ఫైవ్ స్టార్ హోటల్‌లో 70 రూములు బుకింగ్‌! | Ketan Agarwal Family Planned Birthday Bash for Siya Goyal full details | Sakshi
Sakshi News home page

కాబోయే కోడ‌లి పుట్టినరోజు వేడుకలకు భారీ ప్లాన్‌.. ఇంత‌లోనే..

Jun 24 2026 5:22 PM | Updated on Jul 3 2026 2:14 PM

Ketan Agarwal Family Planned Birthday Bash for Siya Goyal full details

కేతన్ అగర్వాల్,సియా గోయల్ (ఫైల్ ఫొటో)

పుణే: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే కోడలు సియా గోయల్ పుట్టినరోజును ఘనంగా జరపాలని అగర్వాల్ కుటుంబ సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, అదే సమయంలో ఆమె మాత్రం కాబోయే భర్తను హత్య చేయడానికి పథకం రచించినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ (Vishal Agarwal), జూన్ 20న సియా గోయల్ పుట్టినరోజును మహారాష్ట్రలోని ప్రముఖ హిల్‌స్టేషన్ మహాబలేశ్వర్‌లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఏకంగా 70 గదులను బుక్ చేశారు. రెండు కుటుంబాలు కలిసి వేడుకలు జరుపుకోవాలని భావించాయి. అయితే సియా, ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కేతన్‌ను ఒప్పించి, పుణే సమీపంలోని లోహగడ్ కోటకు ఇద్దరూ మాత్రమే వెళ్లేలా ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో తేలింది.

నిశ్చితార్థం తర్వాత హత్య
ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన కేతన్ అగర్వాల్, సియా గోయల్ (Siya Goyal) నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. నవంబరులో ఘన వివాహం జరగాల్సి ఉంది. అయితే జూన్ 18న లోహగడ్ కోట వద్ద ట్రెక్కింగ్ సందర్భంగా కేతన్ లోయలో పడి మరణించాడు. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించారు. సియా కూడా అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ పోలీసుల దర్యాప్తులో ఇది ముందుగానే పన్నిన హత్యగా బయటపడింది.

చ‌ద‌వండి:  హుడీతో దొరికిపోయారు ఇద్ద‌రు!

ప్రేమికుడితో కలిసి కుట్ర
విచారణలో సియా గోయల్ త‌న ప్రియుడు చేతన్ చౌధరి (22) క‌లిసి కేతన్‌ను చంపిన‌ట్టు తేలింది. నేరానికి కొన్ని రోజుల ముందు ఒక కేఫేలో సమావేశమై హత్య ప్రణాళికను ఖరారు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, సియా, చేత‌న్‌ను (Chetan Chaudhary) అరెస్ట్ చేసి హత్య, నేరపూరిత కుట్ర ఆరోపణలపై కేసు న‌మోదు చేశారు. లోనావాల రూర‌ల్ పోలీసు స్టేష‌న్‌లో వీరిని విచారిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement