కన్నప్పుడు కాలేజీ ఫీజు కూడా కట్టరా?.. ఎపిక్ ట్రైలర్ రిలీజ్ | Anand Deverakonda and Vaishnavi Chaitanya EPIC trailer out now | Sakshi
Sakshi News home page

EPIC trailer: కన్నప్పుడు కాలేజీ ఫీజు కూడా కట్టరా?.. ఎపిక్ ట్రైలర్ రిలీజ్

Sep 4 2026 9:10 PM | Updated on Sep 4 2026 9:10 PM

Anand Deverakonda and Vaishnavi Chaitanya EPIC trailer out now

బేబీ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న టాలీవుడ్ జంట ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య.  వీరిద్దరి కాంబినేషన్‌ మరోసారి రిపీట్ కానుంది. ఈ జంట ‘ఎపిక్‌ - ఫస్ట్‌ సెమిస్టర్‌ అనే మూవీలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ చిత్రానికి ఆదిత్యహాసన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలోనే ఎపిక్ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే లండన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇండియా నుంచి లండన్ వెళ్లిన ఇద్దరు ప్రేమలో పడే నేపథ్యంలో ఈ కథ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement