నడుము గిల్లే సీన్ చేయనంది.. 'బేబి' చూసి షాకయ్యా | Vaishnavi Chaitanya Incident With Siva Nirvana Latest | Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya: వైష్ణవి గురించి 'ఇరుముడి' డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Sep 5 2026 9:02 AM | Updated on Sep 5 2026 9:07 AM

Vaishnavi Chaitanya Incident With Siva Nirvana Latest

సినిమాలో హీరో లేదా హీరోయిన్ చేసే సీన్స్ చూసి మనం నిజంగా ఫీలైతే సదరు నటుడు సక్సెస్ అయినట్లే. 'బేబి' రిలీజ్ టైంలో ఇలానే జరిగింది. మూవీలోని బెడ్ రూం సన్నివేశాలు చూసి హీరోయిన్ వైష్ణవి చైతన్యపై చాలామంది ట్రోల్ చేశారు. అయితే ఈమెతో గతంలో జరిగిన ఓ షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టిన 'ఇరుముడి' దర్శకుడు శివ నిర్వాణ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైష్ణవి చేసిన 'ఎపిక్' చిత్రం ట్రైలర్ లాంచ్ సందర్భంగా మాట్లాడాడు.

(ఇదీ చదవండి: 'డిసి' సూపర్ హిట్.. బ్యూటీకి బంపర్ ఆఫర్)

'నా 'టక్ జగదీష్' సినిమాలోని ఓ సీన్‌లో రౌడీ వచ్చి వైషు నడుము గిల్లాలి. కానీ తను వద్దని చెప్పింది. ఇబ్బందిగా ఫీలవుతున్నానని చెప్పింది. అప్పుడు దగ్గరకెళ్లి చెప్పా. ఇది పాత్ర, నువ్వు కాదని ఆమెతో అన్నాను. కట్ చేస్తే 'బేబి' చూసి షాకయ్యా. అప్పుడు నాకొకటి అనిపించింది. ఏంటి పాత్రలా ఫీలవ్వమంటే ఈ లెవల్లో జీవించేసిందా అని అనుకున్నాను' అని శివ నిర్వాణ.. వైష్ణవి చైతన్యతో గతంలో జరిగిన అనుభవం గురించి బయటపెట్టాడు.

షార్ట్ ఫిల్మ్స్‌తో నటిగా మారిన వైష్ణవి చైతన్య.. అల వైకుంఠపురములో, టక్ జగదీష్, వరుడు కావలెను తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఎప్పుడైతే 'బేబి'తో హిట్ అందుకుందో అప్పటినుంచి హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయి. అలా ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఈమె చేసిన 'ఎపిక్' మూవీ వచ్చే శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement