మహేంద్రగిరి వారాహి.. ది రేజ్ ఆఫ్ వారాహి రిలీజ్ | Mahendragiri Varahi Movie The Rage Of Varahi song out now | Sakshi
Sakshi News home page

Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి.. ది రేజ్ ఆఫ్ వారాహి రిలీజ్

Sep 4 2026 8:44 PM | Updated on Sep 4 2026 8:48 PM

Mahendragiri Varahi Movie The Rage Of Varahi song out now

సుమంత్, ఐశ్వర్య రాజేశ్, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రల్లో వస్తోన్న డివోషనల్ మూవీ మహేంద్రగిరి వారాహి. వారణాసి గ్రామదేవత వారాహీ అమ్మవారి కథతో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ వారాహీ అమ్మవారిగా కనిపించనుంది.

తాజాగా ఈ మూవీ నుంచి ది రేజ్ ఆప్ వారాహి అనే  లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను టాలీవుడ్ హీరో నాగచైతన్య చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటకు కడలి సత్యనారాయణ లిరిక్స్ అందించగా.. నకాశ్ అజిజ్ ఆలపించారు. ఈ సాంగ్‌ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో మాళవిక నాయర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబరు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement