ఫొటోల వంకతో కాబోయే భర్తను లోయలోకి తోసేసిందా..? | lohagad murder they booked rs 17 crore palace for wedding then she pushed fiance off cliff | Sakshi
Sakshi News home page

ఫొటోల వంకతో కాబోయే భర్తను లోయలోకి తోసేసిందా..?

Jun 23 2026 4:23 PM | Updated on Jul 3 2026 2:06 PM

lohagad murder they booked rs 17 crore palace for wedding then she pushed fiance off cliff

ముంబై: పుణె వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో  భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని కావాలనే లోయపై నుంచి  తోసి వేశారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భార్య 'సియా గోయల్', ఆమె స్నేహితుడు 'సుధాన్షు చౌదరి'లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల నిర్ధారణతో వెలుగుచూసిన అంశాలతో అంతా షాకింగ్‌ గురయ్యారు.

ఏం జరిగింది
పుణేకు చెందిన  26 ఏళ్ల కేతన్‌ అగర్వాల్‌ జూన్‌ 18న చారిత్రక లోహగఢ్‌ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాము ట్రెక్కింగ్‌కు వచ్చామని, కేతన్‌ తనను ఫొటోలు తీస్తుండగా హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని కేతన్‌ కాబోయే భార్య పోలీసులకు తెలిపింది. దాంతో ప్రమాదంగా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.

అయితే విచారణ సందర్భంగా కేతన్‌ కాబోయే భార్య పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. హత్య కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అతడిది హత్య అని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ కేసులో కేతన్ కాబోయే భార్యను, ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లు విచారణ చేపట్టారు.

పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్‌.. తన కుటుంబ స్థిరాస్తి వ్యాపార కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇటీవలే అతడికి వివాహం నిశ్చయమైంది. నవంబర్‌లో జరిగే పెళ్లి వేడుక కోసం ఉదయ్‌పుర్‌లోని ఖరీదైన ప్యాలెస్‌ను కూడా బుక్‌ చేశారు. జూన్‌ 19న కాబోయే భార్య పుట్టినరోజు ఉండటంతో ఆ వేడుకల కోసం కేతన్‌ కొంతమంది మిత్రులతో కలిసి లోహగఢ్‌ కోటకు వెళ్లారు. అక్కడే ఈ విషాద ఘటన జరిగింది.

అంగరంగ వైభవంగా వివాహ వేడుక 
వివాహం ఈ నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో  జరగాల్సి ఉంది.  దీని కోసం ఇరు కుటుంబాలు జైపూర్‌లో రూ.17 కోట్ల వ్యయంతో  ఒక ప్యాలెస్‌ను బుక్ చేశారు. అంతేకాకుండా అతిథుల కోసం రెండు ప్రైవేట్ విమానాలను ఏర్పాటు చేశారని మృతుడి బంధువులు తెలిపారు. ఆ సమయంలో ఇలాంటి ఘటన జరగడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement