ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లోని న్యూ ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. అనుమానాస్పదంగా వేగంగా వచ్చిన కారును ఆపేందుకు సిబ్బంది సూచించినప్పటికీ, కారులో ఉన్న వారు వాహనాన్ని ఆపకపోవడంతో దాన్ని నిలిపివేసేందుకు కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఈ కాల్పుల్లో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని రెహ్మతుల్లా, అబ్దుల్ జబ్బార్‌గా గుర్తించినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో ఒకరికి డేరా ఘాజీ ఖాన్‌తో సంబంధం ఉన్నట్లు, మరొకరు బలూచిస్థాన్‌లోని కోహ్లూ జిల్లాలోని కోహ్లూ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరస్థుడిగా గుర్తించినట్లు సమాచారం. కాల్పుల కారణంగా ఇద్దరికీ బుల్లెట్ గాయాలు కాగా, కారు ముందు అద్దం కూడా ధ్వంసమైంది.


