వరదలో కొట్టుకుపోయే పరిస్థితి.. దుపట్టాతో రక్షించిన వధువు! | Bride Saves Biker From Flood With Dupatta | Sakshi
Sakshi News home page

వరదలో కొట్టుకుపోయే పరిస్థితి.. దుపట్టాతో రక్షించిన వధువు!

Sep 4 2026 9:59 AM | Updated on Sep 4 2026 10:23 AM

Bride Saves Biker From Flood With Dupatta

యువర్స్‌

వైపు భారీ వరద..మరోవైపు అందులో చిక్కుకున్న ఓ బైకర్‌.. క్షణక్షణానికి పెరుగుతున్న వరద ఉధృతి. ఏ క్షణమైనా కొట్టుకుపోయే పరిస్థితి. అలా ప్రాణభయంతో గజగజలాడుతున్న వ్యక్తిని ఓ నవ వధువు తన దుపట్టానే తాడుగా మార్చి సాయం చేసి అతడి ప్రాణం కాపాడింది.

హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లా భటియాత్‌ ప్రాంతంలోని కకీరా–తునుహట్టి రోడ్డుపై ఒక్కసారిగా వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. ఆ సమయంలో ఓ బైకర్‌ నీటి ప్రవాహంలో చిక్కుకుని ముందుకు కదల్లేక ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో అటుగా కారులో ఓ వెళ్తున్న ఓ కుటుంబం అతడిని గమనించి వెంటనే వాహనాన్ని ఆపింది. కారులోని వ్యక్తి బైకర్‌ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించినా వరద జోరు వల్ల కుదరలేదు.

దీంతో కారులోని నవ వధువు ముందుకొచ్చి తన దుపట్టాని తాడు చేసి బైకర్‌కు ఇచ్చింది. కారులో మరో మహిళ కూడా వీరికి సాయం చేసింది. ఎట్టకేలకు ఆ బైకర్‌ ప్రాణాలను కాపాడారు. ఈ మొత్తం సంఘటనను ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బైకర్‌ను కాపాడిన యువతులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవీ చదవండి: ప్రశ్నిస్తేనే సమాధానం.. లైంగిక ఆరోగ్యంపై యువత మాట్లాడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement