లోహగఢ్ కోట ట్రిప్‌కు పంపింది నేనే : తల్లడిల్లిపోతున్న తల్లి
రూ.17 కోట్లతో జైపూర్ కోటలో పెళ్లి.. అంతలోనే తీరని విషాదం
మహారాష్ట్రలోని లోహగడ్ కోటవద్ద రియల్ ఎస్టేట్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసి కాబోయే కోడల్ని ఎంతో ఆనందంగా ఇంటికి తీసుకురావాలని ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ఆ కుటుంబం చివరికి కాబోయే కోడలి క్రూరత్వానికి బలైపోయింది. జీవితంలో ఎప్పటికీ కోలుకోలేని తీవ్ర ఆవేదన మిగిల్చింది.
కన్నతల్లి ఆవేదన.. ఆఖరి మాటలు
కొడుకు మరణవార్త విన్న కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ గుండెకోత తట్టుకోలేక స్పృహతప్పి పడిపోతున్నారు. తనే పంపించానని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. అసలు ఆ రోజు లోహగఢ్ కోట ట్రిప్‌కు వెళ్లమని కేతన్‌ను ఒప్పించింది అతని తల్లే. దాంతో కొడుకును మృత్యుపాశంలోకి తానే నెట్టేసానని తల్లి తల్లడిల్లిపోతోంది. ఆమె తీరని ద్రోహం చేసింది. మా యింటి పిల్ల అనుకున్నాం. కలిసి షాపింగ్‌లు చేశాం, కలిసి భోంచేశాం కానీ ఇంత దారుణానికి తెగ బడుతుందని అస్సలు ఊహించలేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కాబోయే కోడలి గురించి తల్లి, కొడుకుతో చెప్పిన చివరిమాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు.
"My son is no more. Siya betrayed us. We treated her like family, went shopping and had dinners together, but never imagined this," said Ketan Agarwal's grieving mother. 💔
Meanwhile, Ketan's father has appealed for a fast-track trial and the strictest punishment for the… pic.twitter.com/ebQ5MkWggS— Megh Updates 🚨™ (@MeghUpdates) June 24, 2026
చివరి మాటలు
కేతన్ ట్రిప్‌కు బయలుదేరే ముందు తల్లి రాఖీ అగర్వాల్ అతనికి చెప్పిన చివరి మాటలు.. ‘‘సియాను జాగ్రత్తగా చూసుకో. ఆమెను అస్సలు ఇబ్బంది పెట్టకు’’ అని కొడుకు ప్రాణాలు తీయబోయే అమ్మాయి గురించే ఆ తల్లి ఆఖరి నిమిషం వరకు అంతగా తాపత్రయపడటం అందరినీ కలచివేస్తోంది.
35 ఏళ్ల బంధం
అగర్వాల్, గోయల్ కుటుంబాల మధ్య 35 ఏళ్ల పరిచయం అందుకే రాఖీ అగర్వాల్ కాబోయే కోడలు సియాను తన సొంత కూతురిలా చూసుకున్నారు. అలాంటి సియానే తన కొడుకును చంపడానికి కుట్ర పన్నిందని తెలిసి ఆమె కుప్పకూలిపోయారు.
తండ్రి మరో వాదన
కేతన్ తండ్రి పుణేలో ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ ఈ హత్యకు సంబంధించిన మరికొన్ని భయంకరమైన వివరాలను పంచుకున్నారు. కేతన్‌ను కోట పైనుంచి కిందకు నెట్టేయడానికి ముందే.. సియా, చేతన్ చౌదరి ఇద్దరూ కలిసి పదునైన ఆయుధంతో కేతన్ తలపై బలంగా కొట్టారు. అతడు స్పృహ తప్పేలా లేదా కనీసం తప్పించుకోలేనంత బలహీనపడేలా చేసిన తర్వాతే పైనుంచి కిందకు నెట్టేసి చంపేశారని వాపోయారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడాలి
పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేసి నిజాన్ని బయటపెట్టారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి, నిందితులకు త్వరగా అత్యంత కఠినమైన శిక్ష పడేలా చేయడమే నా ఏకైక డిమాండ్. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారికి ఇదొక హెచ్చరిక కావాలి అని తండ్రి విశాల్ అగర్వాల్ ప్రభుత్వాన్ని కోరారు.
బర్త్‌డే వేడుక కోసం స్టార్ హోటల్‌లో 70 రూములు
తన కుమారుడి కాబోయే భార్య సియా గోయల్ పుట్టినరోజు వేడుకను మహారాష్ట్రలోని హిల్ స్టేషన్ మహాబలేశ్వర్‌లోని ఒక ఫైవ్-స్టార్ హోటల్‌లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే, సియా మనసులో తన కుమారుడికి సంబంధించి ఒక భయంకరమైన పథకం ఉందని ఆయనకు తెలియదు.
జూన్ 20న మహాబలేశ్వర్‌లో సియా పుట్టినరోజును కేతన్, సియా, కుటుంబాలు కలిసి జరుపుకోవాలని అనుకున్నాయి. ఇందుకోసం కేతన్ తండ్రి ఆ హిల్ స్టేషన్‌లోని ఒక ఫైవ్-స్టార్ హోటల్‌లో 70 గదులను బుక్ చేశారు. అయితే, ఆ ప్లాన్‌ను రద్దు చేసుకుని, దానికి బదులుగా పుణె సమీపంలోని లోహగడ్ కోటకు ఒంటరిగా వెళ్లేలా సియా కేతన్‌ను ఒప్పించింది. ప్రియుడితో కలిసి తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసిన కేతన్‌ను హతమార్చింది.
రూ. 17 కోట్ల పెళ్లి వేడుక.. అంతలోనే విషాదం
కేతన్ (26), సియా (20) ల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరిగింది. నవంబర్లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వీరి వివాహం జరగాల్సి ఉంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం జైపూర్‌లోని ఒక ప్యాలెస్‌ను రూ. 17 కోట్ల భారీ బడ్జెట్‌తో బుక్ చేశారు. బంధువులను, అతిథులను తీసుకురావడానికి రెండు ప్రైవేట్ విమానాలను కూడా సిద్ధం చేశారు. పెళ్లి కొడుకు ముస్తాబులో చూడాలనుకన్న తమ కుమారుడు ఇలా విగత జీవిగా మారిపోవడం కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
ఇదీ చదవండి: 11 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం : ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్
ఎవరీ కేతన్ అగర్వాల్
కుటుంబ యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ 'సక్సెస్ గ్రూప్'కు డైరెక్టర్‌గా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO)గా ఉండేవారు. పూణేలో నివసించేవారు.
ఓలిన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేశారు. సింబయాసిస్ యూనివర్సిటీ నుండి బీబీఏ డిగ్రీని కూడా పొందారు. కేతన్ లింక్డ్‌ఇన్ బయో ప్రకారం, సుస్థిరత, ఆవిష్కరణలకు కట్టుబడి ఉండటమే కాదు, కేవలం ఆర్థిక వృద్ధిని పెంపొందించడమే కాకుండా, పచ్చని భవిష్యత్తుకు దోహదపడే ప్రాజెక్టులపై దృష్టి సారించారు.
ఇదీ చదవండి : కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!
కాగా కేతన్, సియాల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరిగింది, నవంబర్‌లో వారి వివాహం జరగాల్సి ఉంది. కానీ జూన్ 18న, సియాతో కలిసి లోహగడ్ కోటలో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు కేతన్ లోయలో పడి మరణించాడు. సియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని భావించినప్పటికీ, విచారణలో సియా ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఎత్తు నుండి కిందకు తోసేశారని తేలింది.
ఇదీ చదవండి: అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలు


