సినిమా ఇండస్ట్రీలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అలా హీరోయిన్ శ్రీలీల కూడా విమర్శలని ఎదుర్కొంటూనే ఉంది. శాండిల్‌వుడ్ నుంచి టాలీవుడ్ వయా కోలీవుడ్, బాలీవుడ్ అని పరుగులు పెడుతోందీ భామ. తెలుగులో క్రేజీ హీరోయిన్ స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్‌లో ఆ స్థాయి కోసం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'పరాశక్తి' మూవీతో తమిళ ప్రేక్షకులను అలరించిన ఈ భామ ప్రస్తుతం ధనుష్ సరసన 'ఓం' చిత్రంలో నటిస్తోంది. నవంబర్ 26న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
ఇదీ చదవండి: నా ముఖమే అంతా.. 'ప్యారడైజ్' దర్శకుడి ట్వీట్
అసలు విషయానికొస్తే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీలీల.. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించడం చాలా సంతోషంగా ఉంది. ఇరు రాష్ట్రాల ప్రేక్షకులని ప్రేమిస్తున్నాను. అయితే నాతో సమంగా నటించే నటుడో, నటినో లేరని నేను గర్వపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నాకు అలాంటి అహంకారం లేదు. నేనెవరి దగ్గర ఈగో ప్రదర్శించలేదు. అందరినీ గౌరవించే మనస్తత్వం నాది. కాబట్టి అనవసర పుకార్లని ఎవరూ నమ్మకండి. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నా దృష్టి నటనపైనే. అది మినహా నా మనసులో మరేదీ లేదు అని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు


