మొక్కలకు ఆకు ముడత తెగులా? ఇలా చెక్‌ పెట్టండి! | Leaf Curl Control In Chilli Tomato Brinjal Plants Natural Methods | Sakshi
Sakshi News home page

మొక్కలకు ఆకు ముడత తెగులా? ఇలా చెక్‌ పెట్టండి!

Sep 4 2026 9:19 AM | Updated on Sep 4 2026 9:19 AM

Leaf Curl Control In Chilli Tomato Brinjal Plants Natural Methods

సాగుబడి

మిద్దె తోటలు లేదా పెరటి తోటల్లో మొక్కలకు ముఖ్యంగా మిరప, టొమాటో, వంగ లాంటి మొక్కలకు ఆకు ముడత తెగులు ‘రసం పీల్చే తామర పురుగులు, తెల్లదోమల’ వల్ల ఎక్కువగా వస్తుంది.

1. ఒక లీటరు నీటిలో 5 మి.లీ. వేప నూనె, మైల్డ్‌గా ఉండే షాంపూ కొద్దిగా కలిపి మొక్కలపై, ఆకుల అడుగు భాగంలో బాగా పిచికారీ చేయాలి.
2. 100 గ్రాముల వెల్లుల్లి, 100 గ్రాముల పచ్చిమిర్చిని మిక్సీ పట్టి, 1 లీటరు నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టి, ఆ నీటిని వడపోసి మొక్కలపై చల్లాలి.
3. ఒక లీటరు నీటిలో 50–100 మి.లీ పుల్లటి మజ్జిగ కలిపి పిచికారీ చేయటం వల్ల వైరస్‌ ఉధృతి తగ్గుతుంది.
4. కుండీల మధ్యలో పసుపు (తెల్లదోమ కోసం), నీలం (తామర పురుగుల కోసం) రంగు జిగురు అట్టలను అమర్చటం వల్ల పురుగులు 
  వాటికి అంటుకొని చనిపోతాయి.
5. ముడత పడిన ఆకులు, కొమ్మలను కత్తిరించి, దూరంగా పారేయాలి లేదా తగలబెట్టాలి.

6. మొక్కలకు తగినంత నీరు అందిస్తూ, మట్టి పొడిగా లేకుండా, అలాగని నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
7. మొక్కలకు తరచుగా పశువుల ఎరువు, వర్మీకంపోస్ట్‌ లేదా ద్రవ రూప ఎరువులు అందించి ఆరోగ్యంగా పెంచాలి. మొక్కలు ఆరోగ్యంగా 
  ఉంటే చీడ పీడలు తట్టుకుంటాయి. 
8. ఏది వాడినా ఉదయం లేదా సాయంత్రం సమయంలో మాత్రమే స్ప్రే చేయాలి. 7–10 రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

  • నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

ఇవీ చదవండి: చాపగుత్తి: చూడటానికి చిన్న చెట్టే.. ఉపయోగాలు తెలిస్తే షాకే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement