రిలయన్స్ జియో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన వినియోగదారుల కోసం మెగా వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. 2016 సెప్టెంబర్‌లో టెలికాం సేవలను ప్రారంభించిన జియో.. ఈ ప్రత్యేక సందర్భంలో రూ.3,599 విలువైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడాది మొత్తం కనెక్టివిటీతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, క్లౌడ్, ఏఐ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది.
రూ.3,599 ప్లాన్‌లో ఏమేం లభిస్తాయి?
ఈ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. వినియోగదారులకు ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ డేటా చొప్పున ఏడాదికి మొత్తం 912.5GB డేటా అందుతుంది. దీంతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమిత 5G డేటా ప్రయోజనం కూడా ఉంటుంది.
నెలనెలా రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి ఈ వార్షిక ప్లాన్ ఉపయోగకరంగా ఉండనుంది. బేస్ ప్యాక్‌లో భాగంగా జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి సేవలకు కూడా యాక్సెస్ లభిస్తుంది.
అదనపు ప్రయోజనాలు ఇవే..
కనెక్టివిటీ ప్రయోజనాలకు అదనంగా జియో ఈ ప్లాన్‌లో పలు ఎంటర్‌టైన్‌మెంట్, డేటా బెనిఫిట్స్‌ను అందిస్తోంది.
జియో హాట్‌స్టార్: హాలీవుడ్ కంటెంట్‌తో కూడిన మొబైల్ సబ్‌స్క్రిప్షన్.
జియో టీవీ ప్రో: 1,000కుపైగా టీవీ ఛానళ్లకు యాక్సెస్. రూ.55 చొప్పున 12 నెలల వోచర్ రూపంలో ప్రయోజనం.
డేటా బూస్టర్: 12 నెలల పాటు ప్రతి నెల అదనంగా 10GB డేటా.
జియో ఏఐ క్లౌడ్: బేస్ స్టోరేజ్‌కు అదనంగా 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్.
రూ.35,100 గూగుల్ జెమిని ప్రో ఉచితం
ఈ వార్షికోత్సవ ఆఫర్‌లో అత్యంత ఆకర్షణీయమైన ప్రయోజనం గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్‌స్క్రిప్షన్. అర్హత కలిగిన జియో వినియోగదారులకు 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీని విలువ రూ.35,100గా పేర్కొంది. ఇందులో 5,000GB క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు అధునాతన AI ఆధారిత ఫీచర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
షాపింగ్, ట్రావెల్‌పై ప్రత్యేక వోచర్లు
మైజియో యాప్ ద్వారా వినియోగదారులకు పలు భాగస్వామ్య సంస్థల వోచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
ఈజ్‌మైట్రిప్: విమాన టికెట్లపై రూ.2,200 వరకు తగ్గింపు.
అజియో: రూ.1,000 కంటే ఎక్కువ విలువైన షాపింగ్‌పై రూ.200 తగ్గింపు.
సినీపోలిస్: కనీసం రూ.550 విలువైన రెండు టికెట్లపై ఫ్లాట్ రూ.150 తగ్గింపు. (ఈ ఆఫర్ మంగళవారం వర్తించదు.)
మొత్తంగా చూస్తే.. రూ.3,599 వార్షిక ప్లాన్ ద్వారా ఏడాది పాటు డేటా, అపరిమిత కాలింగ్, SMSలతో పాటు 5G, OTT, క్లౌడ్ స్టోరేజ్, AI సేవలు, షాపింగ్, ట్రావెల్ ప్రయోజనాలను ఒకే ప్యాక్‌లో అందించేందుకు జియో ప్రయత్నిస్తోంది.


