'బేబి' సినిమాతో మూడేళ్ల క్రితం హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా మూవీ 'ఎపిక్'. గతంలో వచ్చిన #90స్ వెబ్ సిరీస్‌లోని పిల్లాడి పాత్రని తీసుకుని వాడి పెరిగి పెద్దయిన తర్వాత ప్రేమలో పడితే అనే స్టోరీతో దీన్ని తీశారు. నిన్న(సెప్టెంబరు 11) థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి చాలావరకు నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం తొలిరోజు బాగానే వచ్చాయి.
ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చైత్ర షాకింగ్ ఎలిమినేషన్.. అసలేంటి ట్విస్టులు?
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన 'ఎపిక్' సినిమాకు తొలిరోజు(ప్రీమియర్లతో కలిపి) మన దేశంలో రూ.2.10 కోట్ల నెట్ వసూళ్లు రాగా ఓవర్సీస్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.3.45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలిరోజు టాక్ నెగిటివ్‌గా ఉన్న నేపథ్యంలో వీకెండ్ అయ్యేసరికి ఎలాంటి ఫలితం అందుకుంటుందనేది చూడాలి?
పైచదువుల కోసం యూకే వెళ్లిన ఓ తెలంగాణ పల్లెటూరి కుర్రాడు.. ఓ మోడ్రన్ తెలుగమ్మాయితో ప్రేమలో పడితే వాళ్లు ఎంతవరకు హద్దులు దాటేశారు. ఈ క్రమంలోనే ఏమేం తెలుసుకున్నారు? తదితర అంశాలతో ఈ సినిమా తీశారు. అయితే ఎమోషన్స్ గానీ అటు లవ్ యాంగిల్ గానీ సరిగా వర్కౌట్ కాలేదని టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. మరికొందరు మాత్రం తమకు నచ్చిందని అంటున్నారు. ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించారు.
ఇదీ చదవండి: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ


