Photo Credit: Twitter
టీమిండియాలో చోటు కోల్పోయిన లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం కౌంటీ చాంపియన్‌షిప్‌లో బిజీ అయ్యాడు. అకీబ్ నబీ, రాహుల్ చాహర్, కుల్దీప్ యాదవ్‌తో పాటు చాహల్ కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో నార్తాంప్టన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్ డుర్హమ్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. చాహల్ ఖాతాలో అలెక్స్ లీస్, బెన్ స్టోక్స్, కాసే అల్డ్‌రిడ్జ్, మాథ్యూ పాట్స్ ఉన్నారు.
ఈ నాలుగింటిలో స్టోక్స్‌ను బురిడీ కొట్టించిన తీరు మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పొచ్చు. చాహల్ వేసిన రిప్పర్ అనూహ్య టర్న్ తీసుకొని ఔట్‌సైడ్ వెళ్లి స్టంప్స్‌ను ఎగురగొట్టింది. చాహల్ వేసిన మ్యాజిక్ బంతికి స్టోక్స్ ఫ్యూజులు కదిలాయని చెప్పొచ్చు. ఏం జరిగింది అన్న తరహాలో స్టోక్స్ తల గోక్కుంటూ క్రీజు వీడడం కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవలే టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ ఎంపిక చేసిన ఐదుగురు భారత బెస్ట్ బౌలర్ల జాబితాలో చాహల్ చోటు దక్కించుకున్నాడు. బుమ్రా మిస్ అయిన జాబితాలో చాహల్ నాలుగోస్థానం పొందగా, వెటరన్ భువనేశ్వర్ కుమార్ తొలి స్థానం దక్కించుకోవడం విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే చాహల్ దెబ్బకు డుర్హమ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ బెడింగ్‌హమ్ (81) టాప్ స్కోరర్ కాగా, మయాంక్ అగర్వాల్ (36) పర్వాలేదనిపించాడు. చాహల్ 4 వికెట్లు తీశాడు. అనంతరం ఆటను ప్రారంభించిన నార్తంప్టన్ షైర్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. లూయిస్ మెక్‌మనస్ (18), లూయిస్ కింబర్ (4) క్రీజులో ఉన్నారు. సైఫ్ జయీబ్ (52), జేమ్స్ సేల్స్ (69) అర్థసెంచరీలతో రాణించారు. బెన్ స్టోక్స్ మూడు వికెట్లు పడగొట్టాడు.
46.3 | WHAT A BEAUTY 😵💫
Yuzi Chahal with an absolute peach to dismiss Ben Stokes 🤯
Durham 187/6.
Watch live 👉 https://t.co/obDgNotzBX pic.twitter.com/0RKBVz0Gxq— Northamptonshire CCC (@NorthantsCCC) September 3, 2026


