ధర శ్రేణి రూ. 1,700–1,785
రూ. 22,569 కోట్లు సమీకరణ
దేశీయంగా రెండో అతి పెద్ద ఇష్యూ
న్యూఢిల్లీ: అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) సెప్టెంబర్ 17న ప్రారంభమై 21న ముగియనుంది. దీని ద్వారా కంపెనీ రూ. 22,569 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ సెప్టెంబర్ 16న, ఎక్సే్చంజీలో షేర్ల లిస్టింగ్ 24న ఉంటుంది. ధర శ్రేణిని రూ. 1,700–1,1785గా నిర్ణయించారు. ఇది దాదాపు 2,000–2,100గా ఉంటుందని అంచనాలు నెలకొన్నా యి.
అర్హత గల ఎన్‌ఎస్‌ఈ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ. 170 చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది. వారి కోసం రూ. 70 కోట్ల విలువ చేసే షేర్లను కంపెనీ రిజర్వ్ చేసింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో ఉండనుంది.
దేశీయంగా అత్యంత భారీ ఇష్యూగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నప్పటికీ, తాజా పరిణామాలతో ఎన్‌ఎస్‌ఈ ఐపీవో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి రానుంది. కనిష్ట ధర ప్రకారం ఇష్యూ ద్వారా సమీకరించే నిధుల పరిమాణం రూ. 21,494 కోట్లు, గరిష్ట రేటు ప్రకారం రూ. 22,569 కోట్లుగా ఉంటుంది. దీంతో 2024లో వచి్చన హ్యుందాయ్ మోటర్ ఇండియా రూ. 27,870 కోట్ల భారీ ఐపీవో తర్వాత రెండో అతి పెద్ద ఇష్యూగా నిలవనుంది.
ఈ క్రమంలో 2022లో వచ్చిన రూ. 21,000 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఐపీవోను మాత్రం అధిగమించనుంది. వేల్యుయేషన్ ముందుగా అంచనా వేసిన రూ. 5 లక్షల కోట్ల కన్నా తక్కువగా రూ. 4.2 లక్షల కోట్లకు పరిమితం కానుంది. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో డిజిటల్ సరీ్వసెస్ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ ప్రతిపాదిత ఇష్యూ దేశీయంగా అతి పెద్ద ఐపీవోగా రూ. 37,700 కోట్ల స్థాయిలో ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి.
ఓఎఫ్‌ఎస్ కుదింపు..
జూన్‌లో ముసాయిదా పత్రాలను సమరి్పంచినప్పుడు ఇన్వెస్టర్లు మరిన్ని ఎక్కువ షేర్లను విక్రయించనున్నట్లు సూచనప్రాయంగా చెప్పినప్పటికీ, ప్రస్తుతం ఆ పరిమాణం తగ్గిందని ఎన్‌ఎస్‌ఈ సీఈవో ఆశీష్ కుమార్ చౌహాన్ తెలిపారు. ముందుగా 14.9 కోట్ల షేర్లను విక్రయించాలని భావించినప్పటికీ, ప్రస్తుతం ఇది 12.64 కోట్లకు పరిమితం కానుంది. ఓఎఫ్‌ఎస్ పరిమాణం తగ్గడంతో ఇష్యూ సైజు కూడా తొలుత అంచనా వేసిన రూ. 30,000 కోట్ల స్థాయికన్నా తక్కువగా ఉంటుంది. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్‌ఎస్ రూపంలో ఉండటంతో ఐపీవో ద్వారా వచ్చే నిధులు.. ఎన్‌ఎస్‌ఈకి కాకుండా, వాటాదారులకే లభిస్తాయి.


