షాకింగ్‌ : ఆమె అలా సిగ్నల్‌ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు! | Ketan Agarwal tragedy Siya Goyal sat down as signal for Chetan to push fiance into Lohagad fort gorge | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ : ఆమె అలా సిగ్నల్‌ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు!

Jun 25 2026 12:12 PM | Updated on Jun 25 2026 1:23 PM

Ketan Agarwal tragedy Siya Goyal sat down as signal for Chetan to push fiance into Lohagad fort gorge

పుణేకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత దీన్ని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించినప్పటికీ, అతని కాబోయే భార్య (ఫియాన్సే) సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి పక్కా స్కెచ్‌తో చేసిన హత్య అని పుణే రూరల్ పోలీసులు వెల్లడించారు. మొదటి ప్రయత్నంలో ఒకసారి కొండంపై నుంచి తోసేసినప్పటికీ,  కాబోయే భార్యను గుడ్డిగా నమ్మిన కేతన్‌ చివరకు ఆమె కుట్రకు బలికాక తప్పలేదు. వారు పక్కాగా అమలు చేసిన వారి ప్లాన్‌ గురించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గజానన్ టోంపే మరికొన్ని దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు.

పక్కా ప్లాన్ ప్రకారం హత్య
పోలీసుల విచారణ ప్రకారం జూన్ 18న సియా గోయల్ తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్‌ను లోహగఢ్ కోటకు తీసుకువెళ్లింది. సియా ప్రియుడైన చేతన్ చౌదరి, ఆ జంటను రహస్యంగా లోహగఢ్ కోట వరకు ఫాలో అయ్యాడు. అంతేకాదు తన ఫోన్‌ను రూంలోనే వదిలి వచ్చాడు. కోటపై ఉన్న ఒక నిర్దేశిత ప్రదేశానికి చేరుకున్నాక, సియా ముందుగా అనుకున్న సిగ్నల్ ఇచ్చింది. 

 ఏంటా  సిగ్నల్‌
అందేంటి అంటే సడెన్‌ కూడా ఒకచోట కూర్చోవడం. అలా యాక్షన్‌కు "సమయం వచ్చింది" అని సైగ (సిగ్నల్) చేయాలి. అలా ఒకచోట కూర్చుని సియా సిగ్నల్ ఇవ్వగానే, వెనుక నుండి మాటు వేసిన చేతన్ చౌదరి, కేతన్‌ను ఒక్కసారిగా లోయలోకి తోసేసి అక్కడి నుండి పారిపోయాడు.

దీనికి సంబంధిచి  పోలీసులు కీలక ఆధారారాలను  కూడా సేకరించారు. కోట కింద ఉన్న సీసీటీవీ విజువల్స్ పరిశీలించగా.. తలకి హుడీ (టోపీ) ధరించి పాలో అయిన వ్యక్తి  చేతన్ చౌదరి అని పోలీసులు గుర్తించారు. చేతన్ చౌదరి కేవలం 50 నిమిషాల్లోనే కోట ఎక్కి, పని ముగించుకుని కిందకు దిగాడు. కోట పైన అతను గడిపింది కేవలం 10 నిమిషాలు మాత్రమే. ఎక్సర్‌సైజ్ కోసం వచ్చానని అక్కడ ఉన్నసెక్యూరిటీ గార్డుతో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డు  పోలీసులకు ధృవీకరించాడు.

ఇదీ చదవండి: అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్‌ చెప్పిన షాకింగ్‌ నిజాలు

సాధారణ రోజుల్లో (వీక్‌డేస్) పెద్దగా జనం ఉండరనే కారణంతో పవనా డ్యామ్ వైపు ఉండే 'వించు కాటా' (Vinchu Kata) అనే లోయ ప్రాంతాన్ని వారు ఎంచుకున్నారు.

ఇది నాలుగో ప్రయత్నం
అంతేకాదు కేతన్‌ను చంపేందుకు సియా, చేతన్‌లు అంతకుముందు కూడా మూడుసార్లు విఫలయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి పాము నుండి రక్షిస్తున్నట్లు నటిస్తూ కేతన్‌ను తోసేయడానికి సియా ప్రయత్నించిందని విచారణలో తేలింది. అలాగే  ఎలాగైనా  కేతన్‌ను మట్టుబెట్టాలనే ఉద్దేశంతో తన పుట్టినరోజు వేడుకల పేరుతో జూన్ 18న లోహగడ్ కోటను సందర్శించేలా సియా, కేతన్‌ను ఒప్పించినప్పుడు ఆ అవకాశం లభించిందని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్‌ : కేతన్‌ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement