషన్షిప్ చిత్రాలతో తమ బంధాలను పోల్చుకోవడం, చిన్న చిన్న విభేదాలను కూడా పెద్ద సమస్యలుగా భావించడం వల్ల అసహనం పెరుగుతోందని చెబుతున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం, కోపాన్ని ఆరోగ్యకరంగా వ్యక్తం చేయలేకపోవడం, కౌన్సెలింగ్ తీసుకోవడంపై ఇప్పటికీ ఉన్న అపోహలు కూడా సమస్యను మరింత తీవ్రమం చేస్తున్నాయని పేర్కొంటున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. అయితే సంభాషణ, కుటుంబ సభ్యుల సహకారం, అవసరమైతే కౌన్సెలింగ్ ద్వారా చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. బంధం కొనసాగించడం సాధ్యం కాకపోతే విడిపోవడం కూడా ఒక మార్గమే. కానీ ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రేమ అనేది స్వాధీనం కాదు, బాధ్యత. బంధం అనేది నియంత్రణ కాదు, పరస్పర గౌరవం. ఆ గౌరవం, నమ్మకం కోల్పోయినప్పుడు బంధాలు బలహీనపడతాయి. కానీ ఏ పరిస్థితుల్లోనూ ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు మరొకరికి లేదన్న విషయాన్ని సమాజం మరచిపోకూడదు.::వెబ్ ప్రత్యేకం -
ఫొటోల వంకతో కాబోయే భర్తను లోయలోకి తోసేసిందా..?
ముంబై: పుణె వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని కావాలనే లోయపై నుంచి తోసి వేశారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భార్య 'సియా గోయల్', ఆమె స్నేహితుడు 'సుధాన్షు చౌదరి'లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల నిర్ధారణతో వెలుగుచూసిన అంశాలతో అంతా షాకింగ్ గురయ్యారు.ఏం జరిగిందిపుణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్ 18న చారిత్రక లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాము ట్రెక్కింగ్‌కు వచ్చామని, కేతన్ తనను ఫొటోలు తీస్తుండగా హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని కేతన్ కాబోయే భార్య పోలీసులకు తెలిపింది. దాంతో ప్రమాదంగా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.అయితే విచారణ సందర్భంగా కేతన్ కాబోయే భార్య పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. హత్య కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అతడిది హత్య అని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ కేసులో కేతన్ కాబోయే భార్యను, ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లు విచారణ చేపట్టారు.పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్.. తన కుటుంబ స్థిరాస్తి వ్యాపార కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇటీవలే అతడికి వివాహం నిశ్చయమైంది. నవంబర్‌లో జరిగే పెళ్లి వేడుక కోసం ఉదయ్‌పుర్‌లోని ఖరీదైన ప్యాలెస్‌ను కూడా బుక్ చేశారు. జూన్ 19న కాబోయే భార్య పుట్టినరోజు ఉండటంతో ఆ వేడుకల కోసం కేతన్ కొంతమంది మిత్రులతో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లారు. అక్కడే ఈ విషాద ఘటన జరిగింది.అంగరంగ వైభవంగా వివాహ వేడుక వివాహం ఈ నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగాల్సి ఉంది. దీని కోసం ఇరు కుటుంబాలు జైపూర్‌లో రూ.17 కోట్ల వ్యయంతో ఒక ప్యాలెస్‌ను బుక్ చేశారు. అంతేకాకుండా అతిథుల కోసం రెండు ప్రైవేట్ విమానాలను ఏర్పాటు చేశారని మృతుడి బంధువులు తెలిపారు. ఆ సమయంలో ఇలాంటి ఘటన జరగడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు.


