శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన చిత్రం ‘ఇరుముడి’ . ఈ సినిమాకు తొలిరోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ను సైతం షేక్ చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ తన పాత్రలో ఒదిగిపోయాడు. జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ సైతం సినిమాకు ప్రాణం పోసింది. తండ్రీకూతురు సెంటిమెంట్‌కి అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీసిన ఇరుముడిని చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఇదీ చదవండి: బిగ్‌బాస్ తొలి కంటెస్టెంట్.. రైతుబిడ్డ ఝాన్సీ
ఈ సినిమా వచ్చి చాలా రోజుల అవుతున్నా ఇంకా ఇరుముడి ఫీవర్ నడుస్తూనే ఉంది. పల్లె నుంచి పట్నం వరకు చిన్న, పెద్దా అని తేడా లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారు. . అయితే ఈ సినిమాను చూసేందుకు గ్రామల నుంచి ప్రేక్షకులు ట్రాక్టర్లతో థియేటర్లకు తరలివెళ్లారు. ఇందులో వృద్ధులు, మహిళలే అధికంగా ఉండడం విశేషం. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
200 కోట్లకు పైగా..
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' (Irumudi Movie) బాక్సాఫీస్ వద్ద కేవలం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది. రవితేజ తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో రూ.200 కోట్ల మార్కును అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఇందులో ప్రియా భవానీ శంకర్, బేబి నక్షత్ర కీలక పాత్రలు పోషించారు.
ఎక్కువ మంది చదివింది: కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియో
IRUMUDI:
టాలీవుడ్‌కి గత వైభవాన్ని గుర్తు చేస్తున్న రియల్ బ్లాక్‌బస్టర్ #IRUMUDI 🔥
గ్రామాల నుంచి ట్రాక్టర్లలో తరలివస్తున్న ప్రేక్షకులు… 3వ వారంలోనూ అదే జోష్, అదే సందడి
'ఇరుముడి' సినిమాని థియేటర్లలో ఒక పండగలా జరుపుకుంటున్నారు ❤️@RaviTeja_offl pic.twitter.com/oDRifTpyGd— H A N U (@HanuNews) September 4, 2026


