Photo Credit: Twitter
స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రస్తుతం యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ వేటలో దూసుకెళ్తున్నాడు. నాలుగు నెలల పాటు మణికట్టు గాయం కారణంగా ఆటకు దూరమైన అల్కరాజ్ యూఎస్ ఓపెన్ ద్వారా పునరాగమనం చేశాడు. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌కు చేరిన అల్కరాజ్ టైటిల్ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు.
టోర్నమెంట్‌లో అల్కరాజ్ ధరించిన బనియన్ (Nike OutFit) వైరల్‌గా మారింది. అతడి బనియన్ కారణంగా సోషల్ మీడియాలో అల్కరాజ్ "నిపుల్‌గేట్" (Nipplegate) ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది.విషయంలోకి వెళితే యూఎస్ ఓపెన్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన అల్కరాజ్ జులపాల జుట్టుతో పాటు వేషదారణను కూడా పూర్తిగా మార్చేశాడు. మొదటి రెండు రౌండ్ల మ్యాచ్‌లకు అల్కరాజ్ నైక్ (Nike) బ్రాండ్‌కు చెందిన లూజ్-ఫిట్టింగ్ బ్రౌన్ కలర్ ట్యాంక్ టాప్ ధరించాడు.

Photo Credit: Twitter
మ్యాచ్ సమయంలో అతను కోర్టులో వేగంగా కదులుతున్నప్పుడు ఆ లూజ్ జెర్సీ పక్కకు జరిగి, అతని కుడి వైపు రొమ్ము భాగం (Nipple) పదే పదే బయటకు కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. "లవ్ యూ కార్లోస్, కానీ నీ రొమ్ము భాగాన్ని కప్పి ఉంచేలా టైట్ బనియన్ వేసుకొని బరిలోకి దిగు" అని మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, కామెంటేటర్ యూజినీ బౌచర్డ్ ఎక్స్ వేదికగా ఫన్నీ కామెంట్ చేసింది.
తన ఔట్‌ఫిట్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్, కామెంట్లను అల్కరాజ్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా అనిపించింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ బ్రౌన్ ట్యాంక్ టాప్ కింద వైట్‌కలర్ అండర్ షర్ట్ ధరించడం కనిపించింది. మ్యాచ్ సమయంలో వేగంగా కదిలినప్పటికీ అతడి రొమ్ము భాగం కనిపించలేదు.

Photo Credit: Twitter
ఇక మ్యాచ్ అనంతరం ఫ్రెస్ కాన్ఫరెన్స్‌లో అల్కరాజ్ మాట్లాడుతూ తన ఔట్‌ఫిట్‌పై సరదాగా స్పందించాడు. “ఇటీవల నా రొమ్ము భాగం నాకే ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా అనిపించింది. అందుకే కనీసం ఒక్క మ్యాచ్‌కైనా వాటిని దాచేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇన్నర్‌వేర్ రూపంలో రెండో షర్ట్ ధరించడం చాలా సౌకర్యంగా అనిపిస్తోంది. ఇకపై దీనినే కొనసాగిస్తాను” అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని, నైక్ సంస్థ దీనికి కారణం కాదని అల్కరాజ్ మరోసారి స్పష్టం చేశాడు.
No more wardrobe malfunctions for Carlos Alcaraz 😂 pic.twitter.com/BDEfGRs4Pf
— TNT Sports (@tntsports) September 5, 2026
Cue the Carlos Alcaraz break of serve! pic.twitter.com/SB8YyFHLCK
— US Open Tennis (@usopen) August 31, 2026
Quem será que ganhou esse sorriso do Carlitos 😍.. pic.twitter.com/ytqhNRiY7F
— Central Carlos Alcaraz (@AlcarazCentral) September 4, 2026
చదవండి: బంతి వేయడానికి 100 కి.మీ. పరిగెత్తిన ఇంగ్లండ్ బౌలర్


