జార్జియాలోని డగ్లస్‌కు చెందిన 18 ఏళ్ల భారత సంతతి విద్యార్థిని కిరణ్ రెడ్డి మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకుంది. అమెరికా జాతీయ పోటీల్లో ఈ ఘనత సృష్టించిన తొలి భారత సంతతి అమెరికన్‌గా చరిత్ర సృష్టించింది. ఫ్లోరిడాలోని మయామిలో ఉన్న అడ్రియెన్ ఆర్ష్ట్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో ఆగస్టు 26న జరిగిన 44వ వార్షిక పోటీల్లో కిరన్ రెడ్డి మొత్తం 50 మంది పోటీదారులతో పోటీపడి ఈ కిరీటం దక్కించుకుంది.
ఈపోటీల్లో ఆర్కాన్సాస్‌కు చెందిన రాక్వెల్ ఓలియా మొదటి రన్నరప్‌గా నిలవగా, న్యూయార్క్‌కు చెందిన ఎలిసా అకిన్, ఇండియానాకు చెందిన కీర్‌స్టెన్ అల్వరాడో, టెక్సాస్‌కు చెందిన క్లో బెల్లా డీట్జ్ టాప్ ఫైవ్‌లో నిలిచారు. ఈ ఈవెంట్‌కి మాజీ మిస్ రోడ్ ఐలాండ్ యూఎస్ఏ కెల్సీ స్వాన్సన్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
గత నెలలోనే మిస్ జార్జియా టీన్ యూఎస్‌ఏ టైటిల్‌ను గెలుచుకున తొలి అమెరికన్‌గా నిలిచిందామె. అంతేగాదు జార్జియా రాష్ట్రంకి ఈ పోటీ చరిత్రలో తొలి విజయాన్ని అందించిన ఘనత కూడా కిరణ్‌దే. ఈ మేరకు కిరణ్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ని స్వీకరించడంపై స్పందిస్తూ..ఇది తన అదృష్టంగా పేర్కొంది. తనకు చిన్నప్పటి నుంచి ఆదర్శంగా నిలవడం ఇష్టమని ఈ గెలుపుతో అది నిజమైందని అంటోంది.
ఎవరామె..
కిరణ్ విద్యా నేపథ్యం వచ్చేసి డగ్లస్‌లోని కాఫీ హైస్కూల్‌లో వాలెడిక్టోరియన్‌గా పట్టభద్రురాలయ్యారు. హైస్కూల్ విద్య పూర్తి చేసిన తర్వాత, రెడ్డి జార్జియా విశ్వవిద్యాలయంలో చేరారు, అక్కడ ఆమె ప్రీ-మెడికల్ ట్రాక్‌లో జీవశాస్త్రాన్ని అభ్యసిస్తోంది. ఆమె 15 ఏళ్ల వయసులో అందాల పోటీలోకి ప్రవేశించింది. 2024లో జరిగిన మిస్ జార్జియా టీన్ యూఎస్ఏ పోటీలో ఆమె మొదటి రన్నరప్‌గా నిలిచింది, ఆ తర్వాత ఈ ఏడాది జూలైలో మిస్ జార్జియా టీన్ యూఎస్ఏగా గెలుపొందడంతోనే ఈ జాతీయ టైటిల్‌కు ఆమె ప్రయాణం సుగమమైంది.
ఇక ఆమె త్వరలోనే మిస్ టీన్ యూఎస్ఏగా బాధ్యతలు తీసుకోనుంది. అలాగే అక్టోబర్ 2026లో కంబోడియాలోని ఫ్నామ్ పెన్‌లో జరిగే మిస్ టీన్ యూనివర్స్ పోటీలో కిరణ్ రెడ్డి యునైటెడ్ స్టేట్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది కూడా. వీటి తోపాటు తన అండర్ గ్రాడ్యుయేట్ ప్రీ-మెడ్ చదువుని కూడా కొనసాగించాలని చూస్తోంది.
(చదవండి: స్టిక్కీ నోట్‌తో గిన్నిస్ రికార్డు)


