మోకాళ్ల లోతు వరదనీటిలోనే పెళ్లి.. వైరల్‌ వీడియో | With Gown And Coat Soaked Couple Marries In Flooded Church | Sakshi
Sakshi News home page

మోకాళ్ల లోతు వరదనీటిలోనే పెళ్లి.. వైరల్‌ వీడియో

Sep 4 2026 7:40 PM | Updated on Sep 4 2026 7:40 PM

With Gown And Coat Soaked Couple Marries In Flooded Church

మోకాళ్ల లోతు వరద నీటిలో కూడా  ఓ జంట పెళ్లి చేసుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక కాథలిక్ చర్చిలో  ఫిలిప్పీన్స్ జంట ఇపుటు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు. తీవ్రమైన వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నప్పటికీ  లీన్ లీజా గలాంగ్, గిల్బర్ట్ చికో అనే  జంట పెళ్లి వేడుక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఈ వినూత్న వివాహానికి  ఆసక్తికర వివరాలు ఇలా ఉన్నాయి.

ఫిలిప్పీన్స్‌లోని ఇటీవలి   భారీ రుతుపవన వర్షాలు చాలా ప్రాంతాలను ప్రభావితం చేస్తున్న తరుణంలో ఈ అసాధారణ వివాహం జరిగింది. మనీలాకు ఉత్తరాన ఉన్న బులాకాన్ ప్రావిన్స్‌లోని హగోనోయ్ పట్టణంలో గల 'సెంట్ జాన్ ది బాప్టిస్ట్ పారిష్' చర్చిలో సెప్టెంబర్ 1న ఈ పెళ్లి జరిగింది.

గత నెల రోజులుగా ఈ చర్చి ప్రాంతం నీట మునిగి ఉంది. నీటి మట్టం పెరుగుతుండటంతో పెళ్లి వాయిదా వేసుకోవాలని చర్చి వర్గాలు సూచించినప్పటికీ, ఆ జంట వెనక్కి తగ్గలేదు. వధువు తన వెడ్డింగ్ గౌన్ తడిసిపోతున్నా మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ అల్తార్ (వేదిక) వద్దకు  చేరుకోవడం విశేషం.

నిజానికి ఈ జంట డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే మిడిల్ ఈస్ట్‌లో ఉద్యోగం చేసే వరుడు చికో, బాస్కెట్‌బాల్ ఆడుతూ కాలుకి గాయం కావడంతో అను అనుకోకుండా ముందుగానే ఇంటికి తిరిగి వచ్చాడు. మళ్లీ ఉద్యోగానికి వెళ్లేలోపు పెళ్లి ముగించుకోవాలని ఈ సమయాన్ని ఎంచుకున్నారు.

ఇదీ చదవండి: నిన్నగాక మొన్న ప్రేమ పెళ్లి.. వాటర్‌ ట్యాంక్‌లో శవంగా నవవధువు

పెళ్లి దుస్తులు పాడవకుండా ఉండటానికి ప్రత్యేక రవాణా వాహనంలో చర్చి ప్రాంగణం వరకు వచ్చారు. అతికొద్ది మంది కేవలం 15 మందిలోపు బంధువుల సమక్షంలో ఫాదర్ ఈ వివాహాన్ని త్వరితగతిన పూర్తి చేశారు.  నడుము లోతు నీళ్లలోనే ఒక చిన్నారిని ఉంగరాలను తీసుకెళ్లాడు.

ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్‌ వీడియో


 

 వేడుక సమయంలో తమ పెళ్లి బట్టలు తడిసినా ఫర్వాలేదని, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తాము ఆ సందర్భానికి తగినట్లే దుస్తులు ధరించామని చికో తెలిపారు "ఎంతటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా, పరస్పర ప్రేమ ముందు వరదలు కూడా  బలాదూర్‌" నెటిజన్లు ఈ జంటను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement