భారతీయులు ఆహారాన్ని ఎందుకు తింటారంటూ చాలాసార్లు విదేశీయలు ప్రశ్నిస్తూ..మన సంస్కృతిని అవమానిస్తుంటారు. పైగా మన విధానాన్ని నాగరికత లేని వ్యక్తిగా అభివర్ణిస్తూ తిట్టిపోస్తుంటారు. ఇలాంటివి మనం చాలాసార్లు చూశాం కూడా. దీనికి ప్రముఖ ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ చాలా అద్భుతమైన సమాధానమిచ్చారు. మరోసారి ఆ ప్రశ్న లేవనెత్తే ఛాన్సే లేకుండా గట్టి కౌంటరిచ్చారు. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఫ్లోరిడాకు చెందిన అకా అనే వ్యక్తి ఒక దక్షిణాది వివాహం లేదా సాంప్రదాయ పెళ్లి భోజనాలకు సంబంధించిన వీడియోని షేర్‌చేశారు. అందులో ఒక జంట చేతులతో భోజనం చేయడం కనిపిస్తోంది. అది చూపిస్తూ..నిజంగా అడుగుతున్నా..వారంతా ఎందుకు చేతులతో తింటున్నారు అని ప్రశ్నించాడు. ఇది నవంబర్ 2025లో వైరల్ అయిన పోస్ట్. ఇది మన భారత ప్రముక ఆర్థివేత్త సంజీవ్ సన్యాల్ దృష్టికి వచ్చింది. ఆయన ఈ వీడియోని రీట్వీట్ చేస్తూ..ఇలా సమాధానమిచ్చారు.
ఇదొక సింపుల్ టెస్ట్ అని. మీరు తాకి పదార్థాన్ని తినే ధైర్యం లేకపోతే స్పూన్లు, కత్తులు వంటి ఇనుప ఆయుధాలను ఉపయోగించండి పర్లేదు. కానీ అలా తింటే గనుక ఆ ఆహారాన్ని తినొచ్చా లేదా అని మీ నోరు నిర్ణయించడం కష్టం అవుతుంది అని అద్భుతంగా రిప్లై ఇచ్చారు. ఆయన చేతి స్పర్శ తినే పదార్థం మధ్య ముడిపడి ఉన్న రుచిని, తినాలనే అనుభూతిని హైలెట్ చేస్తూ చెప్పారు. నిజంగానే మనం టచ్ చేయగానే బాగుంది తినొచ్చు అనిపించి..సులభంగా తినగలం.
పైగా చేయి తాకడంతోనే రుచి కూడా అధికమవుతుది. అదే కత్తులు, స్పూన్లు వాడితే నోట్లో పెట్టుకునేంత వరకు రుచిని చెప్పలేరని స్పర్శతో ఆహారానికి ఉన్న సంబంధాన్ని హైలెట్ చేసింది. కాగా, నెటిజన్లు ఆర్థికవేత్త సన్యాత్ అద్భుతమైన రిప్లైకి ఫిదా అవుతూ ..చాలా చక్కటి పాయింట్‌ని చెప్పారు సార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్ట్‌లు పెట్టారు.
It is a simple test..... if you cannot bear to touch it, and need metal instruments, then it is probably a bad idea to put it in your mouth. https://t.co/omWQcETPDi
— Sanjeev Sanyal (@sanjeevsanyal) September 5, 2026
(చదవండి: సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూ..12 వేల అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగు!)


