స్కిన్‌కేర్‌ రంగంలోకి విజయ్‌ దేవరకొండ | Vijay Deverakonda enters skincare market with new brand Unhype | Sakshi
Sakshi News home page

స్కిన్‌కేర్‌ రంగంలోకి విజయ్‌ దేవరకొండ

Sep 12 2026 4:53 AM | Updated on Sep 12 2026 4:53 AM

Vijay Deverakonda enters skincare market with new brand Unhype

హైదరాబాద్‌: యువ హీరో విజయ్‌ దేవరకొండ చర్మ సంరక్షణ ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టారు. ‘అన్‌హైప్‌’ అనే కొత్త స్కిన్‌కేర్‌ బ్రాండ్‌కు ఆయన సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు. భారతీయ యువత అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయంగా రూపొందించిన స్కిన్‌కేర్‌ ఉత్పత్తులను అందుబాటు ధరలో ఈ బ్రాండ్‌ అందిస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘నో బీఎస్‌.. ఓన్లీ వాట్‌ వర్క్స్‌’ అనే నినాదంతో 18–30 ఏళ్ల యువత లక్ష్యంగా అన్‌హైప్‌ ఉత్పత్తులు ఉంటాయి. ఈ బ్రాండ్‌ కింద .. ఒక్కో దానిలో మూడు ఉత్పత్తులు చొప్పున రెండు ‘వీడీ సిగ్నేచర్‌ రొటీన్స్‌’ ఉంటాయి. ఒక్కో రొటీన్‌ ధర రూ. 1,299గా ఉంటుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement