‘కేతన్‌ నా హీరో.. చాలా కేరింగ్‌’.. పొగడ్తలు గుప్పించిన సియా! | Ketan Was Caring Kind: Siya's Old Engagement Video Goes Viral | Sakshi
Sakshi News home page

‘కేతన్‌ నా హీరో.. చాలా కేరింగ్‌’.. పొగడ్తలు గుప్పించిన సియా!

Jul 21 2026 9:03 AM | Updated on Jul 21 2026 9:28 AM

Ketan Was Caring Kind: Siya's Old Engagement Video Goes Viral

ఒకప్పుడు ప్రేమ, అనుబంధానికి గుర్తుగా నిలిచిన ఓ వీడియో.. ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది. పుణే లోహ్‌గఢ్‌ కేసులో నిందితురాలు సియా గోయల్‌ కేతన్‌ అగర్వాల్‌ను పొడుగుతూ చెప్పిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ వీడియోను నెటిజన్లు చూసి నెటిజన్లు.. పాపం కేతన్‌, అంత మంచోడిని చంపడానికి చేతులెలా వచ్చాయి? అని సియాను తిట్టుకుంటున్నారు. 

ఆ వీడియో కేతన్‌-సియా నిశ్చితార్థ వేడుకలోది. వేదికపై కేతన్‌, సియా కలిసి ఉన్న సమయంలో అక్కడున్న ఒకావిడ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అప్పటికే సియా కేతన్‌ను తన హీరో అని, ఆ హీరో నెంబర్‌ 1 అని వ్యాఖ్యానించింది. “కాబోయే భర్తగా కేతన్‌లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అతడిని మీ హీరో నంబర్‌ వన్‌గా భావించడానికి కారణం?” అని ప్రశ్నించారు. దీనికి సియా చిరునవ్వుతో.. “కేతన్‌ చాలా కేరింగ్‌, చాలా మంచివాడు” అంటూ సమాధానం ఇచ్చింది. 

ఆ మాటలు విన్న కేతన్‌ నవ్వుతూ స్పందించగా.. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. అప్పట్లో ప్రేమగా కనిపించిన ఈ క్షణాలు.. ఇప్పుడు కేతన్‌ మృతి కేసు నేపథ్యంలో మరో కోణంలో చర్చకు వస్తున్నాయి.

పుణెకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ జూన్‌ 18న లోహగఢ్‌ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ.. పుణె రూరల్‌ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వివాహంపై అసంతృప్తితో ఉన్న సియా గోయల్‌ (20), ఆమె స్నేహితుడు చేతన్‌ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. 

ఫొటో షూట్‌ పేరుతో కేతన్‌ను లోహగఢ్‌ కోటకు తీసుకెళ్లి.. అక్కడి లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. అంతకు ముందు(జూన్‌ 14న) ఇదే ప్రాంతంలో కేతన్‌ను చంపేందుకు మరోసారి ప్రయత్నం జరిగినట్లు కూడా తెలుస్తోంది. 

పుణే కేతన్‌ అగర్వాల్‌ కేసు దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. కాబోయేవాడిని ప్రియుడి సాయంతో హతమార్చడం.. రకరకాల చర్చలకు దారి తీసింది. ఈ తరుణంలో కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. కేతన్‌ను తోసి చంపింది సియానా? లేదంటే చేతనా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. విచారణలో పోలీసులును సియా, చేతన్‌లు ఏ వివరాలు చెప్పుకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. పోలీసులు ఆమెను విచారణ కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్తున్న సమయంలోనూ మీడియా ముందు ఆటిట్యూడ్‌ ప్రదర్శిస్తూ వస్తోంది. 

సియా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలంటున్న ఆమె కుటుంబం.. మరోవైపు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. అయితే దర్యాప్తు ఆలస్యం అవుతుండడంతో ఆమె బెయిల్‌ దక్కవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది కేతన్‌ కుటుంబం. 

సియా కేతన్‌ కలిసి దిగిన ఫొటోలు, సరదాగా గడిపిన వీడియోలు.. ఇప్పుడు “కేతన్‌ మంచోడు.. కేరింగ్‌” అని చెప్పిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ వైరల్‌ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంత మంచోడికి విషయం చెబితే సరిపోయేది కదా.. ఎందుకు చంపేశావ్‌? అని కామెంట్లలో సియాను తిట్టి పోస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement