912.5GB డేటా.. అదిరిపోయే జియో ప్లాన్! | Jio Rs 3599 Recharge Plan 365 Days Validity 912.5GB Data and More Benefits | Sakshi
Sakshi News home page

912.5GB డేటా.. అదిరిపోయే జియో ప్లాన్!

Sep 11 2026 7:32 PM | Updated on Sep 11 2026 7:45 PM

Jio Rs 3599 Recharge Plan 365 Days Validity 912.5GB Data and More Benefits

రిలయన్స్ జియో అందిస్తున్న పాపులర్ రీచార్జ్ ప్లాన్లలో రూ.3,599 ఒకటి. ఈ ప్లాన్ ఎంచుకుంటే.. వాలిడిటీ ఎన్ని రోజులు?, డేటా ఎంత? వినియోగదారులకు ఇంకా ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? అని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

జియో రూ.3599 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది పాటు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుందన్నమాట. ప్రతిరోజూ 2.5 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఏడాది రోజులకు మొత్తం 912.5 జీబీ డేటా వస్తుంది. అదనంగా జియో యానివెర్సరీ అఫర్ కింద 120 జీబీ ఎక్ట్రా డేటా లభిస్తుంది. అంటే నెలకు 10 జీబీ చొప్పున 12 లల పాటు అదనపు డేటా లభిస్తుంది.

రోజువారీ 2.5 జీబీ హై-స్పీడ్ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకు తగ్గుతుంది. అయితే 5G సేవలకు అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. అదేవిధంగా ప్రతిరోజూ 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపుకునే అవకాశం ఉంటుంది.

ఇతర ప్రత్యేకమైన ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే.. జియో టీవీ ప్రో ప్యాక్ ద్వారా 1000 అకంటే ఎక్కువ టీవీ ఛానల్స్ చూడటానికి అవకాశం ఉంటుంది. జియో క్లౌడ్ ద్వారా 50 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement