అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. ఈ చిత్రానికి చింతాడ చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సురభి హీరోయిన్‌గా కనిపించింది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఇవాళే థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, నిమ్మకాయ ప్రసాద్ నిర్మించారు.


