సీఏ వదిలేసి మరి దోసె వ్యాపారం..నెలకు రూ. 12 లక్షలు! | The Mother Who Turned Dosa Recipe Into A Rs 12 Lakh | Sakshi
Sakshi News home page

సీఏ వదిలేసి మరి దోసె వ్యాపారం..నెలకు రూ. 12 లక్షలు!

Sep 4 2026 4:35 PM | Updated on Sep 4 2026 4:53 PM

The Mother Who Turned Dosa Recipe Into A Rs 12 Lakh

ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే..విధి మరోలా తలుస్తుంది. పైగా ఆ దారిలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఇస్తుంది. తీరా సక్సెస్‌ అందుతుందా లేదా అనే ఉత్కంఠ మధ్యలో పడేసి కుంగిపోయేలా చేస్తుంది. అయినా ఓపికతో స్ట్రాటజీ మారుస్తూ ముందుకెళ్లే వాడు కచ్చితంగా సక్సెస్‌ అందుకుంటాడు అనే మాటకు ఈ యువకుడే ఉదాహరణ.

బెంగళూరుకి చెందిన గణేశ్‌ సీఏ చదువుని మధ్యలో వదిలేసి అమ్మ చేసే సాధారణ దోసెనే వ్యాపారంగా మార్చాడు. అది మొదట్లో రోజుకి రూ. 20ల నష్టంతో విపరీతమైన నష్టాలు చవిచూసింది. ఎందుకుంటే ఆకర్షణీయమైన ఫుడ్‌ట్రక్‌లు, మోమోలు, పిజ్జా రోల్స్‌ వంటి ఆధునిక ఫుడ్‌ బ్రాండ్‌ దెబ్బకు కుదేలైపోయాడు. దాంతో చెల్లి స్వప్న సాథే తట్టుకోలేక వదిలేద్దాం అని చెప్పినా.. గణేశ్‌ మాత్రం ఎలాగైన సక్సెస్‌ అందుకోవాలని మొండిగా ముందుకు సాగాడు. 

అతడి కుటుంబం అతడు సీఏ చేసి మంచి వృద్ధిలోకి రావాలనుకుంటే ఇదేంటి వ్యాపారం అది ఇది అంటాడని మొత్తుకునేవారు. అయినా ఎవ్వరి మాట లెక్క చేయకుండా నష్టాలు వచ్చినా..సరే మొండిగా వ్యాపారం చేసుకుంటూ వచ్చేవాడు. ఆ తర్వాత అతడి అచంచలమైన ఓర్పు అతనికి ఓ ఆలోచన మెరుపులా తట్టింది. ఇప్పుడంతా సోషల్‌ మీడియాదే హవా కాబట్టి తాను చేసే వ్యాపారం గురించి సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంటే అనే ఆలోచన కలిగింది.

అదే అతడికి విజయానికి పెట్టుబడిగా మారింది. తాను రూ. 50 వేల రూపాయలు అప్పు చేసి తన తల్లి చేసే బెన్నె దోసె వంటకాన్నే వ్యాపారంగా మార్చినట్లు నెటిజన్లతో పంచుకున్నాడు. అలాగా ప్రతి ఉదయం, తన తల్లి, చెల్లి స్వప్న తాజా పిండిని సిద్ధం చేస్తుండగా, గణేష్ రుచికరమైన దోసెలను తయారు చేయడం వంటి వన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ప్రారంభించగానే అటు ఫాలోవర్లు, అమ్మకాలు రెండూ  పెరిగాయి. అలా చూస్తుండగానే వ్యాపారం మంచి ఊపందుకుని నెలకు లక్షల్లో ఆదాయం ఆర్జించే రేంజ్‌కు చేరుకుంది. 

అంతేగాదు ఆ పాత బండి కూడా శాశ్వత రెస్టారెంట్‌గా మారిపోయింది. పైగా రోజుకి దాదాపు 400 మంది దాక దుకాణానికి వస్తుంటారు, అలాగే రోజుకి సుమారు 40 వేలకు పైగా ఆదాయం రావడం మొదలైంది. అంటే నెలకు దగ్గర దగ్గర రూ. 12 లక్షలు పై చిలుకు. ఏ పనైనా మొదలుపెట్టగానే సక్సెస్‌ రాదు, నాలుగైదు సార్లు కిందపడితే గానీ..అనుభవం రాదు, అప్పుడే గెలుపు పాదాక్రాంతం చేసుకోగలలం అని గణేశ్‌ సక్సెస్‌ స్టోరీ చెబుతోంది కదూ..!.

 

(చదవండి: ఎంపీ సుప్రియా సూలే ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..! 50 ఏళ్ల వయసులోనూ..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement