Islamabad
-
ఇద్దరిలో ఓ మెట్టు దిగాల్సింది ఎవరు?
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. చర్చలకు అమెరికా సిద్ధంగానే ఉన్నా.. ఇరాన్ ముందుకు రాకపోవడంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. యుద్ధం గనుక మళ్లీ మొదలైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా కూడా తగ్గబోమని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఇరాన్ కూడా అంటోంది. అయితే..చర్చల విషయంలో సానుకూలంగానే ఉన్నా ఇరాన్ బెట్టు చేయడం సరికాదని అమెరికా అంటోంది. కొత్త ఒప్పందం అమలు అయితే అన్నీ సర్దుకుంటాయని.. ఆ ఒప్పందం ఓ కొలిక్కి రావాలంటే ఇరాన్ చర్చలకు దిగి రావాల్సిందేనని.. అప్పుడే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ చివరి నిమిషంలో ఇరాన్ చర్చలకు వచ్చినా తుది ఒప్పందం కుదురుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఆ ‘ఒక్క’ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేకపోవడమే ఇందుకు కారణంగా చూపిస్తున్నారు. శుద్ధి యురేనియం.. సాధారణంగా యురేనియం శుద్ధి 3–5 శాతం వరకు చేస్తే అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇరాన్ ఏకంగా 20 శాతం పైగా శుద్ధి చేస్తోందని(60 శాతం దాకా చేసిందని కూడా!).. ఇది అణు ఆయుధాల తయారీకి దగ్గర స్థాయిలో ఉందని అమెరికా ఆరోపణ. ఇరాన్ మాత్రం ఇదంతా వైద్య పరిశోధన, అణు శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే అని చెబుతోంది.2015లో కుదిరిన Joint Comprehensive Plan of Action (JCPOA) ప్రకారం.. ఇరాన్ యురేనియం శుద్ధి 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలి. అలా చేస్తే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే.. 2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం తప్పుకుంది. తమ దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ డీల్ కాపాడలేదని.. పైగా ఇరాన్‌కు ఆర్థిక లాభాలు కట్టబెట్టిందని ఆయన ఆ టైంలో ఆరోపించారు. ఒప్పందం తొలగిపోవడంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అయితే..అదే విషయమై.. అదే ట్రంప్ ఇప్పుడు కొత్త డీల్ కుదుర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం మిడిల్ ఈస్ట్ భద్రతకు కీలకమని అంటున్నారాయన. యుద్ధం కన్నా ఒప్పందం మంచిదని పదేపదే పాట పాడుతున్నారు. ఇరాన్‌కు మరో దారి లేదని హెచ్చస్తూనే.. అవసరమైన సడలింపులు కూడా ఇచ్చేందుకు రెడీ అంటూ బుజ్జగిస్తున్నారు. అవసరమైతే.. డీల్ కుదుర్చుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అంటున్నారు. అయితే.. ఇక్కడ ప్రధాన సమస్య యురేనియం శుద్ధి (uranium enrichment) కాలపరిమితి విషయంలోనే కనిపిస్తోంది.ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని సుదీర్ఘ కాలం(20 ఏళ్లపాటు) నిలిపివేయడానికి అంగీకరించిందని, ఇది కొత్త ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ చెబుతున్నారు. అయితే, అమెరికా ఏ రకమైన సడలింపులు ఇవ్వగలదో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇరాన్ మాత్రం చాలా తక్కువ కాలం (5–7 సంవత్సరాలు) మాత్రమే అంగీకరించేందుకు సిద్ధంగా ఉంది. తమకు ఇచ్చే సడలింపులపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని కోరుతోంది. అలాగే ఆర్థిక ఆంక్షలను తక్షణమే తొలగించాలని షరతు పెడుతోంది. ఇక్కడే చర్చలు ముందుకు సాగడం లేదు.అమెరికా ఏం కోరుకుంటోందియురేనియం శుద్ధి, అణు ఆయుధాల అభివృద్ధి పూర్తిగా ఆపడం.బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌పై నియంత్రణ.లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గించడం.దేశీయ నిరసనలపై కఠిన చర్యలు తగ్గించడం.ఇరాన్ ఏం ఆశిస్తోందంటే..ఆంక్షలు ముందుగా ఎత్తివేయాలి. అమెరికా ఆర్థిక ఆంక్షలు తగ్గించకపోతే, అణు కార్యక్రమంపై పెద్ద సడలింపులు ఇవ్వలేమని ఇరాన్ అంటోంది.అణు శుద్ధి అవసరం కూడా. అణు శక్తి ఉత్పత్తి కోసం అవసరమని వాదిస్తోంది.తక్కువకాల పరిమితి మాత్రమే: అమెరికా కోరుతున్న 20 సంవత్సరాలపాటు అణు కార్యక్రమం నిలిపివేయడం సాధ్యం కాదని, గరిష్టంగా 5–7 సంవత్సరాలు మాత్రమే అంగీకరించగలమని చెబుతోంది.ప్రాంతీయ ప్రభావం తగ్గించలేం. లెబనాన్, సిరియా, యెమెన్‌లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం తమ భద్రతా వ్యూహంలో భాగమని ఇరాన్ అంటోంది.దేశీయ విధానాల్లో జోక్యం వద్దు. నిరసనలపై చర్యలు తమ అంతర్గత వ్యవహారమని, అమెరికా లేదంటే ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం అంగీకరించలేమని చెబుతోంది.సమాన ఒప్పందం కావాలి: అమెరికా మాత్రమే లాభపడే ఒప్పందం కాకుండా, ఇరాన్‌కు కూడా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కలిగేలా ఉండాలని కోరుతోంది.సాధ్యమైన సడలింపులు ఆర్థిక ఆంక్షల సడలింపు: చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తగ్గించడం లేదా ఎత్తివేయడం.వాణిజ్య అవకాశాలు: అంతర్జాతీయ మార్కెట్లలో ఇరాన్‌కు తిరిగి ప్రవేశం కల్పించడం.మానవతా మినహాయింపులు: ఔషధాలు, ఆహారం వంటి అవసరమైన వస్తువులపై ఆంక్షలు తగ్గించడం.సైనిక ఒత్తిడి తగ్గింపు: ఇరాన్ మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గిస్తే.. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించడం.ఒప్పందం కుదిరితేప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చు: మధ్యప్రాచ్యంలో యుద్ధం అవకాశాలు తగ్గి, స్థిరత్వం పెరుగుతుంది.ఆర్థిక లాభం: ఇరాన్‌పై ఉన్న ఆంక్షలు సడలితే, చమురు ఎగుమతులు పెరుగుతాయి.చమురు మార్కెట్‌పై ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరిగి, ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.రాజకీయ సంబంధాలు మెరుగుపడవచ్చు. అమెరికా–ఇరాన్ సంబంధాలు సానుకూల దిశలో కదిలి, ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపవచ్చు.ఒప్పందం కుదరకుంటేఉద్రిక్తతలు పెరుగుతాయి: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ ఘర్షణలు.. సైనిక చర్యలు పెరిగే అవకాశంఆంక్షలు కొనసాగుతాయి: ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.చమురు ధరలు పెరిగే అవకాశం: సరఫరా తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయి.ప్రాంతీయ అస్థిరత: లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు పెరిగి.. ఘర్షణలు మరింత తీవ్రమవుతాయి.చర్చలు విఫలమైతే.. అమెరికా–ఇరాన్ సంబంధాలు మరింత దూరమవుతాయి. రెండువారాల యుద్ధ విరమణ బుధవారంతో(భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి దాటాక) ముగియనుంది. అంటే.. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. చర్చల్లో ఏదో ఒక పురోగతి కనిపిస్తేనే.. అది పొడిగింపు ఉండొచ్చు. అంటే.. ఈ చర్చలు మిడిల్ ఈస్ట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. -
మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదురుతోంది. రెండో విడత చర్చల కోసం పాక్‌కు వచ్చేది లేదని ఇరాన్ మొండికేసి కూర్చుంది. మరోవైపు అమెరికా ప్రతినిధులు మాత్రం ఇరాన్‌తో రెండో విడత చర్చల కోసం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నట్లు వార్తలు వచ్చిన వేళ ఒక కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌తో చర్చల నిమిత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్‌కు వెళ్లలేదనే రాయిటర్స్ తమ కథనంలో పేర్కొంది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు చెందిన కాన్వాయ్ వైట్‌హౌస్‌కు చేరుకోవడం ఈ విషయానికి మరింత బలం చేకూర్చినట్లయింది. బుధవారంతో ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జేడీ వాన్స్ అసలు పాక్‌కు వెళ్లలేదని వస్తున్న వార్తలతో మలి విడత చర్చలు జరగడం అనుమానమే. తొలి విడత చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్‌హౌస్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఆ చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. మరోవైపు శాంతి చర్చలకు హాజరయ్యే విషయాన్ని తాము ఇంకా పరిశీలిస్తూనే ఉన్నామని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ అధికారి ఒకరు రాయిటర్స్‌కు పేర్కొన్నారు. -
పాక్‌కు ఇరాన్ సరికొత్త మెలిక
పశ్చిమాసియా సంక్షోభంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ వాణిజ్య నౌకను అమెరికా దళాలు సీజ్ చేయడం.. అటుపై కౌంటర్ దాడులతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శాంతి చర్చలకు తమ ప్రతినిధుల బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదని ఇరాన్ ప్రకటించడంతో.. పరిస్థితి మొదటికి వచ్చింది. అయితే చర్చలకు సిద్ధమని ప్రకటించిన ఇరాన్ కొత్త షరతులతో మధ్యవర్తి పాకిస్తాన్‌ను ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ కుదర్చడం ద్వారా ట్రంప్‌నకు మరింత దగ్గర కావాలని.. తమ దేశం చివర ‘శాంతిదూత’ అనే ట్యాగ్ తగిలించుకోవాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తోంది. అయితే తొలి దఫా చర్చల కోసం పేలవమైన నిర్వహణ.. డీల్ కుదర్చడంలో విఫలం కావడంతో అంతర్జాతీయ సమాజంలో పాక్ నవ్వులపాలైంది. దీంతో రెండో దఫా చర్చలను ఎలాగైనా సక్సెస్ చేయాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే.. ఇరాన్ మాత్రం పాక్‌ను మిత్రదేశంగా కాకుండా.. మధ్యవర్తిగానే చూస్తూ చర్చల విషయంలో మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇరాన్‌ను ఇబ్బంది పెట్టే ఏ ప్రయత్నాన్ని తాము అంగీకరించబోమని అంటోంది. అమెరికా డిమాండ్లు వాస్తవానికి దూరంగా ఉన్నాయని.. ముఖ్యంగా శుద్ధి చేసిన యురేనియంను అప్పగించే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టింది. ఇదే విషయంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఫోన్లో ప్రస్తావించారు. ఈ ఫోన్‌కాల్‌లో ఆయన.. అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. అయితే ఆఖర్లో ఇరాన్ భద్రతా ప్రయోజనాలను కాపాడే షరతులపై మాత్రమే చర్చలకు తాము ముందుకు వస్తామని స్పష్టం చేశారు. ‘‘మా అణు కార్యక్రమం శాంతి ప్రయోజనాల కోసం. దాన్ని వదులుకోవడం అసాధ్యం’’ అని పాక్ ప్రధానితో ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే.. ఈ విషయంలో అమెరికా ఓ మెట్టు పైనే ఉంటోంది. ఇరాన్ అణు ప్రోగ్రామ్ తగ్గించాలని, శుద్ధి చేసిన యురేనియంను అంతర్జాతీయ పర్యవేక్షణ కోసం తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో ఇరాన్‌ను ఒప్పించే పూచీ తమదని ట్రంప్‌నకు తొలి నుంచి పాక్ చెబుతూ వస్తోంది. ఈ హామీ ఆధారంగానే ట్రంప్ బాహాటంగా ఇరాన్ అన్నింటికీ అంగీకరిస్తుందంటూ వరుస స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే.. ఇరాన్ మాత్రం ఆ కండిషన్లకు ససేమీరా అంటోంది. వాటిని ‘అసాధ్యమైనవి’గా పేర్కొంటూ అవసరమైతే చర్చలనే బహిష్కరిస్తామని హెచ్చరిస్తోంది. ఈ కఠిన వైఖరి ట్రంప్‌నకు మరింత మంట పుట్టిస్తోంది. అదే టైంలో.. పాక్‌కు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతోంది.ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా.. ఇరాన్–అమెరికా మధ్య చర్చలు జరగడం ప్రాంతీయ శాంతికి కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇరాన్ తన అణు హక్కులను వదులుకోదనే స్పష్టమైన సంకేతం ఇస్తూ.. అమెరికాను ఢీ కొట్టి తీరతామనే వైఖరిని ప్రదర్శిస్తోంది. -
చర్చలకు వచ్చేది లేదు ఇరాన్.. రాకుంటే వినాశనమే ట్రంప్
-
వార్ అప్డేట్స్: హర్ముజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా వీడలేదు. హర్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం కొసాగుతోంది. ఇరాన్ పోర్టులకు వచ్చిపోయే నౌకలపై నిఘా కొనసాగిస్తోంది. ఈ పరిణామాలు ఇరాన్‌కు సహించడం లేదు. మరోవైపు పాక్ వేదికగానే మరోసారి శాంతి చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
యుద్ధమైనా.. శాంతి చర్చలైనా.. మేం ఒక్కటే
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా గౌరవించి తీరాల్సిందేనని పేర్కొంది. అదే సమయంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మహ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అయినా.. శాంతి చర్చలైనా.. ఇరాన్, దాని మిత్ర శక్తులు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాయని స్పష్టం చేశారు. హెజ్బొల్లా ధైర్యం, రెసిస్టెన్స్ ఐక్యత వల్లే లెబనాన్‌లో కాల్పుల విరమణను సాధ్యమైందని అన్నారాయన. యుద్ధం జరిగినా, శాంతి ఒప్పందం వచ్చినా.. ఇరాన్, రెసిస్టెన్స్(మిత్ర శక్తుల) శక్తులు ఒక్కటిగానే ఉంటాయని.. ఈ శక్తులు కలకాలం ముందుకు సాగుతాయన్నారు. అలాగే.. ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యత ఇవ్వడమే పనిగా పెట్టుకున్న అమెరికా ఆ విధానాన్ని వదిలేయాలని సూచించారు. శాంతి ఒప్పందాన్ని గౌరవించాలని అమెరికాకు హితవు పలికారు. హర్ముజ్ జలసంధి అమెరికా దిగ్బంధనం(బ్లాకేడ్) కొనసాగుతోంది. ఈ చర్య అంతర్జాతీయ చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఈ జోక్యాన్ని చూస్తూ ఊరుకోబోమని చెబుతోంది. లెబనాన్‌లో కాల్పుల విరమణ ఇంకా ఆచరణలోకి రాలేదు. అమెరికా మధ్యవర్తితత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తగ్గినా.. చిన్నపాటి దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఘలీబాఫ్ వ్యాఖ్యలు పశ్చిమాసియా సంక్షోభంలో రెసిస్టెన్స్ శక్తుల ఐక్యతను బలపరిచే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇరాన్ చెబుతున్నట్లు.. అమెరికా గనుక ఇజ్రాయెల్ ఫస్ట్ విధానాన్ని వీడి శాంతి ఒప్పందాన్ని గౌరవించకపోతే ప్రాంతీయ స్థిరత్వం మళ్లీ దెబ్బతినే అవకాశం ఉంది. ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు త్వరలో మళ్లీ ఇస్లామాబాద్‌లోనే జరగనున్నాయి. తొలి దఫా చర్చలు విఫలం కావడంతో.. ఎవరో ఒకరు దిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అటు అమెరికా.. ఇటు ఇరాన్ తగ్గేదే లే అంటున్నాయి. బంతి ఇరాన్ కోర్టులోనే ఉందని అమెరికా అంటుంటే.. తమ డిమాండ్లలో ఏ ఒక్కటి తగ్గినా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ అంటోంది. పాక్ మధ్యవర్తిత్వంలో తొలుత ఇరాన్, అమెరికా ప్రతినిధులు పరోక్ష చర్చలు జరుపుతారు. ఫలితాలు సానుకూలంగా ఉంటే ప్రత్యక్ష చర్చలు జరగొచ్చు. -
మరోసారి నవ్వులపాలైన పాకిస్థాన్
ఇస్లామాబాద్: ఏప్రిల్ 10-12 మధ్య ఇరాన్-అమెరికా చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన హోటల్ బిల్లులను చెల్లించడంలో పాక్ విఫలమైందని.. అంతర్జాతీయంగా తలవంపులు తెచ్చుకుందంటూ ప్రచారం జరుగుతోంది. పరిస్థితి చేయి దాటడంతో.. హోటల్ యజమాని స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. హోటల్ బిల్లు కూడా పాక్ కట్టలేకపోవడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ జరుగుతోంది.అమెరికా-ఇరాన్ మధ్య రెండో రౌండ్ శాంతి చర్చలు ఈ వారంలోనే పాకిస్థాన్‌లో ప్రారంభం కానున్నాయి. అసలే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు రాబోయే చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం ఇప్పుడు సవాలుగా మారింది. వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య ఉన్న రెండు వారాల కాల్పుల విరమణ ఏప్రిల్ 21తో ముగియనున్న నేపథ్యంలో ఏప్రిల్ 16న ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్యొంది. అయితే, ఈసారి కూడా గతంలో వచ్చిన స్థాయి ప్రతినిధి బృందాలు వస్తాయా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలకడం ద్వారా అంతర్జాతీయస్థాయిలో కీర్తి శిఖరాలను అధిరోహించాలని పాకిస్తాన్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది. అమెరికా-ఇరాన్ చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన పాక్.. ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనాలో ఏర్పాట్లు చేసింది. తీరా ఈ చర్చలు విఫలమవ్వడంతో.. చివరకు చెల్లింపులు లేవు, డీల్ లేదన్నట్లుగా పరిస్థితి మారింది. చివరికి హోటల్ బిల్లుల భారం మాత్రం మిగిలింది.మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్‌కు మరో సమస్య వచ్చి పడింది. యూఏఈ ఇచ్చిన $3 బిలియన్ డాలర్లు అప్పు పూర్తిగా తిరిగి చెల్లించాలని కోరడంతో ఎలా చెల్లించేది అనే సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ అప్పులు ఎలా చెల్లించేదని ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఇంతకాలంగా యూఏఈకి ఉన్న అప్పును పలు దపాలుగా పాకిస్థాన్ వాయిదా వేస్తో వచ్చింది.. అయితే ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చెల్లించాలని కోరడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. -
'అందుకే శాంతి చర్చలు విఫలం': నెతన్యాహు
ఇస్లామాబాద్‌లో జరిగిన సుదీర్ఘ శాంతి చర్చల అనంతరం అమెరికా ప్రతినిధి బృందం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో జరిపిన టెలిఫోన్ సంభాషణలోని విషయాలను.. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు.''నేను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడాను. ఆయన ఇస్లామాబాద్ నుంచి తిరిగి వస్తున్న విమానంలో నుంచి నాకు ఫోన్ చేశారు. ఈ ప్రభుత్వం ప్రతిరోజూ చేసే విధంగానే, ఆయన చర్చల పురోగతి గురించి నాకు వివరంగా నివేదించారు. ఈ సందర్భంలో.. చర్చలు విఫలం గురించి తెలియజేశారు'' అని నెతన్యాహు పేర్కొన్నారు.సుదీర్ఘ చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం.. ఇరాన్ ఒప్పందాన్ని పాటించకపోవడమే. ఒప్పందం ప్రకారం.. ఇరాన్ వెంటనే కాల్పుల విరమణ చేయాలి, హోర్ముజ్ జలసంధిని తెరవాలి. అయితే.. ఇరాన్ ఈ నిబంధనలను అమలు చేయలేదు. అందువల్ల, అమెరికా ఈ పరిస్థితిని అంగీకరించలేక చర్చల నుంచి వెనక్కి తగ్గిందని తెలిపారు.ఇరాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో, అమెరికా ఇరాన్‌పై నౌకాదళ నిర్బంధం విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇజ్రాయెల్ పూర్తిగా మద్దతు ఇస్తోందని నేతన్యాహు స్పష్టం చేశారు. అంతే కాకూండా.. ఇజ్రాయెల్ - అమెరికా మధ్య ఉన్న సమన్వయం ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి (Abbas Araghchi) ప్రకారం.. ఈ చర్చల సమయంలోనే నేతన్యాహు వాన్స్‌కు ఫోన్ చేయడం వల్ల చర్చల దృష్టి మారిపోయిందని ఆరోపించారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. అమెరికా చర్చల ద్వారా సాధించలేనిది యుద్ధం ద్వారా సాధించాలని ప్రయత్నిస్తోంది.మొత్తం మీద.. ఈ ఘటన అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచింది. శాంతి చర్చలు విఫలమవడం వల్ల ప్రాంతీయ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. -
చర్చల వైఫల్యం వెనక... ఐదు కారణాలు!
అమెరికా, ఇరాన్ నడుమ ఎంతో ఆశావహంగా మొదలైన శాంతి చర్చలు విఫలం కావడం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర నిరాశలో ముంచెత్తింది. ఈ వైఫల్యం వెనక పలు కారణాలున్నట్టు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాటిలో ప్రధానమైనవి...1. అటు అమెరికా, ఇటు ఇరాన్ తమ ప్రాధాన్యాలకే కట్టుబడి ఉండాలనే మొండి పట్టుదలతో ఇస్లామాబాద్‌లో అడుగుపెట్టాయి. ఎవరూ తమ డిమాండ్ల నుంచి ఇసుమంతైనా వెనక్కు తగ్గలేదు. అవతలి వారి వాదనలకు ఏ మాత్రమూ విలువ ఇవ్వలేదు. చర్చలు వైఫల్యానికి ఈ వైఖరే ప్రధాన కారణంగా నిలిచింది. యురేనియం శుద్ది కార్యక్రమాన్ని తక్షణం, శాశ్వతంగా ఆపేయాలని అమెరికా డిమాండ్‌కు ఇరాన్ ససేమిరా అంది. విద్యుదుత్పత్తి అవసరాల నిమిత్తం యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగించి తీరతామని కరాఖండిగా చెప్పింది.2. చర్చలన్నాక అగ్రరాజ్యాధినేత అయినా నోరు అదుపులో పెట్టుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దౌత్యధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. ఇరాన్ బృందం పాక్‌లో కాలుమోపాక కూడా కాక పెంచేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మునుపెన్నడూ ఉపయోగించని శక్తిమంతమైన ఆయుధాలతో మరింత భీకరంగా విరుచుకుపడతామంటూ ఆయన పెట్టిన పోస్టులు పరిస్థితిని దిగజార్చాయి. ఓవైపు చర్చలకు పిలిచి మరోవైపు ఇలా బెదిరింపులకు పాల్పడటం ఏ రకమైన దౌత్య నీతి అంటూ అమెరికా ప్రతినిధులను ఇరాన్ బృందం నిలదీసినట్లు సమాచారం.3. కాల్పుల విరమణ లెబనాన్‌కూ వర్తిస్తుందని తాము మొదటి నుంచీ చెబుతున్నా చర్చలను బేఖాతరు చేస్తూ ఆ దేశంపై ఇజ్రాయెల్ భీకరంగా దాడులు కొనసాగిస్తుండటం ఇరాన్‌కు సుతరామూ నచ్చలేదు. లెబనాన్‌పై దాడులు చేయకుండా ఇజ్రాయెల్‌ను నిరోధిస్తామని అమెరికా నుంచి ఎలాంటి హామీ రాకపోవడాన్ని ఇరాన్ తీవ్రంగా తప్పుబట్టింది. మధ్యవర్తిగా హుందాగా వ్యవహరించాల్సిన పాక్ కూడా పరిస్థితిని దిగజార్చేలా ప్రవర్తించింది. ఇజ్రాయెల్ జాతి హననానికి పాల్పడుతోందంటూ పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ పోస్టు పెట్టడంతో మండిపడ్డ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేశారు. చర్చలతో తమ దాడులకు సంబంధం లేదంటూ కుండబద్దలు కొట్టారు.4. అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని బేషరతుగా తెరవాలని ట్రంప్ డిమాండ్‌చేశారు. షరతుల్లేకుండా దాన్ని తెరవబోమని, చర్చల్లో బేరసారాలకు హార్మూజ్ తమకు కీలక ఆయుధమని ఇరాన్ ప్రతినిధులు వాదించారు. హార్మూజ్‌ను తెరవకపోతే ఇరాన్ నాగరికతనే బూడిద చేస్తామన్న ట్రంప్ బెదిరింపులను తీవ్రంగా తప్పుబట్టారు. హార్మూజ్‌ను తెరవాలంటే ఇరాన్‌పై ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకు అమెరికా బృందం ఒప్పుకోలేదు. పైగా ఈ విషయంలో ట్రంప్ ధోరణినే గట్టిగా సమరి్థంచింది. హార్మూజ్ గుండా పయనించే నౌకల నుంచి చార్జీలు వసూలుకు ఇరాన్‌తో కలిసి టోల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న ట్రంప్ ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించలేదు. హార్మూజ్‌పై తమతో పాటు ఒమన్ పాక్షిక అధికారాలను గుర్తించాలన్న ఇరాన్ డిమాండ్‌కు అమెరికా ఒప్పుకోలేదు.5. అమెరికా, ఇరాన్ బృందాల మధ్య పరస్పర విశ్వాస లోపం అడుగడుగునా కనిపించింది. హామీలను అవతలి పక్షం పాటిస్తాయా అన్న అనుమానాలు ఇరువైపులా కొట్టొచి్చనట్టు కన్పించాయి. తమ ప్రతిపాదనలు అద్భుతమని అమెరికా చెప్పుకుంటే, అవన్నీ చెత్త షరతులని ఇరాన్ ప్రతినిధులు కుండబద్దలు కొట్టారు.ఇక ఏం జరగనుంది? చర్చల వైఫల్యం తాలూకు తక్షణ ప్రభావం కాల్పుల విరమణపై పడే అవకాశముంది. అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ ఇరాన్‌పై మూకుమ్మడిగా దాడులు ప్రారంభించే ప్రమాదం కన్పిస్తోంది. చర్చలు విఫలమైతే చరిత్ర చూడని స్థాయిలో ఇరాన్‌పై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. అదే జరిగితే ప్రాణ, ఆస్తినష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కూడా కష్టమేనని ఆందోళన వ్యక్తమవుతోంది. హార్మూజ్ జలసంధి తెరచుకోని పక్షంలో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ముదిరే ఆస్కారముంది. తమ వద్ద అణుబాంబు లేని కారణంగానే అమెరికా ఇంతగా దాడులకు దిగుతోందన్న అభిప్రాయంతో ఉన్న ఇరాన్, ఇక అణ్వస్త్ర కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన కొనసాగించే వీలుంది. భారత్‌లో ఇంధన కష్టాలు మరింత పెరిగే అవకాశముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హార్మూజ్‌ను దిగ్బంధించండి
వాషింగ్టన్: శాంతిచర్చలు విఫలమవడంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనువెంటనే హార్మూజ్ జలసంధిని దిగ్భంధించాలని తమ నావికాదళానికి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆదివారం ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఇరాన్‌కు అక్రమంగా టోల్ చెల్లించిన ఏ ఒక్క సరకు రవాణా నౌక కూడా జలసంధి గుండా రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఇరాన్‌కు డబ్బులే కావాలి. మరీ ముఖ్యంగా అణ్వాయుధం కావాలి. అందుకే వాళ్ల ప్రయత్నాలను అడ్డుకుంటూ మేం హార్మూజ్‌ను దిగ్భందిస్తాం. ఇరాన్ అమర్చిన సముద్ర మందుపాతరలను ధ్వంసంచేస్తాం’’ అని అన్నారు. జలసంధి దిగ్బంధంలో మరికొన్ని దేశాలు అమెరికాకు సాయపడనున్నట్లు వార్తలొచ్చాయి. ‘‘ఇరాన్‌తో యుద్ధం చేయడం కంటే చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం వెతకడం ముఖ్యమని భావించి శాంతిచర్చలకు సిద్ధపడ్దాం. చాలా అంశాల్లో వాళ్లతో మాకు ఏకాభిప్రాయం కుదిరింది. కానీ అణ్వస్త్ర తయారీ కార్యక్రమం నిలుపుదలపై ఇరాన్ మొండికేసింది. అందుకే చర్చలు విఫలమయ్యాయి. సంక్లిష్టమైన, అనూహ్యమైన, ప్రమాదకర ఇరాన్ పాలకుల చేతికి అణ్వాయుధం దక్కకుండా చేస్తా. ఇరాన్ ఏనాటికీ అణ్వస్త్ర సామర్థ్యం సాధించబోదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల్లో మధ్యవర్తి పాత్ర పోషించిన పాక్ ప్రస్తావనను ట్రంప్ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ‘‘పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిజంగా అసాధారణ వ్యక్తులు. భారత్‌తో యుద్ధాన్ని నిలువరించి ప్రత్యక్షంగా 3–5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడిన నన్ను మునీర్, షెహబాజ్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలను తరలిస్తే చైనాపై అదనంగా 50 శాతం టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్ ‘సండే మారి్నంగ్ ఫ్యూచర్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి విధ్వంసక మిస్సైల్ లాంచర్‌ను ఇరాన్‌కు చైనా రహస్యంగా పంపిస్తోందన్న వార్తలు చదివా. అవి నిజమని అనుకోను. ఇప్పుడు చైనాతో అమెరికా సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ చైనా నిజంగానే ఇరాన్‌కు ఆయుధ సాయం చేస్తే 50 శాతం పన్నుల భారం పడేస్తా’’ అని హెచ్చరించారు. -
చర్చలు విఫలం
ఇస్లామాబాద్: ప్రపంచమంతా అత్యంత ఆశతో ఎదురు చూసిన అమెరికా, ఇరాన్ చర్చలు చివరికి విఫలమయ్యాయి. పశ్చిమాసియాలో భీకర యుద్ధానికి ముగింపు పలికి శాంతి, సుస్థిరతకు బాటలు వేస్తాయని, శాశ్వత కాల్పుల విరమణకు బాటలు పరుస్తాయని, ఆ మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదురుతుందని ప్రపంచ దేశాలు పెట్టుకున్న ఆశలు వమ్మే అయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యంలోని బృందం, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్ సారథ్యంలోని ఇరాన్ బృందం మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చలు ఎటూ తేలకుండానే అర్ధాంతరంగా ముగిశాయి. ఏకధాటిగా 21 గంటలపాటు కొనసాగిన చర్చల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు ఎవరి డిమాండ్లపై వారు మొండిపట్టు పట్టడంతో ఎలాంటి ఒప్పందమూ సాధ్యపడలేదు. దాంతో ఇరు బృందాలూ ఆదివారమే తమ తమ దేశాలకు వెనుదిరిగాయి. అమెరికా వెళ్లేముందు వాన్స్ ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. చర్చలు విఫలమయ్యాయని స్వయంగా ప్రకటించారు. ‘‘అణు కార్యక్రమాలకు స్వస్తి పలకబోనని ఇరాన్ మొండికేసింది. హార్మూజ్పైనా అదే వైఖరి! చర్చల వైఫల్యానికి ఇవి రెండే ప్రధాన కారణాలు. ఇరాన్‌తో 21 గంటలపాటు చర్చలు జరిపాం. కొన్ని అంశాలపై లోతుగా మాట్లాడాం. చర్చలకు సంబంధించి ఇదొక్కటే మంచివార్త. కానీ ఉమ్మడి నిర్ణయానికి మాత్రం రాలేకపోయాం. ఇది అమెరికాకంటే ఇరాన్‌కే అతి పెద్ద దుర్వార్త. అణ్వాయుధం తయారు చేయబోమని ఒక్క నిర్దిష్టమైన, స్పష్టమైన హామీని మాత్రమే కోరాం. అధ్యక్షుడు ట్రంప్ కోరుతున్నది కూడా ఇదే. చర్చల ద్వారా మేం ఇదే సాధించాలనుకున్నాం. చర్చలకు మేం ముందుకు రావడానికి అసలు కారణమూ ఇదే. కానీ మా షరతులకు ఇరాన్ ఒప్పుకోలేదు. చర్చల సందర్భంగా ట్రంప్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆయన వైఖరిని ఇరాన్ బృందానికి ఎప్పటికçప్పుడు తెలియజేస్తూ వచ్చాం’’ అని వాన్స్ చెప్పారు. తమ ప్రతిపాదనలను ఇరాన్ ఇకనైనా ఆమోదిస్తుందో లేదో చూడాలన్నారు. అణ్వస్త్ర తయారీ, హార్మూజ్ జలసంధి ద్వారా సాధారణ రాకపోకలు, విదేశాల్లో దిగ్భందంలో ఉన్న ఇరాన్ స్థిరచరాస్తులను విడిపించడం వంటి ప్రధానాంశాల్లో సయోధ్య వీలవకపోవడమే చర్చల వైఫల్యానికి కారణమని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. అసాధ్యమైన డిమాండ్లు: బఘేర్ చర్చల వైఫల్యంపై ఇరాన్ బృంద సారథి, స్పీకర్ ఘాలిబఫ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ఇరాన్ సర్వతోముఖాభివృద్ధికి కోసం దూరదృష్టితో మేం చేసిన పలు ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించలేదు. మా బృంద విశ్వాసాన్ని సంపాదించడంలో విఫలమైంది. దాని ఆధిపత్య తరహా దౌత్యమే ఇందుకు కారణం. మాపై సైనిక చర్య నేపథ్యంలో దేశ రక్షణ కోసం 40 రోజులుగా చేస్తున్న పోరాటంలో రాజీ ఉండబోదని కరాఖండిగా చెప్పేశాం. చర్చల సాఫల్యం అవతలి పక్షం అనుకూల వైఖరి, అంకితభావం మీదనే ఆధారపడి ఉంటుంది. అమెరికా మా ముందు ఆచరణ సాధ్యం కాని, అతి, అక్రమ డిమాండ్లు పెట్టింది. ఇలాంటి చర్యలతో చర్చలు ముందుకు సాగబోవు. పరస్పర అవిశ్వాసం, సంశయాల నడుమ సఫలత అసాధ్యం’’ అన్నారు. ‘‘ఒకే దఫాలో ఉమ్మడి నిర్ణయం ఆశించడం కష్టం. పలుమార్లు చర్చల తర్వాత బహుశా ఇరు పక్షాల వైఖరిలో కాస్త సారూప్యత సాధ్యపడొచ్చు’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయెల్ బఖాయీ అభిప్రాయపడ్డారు. మలి దఫా చర్చలపై యోచిస్తున్నట్టు అతిథ్య పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ప్రకటించారు. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌తో అమెరికా జరిపిన తొలి ప్రత్యక్ష చర్చలు ఇవే కావడం తెలిసిందే. ఇస్లామాబాద్‌లో శనివారం మొదలైన ఈ చర్చల్లో అమెరికా తరఫున వాన్స్‌తో పాటు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో అధ్యక్షుని దూత స్టీవ్ విట్కాఫ్; ఇరాన్ తరఫున బఘేర్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ; మధ్యవర్తిత్వ దేశ హోదాలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చల్లో పాల్గొన్నారు. పశ్చిమాసియా నుంచి అమెరికా సేనల నిష్క్రమణ, హార్మూజ్‌పై పట్టు వంటి 10 కీలక డిమాండ్లతో ఇరాన్; అణ్వస్త్ర తయారీకి తక్షణం అడ్డుకట్టే ప్రధాన డిమాండ్‌గా వాన్స్ బృందం పాక్‌లో కాలుమోపాయి.లెబనాన్‌పై ఆగని దాడులు బీరూట్: లెబనాన్‌తో మంగళవారం చర్చలు జరపనున్నా, ఆ దేశంపై దాడులను మాత్రం ఇజ్రాయెల్ ఆపడం లేదు! ఆదివారం దక్షిణ లెబనాన్‌లోని మారౌబ్ గ్రామంపై దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌పై దాడులను పోప్ లియో–14 తీవ్రంగా ఖండించారు. మరోవైపు 40రోజులపాటు జరిగిన యుద్ధంలో ఇప్పటిదాకా ఇరాన్లో 3,375 మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఫోరెన్సిక్ మెడిసన్ ఆర్గనైజేషన్ ఆదివారం ప్రకటించింది. మృతుల్లో 500 మంది దాకా మహిళలున్నారు. ఇప్పటిదాకా యుద్ధంలో లెబనాన్‌లో 2,055 మంది, ఇజ్రాయెల్‌లో 23 మంది, గల్ఫ్‌దేశాల్లో డజను మందికిపైగా చనిపోయారు. -
అందుకే ఒప్పందం కుదరలేదు: ఇరాన్ కీలక ప్రకటన
ఇస్లామాబాద్: అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఇరాన్ వెల్లడించింది. యూఎస్ మితిమీరిన డిమాండ్ల వల్లే ఒప్పందం కుదరలేదని.. చర్చల అనంతరం వివాదాస్పద అంశాలు లేవనెత్తారని ఇరాన్ పేర్కొంది. హర్మూజ్ జలసంధి, అణు హక్కుల వంటి వివాదస్పద అంశాలు ప్రస్తావించారన్న ఇరాన్.. ఏమీ తేలకుండానే అమెరికాతో చర్చలు ముగిశాయని పేర్కొంది.పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. 14 గంటలపాటు చర్చలు సాగాయి. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. తమ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్‌తో డీల్ లేదని ఆయన స్పష్టం చేశారు.ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. తాము విధించిన షరతులను ఇరాన్ ప్రతినిధులు అంగీకరించలేదని వాన్స్ పేర్కొన్నారు. చర్చల్లో తాము చాలా సానుకూలంగా వ్యవహరించామంటూ చెప్పుకున్న వాన్స్.. దురదృష్టవశాత్తు ఎలాంటి పురోగతి సాధించలేకపోయామన్నారు.హార్మూజ్ జలసంధిపై సంపూర్ణ ఆధిపత్యం మాకే ఉండాలని.. అక్కడ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదంటూ ఇరాన్ తేల్చి చెబుతోంది. గల్ఫ్ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలి. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉండడానికి వీల్లేదు. ఇరాన్‌పై అమెరికాతోపాటు యూరప్ దేశాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. స్తంభింపజేసిన మా ఆస్తులను విడుదల చేయాలి’’ అని ఇరాన్ డిమాండ్ చేస్తూ వస్తోంది.మరోవైపు, ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదని అమెరికా డిమాండ్ చేస్తోంది. యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వెంటనే ఆపాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించాలి. హార్మూజ్ నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలి. విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకోరాదు’’ అని అమెరికా స్పష్టం చేసింది. -
ఇరాన్‌తో చర్చలు విఫలం: జేడీ వాన్స్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఇరాన్, అమెరికా మధ్య చర్చలు విఫలమయ్యాయి. అర్ధాంతరంగా చర్చలు ముగించి జేడీవాన్స్ బృందం వెళ్లిపోయింది. దాదాపు 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, అమెరికా చర్చల అనంతరం జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ..‘రెండు దేశాల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇరాన్‌తో చర్చలు విఫలమయ్యాయి. మా డిమాండ్లను ఇరాన్ అంగీకరించలేదు. అందుకే ఇరాన్‌తో డీల్ లేదు. ఇస్లామాబాద్ వేదికగా ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నాం. ఎలాంటి అంగీకారం లేకుండా వెనక్కి వెళ్తున్నాం. మా నిబంధనలు అంగీకరించేందుకు ఇరాన్ సిద్దపడట్లేదు. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి. కానీ, అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ పరిణామం ఇరాన్‌కు కచ్చితంగా బ్యాడ్ న్యూస్’ అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. #WATCH | US-Iran peace talks | Islamabad, Pakistan: US Vice President JD Vance says, "...The simple fact is that we need to see an affirmative commitment that they (Iran) will not seek a nuclear weapon and they will not seek the tools that would enable them to quickly achieve a… pic.twitter.com/elS9Q0xPz4— ANI (@ANI) April 12, 2026ఇక, ఈ చర్చలలో పాకిస్తాన్ పాత్రను ఆయన ప్రశంసించారు. ఇరుపక్షాల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఇస్లామాబాద్ అద్భుతంగా పనిచేసిందన్నారు. చర్చల్లో ఏవైనా లోపాలుంటే పాకిస్తాన్ వల్ల కలిగినవి కావు అంటూ క్లారిటీ ఇచ్చారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఇరాన్ నుండి నిశ్చయాత్మక హామీ రాలేదని జేడీ వాన్స్ అన్నారు. చర్చలు విఫలం కావడం అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం కలిగిస్తాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం, పాకిస్తాన్ నుంచి జేడీ వాన్స్ బృందం.. అమెరికాకు బయలుదేరింది. అయితే, హార్మూజ్ జలసంధిని తెరవాలన్నది అమెరికా డిమాండ్. అలాగే, యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపాలని ఇరాన్‌కు అమెరికా కోరింది. ఇందుకు తమ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. విదేశాల్లోని తమ ఆస్తులపై ఉన్న ఫ్రీజ్ను తొలగించాలని ఇరాన్ కోరినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతిచర్చలు ముగిశాయి. దాదాపు 14 గంటలపాటు చర్చలు కొనసాగినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరుదేశాలకు చెందిన సాంకేతిక బృందాలు నిపుణుల నివేదికలను పంచుకున్నట్లు తెలిపింది. కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నప్పటికీ చర్చలు కొనసాగుతాయని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం మరో విడత చర్చలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. -
ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు.. అల్టిమేటం
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ముగిశాయి.. -
విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు.. ఇరాన్ ఎమోషనల్ పోస్ట్!
-
పశ్చిమాసియా సంక్షోభానికి మోక్షం లభించేనా?
వేలాది మంది ప్రాణాలను బలిగొని ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపుకు చేరుకుంది. నెలల తరబడి సాగుతున్న రక్తపాతానికి ముగింపు పలికే దిశగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నేడు (ఏప్రిల్ 11, 2026) పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అత్యున్నత స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. యుద్ధ మేఘాల మధ్య ఆశా కిరణంలా కనిపిస్తున్న ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.శాంతి మంతనాలు - పట్టువిడుపులుమధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే ధ్యేయంగా అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నతాధికారులు ఇస్లామాబాద్‌లో ముఖాముఖి భేటీ అవుతున్నారు. అయితే, చర్చల ప్రారంభానికి ముందే ఇరు దేశాలు తమ పంతాలను నెగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా లెబనాన్‌లో కాల్పుల విరమణ, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలపై ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయి భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అడ్డంకిగా మారిన హెజ్బుల్లా అంశంమార్చి నెలలో ప్రారంభమైన పోరాటంలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్‌లో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. అయితే, లెబనాన్ అంశాన్ని ఈ ద్వైపాక్షిక చర్చలతో ముడిపెట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ ససేమిరా అంటున్నాయి.ఆర్థిక ఆంక్షలు.. అణు కార్యక్రమంసంవత్సరాలుగా తమ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆంక్షలను అమెరికా వెంటనే ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన అణు, క్షిపణి తయారీ కార్యక్రమాలు నిలిపేస్తేనే ఆంక్షల ఉపశమనం ఉంటుందని వాషింగ్టన్ సంకేతాలిచ్చింది. ముఖ్యంగా యురేనియం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.హార్మూజ్ జలసంధిపై పట్టుప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిపై తన సార్వభౌమత్వాన్ని గుర్తించాలని, అక్కడ రవాణా రుసుములు వసూలు చేసే అధికారం తమకు ఉండాలని ఇరాన్ కోరుతోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా, ఎటువంటి పరిమితులు లేకుండా అంతర్జాతీయ చమురు ట్యాంకర్ల రాకపోకలు సాగాలని డిమాండ్ చేస్తోంది.సైనిక ఉపసంహరణ - పరిహారంగత ఆరు వారాలుగా జరిగిన యుద్ధ నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేయనుండగా, అమెరికా దీనిపై మౌనం వహిస్తోంది. అలాగే, మధ్యప్రాచ్యం నుంచి అమెరికా తన దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరుతుండగా, శాంతి ఒప్పందం కుదిరే వరకు సైన్యం కదిలేది లేదని, ఒకవేళ ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధం తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరించారు.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
ఇరాన్ విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు.. మినాబ్ మృతల కోసం ప్రత్యేక సీట్లు
-
మరో 24 గంటల్లో.. ట్రంప్ హాట్ కామెంట్స్
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్‌లు శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. శాంతి చర్చలకు ముందు లెబనాన్‌పై దాడులు ఆపాలని, ఫ్రీజ్ చేసిన నిధుల్ని విడుదల చేయాలని రెండు కండీషన్లు ఉంచింది ఇరాన్. దీంతో చర్చలు ఎలా ముందుకు సాగుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే చర్చల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్లు చేశారు.శాంతి చర్చలు గనుక విఫలమైతే ఇరాన్‌పై గట్టి దాడులే జరుపుతామని హెచ్చరించారు. న్యూయార్క్ పోస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘చర్చలు విఫలమైతే అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్‌పై దాడులకు రెడీగా ఉన్నాయి. ఈసారి మా యుధ్ధనౌకలను అత్యంత ఆధునిక ఆయుధాలతో నింపాం. ఒకవేళ ఒప్పందం గనుక కుదరకపోతే అత్యంత శక్తివంతంగా సైనిక చర్య ఉంటుంది. మరో 24 గంటల్లో ఏదనేది తేలిపోతుంది’’ అంటూ వ్యాఖ్యానించారాయన.సోషల్ ట్రూత్లోనూ ట్రంప్ కాస్త ఘాటుగానే ఓ పోస్ట్ చేశారు. ‘‘ఇరానియన్లకు ఎలాంటి అవకాశాలు లేవు. వారు ప్రపంచాన్ని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా కేవలం బెదిరించగలరు. ఇవాళ వాళ్లు ప్రాణాలతో ఉన్నారంటే అది కేవలం తన చర్చల వల్లే’’ అంటూ రాసుకొచ్చారు.వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలుశాంతి చర్చలు విజయవంతం అవుతాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్ బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చర్చల విషయంలో ఇరాన్ సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ వాళ్లు ఏదైనా ఆటలాడితే.. మా బృందం అదేరీతిలో వ్యవహరిస్తుంది అని అన్నారు.ఘలీబాఫ్ పోస్ట్చర్చలకు ముందు ఇరాన్ డిమాండ్లను ప్రస్తావిస్తూ.. పార్లమెంట్ స్పీకర్, చర్చల ప్రతినిధి అయిన మొహమ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల విడుదల అనే రెండు అంశాలు పరస్పర అంగీకారానికి వచ్చినప్పటికీ ఇంకా అమలు కాలేదని,, ఈ రెండు విషయాలు చర్చలు ప్రారంభం కావడానికి ముందు అమలు కావాలి అని పేర్కొన్నారు. Two of the measures mutually agreed upon between the parties have yet to be implemented: a ceasefire in Lebanon and the release of Iran’s blocked assets prior to the commencement of negotiations.These two matters must be fulfilled before negotiations begin.— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 10, 2026 -
అర్ధరాత్రి హైడ్రామా.. అమెరికా-ఇరాన్ చర్చలపై వీడిన ఉత్కంఠ
అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై ఉత్కంఠ వీడింది. గత అర్ధరాత్రి దాటాక ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అంతకంటే ముందే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అక్కడికి చేరారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.రెండు వారాల యుద్ధ విరామం ప్రకటించినప్పటికీ.. అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు 300 మంది మరణించారు. అయితే.. హెజ్బొల్లా సంస్థను తుడిచిపెట్టడమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఈ పరిణామంపై ఇరాన్ ఆగ్రహం.. అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించబోదని ఇజ్రాయెల్ సమర్థించుకుంది. ఈ విషయంలో అమెరికా సైతం ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది. అయితే.. లెబనాన్‌పై దాడులు ఆగాల్సిందేనని.. లేదంటే తామూ కాల్పులకు దిగుతామని.. యుధ్ధ మళ్లీ మొదలవుతుందని హెచ్చరించింది ఇరాన్. ఈ విషయంలో ఏదీ తేల్చనిది తాము చర్చలకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ తరుణంలో చర్చలపై ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే.. చివరకు మెట్టు దిగిన ఇరాన్ ప్రతినిధులు హాజరు కావడంతో చర్చలు ముందుకు సాగనున్నాయి.The homeland’s soldiers @mb_ghalibaf & @araghchi in the land of our beloved brothers and sisters, Pakistan. pic.twitter.com/FiMEDikrBk— Iran Embassy SA (@IraninSA) April 10, 2026 -
చర్చలపై ప్రతిష్టంభన!
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించి, శాంతిని సాధించడమే ధ్యేయంగా శనివారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గతంగా విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇరాన్ ప్రతినిధులు రెండు వర్గాలుగా విడిపోయారు. తమ వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. శాంతి చర్చలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఒకవర్గం పట్టుబడుతుండగా, మరో వర్గం అందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే చర్చలంటూ మెలిక పెడుతోంది. మొత్తానికి శాంతి చర్చలకు ఇరాన్ హాజరవుతుందా? లేదా? అనేది అనుమానంగానే మారింది. శుక్రవారం రాత్రి వరకూ ఎటూ తేల్చుకోకపోవడం గమనార్హం. మరోవైపు చర్చలకు అమెరికా సిద్ధమవుతోంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శుక్రవారం ఇస్లామాబాద్‌కు బయలుదేరారు. చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. శాంతి చర్చల పట్ల ఇరానియన్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్నేహహస్తం అందిస్తామని తెలిపారు. ఒకవేళ వారు తమతో ఆడుకోవాలని చూస్తే తదుపరి పరిణామాలు మరోలా ఉంటాయని తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్లు పేర్కొన్నారు. చర్చల విషయంలో ట్రంప్ కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారని వాన్స్ వెల్లడించారు. రెండు అంశాలు పరిష్కారమైతేనే... ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంతి చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 10 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బహుళ అంచెల రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ చర్చలను పాక్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అయితే, ఇరాన్ ప్రతినిధి బృందం రాకపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆగకపోతే ఇస్లామాబాద్ చర్చల నుంచి పూర్తిగా వైదొలుగుతామని టెహ్రాన్ హెచ్చరించినట్లు ఇరాన్ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ వెల్లడించింది. పరస్పరం అంగీకరించిన రెండు అంశాలు ఇప్పటికీ అమలు కాలేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఘలిబాఫ్ శుక్రవారం విమర్శించారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ పాటించడం లేదని, ఇరాన్‌కు సంబంధించిన కొన్ని ఆస్తులను ఇప్పటికీ విడుదల చేయలేదని తప్పుపట్టారు. శాంతి చర్చలు ప్రారంభం కావాలంటే ఈ రెండు అంశాలు అమల్లోకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఇరాన్ నుంచి పది మందితో కూడిన ప్రతినిధి బృందం చర్చలకు రాబోతోందని పాకిస్తాన్‌లోని ఇరాన్ రాయబారి రెజా అమీర్ మొఘదామ్ గురువారం నిర్ధారించారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. అయితే, ఇరాన్ ప్రతినిధి బృందం రాకను ఉద్దేశపూర్వకంగానే రహస్యంగా ఉంచారని, వారి కోసం పాక్ ప్రభుత్వం ప్రత్యేకంగా సెక్యూరిటీ కారిడార్‌ను ఏర్పాటు చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దాడులు జరుగుతుండగానే చర్చలా? లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగించడం ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టంచేశారు. ఒకవైపు దాడులు కొనసాగుతుండగానే మరోవైపు చర్చలు జరపడం అర్థంపర్థం లేని పని అంటూ తేల్చేశారు. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లో చర్చలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇరుపక్షాలను స్వాగతించడానికి పాక్ సర్కార్ సిద్ధమయ్యింది. చర్చల కోసం వచ్చే ప్రతినిధులకు, విలేకరులకు ‘వీసా ఆన్ అరైవల్’కింద వీసాలు ఇవ్వనున్నట్లు పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాఖ్ దార్ శుక్రవారం తెలిపారు. పాక్ మంత్రికి మునీర్ మందలింపు మానవాళికి శాపం ఇజ్రాయెల్, అదొక దయ్యం, క్యాన్సర్ అంటూ దూషించిన పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్‌ను ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తీవ్రంగా మందలించారు. ఆయనపై పెద్ద ఎత్తున కేకలు వేసినట్లు తెలిసింది. బాధ్యత లేకుండా వ్యవహరించడం ఏమిటని మండిపడినట్లు సమాచారం. ఇజ్రాయె ల్ను దూషిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టును ఖవాజా అసిఫ్ తర్వాత తొలగించారు. -
మాతో గేమ్స్ ఆడొద్దు.. ఇరాన్‌కు జేడీవాన్స్ హెచ్చరిక
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్‌కు భారీ హెచ్చరిక చేశారు. చర్చల పేరుతో అమెరికాతో ఆటలాడవద్దన్నారు. తమకు యుద్ధాన్ని ముగించే లక్ష్యం ఉందని దాన్నిసాకుగా చూపి అమెరికాను తక్కువ అంచనా వేయద్దన్నారు. ఇస్లామాబాద్ చర్చలకు బయిలుదేరే ముందు జేడీవాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. 40 రోజుల పాటు మారణ హోమం సృష్టించిన యుద్ధానికి సంబంధించిన చర్చలు ఇస్లామాబాద్‌లో జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో చర్చల నిమిత్తం జేడీవాన్స్ పాకిస్థాన్ బయిలు దేరారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీవాన్స్ మాట్లాడుతూ "చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాం, ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలకు వస్తే తాము యుద్ధాన్ని ముగించడానికి సహకరిస్తాం. కానీ తమను బురిడీ కొట్టించాలని చూస్తే మాత్రం కఠినంగా ఉంటాం" అని అన్నారు. అమెరికాను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయెుద్దని హెచ్చరించారు.కాగా వ్యక్తిగతంగా కూడా జేడీ వాన్స్‌కు ఈ చర్చలు ఒక అగ్నిపరీక్ష వంటివి 2028 అధ్యక్ష ఎన్నికల్లో వాన్స్ పోటీ చేసే అవకాశం ఉన్నందున, ఈ చర్చల ఫలితం ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకవేళ చర్చలు సఫలమైతే అది ఆయనకు పెద్ద ప్లస్ అవుతుందని, విఫలమైతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఇరాన్ కోరుతుండగా ఆ దాడులకు ఈ ఒప్పందానికి సంబంధం లేదని ట్రంప్ మరియు నెతన్యాహు వాదిస్తున్నారు. మరోవైపు, ఇరాన్ మూసివేసిన హర్ముాజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనిపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఆయిల్ ట్యాంకర్లను అనుమతించకపోవడం ఒప్పంద ఉల్లంఘనే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చర్చలలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
ఆకాశంలో హైఅలర్ట్.. ఐరన్ ఎస్కార్ట్‌తో ఇరాన్ ప్రతినిధులు
ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఇస్లామాబాద్‌పైనే ఉంది. అమెరికా- ఇరాన్ మధ్య చర్చలకు ఆ దేశం అతిథ్యం ఇస్తుండడంతో ఇప్పుడు ఆ ప్రాంతం హై సెన్సిటివ్ జోన్‌గా మారింది. ఈ నేపథ్యంలో పాక్ సైతం ఆ భేటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇరాన్ ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆధునాతన యుద్ధ విమానాలతో "ఐరన్ ఎస్కార్ట్" ఏర్పాటు చేస్తోంది.మధ్యప్రాచ్యంలో గత నలబై రోజులుగా జరిగిన మహా విధ్వంసానికి తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు (శనివారం) అమెరికా ప్రతినిధుల బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నాయకత్వం వహిస్తుండగా ఇరాన్ తరపున పాల్గొనే వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే ఇరాన్ ప్రతినిధుల బృంధం కోసం ఇదివరకే పాక్ ఆ దేశానికి అత్యాధునిక భద్రతా విమానాలను పంపినట్లు తెలుస్తోంది.అమెరికాతో చర్చలకు వస్తున్న ఇరాన్ ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన JF-17 థండర్, F-16 యుద్ధ విమానాలు, IL-78 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, C-130 రవాణా విమానాలతో పాటు పలు నిఘా విమానాలు గగనతలంలో పహారా కాస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ ఎస్కార్ట్‌ను నిపుణులు "ఐరన్ ఎస్కార్ట్" గా పిలుస్తారు. ఒకవేళ ఈ చర్చలు విజయవంతంగా పూర్తయితే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి ముఖాముఖి సమావేశం ఇదే అవుతుంది.ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ మరియు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.అయితే ఇదివరకే చర్చలు జరిగే ఇస్లామాబాద్ ప్రదేశం ఆ దేశ మిలటరీ ఆదీనంలోకి వెళ్లింది. హైలెవల్ డెలిగేషన్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలను లాక్డౌన్ చేయడమే కాకుండా గగనతలంలో వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. అయితే చర్చల నేపథ్యంలో ఇజ్రాయెల్ తీరు ఆందోళన కలుగజేస్తోంది. సీజ్ఫైర్ ఒప్పందంలో లెబనాన్‌పై దాడుల నిలిపివేత కూడా ఉందని పాకిస్థాన్, ఇరాన్ భావిస్తుండగా.. అమెరికా, ఇజ్రాయెల్ దీనిని తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. -
అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రతిష్టంభన
పశ్చిమాసియా యుద్ధం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. లెబనాన్ అంశంపై తేల్చేంత వరకు తాము చర్చలకు వెళ్లబోమని ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ మీడియా ఫార్స్ న్యూస్ అధికారికంగా ధృవీకరించింది. రెండు వారాల యుద్ధ విరమణ ప్రకటించిన ఇరు దేశాలు.. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఇందుకోసం పాకిస్తాన్ ఏర్పాట్లు కూడా చేసింది. ఉభయ పక్షాలను వేర్వేరు చోట్ల కూర్చోబెట్టి చర్చలు జరపాలని భావించింది. అయితే.. లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించబోదని చెబుతూ ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడులను ఖండిస్తున్న ఇరాన్.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము చర్చలకు ముందుకు వస్తామని మెలిక పెట్టింది. -
ఇంత అసహ్యంగా మాట్లాడతారా?.. పాక్ మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్
ఇరాన్-అమెరికా శాంతి చర్చల వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లెబనాన్ అంశం తేల్చే వరకు చర్చలు సజావుగా సాగవంటూ ఓపక్క ఇరాన్ కొత్త పాట పాడుతోంది. మరోపక్క ఈ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌పై ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బాహాటంగానే ఇరు దేశాలు తీవ్ర విమర్శలు గుప్పించుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. లెబనాన్ దాడుల విషయంలో ఇజ్రాయెల్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారాయన. ఇజ్రాయెల్ అనే దేశం క్యాన్సర్‌లాంటిదని, ప్రపంచానికి పట్టిన శాపమన్న రీతిలో వ్యాఖ్యానించారు. ‘‘ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ.. అటు లెబనాన్‌లో అమాయకుల్ని ఇజ్రాయెల్ చంపుతోంది. గాజా, ఇరాన్ తర్వాత.. లెబనాన్‌లో రక్తపాతం కొనసాగిస్తోంది. అలాంటి దేశాన్ని పుట్టించినవాళ్లు నరకంలో కాలిపోతూ చిత్రహింసలు అనుభవించాలని కోరుకుంటున్నా’’ అంటూ సోషల్ మీడియాలో ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆసిఫ్ వ్యాఖ్యలకు గట్టి కౌంటరే పడింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పందిస్తూ.. ఇజ్రాయెల్ నాశనం కోరుకుంటున్న పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలు అసహ్యకరంగా ఉన్నాయని అన్నారు. ఏ దేశం ఇలాంటి వ్యాఖ్యలను స్వాగతించబోదని.. పైగా శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశం నుంచి ఇలాంటివి ఊహించలేం అంటూ పేర్కొంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సర్ కూడా పాక్ నాయకత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ జబ్బుతో పోల్చడం అంటే.. ఒక దేశ నాశనాన్ని కోరుకోవడమేనని, ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం మంచివి కావని అన్నారు. ఇజ్రాయెల్-పాకిస్తాన్ మధ్య ఏనాడూ అధికారిక సంబంధాలు లేవు. అయితే.. ఇరాన్-అమెరికా యుద్ధంలో చైనాతో పాటు పాక్ మధ్యవర్తిత్వం వహించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ ఈ వ్యవహారంలో పాక్ పాత్ర ఏమీ ఉండకపోవచ్చని.. అసలు ఆ దేశాన్ని నమ్మడానికే వీల్లేదని ఇజ్రాయెల్ అంటోంది. గతంలో గాజా విషయంలో గల్ఫ్ దేశాల సాయం తీసుకున్న ట్రంప్.. ఇప్పుడు పాక్‌ను కూడా వాడుకుంటున్నట్లు కనిపిస్తోందని చెబుతోంది. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగాల్సిన టైంలో.. పాక్-ఇజ్రాయెల్ మధ్య దౌత్యపరంగా మాటల యుద్ధం ఎటు దారి తీస్తుందో చూడాలి. -
ఇరాన్‌కు అమెరికా మరోసారి వార్నింగ్
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా?. శాశ్వాత శాంతి స్థాపనే ధ్యేయంగా ఇరాన్-అమెరికాలు చర్చలకు ముందుకు వచ్చాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ పాటిస్తున్న ఇరు దేశాలు.. ఇస్లామాబాద్ వేదికగా చర్చలకు సిద్ధమయ్యాయి. అయితే ఈ చర్చలపై సందిగ్ధత నెలకొంది. -
మార్కెట్లు, మాల్స్ అన్నీ ప్రతిరోజు రాత్రి 8 గంటలకే క్లోజ్
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం అనేక దేశాలపై తీవ్ర ప్రభావం పడేలా చేస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఇంధన సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం తీవ్రం కావడంతో మార్కెట్లు, మాల్స్ అన్నింటినీ నేటి నుంచి (ఏప్రిల్ 7) రాత్రి 8 గంటలకే మూసివేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.యుద్ధం వల్ల పెరుగుతున్న ప్రపంచ ఇంధన ఖర్చులకు ప్రతిస్పందనగా పొదుపు చర్యల్లో భాగంగా పాక్ నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.ప్రధానమంత్రి షెహ్బాజ్ షరీఫ్ అధ్యక్షతన పెట్రోలియం ఉత్పత్తులపై జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని పీఎంవో ప్రకటన విడుదల చేసింది.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలోచిస్థాన్, ఇస్లామాబాద్, పాకిస్థాన్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్లు, నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసివేస్తారు. అయితే ఖైబర్ పఖ్తుంఖ్వాలో డివిజనల్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంతాల్లో మార్కెట్లు రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు.అలాగే.. బేకరీలు, రెస్టారెంట్లు, తందూర్ దుకాణాలు, ఆహార కేంద్రాలు, వివాహ మండపాలను రాత్రి 10 గంటలకు మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది. వ్యక్తిగత నివాసాల్లో జరిగే వివాహ కార్యక్రమాలు కూడా రాత్రి 10 గంటలలోపే ముగించాలి. మెడికల్ స్టోర్లు, ఫార్మసీలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది.పశ్చిమాసియా ఘర్షణల వల్ల సరఫరా గొలుసులు దెబ్బతినడంతో పెరుగుతున్న ప్రపంచ చమురు, ఎనర్జీ ధరలను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. -
పాక్‌లో ‘పెట్రో’ మంట: ప్రధాని మాస్టర్ ప్లాన్ ఇదే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 459 పాకిస్తానీ రూపాయలకు చేరడంతో సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెంపుతో రావల్పిండి, ఇస్లామాబాద్‌లలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తక్షణమే పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.పెట్రోల్ ధరల పెంపు ప్రభావం స్థానిక మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. రవాణా భారం పెరగడంతో కూరగాయలు, గోధుమ పిండి, మాంసం వంటి నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయి. ఆటో, రిక్షా ఛార్జీల మోతతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. స్కూల్ వ్యాన్ నిర్వాహకులు సైతం నెలవారీ ఫీజులను రూ.1,000 మేర పెంచేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రావల్పిండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఆర్సీసీఐ) అధ్యక్షుడు ఉస్మాన్ షౌకత్ మాట్లాడుతూ.. రవాణా ఖర్చులు రెట్టింపు అయ్యాయని, దీనివల్ల ఆహార, నిర్మాణ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతున్నదన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌తో సంబంధం లేకుండా, ప్రభుత్వమే లీటర్‌పై రికార్డు స్థాయిలో రూ.160.61 పన్ను విధిస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే అనవసర ఖర్చులు తగ్గించుకుని, పన్నుల భారం ప్రజలపై పడకుండా ఐఎంఎఫ్ (ఐఎంఎఫ్)తో చర్చలు జరపాలని ఆయన సూచించారు.మరోవైపు రాజకీయ పక్షాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతలు సఫ్దార్ అలీ అబ్బాసీ, నహీద్ ఖాన్ ఈ పెంపును ‘ఆర్థిక అణచివేత’గా అభివర్ణించారు. సామాన్య, కార్మిక వర్గాల జీవన ప్రమాణాలను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటున్న నేపథ్యంలో పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ ఒక ప్రకటన చేశారు. ప్రధాని ఆదేశాల మేరకు ఇస్లామాబాద్‌లో 30 రోజుల పాటు ప్రయాణికులందరికీ ఉచిత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: 345 మంది భారత మత్స్యకారులకు ఊరట -
పాక్ ఉప ప్రధానికి చేదు అనుభవం.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌కు చేదు అనుభవం ఎదురైంది. పాకిస్తాన్లో జరిగిన కీలక నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సందర్బంగా ఇషాక్ దార్ కాలు జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల మేరకు.. తాజాగా పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలలో మధ్యవర్తిగా తనను తాను నిలబెట్టుకోవడానికి ఇస్లామాబాద్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బద్ర్ అబ్దెలట్టిని ఆహ్వానించే సమయంలో కాలు జారి కింద పడిపోయారు.#Pakistan के Deputy Prime Minister और Foreign Minister #Ishaq_Dhar ज़मीन पर धड़ाम!इशाक Saudi और Egypt के विदेश मंत्रियों का स्वागत कर रहे थे कि चलते चलते अचानक गिर गए.. pic.twitter.com/0H2aNHdP6i— Ruby Arun रूबी अरुण (@arunruby08) March 29, 2026దీంతో, వెంటనే అక్కడ ఉన్న అధికారులు ఆయనను పైకిలేపేందుకు సహాయం చేశారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. సమావేశం యథావిధిగా కొనసాగినట్టు సమాచారం. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటికి కేవలం పాకిస్తాన్ నేతలకు మాత్రమే సాధ్యమని.. ఎవరూ ఇలా ప్రయత్నించవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Ishaq Dar sends his regards and slots to the Foreign Ministers of Iran and Egypt like this.It's a new style of slots of Pakistan military regime 😂Note: None should try this kind of slots it's just Pakistan military regime style 😀 😂 pic.twitter.com/QbaXf36Aea— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) March 29, 2026 -
పాక్ మునీర్‌తో ట్రంప్ ఫోన్ కాల్.. అంతలోనే షాక్
వాషింగ్టన్: ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో చర్యలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య చర్యలు జరుగుతాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీన్ని వైట్‌హౌస్ వర్గాలు ఖండించాయి. చర్యలు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.అయితే, ఇరాన్‌తో ట్రంప్ చర్యల నేపథ్యంలో పాకిస్తాన్ సైనాధికారి ఆసిమ్ మునీర్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్టు వార్తలు బయటకు వచ్చాయి. మధ్యవర్తిత్వానికి ఆయనే ఉండాలని కోరినట్టు కథనాలు పేర్కొన్నాయి. ఇదేసమయంలో అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా ఇస్లామాబాద్‌ను పాకిస్తాన్ ప్రతిపాదించినట్టు మరో వార్త కూడా బయటకు వచ్చింది. ఇది ఒక ముఖ్యమైన దౌత్యపరమైన ముందడుగు అంటూ పలు కథనాలు వెలువడ్డాయి.Pakistan army chief speaks with US President Trump about the ongoing West Asia conflict as Islamabad positions itself as a mediator: UK media report.#Pakistan #WestAsiaConflict #Iran #Israel #ITVideo | @Sriya_Kundu pic.twitter.com/VCnOzetBio— IndiaToday (@IndiaToday) March 24, 2026ఈ క్రమంలో పాక్‌లో మధ్య వర్తిత్వ చర్చల కథనాలపై వైట్‌హౌస్ స్పందించింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నెర్‌లు ఇరాన్ ప్రతినిధులతో ఇస్లామాబాద్‌లో భేటీ కానున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ కథనాలు ఊహాజనితమని కొట్టేశారు. చర్యలకు వేదికపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఎలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే తామే వెల్లడిస్తామని కుండబద్దలు కొట్టారు. దీంతో, పాక్ అనుకూల కథనాలకు తెరపడినట్టు అయ్యింది. -
పాకిస్తాన్ 30 విమానాలకు తప్పిన ప్రమాదం..
లాహోర్: పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఇరాన్ వార్‌జోన్‌లోకి ప్రవేశించకుండా గత రెండు రోజుల్లో 30 విమానాలను సురక్షితంగా దారి మళ్లించినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు.కాగా, ఇవన్నీ ప్యాసింజర్ విమానాలే. ఒకవేళ వార్‌జోన్‌లోకి ప్రవేశించి ఉంటే వాటిపై దాడి జరిగే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. బుధవారం, గురువారం ప్రతికూల వాతావరణం కారణంగా పాక్‌కు చెందిన 30 ప్యాసింజర్ విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రశించే పరిస్థితి ఏర్పడింది. లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కరాచీలోని ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ వాటిని దారి మళ్లించారు. డేంజర్ జోన్లోకి వెళ్లకుండా తప్పించారు. ఈ విమానాలు సౌదీ అరేబియా, దుబాయ్‌తోపాటు ఇతర దేశాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. -
పాకిస్తాన్ ఇమ్రాన్‌ఖాన్‌కు మరో బిగ్ షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పాకిస్తాన్లో తీవ్ర సంచలనం సృష్టించిన తోషఖానా-2 అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి న్యాయస్థానంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు వారికి.. 17 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో, ఇమ్రాన్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సౌదీ ప్రభుత్వం నుంచి ఖరీదైన బహుమతులు వచ్చాయి. అయితే, వాటిని ప్రభుత్వ ఖజానాలో జమ చేయలేదు. అనంతరం, బహుమతులను తక్కువ ధరకు అక్రమంగా సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమేనని రుజువైంది. దీంతో, తోషఖానా-2 అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ప్రత్యేక కోర్టు 17 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు.ఈ సందర్బంగా నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడినందుకు 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో 7 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. దీంతో పాటు ఇద్దరికీ చెరో రూ. 1.64 కోట్ల జరిమానా కూడా విధించారు. ఇమ్రాన్ ఖాన్ వయసు, బుష్రా బీబీ మహిళ కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కాస్త తక్కువ శిక్ష విధించినట్లు తీర్పులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ అధికారం కోల్పోయిన తర్వాత వరుస కేసులతో సతమతమవుతున్నారు. 2023 ఆగస్టు నుంచి ఆయన అడియాలా జైలులోనే ఉంటున్నారు. ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ డజన్ల కొద్దీ కేసులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటకు రావడం దాదాపు అసాధ్యమేనని పాక్ చర్చ నడుస్తోంది. -
పాకిస్తాన్లో దాడి.. ఐఎస్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో షియాలకు చెందిన మసీదులో శుక్రవారం జరిగిన భారీ ఆత్మాహుడి దాడికి తామే కారణమని ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)శనివారం ప్రకటించుకుంది. ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోగా, 169 మంది గాయపడటం తెల్సిందే. తమ బాంబర్‌ను మసీదు వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో, వారిపైకి కాల్పులు జరిపి లోపలున్న వారికి సమీపంలోకి వెళ్లి పేల్చేసుకున్నాడని తెలిపింది.ఇదే సమయంలో సిరియాలో షియా సాయుధ గ్రూపులకు పాకిస్తాన్ మానవ వనరుగా మారిందని, ఇక్కడి నుంచే రిక్రూట్లు జరుగుతున్నాయని ఆరోపించింది. అందుకే తాము పాకిస్తాన్‌లోని షియాలను లక్ష్యంగా చేసుకుంటున్నామని తెలిపింది. ఇలా ఉండగా, శుక్రవారం నాటి ఆత్మాహుతి దాడికి కీలక సూత్రధారి సహా నలుగురిని ఖైబర్ ప్రావిన్స్‌లోని పెషావర్, నౌషేరాల్లో అరెస్ట్ చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో లభ్యమైన గుర్తింపు కార్డు ఆధారంగా ఆత్మాహుతి బాంబర్‌ను పెషావర్‌కు చెందిన యాసిర్‌గా గుర్తించామన్నారు. ఇతడు ఐదు నెలలపాటు అఫ్గానిస్తాన్‌లో ఉండి ఆయుధాల వినియోగంతోపాటు ఆత్మాహుతి దాడులకు శిక్షణ తీసుకున్నాడన్నారు. -
మసీదులో ఆత్మాహుతి దాడి.. భారీగా పెరుగుతున్న మరణాలు
-
పాక్‌లో ఆత్మాహుతి దాడి
ఇస్లామాబాద్: కల్లోల పాకిస్తాన్లో మరో ఆత్మాహుతి చోటుచేసుకుంది. షియా వర్గీయులే లక్ష్యంగా జరిగిన ఈ దారుణంలో కనీసం 50 మంది దుర్మరణం పాలయ్యారు. 169 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని ఇస్లామాబాద్ శివార్లలో ఉన్న షియా మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా అత్యంత శక్తిమంతమైన పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కాళ్లూ చేతులూ తెగిపడ్డవారు, తీవ్ర గాయాలతో అల్లాడుతున్న వారికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. మృతులు, క్షతగాత్రుల బంధుమిత్రుల ఆర్తనాదాలు, రోదనలతో ఘటనా స్థలి మారుమోగిపోయింది. వారిలో తమవారు కూడా ఉన్నారేమోనని పలువురు వెదుక్కుంటుండటం కన్పించింది. ‘‘చాలామందిని ఆస్పత్రుల్లో చేరి్పంచాం. వారిలో ఎందరు బతికి బయటపడతారో చెప్పలేం’’అని పోలీసు అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పుకొచ్చారు. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 70 దాటినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి. మృతుల్లో ఇస్లామాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సోదరుడు, మరో బంధువు కూడా ఉన్నారు. ఆత్మాహుతి బాంబర్ ఒక విదేశీయుడని అనుమానిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. అతను ఫిత్నా అల్ ఖ్వరాజీ అలియాస్ తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) సభ్యుడని భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. తమ లక్ష్యం ఎప్పుడూ పాక్ సైన్యం మాత్రమేనని చెప్పుకొచి్చంది. పాకిస్తాన్ తాలిబాన్‌గా పిలిచే టీటీపీ కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పలు దాడులు చేస్తూ వస్తోంది. దాడిని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని హెహబాజ్ షరీఫ్ తదితరులు తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది పిరికిపంద చర్య. అమాయకులను లక్ష్యం చేసుకోవడం మానవత్వానికే తీరని మచ్చ’’అంటూ మండిపడ్డారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ పాక్‌లో పర్యటిస్తున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. ఇస్లామాబాద్‌లో గత ఆర్నెల్లలో ఇది రెండో ఆత్మాహుతి దాడి. గత నవంబర్‌లో ఒక వ్యక్తి ఏకంగా ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్‌లోనే కారులో తనను తాను పేల్చేసుకున్నాడు! ఆ ఘటనలో 12 మందికి పైగా మరణించారు. అంతకుముందు 2008 సెప్టెంబర్‌లో ఇస్లామాబాద్‌లోని మారియట్ హోటల్లో జరిగిన ఆత్మాహుతి దాడి 63 మందిని బలిగొంది. తొలుత కాల్పులు... ఇస్లామాబాద్‌లోని హెహజాద్ టౌన్లో తర్లాయ్ ప్రాంతంలో ఉన్న ఖదీజా అల్ కుబ్రా ఇమాంబరాలో షియా వర్గీయులు భారీ సంఖ్యలో శుక్రవారం మధ్యాహ్న వేళ ప్రార్థనల కోసం గుమిగూడారు. అదే సమయంలో ఆత్మాహుతి బాంబర్ లోనికి దూసుకొచ్చేందుకు ప్రయతి్నంచాడు. గేట్ దగ్గర గార్డులు అడ్డుకోవడంతో అక్కడికక్కడే తనను తాను పేల్చేసుకున్నట్టు పోలీసులతో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా వెల్లడించారు. దుండగుడు తొలుత కాల్పులకు తెగబడి తర్వాత పేలుడుకు పాల్పడ్డట్టు వారిని ఉటంకిస్తూ జియో న్యూస్ వార్తా సంస్థ పేర్కొంది. పేలుడు తీవ్రతకు మసీదు ప్రధాన ద్వారం కుప్పకూలడంతో పాటు సమీప భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా ఛిన్నాభిన్నమైన మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలతో రక్తంతో ఘటనాస్థలి భీతావహంగా మారింది. దాడి తమ పనేనని ఇప్పటిదాకా ఏ ఉగ్ర సంస్థా ప్రకటించుకోలేదు. పోలీసులతో పాటు సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించాయి. ఘటన నేపథ్యంలో ఇస్లామాబాద్‌లోని ఆస్పత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. పాక్ కొంతకాలంగా ఆత్మాహుతి దాడులతో అతలాకుతలమవుతోంది. స్వతంత్ర బలూచిస్తాన్ డిమాండ్‌తో ఆ ప్రావిన్స్‌లో బలూచ్తిఆన్ లిబరేషన్ ఆర్మీ నిరంతరం పాక్ సైనికులపై దాడులకు దిగుతోంది. ఆ క్రమంలో ఇటీవల జరిపిన ఆత్మాహుతి దాడుల్లో భారీ సంఖ్యలో సైనికులు మృత్యువాత పడటం తెలిసిందే. సైన్యం ప్రతీకార దాడుల్లో బలోచీ సాయుధులు కూడా వందల్లో మరణించారు. -
ఆ టైంలో మేమిద్దరం సిగ్గుతో తలదించుకునేవాళ్లం
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అన్నిచోట్లా అప్పుల కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో సొంత పౌరులే సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నా.. ఏనాడూ ఆ దేశ ప్రభుత్వం స్పందించింది లేదు. తాజాగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ విషయాన్ని అంగీకరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇస్లామాబాద్‌లో జరిగిన బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో కలిసి నేను రహస్యంగా చాలా దేశాల వద్దకు వెళ్లి అప్పులు అడిగాం. ఆ సమయంలో మాకు చాలా సిగ్గుగా అనిపించి తలలు దించుకునేవాళ్లం. రుణాలు తీసుకోవడం ఆత్మగౌరవానికి పెద్ద దెబ్బ. డబ్బులు ఇచ్చేవారు ఏం డిమాండు చేసినా సరే.. అడ్డు చెప్పలేని పరిస్థితి ఉంటుంది’ అంటూ షరీఫ్ ప్రసంగించారు. అయితే..రుణాలు ఇచ్చే విషయంలో చాలా దేశాలు పాక్‌ను నిరాశ పరచలేదని షరీఫ్ చెప్పుకొచ్చారు. పరిస్థితులతో సంబంధం లేకుండా పాక్‌కు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, చైనా.. ఇలా మిత్ర దేశాలన్నింటికీ కృతజ్ఞతలు చెప్పారాయన. అదే సమయంలో.. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడంపై షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. మిత్ర దేశాల నుంచి అప్పులు కోరడంపై పాక్ ప్రధాని నిరాశ వ్యక్తంచేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో సౌదీ ఆరేబియా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. మరిన్ని రుణాలు అడగడం తనను ఇబ్బంది పెట్టిందన్నారు. ఇదిలా ఉంటే.. పాక్‌కు ఆర్థికసాయం అందించిన దేశాల్లో మొదటి స్థానంలో చైనా ఉంది.ఇదీ చదవండి: వాళ్లంతా బిచ్చగాళ్లే.. పాక్ పరువు పోయిందిగా! -
ఇమ్రాన్ ఖాన్ కండిషన్ సీరియస్?!
క్రికెట్ దిగ్గజం, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఏమైంది? అనే అంశంపై మరోసారి తెర మీదకు వచ్చింది. అవినీతి కేసుల్లో ఆయన్ని రావల్పిండి(పంజాబ్) అడియాలా జైల్లో పెట్టి పాక్ ప్రభుత్వం.. జైల్లో ఆయన పట్ల దారుణంగా వ్యహరిస్తోందన్న విమర్శలు వెల్లవెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందంటూ తాజాగా కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. దీంతో ఖాన్ కుటుంబ సభ్యులు, పీటీఐ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబం, పీటీఐ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అడియాలా జైలులో ఖైదీగా ఉన్న ఖాన్‌కు కంటి సమస్య (Central Retinal Vein Occlusion) తలెత్తిందని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యాధికి తక్షణ చికిత్స లేకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. దీంతో కుటుంబ సభ్యులు అప్రమత్తం అయ్యారు. ఈ విషయమై తక్షణమే కోర్టులను ఆశ్రయించాలని భావిస్తున్నారు.అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో 2023 ఆగస్టులో ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి అడియాలా జైల్లోనే ఉన్నారు. అయితే.. ఆయన్ని ఒంటరిగా సెల్లో ఉంచారని.. తోటి ఖైదీలు, జైలు సిబ్బందిని ఆయనతో మాట్లాడనివ్వడం లేదని.. పైగా ఆయన ఉన్న గది, చుట్టుపక్కల పరిసరాలు కలుషితంగా ఉన్నాయని.. రోజులో కనీసం పట్టుమని పది అడుగులు కూడా వేయని స్థితిలో ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ పోస్ట్ చేశారాయన. అప్పటి నుంచి 100 రోజులకుపైగా ఆయన్ని ములాఖత్‌కు కూడా అనుమతించలేదు. దీంతో జైల్లో ఆయనకు ఏదైనా జరిగిందా? అనే చర్చా నడిచింది కూడా. చివరకు.. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో కుటుంబ సభ్యులను ఆయన్ని కలిసేందుకు అనుమతించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం కథనాలతో అడియాలా జైలు అధికారులు స్పందించారు. ఆయనకు జైల్లోనే చికిత్స అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఖాన్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది వైద్యుల సూచనకు వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. జైల్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని.. అక్కడ ప్రాథమిక చికిత్స కూడా అందడం కష్టమని.. తక్షణమే ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సిందేని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమను ఆయన్ని కలిసేందుకు అనుమతించాలని కోరుతున్నారు. అయితే ఈ విజ్ఞప్తికి జైలు అధికారులు సానుకూలంగా స్పందించలేదని సమాచారం. కోర్టు ఆదేశాలు బేతాఖరుఖాన్ చివరిసారిగా తన వ్యక్తిగత వైద్యుడిని 2024 అక్టోబరులో కలిశారు. అప్పటి నుంచి ఎలాంటి వైద్య పరీక్షలు జరగలేదని, ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడంలేదని పీటీఐ విమర్శిస్తోంది. అలాగే 2025 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై కూడా చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఇదిలా ఉంటే.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఖాన్ సోదరీమణులు అడియాలా జైలు బయట పీటీఐ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఖాన్ సోదరి నూరీన్ ఖానుమ్ మాట్లాడుతూ.. ఆయన అనారోగ్యం వార్తలు నిజమైతే మాకు ముందే సమాచారం ఇవ్వాలి కదా. మేమే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్లం కదా అని అన్నారు. మరో సోదరి అలీమా ఖానుమ్ మాట్లాడుతూ.. జైలు అధికారులు తమకుగానీ, లీగల్ టీంకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా వాళ్లిద్దరినీ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ పరిణామాలపై ప్రతిపక్ష కూటమి తహఫుజ్ ఆయిన్-ఇ-పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని షెహబాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.విచారణ ఎప్పుడంటే..ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. పీటీఐ నాయకులు ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో ములాఖత్‌ను అనుమతించాలని కోరుతున్నారు. పార్టీ చైర్మన్ బరిస్టర్ గోహర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ఖైదీని కలవడం ఒక చట్టబద్ధమైన హక్కు, ఖాన్‌తో పాటు ఆయన సతీమణి బుష్రా బీబీ ఆరోగ్యం కూడా బాగోలేదు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పీటీఐ కోరగా.. రేపు లేదంటే ఎల్లుండి విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. -
పాకిస్తాన్ ఓవరాక్షన్!.. దీనికే ఇంత చేశారంటే..
మొట్టమొదటిసారిగా 2012లో అండర్-19 ఆసియాకప్ టైటిల్ గెలిచింది పాకిస్తాన్. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి తాజాగా ట్రోఫీని ముద్దాడింది. కాగా ఆసియా కప్-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, యూఏఈ, మలేషియా జట్లతో తలపడ్డ పాక్.. భారత్ మినహా మిగతా రెండు జట్లపై గెలిచింది. తద్వారా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.ఈ క్రమంలో సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరిన పాకిస్తాన్.. టైటిల్ పోరులో దాయాది భారత్ (IND vs PAK)ను ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 347 పరుగులు చేసింది.ఓపెనర్ సమీర్ మిన్హాస్ భారీ శతకం (113 బంతుల్లో 172)తో చెలరేగగా.. అహ్మద్ హుసేన్ హాఫ్ సెంచరీ (56)తో రాణించాడు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా... హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. కీలక మ్యాచ్‌లో దారుణ వైఫల్యంఅయితే, ఈ టోర్నీ ఆసాంతం దంచికొట్టిన భారత యువ తారలు... కీలక మ్యాచ్‌లో మాత్రం విఫలమయ్యారు. ఫలితంగా భారీ లక్ష్యఛేదనలో భారత జట్టు 26.2 ఓవర్లలో కేవలం 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దీంతో 191 పరుగుల తేడాతో గెలిచిన పాక్ చాంపియన్‌గా నిలిచింది.భారత ఓపెనర్లలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 10 బంతుల్లో 26) వేగంగా ఆడే ప్రయత్నం చేయగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre- 2) దారుణంగా విఫలమయ్యాడు. ఆరోన్ జార్జ్ (16), విహాన్ మల్హోత్రా (7), వేదాంత్ త్రివేది (9), అభిజ్ఞాన్ కుందు (13) తేలిపోయారు. పదోస్థానంలో వచ్చిన దీపేశ్ 16 బంతుల్లో 36 పరుగులతో కాసేపు పోరాడాడు. అయితే, అప్పటికి పరిస్థితి చేజారి ఓటమి ఖరారైంది.పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు తీయగా... మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, హుజైఫా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ సమీర్ మన్హాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఘన స్వాగతంఇదిలా ఉంటే.. అండర-19 ఆసియా కప్ గెలిచిన పాక్ యువ జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఇస్లామాబాద్ విమానాశ్రయంలో దిగగానే జట్టును అభిమానులు చుట్టుముట్టారు. అనంతరం ఇస్లామాబాద్‌లో విక్టరీ పరేడ్ నిర్వహించారు. ప్రపంచకప్ గెలిచినంతగా సంబరాలు చేసుకున్నారు.దీనికే ఇంత చేశారంటే..ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘మీ ఓవరాక్షన్ ఆపండి.. అండర్-19 స్థాయిలో ఆసియా కప్ గెలిస్తేనే ఈ స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకుంటారా?.. ఒకవేళ మీ ప్రధాన జట్టు ప్రపంచకప్ గెలిస్తే అసలు తట్టుకుంటారా?.. దేశ ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న పేదరికం.. ఇలాంటి వాటిపై కాస్త దృష్టి పెట్టండి.. ఇలాంటి అతి ఎప్పుడూ పనికిరాదు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. చదవండి: అద్భుతమైన ఆటగాడు.. అయినా ఎందుకు వేటు?.. ఇదే సరైన నిర్ణయం!THE CRAZE OF CRICKET IN PAKISTAN😍🇵🇰Imagine what the scene would be like if the main team brought the trophy home.pic.twitter.com/7SWpww9Fxh— junaiz (@dhillow_) December 22, 2025 -
ఏఐ వెలిగించిన కిరణం!
అనగనగా ఓ చిన్నారి.. ఐస్‌క్రీమ్ కొనుక్కోవడానికి ఇంటి గడప దాటింది. అంతే.. తప్పిపోయింది. ఇంటి చిరునామా మరిచిపోయింది. దశాబ్దంన్నరకు పైగా సాగిన ఆ కన్నీటి కథకు, ఆధునిక సాంకేతికత అనూహ్యమైన ముగింపు పలికింది. దశాబ్దం క్రితం నమోదైన ఓ ‘మిస్సింగ్ గర్ల్’ ఫిర్యాదు, అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికత... వెరసి ఓ పాకిస్తానీ యువతిని 17 ఏళ్ల తర్వాత తన కుటుంబంతో తిరిగి కలిపాయి. 2008లో ఇస్లామాబాద్‌లో తప్పిపోయిన కిరణ్ అనే బాలిక.. ఇప్పుడు 27 ఏళ్ల యువతిగా ఎదిగి కన్నవారి ఒడికి చేరుకుంది.‘నేను ఏడుస్తూ ఒంటరిగా ఉన్నాను. అప్పు డు ఎవరో ఒక దయామయి నన్ను ఇస్లామాబాద్‌లోని ఎధీ సెంటర్‌కు తీసుకెళ్లినట్టు గుర్తు. అప్పట్లో నాకు ఏమీ గుర్తు లేదు’.. అని కిరణ్ గుర్తు చేసుకుంది. కొద్ది రోజుల్లోనే, మానవతామూర్తి దివంగత అబ్దుల్ సత్తార్ ఎధీ భార్య బిల్కిస్ ఎధీ.. కిరణ్‌ను కరాచీకి తీసుకెళ్లారు. అప్పటి నుండి, ఎధీ ఆశ్రయంలో.. బిల్కిస్ సంరక్షణలో కిరణ్ పెరిగింది. కిరణ్ తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఇస్లామాబాద్‌కు పలుమార్లు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఎథీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.పట్టు వదలని ‘ఎధీ’ ప్రయత్నంఎధీ ఫౌండేషన్ ప్రస్తుత చైర్పర్సన్ ఫైసల్ ఎధీ భార్య సభా ఫైసల్ ఎధీ మాట్లాడుతూ.. కిరణ్ తల్లిదండ్రులను గుర్తించడానికి ఇస్లామాబాద్‌కు ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం దక్కలేదన్నారు. ఆశలు సన్నగిల్లిన సమయంలో, ఫౌండేషన్ ఈ ఏడాది మొదట్లో పంజాబ్‌లో ’సేఫ్ సిటీ ప్రాజెక్ట్’లో పనిచేస్తున్న సైబర్ సెక్యూరిటీ నిపుణుడు నబీల్ అహ్మద్‌ను సంప్రదించింది. ‘మేము అతనికి కిరణ్ ప్రస్తుత ఫొటోలు, ఆమె బాల్యం గురించి తెలిసిన స్వల్ప సమాచారాన్ని అందజేశాం’.. అని సభా వివరించారు. కేసును సవాలుగా తీసుకున్న నబీల్, ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్లో దశాబ్దం క్రితం నమోదైన ‘మిస్సింగ్ గర్ల్’ రిపోర్ట్‌ను గుర్తించారు. ఆ రిపోర్ట్‌లోని పాత ఫొటోలు, కిరణ్ ప్రస్తుత ఫొటోలను, అత్యాధునిక ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్, ట్రాకింగ్ సాఫ్ట్వేర్ల సహాయంతో విశ్లేషించారు. పాత రూపానికి, ప్రస్తుత రూపానికి పోలికలను ఏఐ అత్యంత కచి్చతత్వంతో అందించడంతో, కిరణ్ కుటుంబాన్ని గుర్తించడం సాధ్యమైంది. నా కూతుర్ని చూస్తాననుకోలేదు టైలర్‌గా పనిచేసే అబ్దుల్ మజీద్, తానే కిరణ్ తండ్రినని ధ్రువీకరిస్తూ కరాచీకి చేరుకున్నారు. ‘కిరణ్ ఫొటోలను పత్రికల్లో వేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. నా కూతురిని చూస్తానని ఆశ వదులుకున్నాను’.. అని మజీద్ భావోద్వేగానికి లోనయ్యారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అధికారులు తనను సంప్ర దించినప్పుడు ఆ ఆనందాన్ని వరి్ణంచలేనని తెలిపారు. ‘ఇక్కడి నా కుటుంబ సభ్యులను (ఎధీ ఆశ్రయం) వదిలి వెళ్లడం బాధగా ఉన్నా, బిల్కిస్ ఆపాకు నేను ఎప్పటికీ కృతజు్ఞరాలిని’.. అని కిరణ్ సంతోషంగా వీడ్కోలు పలికింది. ఏఐ సాంకేతికత సాయంతో ఎధీ ఆశ్రయం నుండి.. తన కుటుంబానికి చేరిన అయిదో యువతి కిరణ్ కావడం విశేషం. కాలం చెరిపేసిన గతాన్ని, ఏఐ సాంకేతికత చెక్కు చెదరకుండా తిరిగి లిఖించింది... ఇది సైన్స్, సెంటిమెంట్ మేళవించిన అద్భుతం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్ పిచ్చి కూతలు.. భారత్ కౌంటర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చోటుచేసుకున్న ఆత్మహుతి దాడి వెనుక భారత్ ఉన్నదంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ దేశపు ఉన్మాద నాయకత్వం ఇలాంటి కల్పిత, తప్పుడు కథనాలను అల్లుతుందని తాము ముందే ఊహించామని వ్యాఖ్యానించింది.ఓ కోర్టు వెలుపల జరిగిన దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వాస్తవమేదో అంతర్జాతీయ సమాజానికి తెలుసునని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. తప్పుదోవ పట్టించే పాకిస్తాన్ కథనాలను ఎవరూ నమ్మరన్నారు. పాక్‌లో రాజ్యాంగ స్వరూపాన్ని మార్చి వేస్తూ మిలటరీ చేతుల్లోకి అధికారాన్ని ధారదత్తం చేస్తున్న వేళ ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలను ప్రధాని షరీఫ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పేరుతో మరో పోస్టును సృష్టించి, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు త్రివిధ దళాలపై తిరుగులేని అధికారాలను కట్టబెట్టేందుకు పార్లమెంట్ రాజ్యాంగ సవరణలకు ఆమోదించడంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలకు దిగడం తెల్సిందే.ఇదిలా ఉండగా, దాడి తర్వాత పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్.. భారత్‌ను టార్గెట్ చేసి ఆరోపణలు చేశారు. ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతి చెందడానికి భారత్ కారణమని అన్నారు. దాడిలో ఢిల్లీ పాత్ర ఉందని కూడా ఆయన ఆరోపించారు. ఈ దాడులు పాకిస్తాన్‌ను అస్థిరపరిచే లక్ష్యంతో భారత్ రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాదానికి కొనసాగింపు అంటూ కామెంట్స్ చేశారు. భారత్ మద్దతు ఉగ్రవాదులు ఇస్లామాబాద్‌లో దాడి చేసినప్పటికీ, ఆఫ్ఘన్ భూభాగం నుండి పనిచేస్తున్న అదే నెట్వర్క్ వానాలో అమాయక పిల్లలపై కూడా దాడి చేసింది. -
పాక్‌లో భారీ పేలుడు.. 12 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇవాళ (నవంబర్ 11, మంగళవారం) జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు న్యాయవాదులేనని పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆత్మాహుతి దాడిగా అధికారులు భావిస్తున్నారు.స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు జరిగింది. అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. పేలుడు తీవ్రతకు సమీపంలోని పార్క్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కిలో మీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ఈ బాంబు దాడి మధ్యాహ్నం 12.39 గంటలకు జరిగిందని తెలిపారు.కారులోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా? ఆత్మాహుతి దాడా? పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను నా కారు పార్క్ చేసి కాంప్లెక్స్‌లోకి వెళ్తుండగా.. గేటు సమీపంలో పెద్ద శబ్దం వినిపించిందని.. అక్కడ రెండు మృతదేహాలు పడి ఉన్నాయని న్యాయవాది రుస్తుమ్ మాలిక్ ఏఎఫ్‌పీ మీడియా తెలిపారు. కాగా, ఈ పేలుడు సంభవించిన కొన్ని గంటల ముందే దక్షిణ వజీరిస్థాన్‌లో పాక్ భద్రతా దళాలు ఓ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. వానాలోని కేడెట్ కాలేజీపై తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదులు దాడికి యత్నించగా.. అడ్డుకున్న భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.ఇటీవల పాకిస్తాన్–ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అక్టోబర్ 9న కాబూల్‌లో జరిగిన డ్రోన్ దాడులకు ఇస్లామాబాద్ బాధ్యత వహించిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. ఆ దాడిలో పలువురు మరణించగా, ప్రతీకార చర్యలు చేపడతామని కాబూల్ హెచ్చరించింది. అనంతరం జరిగిన సరిహద్దు ఘర్షణల్లో పలు సంఖ్యల్లో సైనికులు, పౌరులు, మిలిటెంట్లు మరణించారు. అక్టోబర్ 19న ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్లో ఎస్పీ ఆత్మహత్య.. భారత్ ఏజెంట్? ఆపరేషన్ సిందూర్‌లో సాయం?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. సీనియర్ పోలీసు అధికారి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఒక ఫోన్ కాల్ అందుకున్న కాసేపటికే ఆయన ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా మారింది. మరోవైపు.. సదరు అధికారి భారత్ ఏజెంట్ అని.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయనే భారత్‌కు సాయం చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. ఇస్లామాబాద్‌లోని ఐ-9 ప్రాంతంలో ఉన్న ఎస్పీ కార్యాలయంలో అదీల్ అక్బర్ ఎస్పీగా పని చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజులాగే విధులకు వెళ్లిన అక్బర్.. గురువారం కూడా స్టేషన్‌కు వెళ్లారు. ఇంతలో ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది మాట్లాడిన కాసేపటికే.. ఆయన ఆవేశంతో ఊగిపోతూ తన గన్‌మెన్ వద్ద నుంచి తుపాకీని లాక్కుని ఛాతీలోకి కాల్చుకున్నారు. దీంతో, షాకైన గన్‌మెన్ వెంటనే తేరుకుని.. అదీల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ ఎస్పీ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయనకు చివరగా ఫోన్ చేసింది ఎవరు, ఆయనతో ఏం మాట్లాడారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాల్ రికార్డింగ్‌లు, మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.SP City of Islamabad Police Adeel Akbar was an agent of IndiaHe shot himself today .His inputs were very helpful during Op Sindoor.Thank you Adeel bhai , you have been a great help. pic.twitter.com/XZhcZTKZmn— Akshit Singh 🇮🇳 (@IndianSinghh) October 23, 2025ఇక, అదీల్ అక్బర్ సియాల్కోట్ జిల్లాలోని కమోంకి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన గతంలో బలూచిస్థాన్‌లో కూడా సేవలు అందించారు. అయితే, ఎస్పీ అదీల్ అక్బర్ ఆత్మహత్య తర్వాత సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇస్లామాబాద్ ఎస్పీ అదీల్ అక్బర్ భారతదేశ ఏజెంట్ అని వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో అదీల్ అక్బర్.. మన సైన్యానికి ఇన్పుట్స్ ఇచ్చారని.. అవి మనకు సాయం చేశాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. -
ఎవడ్రా సామి నువ్వు.. పాక్‌ను ఇంతలా వణికిస్తున్నావ్?
అది కాబూల్‌లోని ఓ మారుమూల కొండ ప్రాంతం. ఓ టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనం నిదానంగా వెళ్తోంది. ఓ క్షిపణి రయ్‌మంటూ దూసుకొచ్చి ఆ వాహనాన్ని ఢీ కొట్టింది. ‘హమ్మయ్యా..’ అంటూ పాక్ సైన్యం సంబురాలు చేసుకుంది. కట్ చేస్తే.. ఆ మరుసటిరోజే ‘నేను అమరుడ్ని..’ అనే రేంజ్లో ఓ వ్యక్తి వాయిస్‌తో ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. అంతే పాక్ సైనికాధికారుల ముఖంలో సంతోషం పోయి.. మళ్లీ తలపట్టుకున్నారు. పాకిస్తాన్-అఫ్గనిస్తాన్ మధ్య గత 10 రోజులుగా పరస్పర దాడులతో యుద్ధ పరిస్థితులు నెలకొన్నది చూస్తున్నదే!. ఈ దరిమిలా 48 గంటల కాల్పుల విరమణతో పరిస్థితి కాస్త చల్లారినట్లే కనిపిస్తోంది. అయితే.. ఒకప్పుడు జగ్రి దోస్తులుగా ఉన్న ఈ రెండు దేశాలు దుష్మన్లుగా మారడానికి కారణం.. ఒకే ఒక్కడు. వాడి పేరు నూర్ వాలి మోహ్సూద్(Noor Wali Mehsud). పాక్‌కు కొరకరాని కొయ్యగా(వ్యక్తిగా) మారిన ఇతని గురించి ఇంటర్నెట్లో ఇప్పుడు తెగ వెతికేస్తున్నారు. నూర్ వాలి మెహ్సూద్(47).. ఒకప్పుడు తాలిబాన్ ఉద్యమంలో భాగమైన వ్యక్తి. అయితే ఆ తర్వాతి కాలంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) అనే ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తూ.. పాక్‌ను వణికిస్తున్నాడు. ఇతని నేతృత్వంలో టీటీపీ సంస్థ పాక్ గడ్డపై పలు దాడులు జరిపింది. మరీ ముఖ్యంగా సైనిక స్థావరాలు, పోలీసు ఔట్‌పోస్టులను లెక్కలేన్నంటిని నాశనం చేసింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఇతని నేతృత్వంలో జరిగిన దాడులతో పాక్‌కు తీరని నష్టమే వాటిల్లింది. అలా.. తమ దేశ భద్రతా వ్యవస్థకు నూర్ వాలి మెహ్సూద్ పెనుముప్పుగా మారడంతో పాక్ ప్రభుత్వం శాంతి చర్చలకు ఆహ్వానించింది. అయితే.. నూర్ మొండి పట్టు వల్లే ఆ చర్చలు విఫలం కావడం గమనార్హం. తాజాగా ఇతగాడి చర్యల వల్ల పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పాక్ సైన్యం.. అతను ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై క్షిపణి దాడులు చేసింది. అయితే అనూహ్యంగా నూర్ వాలి దాడి నుంచి తప్పించుకున్నాడు. అతని అనుచరులు గాయాలతోనే బయటపడినట్లు తెలుస్తోంది. తన క్షేమసమాచారాన్ని తెలియజేస్తూ ఆ మరుసటిరోజే ఆడియో క్లిప్ ఒకటి నూర్ బయటకు వదిలాడు. ఈ టీటీపీ ఏంటసలు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) పలు నిషేధిత సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన గ్రూప్. అయితే.. ఇది ఏర్పడడానికి ఒక బలమైన కారణం ఉంది. లాల్ మసీదు ఏరియా.. ఇస్లామాబాద్‌లో ఒకప్పుడు మతపరమైన కేంద్రంగా విరజిల్లేది. మౌలానాలు అబ్దుల్ అజీజ్, అబ్దుల్ రషీద్ ఘాజీ సారథ్యంలో షరియా చట్టం అమలు కోసం ఉద్యమించారు. అయితే.. ఉద్యమం మాటున ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అప్పటి సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వం ఆపరేషన్ సైలెన్స్ పేరిట చర్యకు ఉపక్రమించింది. జులై 3-11 తేదీ మధ్య ఈ దాడిలో 100 మంది మరణించగా.. 11 మంది సైనికులు, 200 మంది పౌరులు గాయపడ్డారు.మరణించిన వాళ్లంతా మిలిటెంట్లేనని ముషారఫ్ నాడు ప్రకటించారు. లాల్ మసీద్ ఘటన భావోద్వేగంగా, మతపరంగా ప్రజలను ప్రభావితం చేసింది. అయితే.. ఈ ఘటనను ఇస్లాం మీద దాడిగా భావించిన పలు గ్రూపులు.. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రతీకారంగా కలసి TTPను డిసెంబర్ 2007లో ప్రకటించాయి. దీని లక్ష్యం.. అప్పటి ముష్రాఫ్ ప్రభుత్వాన్ని కూల్చేయడం, పాకిస్తాన్లో షరియా చట్టం అమలయ్యేలా చూడడం. కాలక్రమంలో.. ఇది పాక్ సరిహద్దు ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసుకుని పాక్ భూభాగంపై తరచూ దాడులు చేస్తూ వస్తోంది.నూర్ సారథ్యం.. మరో మలుపు!2018లో అఫ్గన్ సరిహద్దులో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో టీటీపీ కీలక నేతలు ముగ్గురూ మరణించారు. దీంతో నూర్ వాలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. నూర్ వాలి మెహ్సూద్ సారథ్యంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) కొత్త పంథా ఎంచుకుంది. టీటీపీ అంటే అప్పటిదాకా పాక్ అమాయక పౌరులను బలిగొన్న కరుడుగట్టిన ఉగ్రసంస్థగా ముద్రపడిపోయింది. 2014లో ఓ పాఠశాలలో జరిపిన దాడిలో 130 మంది చిన్నారులు మరణించడం.. ఇందుకు ఓ ఉదాహరణ కూడా. అయితే మత పండితుడైన నూర్.. తన సారధ్యంలో అలాంటివి జరగకూడదని బలంగా తీర్మానించాడు. పాక్ సైన్యం అనేది ఇస్లాంకు వ్యతిరేకంగా.. 78 ఏళ్లుగా పాక్ ప్రజలను బందీఖానాలో ఉంచిందని, రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టిపోయిందని ఘాటు విమర్శలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పౌరుల జోలికి పోకూడదని.. కేవలం పాక్ ఆర్మీ, అవసరమైతేనే పోలీసులను లక్ష్యంగా చేసుకోవాలని టీటీపీ కేడర్‌కు సూచించాడు. అలా టీటీపీపై పడ్డ మచ్చను చెరిపేసే ప్రయత్నం చేశాడు నూర్. 2021లో అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ అధికారంలోకి రావడంతో.. TTPకు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం కలిగింది. ప్రత్యేకించి.. పాక్ ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు పెరిగాయి. పాక్ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే.. నూర్ వాలి ఆఫ్ఘనిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నాడని, తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వ సహకారంతోనే మరింత రెచ్చిపోతున్నాడని. అంతేకాదు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఇస్లాం మతాన్ని వక్రీకరిస్తోందని, అలాంటి సంస్థకు భారతదేశమూ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ వచ్చింది. అయితే, ఈ ఆరోపణలను న్యూఢిల్లీ ఖండించింది, తాము ఎలాంటి మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేసింది. -
ఇండియా బయటపెట్టిన సంచలన నిజం
-
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి.. పలువురు పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. దాయాది దేశం పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్లో తాజాగా ఆత్మాహుతి దాడి ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పాకిస్తాన్ పోలీసులు మృతిచెందగా.. పలువురు గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. An explosion near Ring Road, Mal Mandi in Peshawar, the capital of Khyber Pakhtunkhwa, leaves two dead and three injured. pic.twitter.com/oIwp31n0Sq— Aftab Mohmand (@AftabMohmand101) May 12, 2025 -
అవును.. మా యుద్ద విమానం ధ్వంసమైంది: పాక్ అధికారిక ప్రకటన
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. భారత ముప్పెట దాడి చేస్తూ పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ యుద్ధ విమానంపై అటాక్ చేయడంతో అది ధ్వంసమైంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.పాకిస్తాన్ సైన్యం, వైమానిక దళం, నావికాదళ సీనియర్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల భారత్ జరిపిన దాడిలో పాకిస్తాన్ యుద్ధ విమానం ధ్వంసమైందని అధికారికంగా ప్రకటించారు. భారత్ దాడులను ఎదుర్కొనే క్రమంలో ఇలా జరిగిందన్నారు. అయితే నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, భారత్-పాకిస్తాన్ మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ ప్రకటన చేయడం గమనార్హం.ఇదే సమయంలో భారత పైలట్.. పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడ్డారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చౌదరి స్పందించారు. ఇది ఫేక్ వార్త అని ఖండించారు. భారత్ పైలట్ ఎవరూ తమ ఆధీనంలో లేరని స్పష్టం చేశారు. అలాగే, భారత్ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చారు. పాక్‌ను దెబ్బకొట్టాం..మరోవైపు.. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సాధించిన విజయాలను మన సైన్యం ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్ విమానాలను నేల కూల్చామని ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి తెలిపారు. అయితే, ఆ సంఖ్య ఎంత అన్నది ఆయన చెప్పలేదు. ‘‘మన సరిహద్దు లోపలికి పాక్ యుద్ధవిమానాలను రాకుండా నిరోధించాం. కాబట్టి వాటి శకలాలు మా దగ్గర లేవు. కాకపోతే కచ్చితంగా కొన్ని విమానాలను కూల్చాం’’ అని తెలిపారు.బ్రహ్మోస్ సూపర్ పవర్..ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్నువిరిచేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో.. అప్పటి వరకూ అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్బాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకుపుట్టింది. మొత్తం పరిస్థితే మారిపోయింది. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాక్‌లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్ ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. ఇక్కడ గగనతల రీఫ్యూయలర్ ట్యాంకర్ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికే పాకిస్థాన్ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు... గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400తో మధ్యలోనే పేల్చివేసింది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్ నుంచి నలియా వరకు 26 లక్ష్యాలపైకి పాక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. -
నో పెట్రోల్, నో డిజిల్.. భారత్ దెబ్బకు పాకిస్తాన్ లో సీన్ రివర్స్
-
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు.. నివాసం నుంచి షరీఫ్ తరలింపు
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారత సైన్యం దాడితో భారీ పేలుళ్లు జరిగాయి. దాంతో ఇస్లామాబాద్‌లోని తన నివాసం నుంచి షెహబాజ్ షరీఫ్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.పాక్ రాజధాని ఇస్లామాబాద్‌పై భారత సైన్యం దాడి చేసింది. ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ డ్రోన్లు, మిస్సైల్లతో దాడికి దిగింది. పాక్ మిస్సైల్లను గాల్లోనే కూల్చి వేసిన భారత సైన్యం. జమ్మూలోని ఎయిర్‌పోర్టుపై 8 సూసైడ్ డ్రోన్లతో పాక్ దాడి చేయగా వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. జైసల్మేర్, అక్నూర్లో ఇద్దరు పాక్ పైలట్లను పట్టుకున్న భారత ఆర్మీ. మొత్తం 20కి పైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత సైన్యం. లాహోర్ , సియాల్ కోర్టులో కౌంటర్ ఎటాక్‌కు దిగిన భారత్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 14 మంది పాక్ సైనికులు హతమైనట్టు సమాచారం.S-400, L-17 సిస్టమ్‌ను యాక్టివేట్ చేసిన భారత్. జమ్మూ ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా పాక్ దాడులు. ఈ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని, పాక్ దాడులను సమర్ధవంతగా తిప్పికొట్టామని భారత ఆర్మీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులను హై అలర్ట్ చేసిన భారత్ సైన్యం. వరుస డ్రోన్ దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరి అయింది. ఇదిలా ఉండగా అమెరికా, యూకే, యూఏఈలతో టచ్‌లో భారత్. రంగంలోకి SZU-23, శిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తాజా పరినామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సమావేశం అయ్యారు. త్రివిధ దళాధిపతులు, CDSతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. రంగంలోకి భారత నౌకాధళం రంగంలోకి దిగిన భారత నౌకాధళం పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ సీ పోర్టుపై ప్రతీకార దాడి చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత నుంచి మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించింది. ఈ పోర్టులో ఏడు భారీ పేలుళ్లు, ఎగిసిపడుతున్న మంటలు. కరాచీ పోర్టులో మొత్తం 10 పాక్ కార్గో నౌకలను ద్వంసం చేసిన ఇండియన్ నేవీ. ఈ దాడుల్లో అనేక షిప్పులు ధ్వంసం అయ్యాయి. అరేబియా సముద్రంలో పాక్‌పై గురి పెట్టిన భారత నేవీ ఏకంగా 26 యుద్ధ నౌకలతో విరుచుకుపడుతూ పాక్‌ను వణికిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో రైళ్లు నిలిపివేతతాజా పరినామాలతో దేశంలో ఢిల్లీ నుంచి జమ్మూ,గుజరాత్, రాజస్థాన్ వెళ్లే రైళ్లన్నీ రద్దు చేశారు. ఢిల్లీలో హై అలర్ట్తాజా పరినామాలతో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ధ భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం. ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. భారీగా NSG కమాండర్ల మోహరింపు.మరోవైపు పాకిస్తాన్‌పై బలూచిస్తాన్ దాడిఓవైపు భారత సైన్యం, ఇండియన్ నేవీ జరుపుతున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్‌కు మరోవైపు నుంచి బలూచిస్తాన్ దాడికి దిగింది. పాక్ చమురు క్షేత్రాలపనా బలూచిల దాడులు. ఇదిలా ఉండగా పాక్‌పై భారత్ దాడులను బలూచి రేడియో హైలెట్ చేస్తోంది.పాక్ రక్షణ వ్యవస్థల కూల్చివేతపాక్లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసిన భారత్. సర్గోదా, ఫైసలాబాద్‌లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లు ప్రకటించిన భారత్. భారత్ దాడులతో దిక్కు తోచని పాక్ బలగాలు.15 భారత సైనిక స్థావరాలపై గురిన్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకోబోయి పాక్ బొక్కబోర్లా పడింది. భారత్‌లోని 15 సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఉదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడీ, ఉత్తర్లాయ్, భుజ్ సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. అందుకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను తుత్తునియలు చేసింది. గురువారం మధ్యాహ్నం పాక్‌పై ప్రతి దాడులకు దిగింది. ఇస్లామాబాద్, సియాల్కోట్, లాహోర్, రావల్పిండిలపై విరుచుకుపడింది. లాహోర్‌లోని పాక్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన హెచ్‌క్యూ–9 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్లను హర్పీ కామికాజ్ డ్రోన్లతో నేలకూల్చింది. ఈ దాడులను పాక్ కూడా ధ్రువీకరించింది. ‘‘లాహోర్ సమీపంలో ఒక డ్రోన్ నేలకూలింది. గుర్జన్‌వాలా, చాక్వాల్, బహవల్పూర్, మియానో, కరాచీ, ఛోర్, రావల్పిండి, అతోక్ ప్రాంతాల్లో మరో 12 డ్రోన్లు ధ్వంసమయ్యాయి’’ అని అంగీకరించింది. లాహోర్‌లో నలుగురు సైనికులు గాయపడ్డారని, ఒక పౌరుడు మరణించాడని చెప్పింది. ‘‘పాక్ దుశ్చర్యకు అదే స్థాయిలో బదులిచ్చాం. ఎస్–400తో పాటు ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్‌తో పాక్ క్షిపణులు, డ్రోన్లను కూల్చేశాం’’ అని సైన్యం ప్రకటించింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను నాశనం చేసినట్లు కేంద్రం పేర్కొంది. యుద్ధ వాతావరణం భారత దాడులతో లాహోర్‌లో యుద్ధ వాతావరణం కనిపించింది. వాల్టన్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సైరన్లు మోగడంతో జనం భయభ్రాంతులయ్యారని తెలిపింది. గాల్లో దట్టమైన పొగ వ్యాపించినట్లు వెల్లడించింది. యుద్ధ భయంతో పాక్‌లో సియాల్కోట్, కరాచీ, లాహోర్ సహా పలు ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. పాక్ నగరాల్లోని తమ పౌరులు తక్షణం దేశం వీడాలని, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలాలని అమెరికా సూచించింది. పీఎంఓ భేటీ జరుగుతుండగానే!ఇస్లామాబాద్‌పై భారత్ దాడుల సమయంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లతో నగరమంతా దద్దరిల్లిపోయింది. దాంతో సమీక్షను అర్ధంతరంగా నిలిపేసి ప్రధాని బృందం సురక్షిత ప్రాంతానికి తరలినట్టు సమాచారం. కాసేపటికే షహబాజ్ నివాస పరిసరాలు నేలమట్టం కావడంతో ఆయనను హుటాహుటిన పాతిక కి.మీ. దూరంలోని బంకర్లోకి తరలించినట్టు చెబుతున్నారు. పలుచోట్ల బ్లాకౌట్పాక్ దాడుల నేపథ్యంలో గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పలుచోట్ల వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, అమృత్సర్, హోషియార్పూర్, మొహాలీ, చండీగఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని జైసల్మేర్ దాకా పలు నగరాల్లో కరెంటు సరఫరా నిలిపేశారు. ఆయాచోట్ల రాత్రిపూట పలు డ్రోన్లతో పాటు పేలుడు శబ్దాలను గమనించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ప్రజలు లైట్లన్నీ ఆర్పేసి ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నాయి. -
పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
ఇస్లామాబాద్: పహల్గాం ఘటన(Pahalgam Incident)పై పాకిస్థాన్ స్వరం మార్చింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్(Khawaja Asif) చేసిన వ్యాఖ్యలను ది న్యూయార్క్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించింది.‘‘పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది. ఈ దాడిపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగినట్లు కనిపించడం లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం’’ అని అసిఫ్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.పహల్గాం దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని.. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం, నీటి ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణంగా భారత్ ఉపయోగించుకుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా, దర్యాప్తు జరపకుండానే పాక్‌ను శిక్షించాలని అడుగులు వేస్తోంది. అయితే పరిణామాలు యుద్ధానికి దారి తీయాలని మేం కోరుకోవడం లేదు. ఎందుకంటే.. యుద్ధమంటూ జరిగితే ఈ ప్రాంతమంతా నాశనం అవుతుంది కాబట్టి’’ అని అసిఫ్ వ్యాఖ్యానించారు.ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే సంస్థ లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల అనుబంధ విభాగమని, వీటికి పాక్ ప్రభుత్వ అండదండలు.. అక్కడి నిఘా వ్యవస్థల సహకారమూ ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: అవును.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం!అయితే ఈ వ్యవహారంపై ది న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో అసిఫ్ స్పందించారు. పాక్‌లో లష్కరే తోయిబా నిష్క్రియ(defunct) గా ఉందని అన్నారు. వాళ్లలో (ఉగ్రవాదులు) కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు గృహ నిర్బంధాలలో ఉన్నారు. పాక్‌లో వాళ్లకు ఇప్పుడు ఎలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి దాడులు జరిపే అవకాశమే లేదని ప్రకటించారాయన.ఇదిలా ఉంటే.. పహల్గాం దాడి వెనుక పాక్ ప్రమేయం ఉందని భారత్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే ఇస్లామాబాద్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. అంతకు ముందు.. పహల్గాం దాడి జరిగిన రోజు ఓ స్థానిక మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ దాడిలో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయిందని అన్నారాయన. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. పహల్గాం దాడిలో మమ్మల్ని(పాక్‌ను) నిందించొద్దు’’ అంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు. -
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ విధిస్తున్న దౌత్యపరమైన ఆంక్షలకు పాకిస్తాన్ అల్లలాడిపోతోంది. ఈ క్రమంలో ప్రతీకార చర్యలకు దిగింది. పాక్ గగనతలం నుంచి వెళ్లే భారత విమానాలకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. గురువారం పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. పహల్గాం దాడి తర్వాత పాక్ విషయంలో భారత్ అనుసరిస్తున్న తీరుపై సమీక్ష ఈ భేటీలో సమీక్ష జరిపారు. పాక్ పౌరుల వీసా రద్దు చేయడం, దేశం విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాలను పాక్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే.. కౌంటర్ చర్యలను ప్రకటించింది. భారత్‌లో జరిపే అన్ని వర్తకవ్యాపారాలను(మధ్యవర్తి దేశం ద్వారా జరిపే వ్యాపారలావాదేవీలను సైతం) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు తెలిపింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ సిబ్బందిని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ పౌరులకు జారీ చేసే వీసాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడం కిందకే వస్తుందని పేర్కొంది. మరోవైపు సైన్యం సెలవులను రద్దు చేసిన పాక్ ప్రభుత్వం.. భారత్ గనుక యుద్ధానికి దిగితే ప్రతిఘటనకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చింది. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భద్రతా కమిటీ భేటీలో కీలక నిర్ణయాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే పహల్గాం దాడిని ఖండించిన పాక్.. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ‘‘భారత్‌లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉంటుందని, ఇందులో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని’’ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయింది. పహల్గాం దాడిలో.. మమ్మల్ని నిందించకండి’’ అంటూ ఓ లోకల్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. -
కశ్మీర్‌ను మరిచిపోయే ప్రసక్తే లేదు: పాక్ ఆర్మీ చీఫ్
కశ్మీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(General Asim Munir) భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్, పాకిస్థాన్‌లు సిద్ధాంతాల పరంగా వేర్వేరు దేశాలేనన్న ఆయన.. కశ్మీర్‌ను ఇస్లామాబాద్‌కు గళ సిరగా అభివర్ణించారు. ఈ క్రమంలో పాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌ను మరిచిపోదని, ఏ శక్తీ దానిని పాక్ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. అలాగే దేశ విభజనకు కారణమైన రెండు దేశాల విభజనను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలూ చేశారు. పాక్ మీడియా హౌజ్ డాన్(dawn) కథనం ప్రకారం.. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన జనరల్ మునీర్ మాట్లాడారు. ఉగ్రకార్యకలాపాలతో పాక్ నిధులు రావనే భయాలు నెలకొన్నాయని.. కానీ, ఆ భయాలను తొలగించే ప్రయత్నాల్లో పాక్ సైన్యం ఉందని అన్నారు. ఉదాహరణగా.. బెలూచిస్తాన్, కశ్మీర్ అంశాలను(Kashmir Issue) ప్రస్తావించారు. పాక్‌కు బెలూచిస్తాన్ ఎంతో గర్వకారణమైంది. అలాంటి ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలను పాక్ సైన్యం సమర్థవంతంగా అణచివేసింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా పెట్టుబడులు రాకపోవచ్చనే భయాలు ఉన్నాయి. కానీ, ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును మార్చగలరా?. త్వరలో పూర్తి విజయం సాధిస్తాం. ఇంకో పది జన్మలెత్తినా ఆ ప్రాంతాన్ని మనకు ఎవరూ దూరం చేయలేరు. ఇక.. కశ్మీర్‌పై తమ ఆశ చావదన్న పాక్ ఆర్మీ చీఫ్(Pak Army Chief).. అది మాకు గళ సిర(జగ్యులర్ సిర) అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మరిచిపోలేమని, కశ్మీరీ సోదరుల వీరోచిత పోరాటాలను అంత సులువుగా వదిలిపెట్టబోమని, ఏ శక్తీ దానిని పాక్ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. పాక్ గురించి తర్వాతి తరాలకు ఎంతో చెప్పాల్సిన అవసరం ఉందన్న జనరల్ మునీర్.. మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు.. ఇలా ప్రతీ విషయంలోనూ హిందువులతో మనం(ముస్లిం) వేరనే విషయం తెలియజేయాల్సిన బాధ్యత ఉందంటూ పాక్ పౌరులకు సూచించారు. ఇదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది అని అన్నారాయన. ఏరకంగా ఈ రెండు దేశాలు ఒక్కటి కాదని.. అందుకే తమ పూర్వీకులు పాక్ కోసం పోరాడారని వ్యాఖ్యానించారు. ఇలాంటి దేశాన్ని ఎలా రక్షించుకోవాలనే దానిపైనే దృష్టిసారించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!.Ugh! I thought General Musharraf was the worst, but this COAS takes the cake. The whole bakery. General Asim Munir. pic.twitter.com/t8eVYukQqG— Smita Prakash (@smitaprakash) April 16, 2025 -
వరుస షాక్‌లు.. పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025 సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తేరలేవనుంది. తొలి మ్యాచ్‌లో రావల్పిండి వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌కు ముందు ఇస్లామాబాద్ యునైటెడ్‌కు గట్టి తగలింది. ఆస్ట్రేలియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ కారీ పీఎస్ఎల్-2025 సీజన్ నుంచి వైదొలిగాడు.దక్షిణాఫ్రికా బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ స్థానంలో ఇస్లామాబాద్ ఫ్రాంచైజీ కారీని తమ జట్టులోకి తీసుకుంది. వ్యక్తిగత కారణాల కారణంగా ఫస్ట్ హాఫ్ సీజన్ దూరంగా ఉండాలని రాస్సీ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే కారీతో ఇస్లామాబాద్ యునైటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది.ఇప్పుడు కారీ కూడా పీఎస్ఎల్ నుంచి వైదొలిగి ఇస్లామాబాద్‌కు భారీ షాకిచ్చాడు. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియా డొమాస్టిక్ మ్యాచ్‌ల షెడ్యూల్ కారణంగా పీఎస్ఎల్ పదో సీజన్ నుంచి కారీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే వాన్ డెర్ డస్సెన్ మాత్రం త్వరలోనే ఇస్లామాబాద్ జట్టులో చేరనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్ నుంచి కారీతో పాటు చాలా మంది స్టార్ క్రికెటర్లు తప్పకున్నారు. సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఎంపిక కావడంతో పీఎస్ఎల్ నుంచి వైదొలిగాడు. దీంతో అతడిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్లో ఆడకుండా ఏడాది పాటు నిషేధం విధించింది. వీరితో పాటు కివీస్ ఆటగాళ్లు మార్క్ చాప్మన్, కేన్ విలియమ్సన్, బంగ్లాదేశ్ ప్లేయర్లు నహిద్ రాణా, లిట్టన్ దాస్ కూడా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకున్నారు. పీఎస్ఎల్-2025 సీజన్లో మొత్తం 35 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 18న జరగనున్న ఫైనల్ పోరుతో ఈ ఏడాది సీజన్ ముగియనుంది. -
PAK: పీటీఐ నిరసనలు.. ట్విస్ట్ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ భార్య
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలన్న డిమాండ్ వేళ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ విడుదల డిమాండ్ చేస్తూ పార్టీ మద్దతుదారులు నిరసనలకు దిగారు.ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో, నిరసనలకు నేతృత్వం వహిస్తున్న ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ, సన్నిహితుడు.. మద్దతుదారులకు హ్యాండ్ ఇచ్చారు. నిరసనల వద్ద నుంచి వారిద్దరూ పారిపోయారు. దీంతో, నిరసనకారులు వెనుదిరిగినట్టు అక్కడి మీడియా పేర్కొంది.ఇక, ఇమ్రాన్ ను విడుదల చేయాలంటూ బుష్రా బీబీ, ఆయన సన్నిహితుడు ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం అలీ అమీన్ నేతృత్వంలోపీటీఐ మద్దతుదారులు ఆదివారం నుంచి నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో నిరసనకారులు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య ఘర్షణల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. పదుల సంఖ్యలో మద్దతుదారులు గాయపడ్డారు. మరోవైపు.. పోలీసుల కాల్పుల హెచ్చరికల నేపథ్యంలో బుష్రా బీబీ, ఖైబర్ నిరసనల నుంచి పారిపోయారు. అక్కడే ఉండి నిరసనలు కొనసాగించాలని పార్టీ మద్దతుదారులు విజ్ఞప్తి చేసినప్పటికీ వారిద్దరూ దొంగచాటుగా ట్రక్కులో పారిపోవడం గమనార్హం. ఈ క్రమంలో వారిపై పార్టీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
Pakistan: ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలు.. కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వ ఆదేశం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు. ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్’ (పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు.దేశం నలుమూలలకు చెందిన పీటీఐ కార్యకర్తలు నిరసనలు చేపడుతూ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పుతోంది. చాలా చోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతో అతని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ‘డూ ఆర్ డై’ నిరసనను నిర్వహించడానికి రాజధానికి తరలి వెళుతున్నారు.ఇప్పటికే పలువురు పీటీఐ నేతలు, కార్యకర్తలు ఇస్లామాబాద్ నగరంలోనికి ప్రవేశించారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఇస్లామాబాద్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఇక్కడ పాక్ సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించారు. ఈ రెడ్ జోన్ లోపల ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధానమంత్రి నివాసం, పార్లమెంట్, రాయబార కార్యాలయం ఉన్నాయి. ఈ రెడ్‌జోన్‌లో ఎవరైనా నిరసనకారులు కనిపిస్తే, వెంటనే వారిని కాల్చివేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ నేతలు అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలుసుకున్నారు. ఖాన్ గత సంవత్సరం నుండి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. అతనిపై 200కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్నింటిలో ఖాన్‌కు బెయిల్ లభించగా, కొన్నింటిలో ఆయన దోషిగా తేలాడు. మరికొన్నింటిపై విచారణ జరుగుతోంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా -
నాడు సుష్మా స్వరాజ్.. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్‌కు జైశంకర్
ఢిల్లీ: ఇస్లామాబాద్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ వెళ్లనున్నారు. ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాలు అక్టోబర్ 15-16 తేదీలో జరగనున్నాయి. ఈ సమావేశాలకి సంబంధించి.. పాకిస్తాన్ నుంచి ఆహ్వానం అందినట్లు భారత్ ఆగస్టు 30న ధృవీకరించింది. ఎస్సీఓ సమావేశంలో మంత్రి జైశంకర్ భేటీ అవుతారనే విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ప్రకటించారు. 2015 డిసెంబర్ అనంతరం భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2015లో ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించి భద్రతా సదస్సులో పాల్గొనేందుకు ఇస్లామాబాద్‌ను సందర్శించారామె.ఈసారి పాకిస్తాన్ అధ్యక్షతన ఎస్సీఓ ప్రభుత్వాధినేతల సమావేశాలు ఇస్లామాబాద్‌లో రెండురోజుల పాటు జరగనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశాలకు ముందుగా మంత్రివర్గ సమావేశం, ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక, మానవతా సహకారంపై దృష్టి సారించే విధంగా పలు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి.MEA Spokesperson Randhir Jaiswal confirms: "EAM Jaishankar will lead a delegation to Pakistan for the SCO summit in Islamabad on 15th and 16th October."#SJaishankar #Pakistan #Islamabad #India #SCOSummit #IndiaPakRelations pic.twitter.com/Aq5UHYYjzy— Neha Bisht (@neha_bisht12) October 4, 2024ఇక.. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అధ్యక్షులు కలిసి.. 2001లో షాంఘైలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. 2017లో భారత్, పాకిస్తాన్‌లు ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం పొందాయి. గత ఏడాది జూలైలో భారతదేశం నిర్వహించిన వర్చువల్ సమ్మిట్ ఆఫ్ గ్రూపింగ్‌లో ఇరాన్ కూడా ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం పొందింది. ఆర్థిక, భద్రతా కూటమిగా, అతిపెద్ద ట్రాన్స్-రీజినల్ అంతర్జాతీయ సంస్థలలో ఒకటిగా ఎస్సీఓ ప్రారంభమైంది. గత ఏడాది ఎస్సీఓ సమ్మిట్‌ను భారత్ వర్చువల్‌గా నిర్వహించగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.చదవండి: ‘మీరే హిందూ మతానికి అసలైన శత్రువులు’.. పవన్‌కు డీఎంకే కౌంటర్ -
Pakistan: ఇమ్రాన్ ఖాన్ పార్టీ ర్యాలీలో కాల్పులు.. పలువురు మృతి?
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్’(పీటీఐ) చేపట్టిన ర్యాలీపై కాల్పులు జరిగాయి. ఈ ర్యాలీకి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. కాల్పుల అనంతరం తొక్కిసలాట జరిగింది.ఈ పరిస్థితుల నేపధ్యంలో అధికారులు ఇస్లామాబాద్‌కి వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. ఈ సందర్భంగా పీటీఐ నేత ఫవాద్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు మృతిచెందారని తెలిపారు. పాకిస్థాన్‌లో మార్షల్ లా తరహా పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.కాగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు జరిపిన రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుండి విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ పార్టీ ఇస్లామాబాద్‌లో ర్యాలీ చేపట్టింది. కాగా ఇమ్రాన్ ఖాన్ గత 400 రోజులుగా జైలులో ఉన్నారు. తోషాఖానా కేసులో దోషిగా తేలడంతో 2023 ఆగస్టు 5న ఆయన అరెస్టయ్యారు. -
Pakistan: ఒకేసారి ఉద్యోగాలు కోల్పోయిన 700 మంది
పాకిస్తాన్‌లోని ఒక సంస్థలో పనిచేస్తున్న 700 మంది సిబ్బందికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఇస్లామాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్ మోనాల్‌ను మూసివేయడంతో దానిలో పని చేస్తున్న 700 మంది రోడ్డున పడ్డారు.డాన్ నివేదిక ప్రకారం ఇస్లామాబాద్‌లోని మార్గల్లా హిల్స్ నేషనల్ పార్క్‌లోని మోనాల్‌ను మాత్రమే కాకుండా ఇక్కడున్న అన్ని రెస్టారెంట్లను మూసివేయాలని పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణను ఉద్దేశించి 2024, జూన్ 11న సుప్రీం కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ పార్క్ చుట్టూ ఉన్న రెస్టారెంట్లను తక్షణం మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు 2024 సెప్టెంబర్ 11 నుంచి రెస్టారెంట్ మూసివేయనున్నామని మోనాల్ యాజమాన్యం తెలిపింది.ఈ హోటల్ గత రెండు దశాబ్దాలుగా ఆహర ప్రియులకు ఇష్టమైనదిగా పేరొందింది. 2006లో ప్రారంభించినప్పటి నుండి మోనాల్ నిరంతరం ఆహార ప్రియులకు సేవలు అందిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ రెస్టారెంట్లో 700 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఇస్లామాబాద్‌కు వచ్చే పర్యాటకులు ఈ రెస్టారెంట్లో ఆహారం తినేందుకు వస్తుంటారు.మోనాల్ మూసివేత ప్రకటనతో దానిలో పనిచేస్తున్న ఉద్యోగుల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఓ ఉద్యోగి స్పృహ తప్పి పడిపోయాడు. అందరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ కనిపించారు. తమ రెస్టారెంట్‌కు స్టార్ రేటింగ్ ఉందని మోనాల్ యజమాని లుక్మాన్ అలీ అఫ్జల్ తెలిపారు. -
హౌసింగ్ కుంభకోణం: పాక్ మాజీ ఐఎస్ఐ చీఫ్ అరెస్ట్
ఇస్లామాబాద్: మాజీ ఇంటర్ సర్విసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ ఫైజ్ హమీద్‌ను పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్లు సోమవారం పాక్ ఆర్మీ వెల్లడించింది. టాప్ సిటీ కేసు (హైసింగ్ స్కీమ్)లో ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరూపితం అయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనపై విచారణను చెపట్టినట్లు పాక్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ ఆర్మీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఫైజ్ హమీద్‌పై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆయనపై ఇచ్చిన అధికార దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సైన్యం ఏప్రిల్‌లో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నవంబర్ 8,2023న టాప్ సిటీ హౌసింగ్ డెవలప్మెంట్ ఓనర్ మోయీజ్ అహ్మద్ ఖాన్ పాకిస్థాన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. హమీద్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అహ్మద్ ఖాన్ 2017లో ఆరోపణలు చేశారు. ఐఎస్ఐ అధికారులు హమీద్ ఇంటిపై దాడులు చేయగా.. బంగారం, వజ్రాలు, నగదుతో సహా విలువైన వస్తువులను బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ గతంలో ఐఎస్ఐ (కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్) చిఫ్గా పనిచేశారు. తర్వాత ఆయన జూన్ 2019 నుంచి 6 అక్టోబర్ 2021 వరకు ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఫైజ్ హమీద్ ఐఎస్ఐ 24వ డైరెక్టర్ జనరల్‌గా సేవలు అందించారు. -
ఇమ్రాన్ ఖాన్ పార్టీపై నిషేధం విధిస్తాం: పాక్ మంత్రి ప్రకటన
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించనున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో పాక్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనుందని పాక్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. నమ్మదగిన ఆధారాలు లభిస్తే ఇమ్రాన్ పార్టీపై నిషేధం విధిస్తామని అత్తావుల్లా తరార్ తెలిపారు. ‘విదేశీ ఫండ్స్ కేసు, మే 9న జరిగిన అల్లర్లు, చిపర్ ఎపిసోడ్ వంటి కేసులతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు నమ్మదగిన ఆధారాలు లభిస్తే.. ఇమ్రాన్ ఖాన్ పార్టీపై బాన్ విధిస్తాం’ అని మంతి అత్తావుల్లా తరార్ తెలిపారు. -
పెళ్లి కేసులో ఇమ్రాన్‌కు ఊరట
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట. ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా పెళ్లాడారన్న కేసులో ఇమ్రాన్ (71), బుష్రా బీబీ (49) దంపతులను న్యాయస్థానం నిర్దోషులుగా తేలి్చంది. వారిపై మోపిన అభియోగాలను ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు శనివారం తోసిపుచి్చంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను కొట్టేసింది. మత ప్రబోధకురాలైన బుష్రా తన మొదటి భర్త ఖవర్ ఫరీద్ మనేకాతో 28 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుని ఇమ్రాన్‌ను పెళ్లా డారు. అయితే విడాకులకు, పునర్వివాహానికి మధ్య ముస్లిం మహిళ విధి గా పాటించాల్సిన 4 నెలల గడువు (ఇద్దత్)ను ఆమె ఉల్లంఘించిందంటూ ఫరీద్ కేసు పెట్టారు. ఈ కేసులో గత ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల ముంగిట ఇమ్రాన్ దంపతులకు ఏడేళ్ల శిక్ష పడింది. ఇమ్రాన్‌కు జైలు శిక్ష పడ్డ మూడు కేసుల్లో ఇదొకటి. తోషా ఖానా కేసులో జైలు శిక్షను కోర్టు ని లుపుదల చేయగా, సిఫర్ కేసుల్లో నిర్దోíÙగా బయటపడ్డారు. దాంతో గత ఆగస్టు నుంచీ జైల్లోనే ఉన్న ఇమ్రాన్ విడుదలవుతారని భావించారు. కానీ తాజా తీర్పు వెలువడ్డ కాసేపటికే అల్లర్ల కేసులో ఆయన అరెస్టుకు ఉగ్ర వాద వ్యతిరేక కోర్టు అనుమతినిచ్చింది. దాంతో ఆయన జైల్లోనే ఉండనున్నారు. -
ఆఖరి బంతికి సంచలనం.. పీఎస్ఎల్ ఛాంపియన్స్‌గా ఇస్లామాబాద్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 విజేతగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. కరాచీ వేదికగా జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్‌ను 2 వికెట్లతో ఓడించిన ఇస్లామాబాద్.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో హునైన్ షా ఫోర్ కొట్టి ఇస్లామాబాద్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్లో ఇస్లామాబాద్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను ముల్తాన్ కెప్టెన్ రిజ్వాన్ పేసర్ మహ్మద్ అలీకి అప్పగించాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఇమాద్ వసీం సింగిల్ తీసి నసీం షాకు స్ట్రైక్ ఇచ్చాడు. నసీం షా రెండో బంతిని ఫోర్‌గా మలిచాడు. దీంతో యూనైటడ్ విజయ సమీకరణం నాలుగు బంతుల్లో 3 పరుగులగా మారింది. మూడో బంతి నసీం సింగ్ తీసి వసీంకు మళ్లీ స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరమయ్యాయి. ఇక నాలుగో బంతికి ఇమాద్ వసీం సింగిల్ తీసి స్కోర్లను సమం చేశాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆఖరి రెండు బంతుల్లో ఒక్కపరుగు కావల్సిన సమయంలో నషీం ఔటయ్యాడు. ఐదో బంతికి రిజ్వాన్ క్యాచ్‌కు ఔటయ్యాడు. దీంతో ఇస్లామాబాద్ డగౌట్లో టెన్షన్ వాతవారణం నెలకొంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హునైన్ షా ఆఖరి బంతికి ఫోరు బాది తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ముల్తాన్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(57) హాఫ్ సెంచరీతో చెలరేగగా, ఆఖరిలో ఇఫ్తికర్ ఆహ్మద్(20 బంతుల్లో 32, 3 సిక్స్‌లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో స్పిన్నర్ ఇమాద్ వసీం 5 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఇస్లామాబాద్ ఛేదించాడు. ఇస్లామాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ మార్టిన్ గప్టిల్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా ఐదు వికెట్లతో ఇస్లామాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇమాద్ వసీం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అలాగే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డ్ షదాబ్ ఖాన్‌కు దక్కింది. Shadab Khan won at this life! 😭♥️#HBLPSLFinal I #PSL2024 I #PSLFinal pic.twitter.com/gd53bAzPpy — Rizwan Babar Army (@RizwanBabarArmy) March 18, 2024 -
వికెట్లను కాలితో తన్నాడు.. ఫలితం అనుభవించాడు?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 ప్లే ఆఫ్స్‌కు ఇస్లామాబాద్ యునైటెడ్ ఆర్హత సాధించింది. ఆదివారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇస్లామాబాద్.. తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇస్లామామాబాద్ విజయంలో మున్రో(84), ఇమాద్ వసీం(30) కీలక పాత్ర పోషించారు. నసీం షాకు బిగ్ షాక్.. ఇస్లామామాబాద్ స్టార్ పేసర్ నసీం షాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో పీఎస్ఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నసీంకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. షా లెవెల్1 అత్రికమణకు పాల్పడ్డాడని, ఈ విషయంలో మ్యాచ్ రెఫరీదే తుది నిర్ణయమని పీఎస్ఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఏం చేశాండంటే? ముల్తాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాదాబ్ ఖాన్‌ను నసీం షా అప్పగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని షా వమ్ము చేయలేదు. అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఇక్కడ వరకు అంతబాగానే ఉన్నప్పటికి ఓవర్ పూర్తి అయిన వెంటనే నసీం తన కాలితో స్టంప్స్‌ను తన్నాడు. ఈ విషయాపై అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా అతడిపై ఈ చర్యలు తీసుకున్నాడు. చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్ -
పాక్‌లో పేలుళ్లు.. 30 మంది బలి
కరాచీ: సార్వత్రిక ఎన్నికలకు పాకిస్తాన్ సిద్ధమవుతున్న వేళ బుధవారం జంట పేలుళ్లతో పాకిస్తాన్ దద్దరిల్లింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనల్లో మొత్తంగా 25 మంది మరణించారు. 42 మంది గాయపడ్డారు. పర్వతమయమైన బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని వేర్వేరు పార్టీ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఈ జంట పేలుళ్లు జరిపారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ పేలుళ్లు జరిపింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించుకోలేదు. తొలి పేలుడు పిషిన్ జిల్లాలోని స్వతంత్ర అభ్యర్థి అస్ఫాందర్ ఖాన్ కకర్ ఆఫీస్ బయట జరిగింది. ఈ పేలుడులో 20 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఒక గంట తర్వాత కిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని జమియత్ ఉలేమా ఇస్లామ్–పాకిస్తాన్ పార్టీ కార్యాలయం బయట జరిగింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల ప్రక్రియల్లో పౌరుల భాగస్వామ్యాన్ని తగ్గించేందుకే ఇలా ఉగ్రవాదులు బాంబు దాడులతో భయపెడుతున్నారని బలూచిస్తాన్ పంజ్‌ఘర్ సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్లా చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బాంబుపేలుళ్ల జరగడంతో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేశారు. బలూచిస్తాన్‌లో పెరిగిన దాడులు అఫ్గానిస్తాన్, ఇరాన్‌లతో సరిహద్దులు పంచుకుంటున్న పర్వతమయ బలూచిస్తాన్‌లో ఇటీవల బాంబు దాడులు ఎక్కువయ్యాయి. మంగళవారం సైతం 10 గ్రనేడ్ దాడులు జరిగాయి. వేర్వేరు ప్రావిన్స్‌లలోని భద్రతా పోస్ట్‌లు, ఎన్నికల ప్రచార కార్యాలయాలు, ర్యాలీలపై ఈ దాడులు జరిగాయి. ఆదివారం నుంచి లెక్కిస్తే ఈ సంఖ్య ఏకంగా 50కి చేరింది. చాన్నాళ్ల నుంచి బలూచిస్తాన్‌లో వేర్వేరువాద శక్తుల క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. సైన్యం ఏరివేత చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జనవరిలో 24 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. చదవండి: పాక్ ఎన్నికల బరిలో...ఆమె అంతంతే -
ఆర్సీబీతో బంధానికి ముగింపు.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో.. హెడ్‌కోచ్‌గా
Mike Hesson- Pakistan Super League: న్యూజిలాండ్ మాజీ హెడ్‌కోచ్ మైక్ హసన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగం కానున్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు అతడు హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బంధం తెంచుకున్న తర్వాత ఈ మేరకు కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు ఆర్సీబీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలు అందించిన మైక్ హసన్‌కు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీని వీడుతున్నందుకు బాధగా ఉందంటూ మైక్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి పూర్తిగా బయటికొచ్చిన ఈ న్యూజిలాండ్ స్టార్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటికే రెండుసార్లు టైటిల్ గెలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు. కాగా గత ఐదు సీజన్లలో ఇస్లామాబాద్ జట్టు నాలుగుసార్లూ నాకౌట్ దశకు చేరుకున్నా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో కోచ్ అజర్ మహ్మూద్పై వేటు వేసిన యాజమాన్యం ఆ స్థానాన్ని మైక్ హసన్‌తో భర్తీ చేసింది. సంతోషంగా ఉంది ఇక తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన మైక్ హసన్.. ‘‘ఇస్లామాబాద్ యునైటెడ్‌లో భాగం కావం సంతోషంగా ఉంది. ఎక్స్‌లెన్స్, ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్.. ఇలా నాలుగు E-లను ప్రధాన లక్షణాలుగా చేసుకుని ముందుకు సాగుతున్న జట్టుతో చేరడం గొప్ప విషయం. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కలిగి ఉన్న ఈ టీమ్‌తో ప్రయాణం సాగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీతో దాదాపు ఐదేళ్లు కాగా గతంలో న్యూజిలాండ్‌తో పాటు అర్జెంటీనా, కెన్యా జట్లకు మైక్ హసన్ కోచ్‌గా వ్యవహరించాడు. అదే విధంగా 2019-2023 వరకు ఆర్సీబీ డైరెక్టర్‌గా ఉన్నాడు. అతడి మార్గదర్శనంలో ఆర్సీబీ 2020- 2022 వరకు వరుసగా మూడుసార్లు ప్లే ఆఫ్స్ చేరుకుంది. కానీ టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. చదవండి: WC 2023 Semis Race: అలా అయితే న్యూజిలాండ్‌కు షాక్ తగిలినట్లే! ఇప్పటికి భారం వరణుడిపైనే! -
పాక్‌లో జోరుగా కిడ్నీల దోపిడీ.. 328 సర్జరీలు..?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమవడంతో అక్కడి వారు దొడ్డిదారిలో సంపాదన కోసం అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో మానవ అవయవాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు. ఒక బాధితుడు తమవద్దకు వచ్చి కొందరు తనను బలవంతంగా ప్రైవేట్ ట్రీట్మెంట్ చేయించుకోమని వేధించారని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూపీ మొత్తం లాగారు. పాకిస్తాన్లో ఓ అనామక డాక్టర్ గుట్టుగా నిర్వహిస్తోన్న మానవ అవయవాల స్మగ్లింగ్ గుట్టును రట్టు చేశారు పంజాబ్ ప్రావిన్స్‌లోని పోలీసులు. ధనికుల అవసరానికి తగ్గట్టుగా కిడ్నీలను సమకూర్చే క్రమంలో ఈ ముఠా వందల మందికి సర్జరీలు నిర్వహించి వారి కిడ్నీలను తొలగించారు. డాక్టర్ ఫవాద్ నేతృత్వంలో సాగుతున్న ఈ దందా గురించిన వివరాలు అక్కడి ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ బయటపెట్టారు. మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. డాక్టర్ ఫవాద్ ఇప్పటివరకు మొత్తం 328 సర్జరీలు నిర్వహించారని వీటి ద్వారా సుమారుగా 35000 యూఎస్ డాలర్లు( రూ.28.27 లక్షలు) కొల్లగొట్టారునై అన్నారు. ఈ ముఠాలో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశామని తెలిపారు. వీరిలో ఒక కారు మెకానిక్ పేషేంట్లకు అనస్థీషియా ఇవ్వడంలో సహకరించేవాడని వెల్లడించారు. ఆసుపత్రుల్లో చేరిన పేషేంట్లను లాహోర్ లేదా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి అక్కడ గుట్టుగా ఆపరేషన్లు నిర్వహించేవారని తెలిపారు. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో కిడ్నీ మార్పిడులకు సంబంధించి ఎలాంటి చట్టాలు లేనందున అక్కడ వీరు యథేచ్ఛగా సర్జరీలు చేసేవారని అన్నారు. ఈ ముఠా నిర్వహించిన సర్జరీల్లో ఇప్పటివరకు ముగ్గురు మృతిచెందినట్లు గుర్తించామని, మిగిలిన విషయాలపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు. నిందితుడు డాక్టర్ ఫవాద్ ఇదే కేసులో గతంలో ఐదు సార్లు అరెస్టయ్యారని కానీ న్యాయపరమైన లొసుగులను అడ్డంపెట్టుకుని బయటకు వచ్చేవారని అన్నారు. ఆశ్చర్యకరంగా సర్జరీలు జరిగిన చాలామందికి తమ కిడ్నీని తొలగించిన విషయం కూడా తెలియదు. ఈ ముఠాసభ్యుల్లో ఒకరు తనవద్దకు వచ్చి ప్రైవేటు ట్రీట్మెంట్ కోసం బలవంత పెట్టారని.. ఇప్పుడు వేరొక డాక్టర్ వద్దకు వెళ్తే తనకు ఒక కిడ్నీలేదని చెప్పారని ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చదవండి: 2023 Nobel Prize: కోవిడ్–19 టీకా పరిశోధనలకు నోబెల్ -
మీరు వద్దనుకుంటే పాకిస్తాన్‌కు ఇండియా పేరు పెట్టుకుంటాం
న్యూఢిల్లీ: రెండురోజులుగా ఇండియా పేరుని భారత్‌గా మార్చే విషయమై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంటే సోషల్ మీడియాలో మరో వార్త దావానలంలా వ్యాపించింది. ఒకవేళ భారతదేశం ఇండియా అనే పేరుని ఐక్యరాజ్యసమితి సమక్షంలో అధికారికంగా వదులుకుంటే పాకిస్తాన్ ఆ పేరుని చేజిక్కించుకోవాలని అనుకుంటోందట. ఇదిలా ఉండగా దేశం పేరు మార్పుపై కేంద్రం నుంచైతే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆహ్వానంతో మొదలైంది.. భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి భావం నుంచి అతిధులకు చేరిన ప్రత్యేక డిన్నర్ ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించింది కేంద్రం. ఈ నేపథ్యంలో సౌత్ ఏషియా ఇండెక్స్ అనే ఒక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి ప్రత్యక్షమైంది. మాకే హక్కుంది.. ఒకవేళ భారతదేశం ఇండియా అనే పేరుని ఐక్యరాజ్యసమితి సమక్షంలో మార్చుకుని భారత్ అని నామకరణం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తే పాకిస్తాన్ దేశం తమ దేశానికి ఇండియా అని పేరు పెట్టుకోవచ్చని స్థానిక మీడియా తెలిపినట్లు రాశారు. చాలాకాలంగా పాకిస్తాన్ జాతీయవాదులు ఇండియా అనేది సింధు ప్రాంతాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ పేరు మీద తమకే ఎక్కువ హక్కులు ఉన్నాయని చెబుతూ వస్తోంది. అక్కడ ఊరే లేదు.. ఇక ఈ పోస్టుపై సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ ఇండియా పేరు పెట్టుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పేరు పెట్టుకుంటుంది. అపుడు రష్యా ఆఫ్ఘనిస్తాన్ పేరును పెట్టుకోవచ్చంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారొక యూజర్. మరో వ్యక్తి అయితే పెరు మారినా పాకిస్తాన్ తలరాత మాత్రం మారదులే అని రాశారు. ఇక భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే ఈ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. అక్కడ గ్రామమే లేదు అంతలోనే దాన్ని దోచుకోవడానికి దొంగలు తయారయ్యారని రాశారు. Just IN:— Pakistan may lay claim on name "India" if India derecongnises it officially at UN level. - local media — Nationalists in Pakistan have long argued that Pakistan has rights on the name as it refers to Indus region in 🇵🇰. — South Asia Index (@SouthAsiaIndex) September 5, 2023 Gaaon basa nahin aur …. https://t.co/g5Zfe4GUHV — Virender Sehwag (@virendersehwag) September 5, 2023 ఇది కూడా చదవండి: అమెరికాలో అసలేం జరుగుతుంది?బాంబుల్లా పేలుతున్న పుచ్చకాయలు -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరటనిచ్చింది ఇస్లామాబాద్ హైకోర్టు. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ళ జైలు శిక్షను నిలిపివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. తోషఖానా అవినీతి కేసులో ట్రయల్ కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి అమిర్ ఫరూఖ్, న్యాయమూర్తి తరీఖ్ మహమూద్ జహంగిరిలతో కూడిన డివిజన్ బెంచ్ తోషఖానా కేసులో ఉత్కంఠతకు తెరదించుతూ సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌కు విధించిన మూడేళ్ళ జైలుశిక్షను నిలిపివేసింది. 2018 నుండి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై దేశ సంపదను అక్రమంగా అమ్ముకున్నారన్న నేరంపై పంజాబ్ ప్రావిన్స్‌లోని అటక్ జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఇదే కేసులో మరో ఐదేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా వీల్లేదని తెలుపుతూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆ తీర్పును నిలిపివేయడంతో ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం లభించినట్లయింది. ఇది కూడా చదవండి: అమెరికా పర్యటనలో కేటీఆర్...క్రిటికల్ రివర్ కంపెనీతో భేటీ -
Chandrayaan -3: ప్రత్యక్ష ప్రసారం చేయండి.. పాక్ మాజీ మంత్రి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి చంద్రయాన్-3 ప్రయోగం చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపే దృశ్యాలను పాకిస్తాన్లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని అక్కడి మీడియాను కోరారు. శభాష్ ఇండియా.. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి చంద్రయాన్-3 ప్రయోగం అద్భుతమని కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన భారతీయ శాస్త్రవేత్తలను, అంతరిక్ష సంఘాన్ని అభినందించి చంద్రయాన్-3 మనుష్యజాతి చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఫవాద్ చౌదరి తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో అరుదైన ఘనతను సాధించనున్న భారతదేశాన్ని, భారత శాస్త్రవేత్తలను అభినందిస్తూనే చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపే అద్భుత దృశ్యాలను పాకిస్తాన్ మీడియా ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని కోరారు. Pak media should show #Chandrayan moon landing live tomorrow at 6:15 PM… historic moment for Human kind specially for the people, scientists and Space community of India…. Many Congratulations — Ch Fawad Hussain (@fawadchaudhry) August 22, 2023 నాడు విమర్శించిన వారే.. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత భారత దేశాన్ని, భారత శాస్త్రవేత్తలను ఎగతాళి చేసిన వారిలో ఫవాద్ చౌదరి కూడా ఉన్నారు. అనవసరంగా డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు. ఆ డబ్బులను పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగించాలని హితవు కూడా పలికారు. కానీ నేడు ప్రపంచ అగ్ర దేశాలకు సైతం సాధ్యంకాని అరుదైన ఘనతను భారతదేశం సాధిస్తుండతమ్.. విమర్శకులకు కూడా కళ్ళు తెరిపించింది. విమర్శకుల ప్రశంస కంటే గొప్ప గెలుపు మరొకటుండదు అనడానికి ఇదే నిదర్శనం. Dear Endia; instead of wasting money on insane missions as of Chandrayyan or sending idiots like #abhinandan for tea to across LoC concentrate on poverty within, your approach on #Kashmir ll be another Chandrayyan just price tag ll be far bigger. — Ch Fawad Hussain (@fawadchaudhry) September 7, 2019 Surprised on Indian trolls reaction, they are abusing me as I was the one who failed their moon mission, bhai hum ne kaha tha 900 crore lagao in nalaiqoon per? Ab sabr kero aur sonah ki koshish kero #IndiaFailed — Ch Fawad Hussain (@fawadchaudhry) September 6, 2019 ప్రపంచ దేశాలు సైతం.. చంద్రుడిపై అడుగుపెట్టాలన్న భారత ఉక్కుసంకల్పానికి చంద్రయాన్-3 ఒక తార్కాణం. చంద్రయాన్-2 వైఫల్యం తర్వాత భారత దేశం పట్టువిడవకుండా వెనువెంటనే చంద్రయాన్-3కి శ్రీకారం చుట్టింది. మధ్యలో కోవిడ్ -19 కారణంగా కొంత కాలయాపన జరిగినా చివరకు ఈరోజు ఆ అపురూప ఘట్టాన్ని సాక్షాత్కరించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు చంద్రయాన్-3 ఘనవిజయాన్ని చూడాలని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది కూడా చదవండి: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. ఎయిర్‌పోర్టులు మూసివేత -
భార్య పాకిస్తాన్ కేంద్ర మంత్రి.. భర్త తీవ్రవాది
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాతకాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అన్వర్-ఉల్-హాక్ కకర్ తాత్కాలికంగా కేబినెట్ విస్తరించారు. కేబినెట్లో తీవ్రవాది యాసిన్ మాలిక్ సతీమణి మిశాల్ హుస్సేన్ మాలిక్ కు కూడా చోటు కల్పించడం పాకిస్తాన్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో షెబాజ్ షరీఫ్ తమ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అనంతరం ఆగస్టు 15న అన్వర్-ఉల్-హాక్ కకర్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన నియమించిన కొత్త కేబినెట్ మంత్రుల జాబితాలో మానవ వనరుల శాఖ మంత్రిగా మిశాల్ హుస్సేన్ మాలిక్ ను నియమించినట్లు తెలిపారు. మిశాల్ భర్త జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్ తీవ్రవాదులకు నిధులను సమకూర్చిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నెరసుడిగా నిర్ధారించగా కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. ప్రస్తుతం యాసిన్ మాలిక్ శిక్షను అనుభవిస్తున్నాడు. మిశాల్ హుస్సేన్ మాలిక్ తోపాటు ఆర్ధిక మంత్రిగా మాజీ సెంట్రల్ బ్యాంకు చీఫ్ షంషాద్ అఖ్తర్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా సర్ఫరాజ్ బుగాటి నియమితులయ్యారు. వీరితోపాటు మొత్తం 16 మంది మంత్రులతో కూడిన పాకిస్తాన్ కేబినెట్ తో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో జలీల్ అబ్బాస్ జిలానీ, లెఫ్టినెంట్ జనరల్ (ఆర్) అన్వర్ అలీ హైదర్, ముర్తజా సోలంగి సమీ సయీద్, షాహిద్ అష్రఫ్ తరార్, అహ్మద్ ఇర్ఫాన్ అస్లాం, ముహమ్మద్ అలీ, గోహర్ ఎజాజ్, ఉమర్ సైఫ్, నదీమ్ జాన్, ఖలీల్ జార్జ్, అనీఖ్ అహ్మద్, జమాల్ షా, మదాద్ అలీ సింధీ ఉన్నారు. పాక్ తాత్కాలిక ప్రధానికి ముఖ్య సలహాదారులుగా ఎయిర్ మార్షల్(ఆర్) ఫర్హాట్ హుస్సేన్ ఖాన్, ఆహద్ ఖాన్ చీమా, వకార్ మసూద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేశారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ మఫ్టీ సోదరి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మఫ్టీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబైయా సయీద్ 1989, డిసెంబరు 8న కిడ్నాప్ కు గురవ్వగా ఆ కేసులో యాసిన్ మాలిక్ ను నిందితుడిగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే యాసిన్ మాలిక్ స్థాపించిన జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ను 2019లో అధికారికంగా నిషేధించింది పాకిస్తాన్. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులోని భారతీయ అభ్యర్థికి ఎలాన్ మస్క్ ప్రశంస -
స్వాతంత్య్ర వేడుకల్లో హడావుడి అంతా వాళ్లదే
ఇస్లామాబాద్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రేమికులు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తూ సరిహద్దులు దాటి మరీ ఏకమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండు దేశాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్తాన్ ప్రియురాలు సీమా హైదర్ 'భారత్ జిందాబాద్' అంటూ ఇక్కడ జెండా ఎగురవేస్తే భారత ప్రియురాలు అంజు మాత్రం 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినదిస్తూ అక్కడ జెండా ఎగురవేసింది. పంద్రాగస్టు వచ్చిందంటే భారత దేశమంతటా పండగ వాతావరణం నెలకొంటుంది. 77 ఏళ్ల క్రితం ఎందరో మహానుభావుల ప్రాణత్యాగానికి దక్కిన ప్రతిఫలం స్వాతంత్య్రం. భారత దేశం తోపాటు పాకిస్తాన్ కూడా ఇదేరోజున స్వాతంత్య్రం జరుపుకుంటోంది. ఇక్కడలాగే అక్కడ కూడా వారి జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్య్రం వచ్చినా కూడా ఎవరికి వారు విడివిడిగా జరుపుకుంటూ ఉంటారు. ఆక్కడి వారు ఇక్కడి పతాకాన్ని ఎగరవేయడం కానీ ఇక్కడి వారు అక్కడి పతాకాన్ని కానీ ఎగరెయ్యడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. सीमा हैदर ने सचिन के साथ 15 अगस्त का झंडा लहराया अपने भारत में Visit- https://t.co/EY7ZMmpcrW#SeemaHaider #SachinSeema #IndependenceDay #indep #Newsclick pic.twitter.com/1cD3y0Uf5O — Newsfordays (@Newsforday65988) August 14, 2023 కానీ అలాంటి అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టారు దేశాంతర ప్రేమికులు సీమా హైదర్, అంజు. నేపాల్ మీదుగా భారత్‌లో అడుగుపెట్టిన సీమా హైదర్ భారతదేశ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని జెండా ఎగరవేయగా వాఘా బోర్డర్ మీదుగా దాయాది దేశం చేరుకున్న అంజు మాత్రం పాకిస్తాన్లో వారి జాతీయ జెండాను ఆవిష్కరించి కేకును కూడా కట్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. अंजू ने मनाया पाकिस्तान की आजादी का जश्न, नसरुल्लाह के साथ काटा केक#anjunasrullah #AnjuNasrullahLoveStory pic.twitter.com/M7of9FScJN — India TV (@indiatvnews) August 14, 2023 ఇది కూడా చదవండి: స్వాతంత్య్ర వేళ పాకిస్తాన్‌కు ఘోర అవమానం -
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అసెంబ్లీని రద్దు చేసే ముందు ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రతిపక్ష నాయకుడు రజా రియాజ్ తో ఈరోజు సమావేశం కానున్నారు. వీరిద్దరూ కలిసి ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దు తర్వాత పాక్ ఆపద్ధర్మ ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తారు. ఆగస్టు 11న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దు విషయాన్ని రాష్ట్రపతి అరిఫ్ అల్వి దృష్టికి తీసుకెళ్తూ ఆయనకు లేఖ రాయనున్నారు ప్రస్తుత ప్రధాని షెబాజ్ షరీఫ్. అంతకు ముందే అసెంబ్లీ రద్దయిన తర్వాత ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించడానికి, ఎన్నికలు నిర్వహించడానికి తాత్కాలిక ప్రధానిని నియమించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఇందులో భాగంగా ఆయన ప్రతిపక్ష నేత రజా రియాజ్ తో ఈరోజు చర్చించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే షెబాజ్ షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తారు. తాత్కాలిక ప్రధాని రేసులో ఉన్నవారిలో మాజీ ఆర్ధిక శాఖ మంత్రి హఫీజ్ షేక్, నవాజ్ షరీఫ్ వద్ద ఆర్ధిక కార్యదర్శిగా పనిచేసిన తరీక్ బజ్వా, 2018లో తాతకాలిక ప్రధానిగా పని చేసిన మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ, పాకిస్తాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి తస్సాదక్ హుస్సేన్ జిలాని, మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాకేబుల్ బఖీర్, నవాజ్ షరీఫ్ వ్యక్తిగత సహాయకుడు ఫవాద్ హాసన్ ఫవాద్, మాజీ విదేశాంగ శాఖమంత్రి హుస్సేన్ హరూన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. డిసెంబరులో పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల ఏర్పాటుకు కొంత సమయం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో అసెంబ్లీని రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం. ప్రభుత్వం రద్దైన మరుక్షణమే పాకిస్తాన్ ఎలక్షన్ కమీషన్ రంగంలోకి దిగి తదుపరి ప్రభుత్వ ఎన్నిక కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. పూర్తి పదవీకాలం పూర్తైన తర్వాత అయితే ఎన్నికలు 60 రోజుల్లోనే నిర్వహిచాల్సి ఉంటుంది. అలా కాకుండా ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే మాత్రం పాక్షితం ఎన్నికల కమిషన్ కు 90 రోజుల గడువు ఉంటుంది. ఈలోపే వారు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: 27 ఏళ్ల తర్వాత థాయ్ యువరాజు రీఎంట్రీ.. అందు కోసమేనా? -
పాకిస్తాన్లో దారుణం.. తండ్రిని చంపినట్టే కుమారుడిని కూడా..
ఇస్లామాబాద్: సోమవారం అర్ధరాత్రి బలూచిస్తాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ల్యాండ్‌మైన్ పేల్చారు దుండగులు. ఈ పేలుడులో యూనియన్ కౌన్సిల్ (యుసి) ఛైర్మన్‌తో సహా కనీసం ఏడుగురు మరణించారని అధికారులు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న బల్గతార్ యుసి ఛైర్మన్ ఇష్తియాక్ యాకూబ్ తోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న ఇతరులను లక్ష్యంగా చేసుకుని దుండగులు రిమోట్ సాయంతో పేల్చడానికి ల్యాండ్‌మైన్ అమర్చారని పంజ్గూర్ డిప్యూటీ కమిషనర్ అమ్జద్ సోమ్రో తెలిపారు. వాహనం బల్గతార్ ప్రాంతంలోని చకర్ బజార్ వద్దకు రాగానే దుండగులు రిమోట్ సాయంతో వాహనాన్ని పేల్చివేశారని ఫలితంగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతుల్లో మహ్మద్ యాకూబ్, ఇబ్రహీం, వాజిద్, ఫిదా హుస్సేన్, సర్ఫరాజ్, హైదర్ ఉన్నట్లు వీరంతా బల్గతార్, పంజ్గూర్ ప్రాంతానికి చెందినవారని అన్నారు. ఈ ప్రమాదం జరిగిన చోటే 2014లో ఇష్తియాక్ యాకూబ్ తండ్రి యాకుబ్ బల్గాత్రి తోపాటు అతని పదిమంది అనుచరులను కూడా ఇదే తరహాలో బాంబుదాడిలో హత్య చేయబడ్డారు. ఆనాటి ఆ దాడికి సూత్రధారులం తామేనంటూ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(BLF) అప్పుడే ప్రకటించింది. తాజాగా జరిగిన సంఘటనకు కూడా వారే బాధ్యులై ఉంటారని అధికారులు భయపడుతున్నారు. ఇది కూడా చదవండి: ఇటలీ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి -
పాకిస్తాన్ వధువు, భారత వరుడు.. మరో జంట కథ
జోధ్‌పూర్: భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధం మరింత బలపడింది. ఇప్పటికే సీమా హైదర్-సచిన్ మీనా, అంజు-నస్రుల్లా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి తమ ప్రేమను గెలిపించుకోగా తాజాగా అమీనా-అర్బాజ్ ఖాన్ కూడా ఒక్కటై ఈ లిస్టులో చేరిపోయారు. అయితే వీరు సాహసాలకు తెరతీయకుండా పెద్దలను ఒప్పించి ఆన్లైన్లో వివాహం చేసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అమీనాకు భారత్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అర్బాజ్ ఖాన్‌కు వర్చువల్‌గా వివాహం జరిగింది. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన సంబంధమని పాకిస్థాన్‌లో ఉన్న తమ బంధువులు ఈ సంబంధాన్ని మాట్లాడి కుదిర్చినట్లు చెప్పారు అర్బాజ్ ఖాన్. వాస్తవానికి వివాహం భారత్‌లోనే జరగాలి కానీ అమీనాకు వీసా దొరకకపోవడం వలన ఎవరి దేశాల్లో వారు ఉండిపోయామని. అయినప్పటికీ తమ నిఖా సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలోనే జరిగినట్లు అర్బాజ్ ఖాన్ తెలిపాడు. భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేనందునే ఈ విధంగా ఆన్లైన్లో వివాహం చేసుకోవాల్సి వచ్చిందని అమీనాకు వీసా వచ్చిన తర్వాత ఇండియాలో మళ్ళీ వివాహం చేసుకుంటానని చెప్పారు అర్బాజ్. నిఖా మాత్రమే కాదు వివాహానికి సంబంధించిన అన్ని సంప్రదాయాలను దగ్గరుండి జరిపించారు కుటుంబ సభ్యులు. అర్బాజ్ చెప్పినట్లు పాకిస్తాన్ భారతదేశం మధ్య సంబంధాలు సరిగ్గా లేవన్నది ఒకప్పటి మాట. ఈ జంటల కథలను చూస్తే సంబంధాలు మెరుగవుతున్నట్టే కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: హర్యానా అల్లర్లు: నాలుగోరోజుకు చేరిన బుల్డోజర్ విధ్వంస ప్రక్రియ -
ఫాతిమాగా మారిన అంజు... ఇల్లు కట్టుకోవడానికి స్థలం, డబ్బు..
ఇస్లామాబాద్: ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ప్రేమికుడు నస్రుల్లాను కలుసుకునేందుకు పాకిస్తాన్ వెళ్ళిపోయినా భారత మహిళా అంజు అక్కడి సంప్రదాయాలను అలవాటు హెసుకునే క్రమంలో ఫాతిమాగా మారింది. దీంతో అక్కడి వ్యాపారవేత్త మహమ్మద్ ఖాన్ అబ్బాసీ ఆమెపై కానుకల వర్షాన్ని కురిపించారు. ఇల్లు కట్టుకోవడానికి స్థలంతోపాటు నగదును కూడా కానుకగా ఇచ్చారు. రాజస్థాన్ కు చెందిన అంజు(34) పాకిస్తాన్ కు చెందిన నస్రుల్లా(29) ఒకరినొకరు సోషల్ మీడియాలో ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ప్రేమికుడిని కలుసుకునేందుకు అంజు సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ వెళ్లి కథను సుఖాంతం చేసుకుంది. ఒకపక్క ఆమె భర్త ఆమె వివాహం చెల్లదని చెబుతున్నా కూడా ఆమె మాత్రం తన సంప్రదాయాలను మార్చుకుని అక్కడ ఒదిగిపోయే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఆమె అంజు నుండి ఫాతిమాగా మారింది. ఇదిలా ఉండగా ఆమె తెగువకు ఫిదా అయిపోయిన అక్కడి వ్యాపారవేత్త పాక్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ ఖాన్ అబ్బాసీ ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి 272 చదరపు గజాల స్థలాన్ని, రూ.50000 నగదును కూడా కానుకగా ఇచ్చారు. ఈ సందర్బంగా అబ్బాసీ మాట్లాడుతూ.. కొత్త ప్రదేశానికి వచ్చినవారికి ఆశ్రయం ఏర్పరచుకోవడం కొంత కష్టంగానే ఉంటుంది. అందుకే నేను మా గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ తో చర్చించి ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని, నగదును ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అబ్బాసీ అదేవిధంగా సహచర వ్యాపారవేత్తలు, ప్రభుత్వం కూడా వారికి చేయూతనివ్వాలని కోరారు. తమ దేశానికి కొత్తగా వచ్చిన ఫాతిమాకు పాకిస్తాన్ తన సొంత ఇల్లేనన్న భావన కల్పించాలని కోరారు. Anju received 10 Marla housing land,cheque of 50K, & other Gifts, given by Islamabad Based businessman & CEO of Pak Star Group of Companies Mohsin Khan Abbasi. CEO PSG said that, #Anju has converted to Islam and married Nasrullah,so we are welcoming her. #AnjuNasrullahLoveStory pic.twitter.com/22j5CWM9LC — Ghulam Abbas Shah (@ghulamabbasshah) July 29, 2023 ఇది కూడా చదవండి: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. మాస్కో విమానాశ్రయం మూసివేత -
ఎంతకాలం అడుక్కుంటాం.. ముందు చేతిలో చిప్ప విసిరేయాలి
ఇస్లామాబాద్: అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ దేశ ఆర్ధిక పరిస్థితి ఎప్పటికి కుదుటపడుతుందో తెలీయని అనిశ్చితిలో దొరికిన చోట దొరికినంత అప్పు చేస్తోంది. తాజాగా తన మిత్ర దేశమైన చైనా దగ్గర మరికొంత ఋణం తీసుకునేందుకు అంతా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు సయ్యద్ అసీం మునీర్ స్పందిస్తూ మన చేతిలో ఉన్న చిప్పను అవతలకు విసిరేసి స్వాభిమానంతో బ్రతకడం అలవాటు చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గత కొంతకాలముగా ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క ఉన్న ఆస్తులను అమ్ముకోవడంతో పాటు మరోపక్క రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయాణంలో భాగంగా ఇటీవలే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) దగ్గర కొంత ఋణం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ మిత్రదేశం చైనా దగ్గర మరికొంత రుణాన్ని పొందనుంది. చైనాకు పాకిస్తాన్ ఇప్పటికే 2.07 బిలియన్ డాలర్ల రుణపడి ఉండగా తాజాగా తీసుకోనున్న మరో 600 మిలియన్ డాలర్ల రుణంతో కలిపి ఆ మొత్తం 2.44 బిలియన్ డాలర్లకు చేరనుంది. దీంతో విపరీతంగా పెరుగుతున్న అప్పుల భారం దృష్ట్యా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్ స్పందించారు. పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ బలపడేంత వరకు సైన్యం నిద్రపోకుండా పనిచేస్తుందని, అపార ప్రతిభావంతులను, ఉత్సాహవంతులైన వారిని చూసి పాకిస్తాన్ గర్విస్తోందని అన్నారు. ఎంతకాలం ఇలా పొరుగుదేశాల దగ్గర చిప్ప పట్టుకుని తిరుగుతాం. ముందు చేతిలోని ఆ చిప్పను విసిరేయాలి. రుణాల కోసం ఇతర దేశాల మీద మీద ఆధారపడటం మానేయాలి. సొంత కాళ్ళ మీద నిలబడి ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రయత్నించాలని అన్నారు. ఇది కూడా చదవండి: అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం -
పబ్జీ ప్రేమకథ: వాడెలా నచ్చాడు తల్లీ.. వాడిలో ఏముంది?
గ్రేటర్ నోయిడా: పబ్జీలో పరిచయమైన వ్యక్తిని కలుసుకోవాలన్న ఆలోచనలో ముందు వెనుక చూడకుండా నలుగురు పిల్లలతో సహా ఇండియాలో ల్యాండ్ అయిపొయింది పాకిస్తాన్ వీర ప్రేమికురాలు సీమా గులామ్ హైదర్. అన్ని అడ్డంకులను జయించి ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంతా సిద్ధం చేసే పనిలో పడింది. ఇదే క్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాస్తూ తనకు భారత పౌరసత్వం ఇప్పించమని కోరిన విషయం తెలిసిందే. మరోపక్క ఆమెకు తీవ్రవాద ముఠాలతో ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు యూపీ యాంటీ టెర్రరిస్టు పోలీసులు. ఇదిలా ఉండగా గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనా ఇంటిలో కొత్త కాపురాన్ని మొదలు పెట్టిన సీమా హైదర్ పై చుట్టుపక్కల వారు చిరుబుర్రుమంటున్నారు. ఓ మీడియా సంస్థ వీరిద్దరినీ పలకరించేందుకు వెళ్లి అక్కడ గుమికూడిన స్థానికులను కూడా కొన్ని ప్రశ్నలు అడగ్గా... అందులోని ఒకామె.. పాకిస్తాన్ మహిళను వెంటనే ఆమె దేశం పంపించాలి.. లేదంటే ఇటువంటి వారి వలన ఇక్కడివారి మనసుల్లో కొత్త ఆలోచనలు పుడతాయి. పాకిస్తాన్ నుంచి కోడళ్లను తెచ్చుకోవాలన్న కోరిక పుట్టినా పుడుతుందని అంది. అసలు నీకు వాడేలా నచ్చాడు తల్లీ.. వాడొక బద్ధకస్తుడు.. చూడటానికి కూడా చాలా సన్నగా పుల్లల ఉంటాడని ఎద్దేవా చేసింది. ఆ మహిళ వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. Seema haider ke Indian padosi 🤣 pic.twitter.com/0mFyZm54aW — SwatKat💃 (@swatic12) July 19, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్‌లో బయటపడుతున్న దారుణాలు.. రోజుకొకటి.. -
ఒకరు వచ్చారు.. ఇంకొకరు వెళ్లారు.. భారత్-పాకిస్తాన్ ప్రేమకథలు..
ఇస్లామాబాద్: మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరమంటూ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి ప్రయత్నంలో ఉన్నారు ఇరుదేశాల ప్రేమికులు. పాకిస్తాన్ నుంచి ఒక మహిళ పబ్జీ పరిచయంతో తాను ప్రేమించిన యువకుడి కోసం భారతదేశం వచ్చినట్టే భారత దేశం నుండి కూడా ఒక మహిళ లెక్క సరిచేస్తూ ప్రేమించిన యువకుడి కోసం ఇటు నుండి పాకిస్తాన్‌కు ప్రయాణమైంది. కాకపొతే పాకిస్తానీ మహిళ సీమా హైదర్ లా కాకుండా అన్ని డాక్యుమెంట్లు పక్కాగా సిద్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం వెళ్ళింది భారత మహిళ. ఒక పధ్ధతి.. ఒక ప్లానింగ్.. యూపీలోని కైలార్ గ్రామంలో పుట్టి పెరిగి రాజస్థాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో నివాసముంటున్న అంజు(34)కు పాకిస్తాన్ యువకుడు నస్రుల్లా(29)తో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. కొద్దిరోజులకి ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఎలాగైనా ప్రియుడిని కలవాలనుకుంది. అనుకుందే తడవు సాహసం చేసి సరిహద్దు దాటేసి డిర్ జిల్లాలోని పక్తుంక్వా చేరుకుని నస్రుల్లాను కలుసుకుంది. విషయం తెలుసుకున్న డిర్ పోలీసులు వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకుని సీనియర్ పోలీసు అధికారి ముస్తాక్ ఖాబ్ ఆధ్వర్యంలో అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు. అంతా సక్రమంగా ఉందని తెలిసిన తర్వాతే వారిని విడిచిపెట్టారు. జైపూర్ వెళ్తున్నట్లు చెప్పి.. రాజస్థాన్ పోలీసులకు ఈ సమాచారమందడంతో వారు భివాడిలోని అంజు ఇంటికి వెళ్ళి ఆరా తీశారు. విచారణ సమయంలో అంజు భర్త అరవింద్ మాట్లాడుతూ.. మాకు 2007లో పెళ్లి జరగగా 15 ఏళ్ల పాప, 6 ఏళ్ల బాబు ఉన్నారని తెలిపారు. నా భార్యకు సోషల్ మీడియాలో పరిచయాలున్నాయని నాకు తెలియదు. గురువారం తాను స్నేహితురాలిని కలిసేందుకు జైపూర్ వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిందని తర్వాత తన చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా లాహోర్ వెళ్లిన విషయం తెలిసిందన్నారు. ఎలాగైనా నా భార్యకు నచ్చజెప్పి తనను తిరిగి తీసుకొస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అరవింద్. అంతా సేమ్ టు సేమ్.. ఇటీవల పబ్జీలో పరిచయాన్ని ప్రేమగా మలచుకుని భారత్ వచ్చిన మహిళ సీమా హైదర్- సచిన్ మీనాల ప్రేమకి అంజు-నస్రుల్లా ప్రేమకి కొన్ని సారూప్యతలున్నాయి. ఇద్దరూ పెళ్ళై పిల్లలున్నవారే.. ఇద్దరి ప్రేమలకూ సోషల్ మీడియానే వేదిక.. పొందికగా పొరుగు దేశాల వారినే ప్రేమించారు. కాకపొతే సీమా హైదర్ చట్టవిరుద్ధంగా భారత దేశంలో అడుగుపెట్టగా అంజు మాత్రం పూర్తి చట్టబద్ధంగా పాకిస్తాన్ వెళ్ళింది. అదొక్కటే వ్యత్యాసం. ఇది కూడా చదవండి: కూతురు అబార్షన్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది! -
దయనీయంగా పాక్ పరిస్థితి.. బాంబు పేల్చిన ఐఎంఎఫ్, ఇప్పట్లో కష్టమే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి దయనీయంగా మారుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఆర్ధిక స్థితిగతులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) 120 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుతానికైతే పాకిస్తాన్ అప్పులతో ఏదో ఒక విధంగా నెట్టుకొస్తుంది కానీ భవిష్యత్తులో వారికి మరిన్ని కష్టాలు తప్పవని తేటతెల్లం చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ దేశం ఎక్కడెక్కడో ఉన్న వారి ఆస్తులను అమ్ముకుని నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇదే క్రమంలో వాషింగ్టన్ లోని వారి ఎంబసీ భవనాన్ని అమ్మకానికి పెట్టింది. అలాగే కరాచీ, లాహోర్ విమానాశ్రయాలను కూడా లీజుకు ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది. ఇస్లామాబాద్ విమానాశ్రయాన్నైతే ఇప్పటికే అవుట్సోర్సింగ్ కు ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఐఎంఎఫ్ ను ఆర్థిక సహాయం కోరిన విషయం తెలిసిందే. ఐఎంఎఫ్ కొంత నిధులను సమకూర్చినా కూడా పాకిస్తాన్ వారి ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడాలంటే మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది ఐఎంఎఫ్. పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ తోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ తోనూ ఆర్థిక ద్రవ్య విధానాలపై వారు చేసిన ఒప్పందం ఆధారంగా నివేదిక తయారుచేశామని ఐఎంఎఫ్ ఈ నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ప్రస్తుత అంతర్గత విధానాలు, దీర్ఘకాలిక చెల్లింపులు దృష్ట్యా వెలుపల నుండి సహకారం అందిస్తున్నవారు మరికొంత కాలం పాక్ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరముందని తెలిపింది ఐఎంఎఫ్. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ ఈ సంక్షోభం నుండి గట్టెక్కడం కష్టమని నివేదికలో చెప్పకనే చెప్పింది. మరోపక్క పెరుగుతోన్న నిత్యావసర వస్తువుల ధరలకు తాళలేక పాక్ ప్రజలు విలవిలలాడుతున్నారు. వీటితోపాటు ఇటీవలే యూనిట్ పై ఐదు పాకిస్తాన్ రూపాయల విద్యుత్ చార్జీలు, గ్యాస్ చార్జీలు 40% కూడా పెరగడంతో దిక్కుతోచని స్థితిలో జనం కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కూడా చదవండి: బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు.. -
పాకిస్తాన్ లో హిందూ దేవాలయంపై దాడి.. పబ్జీ లవ్ స్టోరీనే కారణమా?
ఇస్లామాబాద్: శనివారం తెల్లవారు జామున సింధ్ ప్రాంతంలోని 150 ఏళ్ల నాటి "మరి మాతా" హిందూ దేవాలయాన్ని కూల్చిన 24 గంటలు గడవక ముందే మరో ఆలయంపై పాకిస్తానీ దుండగులు రాకెట్ లాంచర్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. సింధ్ ప్రావిన్సులో కొందరు దుండగులు హిందువులు నివసించే కాష్మోర్ ప్రాంతంలో అక్కడి హిందూ సమాజం నిర్మించుకున్న దేవాలయం పైనా చుట్టుపక్కల ఉన్న హిందువుల ఇళ్ల మీదా రాకెట్ లాంఛర్లతో విచక్షణారహితంగా దాడులు చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి దుండగులు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని కాష్మోర్-కందకోట్ ఎస్.ఎస్.పీ ఇర్ఫాన్ సమ్మో తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో స్థానిక హిందూ సమాజానికి రక్షణ కల్పిస్తామని ఈ సందర్బంగా సమ్మో అభయమిచ్చారు. ఈ దేవాలయంలో బాగ్రి సమాజానికి చెందిన వారంతా ఏడాదికి ఒకసారి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటామని, ఆలయంపై ఈ విధంగా దాడి చేయడం పిరికి చర్య అని అన్నారు బాగ్రి సమాజానికి చెందిన డాక్టర్ సురేష్. దుండగులు ఫైర్ చేసిన చాలా రాకెట్ లాంచర్లు జనావాసాల వద్ద పడ్డాయని కానీ అవి పేలకపోవవడంతో ప్రాణనష్టం జరగలేదని లేకుంటే మరింత విధ్వంసం జరిగి ఉండేదని ఆయన తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ పబ్జీలో పరిచయమైన భారతీయ యువకుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయినందుకు ప్రతీకారంగా కాష్మోర్-ఘోట్కీ నదీతీరాన ఉండే కొంతమంది ఆగంతకులు గతంలో హెచ్చరించారు. బహుశా ఇది వారి చర్యే అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇది కూడా చదవండి: బంపరాఫర్.. అద్దెకు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లభ్యం.. -
Pakistan Crisis : ఆర్ధిక సంక్షోభంతో ఆస్తులను అమ్ముకుంటున్న పాకిస్తాన్..
వాషింగ్టన్: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. చాలాకాలంగా బకాయిపడ్డ ఉద్యోగుల వేతనాలు, భారీగా పెరిగిన అప్పులు తీర్చేందుకు వేరే మార్గం లేక వాషింగ్టన్ లోని పాకిస్తాన్ ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలోని అమ్మకానికి పెట్టిన ఎంబసీ 7.1 మిలియన్ డాలర్లకు అమ్ముకుంది. వాషింగ్టన్‌లోని పాకిస్తాన్ చారిత్రాత్మక భవనమైన ఎంబసీ 2003 నుంచి ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉన్న కారణంగా 2018లో దౌత్య హోదాను కూడా కోల్పోయిన ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్‌కు చెందిన ఓ రియాల్టీ సంస్థతో సహా పలు సంస్థలు పోటీపడగా చివరకు పాకిస్తాన్ కు చెందిన వ్యాపారవేత్త హఫీజ్ ఖాన్ దీన్ని 7.1 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు. పాకిస్థాన్‌కు వాషింగ్టన్లో రెండు చోట్ల ఎంబసీ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్ స్ట్రీట్‌లో ఉన్న ఈ భవనాన్ని1956లో కొనుగోలు చేశారు. 2000 వరకు అందులో కార్యకలాపాలు సాగాయి. క్రమేపీ అందులో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఈ భవనాన్ని దుర్భర స్థితిలో ఉన్న ఆస్తుల లెక్కలో చేర్చడంతో దీని అంచనా విలువపై టాక్స్ కూడా భారీగా పెరిగింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు గతేడాది బిడ్ లను ఆహ్వానించింది పాకిస్తాన్ ప్రభుత్వం. తర్వాత భవనం తరగతిని మార్చిన పాకిస్తాన్ అధికారిక వర్గం ఎటువంటి వివరణ ఇవ్వకుండానే బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసింది. ఒకపుడు క్లాస్ -2 హోదాలో ఉన్న ఈ భవనం తర్వాత క్లాస్-3 కి ఇప్పుడు క్లాస్-4 స్థాయికి పడిపోయింది. ఇది కూడా చదవండి: పార్లమెంటు సాక్షిగా ప్రజాప్రతినిధుల కుమ్ములాట -
విపత్తు దిశగా పాక్.. పిరికిపందల్లా పారిపోను: ఇమ్రాన్ ఖాన్
లాహోర్: పాకిస్తాన్లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని పీటీఐ(తెహ్రీక్ ఎ ఇన్సాఫ్) అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు. గతంలో మాదిరి మిగతా రాజకీయ నేతల్లా తాను దేశం విడిచి వెళ్లనని, చివరిశ్వాస వరకు ఇదే గడ్డ మీద ఉంటానని గురువారం తన సందేశంలో పేర్కొన్నారు. పాకిస్థాన్ విపత్తు దిశగా వెళ్తోందన్న ఇమ్రాన్ ఖాన్.. తూర్పు పాకిస్తాన్ మాదిరి దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తన పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ వాతావరణం తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. తాను ఆర్మీని విమర్శించానంటే తన పిల్లలను మందలించినట్లుగా భావించాలన్నారు. పాక్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లేది లేదని, చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటానన్నారు. ఇక్కడి నుండి పరారై లండన్ లో ఉన్న నవాజ్ షరీఫ్ వంటి నేతలు ఈ దేశ రాజ్యాంగం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు. దేశంలో వ్యవస్థలు, పాక్ ఆర్మీకి వస్తోన్న చెడ్డపేరు గురించి వారికి ఆలోచన ఉందా? అని నిలదీశారు. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ నివాసాన్ని చుట్టుముట్టిన పారామిలిటరీ దళాలు, పోలీస్ బలగాలు.. ఏ క్షణంలోనైనా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ సుప్రీం కోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టులు ఇమ్రాన్ ఖాన్‌కు ఇచ్చిన ఊరట ఆదేశాలను సైతం పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోపక్క పాక్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. పీటీఐ కార్యకర్తల ఆగడాలను భరించేది లేదని ఆర్మీ ఛీప్ ప్రకటించారు కూడా. -
Imran Khan: కస్టడీకి ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: అవినీతి సంబంధిత కేసుల్లో పీటీఐ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కస్టడీ విధించింది ప్రత్యేక న్యాయస్థానం. అయితే దర్యాప్తు సంస్థ ది నేషనల్ అకౌంటబిలిటీ(NAB) పదిరోజుల కస్టడీకి కోరగా.. కోర్టు మాత్రం ఎనిమిది రోజులకు మాత్రమే అనుమతించింది. ఓ (Al-Qadir Trust Case) కేసులో విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన ఆయన్ని .. సైన్యం సాయంతో దర్యాప్తు సంస్థ మంగళవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన్ని రాత్రికి రాత్రి అజ్ఞాతంలోకి తరలించారు. అయితే ఇవాళ కోర్టు(National Accountability Bureau Court)లో ఆయన్ని హాజరు పర్చగా.. అవినీతి సంబంధిత కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు ప్రశ్నించేందుకు కస్టడీ కోరింది ఎన్ఏబీ. కానీ, కోర్టు మాత్రం 8 రోజులకు అనుమతి ఇచ్చింది. అయితే రాత్రికి రాత్రే తనకు నరకం చూపించారంటూ ఆరోపణలకు దిగారు ఇమ్రాన్ ఖాన్. కనీసం వాష్‌రూం కూడా వినియోగించుకోనివ్వకుండా తనను టార్చర్ చేశారంటూ కోర్టులో బోరుమన్నాడు ఇమ్రాన్ ఖాన్. అంతేకాదు.. నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించడానికి తనకు ఇంజెక్షన్ ఇచ్చారని ఆరోపించారాయన.మే 17వ తేదీన ఈ కేసులో తదుపరి వాదనలు విననుంది కోర్టు. An accountability court sends former PM Imran Khan on 8-day physical remand to the National Accountability Bureau in Al-Qadir Trust case, reports Pakistan media. — ANI (@ANI) May 10, 2023 మరోవైపు పీటీఐ కార్యకర్తలు పాక్‌ను అగ్గిగుండంగా మార్చేశారు. ఒకవైపు ఇస్లామాబాద్‌లో గుమిగూడాలని పిలుపు ఇస్తూనే.. మరోవైపు ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. దీంతో పీటీఐ ముఖ్యనేతలను సైతం అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇక పెషావర్ ఆందోళనల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బంద్‌కు పిలుపు ఇచ్చింది పీటీఐ. ఇదీ చదవండి: ఖాన్ అరెస్ట్‌పై ఆందోళన -
పాక్ సైన్యం ఆగడం
రాజకీయంగా తానే పెంచి పోషించి ప్రధానిగా చేసిన ఇమ్రాన్‌ఖాన్ తనపైనే తిరుగుబాటు చేయడాన్ని జీర్ణించుకోలేక నిరుడు ఏప్రిల్‌లో పదవీభ్రష్టుణ్ణి చేసిన సైన్యం చివరకు మంగళవారం ఆయన్ను అరెస్టు చేసి పగ చల్లార్చుకుంది. అధికారం పోగానే అవినీతి, ఉగ్రవాదం, మత దూషణ, హత్య, హింసాకాండను ప్రోత్సహించటం వంటి 140 ఆరోపణల్లో చిక్కుకుని వీలుదొరికినప్పుడల్లా తమపై విరుచుకుపడుతున్న ఇమ్రాన్‌పై సైన్యం ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. అదును కోసం ఎదురుచూస్తోంది. కొన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకుని ఒక అవినీతి ఆరోపణ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరైన ఇమ్రాన్‌ను ఆ కోర్టు ప్రాంగణంలోని గది తలుపులు బద్దలుకొట్టి పారామిలిటరీ బలగాలు తీసుకుపోగలిగాయంటే సైన్యం ఎంత బరితెగించిందో అర్థమవుతుంది. ‘ఇది చట్టవిరుద్ధం కాదా? ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతపైనా, న్యాయస్థానంపైనా దాడి కాదా?’ అంటూ ఇస్లామా బాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆమర్ ఫరూక్ ఆక్రోశించటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. జనరల్ ముషార్రఫ్ ఏలుబడిలో దానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడిన న్యాయవ్యవస్థ ఇప్పుడు జస్టిస్ ఫరూక్ ఆక్రోశాన్ని వింటుందా, సైన్యంతో తలపడటానికి సిద్ధపడుతుందా అన్నది చూడాలి. నిరుడు నవంబర్‌లో జరిగిన హత్యాయత్నం నుంచి ఇమ్రాన్ క్షేమంగా బయటపడగా అప్పటినుంచీ పాక్ సైన్యం తనను చంపడానికి కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. తన అరెస్టుకు ముందు ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని పాక్ సైన్యం హెచ్చరించిన కొన్ని గంటలకే ఇమ్రాన్ అరెస్టయిన తీరు చూస్తే ఆ దేశం ఇంకా ఆటవిక న్యాయంలోనే బతుకీడుస్తోందని తెలుస్తుంది. అధికారంలో ఉన్నవారిని కూలదోయటం, నచ్చినవారిని అందలం ఎక్కించటం సైన్యానికి కొత్త గాదు. అలాగే తమ బద్ధ శత్రువులుగా మారినవారిని అంతమొందించేందుకు కూడా వెనకాడదు. ఇందుకు మాజీ ప్రధానులు జుల్ఫికర్ అలీ భుట్టో, ఆయన కుమార్తె బేనజీర్ భుట్టో ఉదాహరణలు. భుట్టోను ఒక హత్యకేసులో ఇరికించి విచారణ తంతు నడిపించి ‘చట్టబద్ధంగా’ ఉరితీస్తే, బేనజీర్‌ను ఎన్నికల ర్యాలీలో ఉండగా కాల్చిచంపారు. పాకిస్తాన్ ఏర్పడ్డాక దాదాపు పదేళ్లు ఏదోమేరకు సవ్యంగానే గడిచింది. కానీ ఎన్నికైన ప్రభుత్వంపై 1958లో తొలిసారి అప్పటి సైనిక దళాల చీఫ్ జనరల్ అయూబ్ ఖాన్ తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఆ తర్వాత జనరల్ యాహ్యాఖాన్, జనరల్ జియావుల్ హక్, జనరల్ పర్వేజ్ ముషార్రఫ్‌లు ఆ తోవనే పోయారు. మధ్య మధ్య పౌర ప్రభుత్వాలు ఏర్పడినా అవన్నీ అల్పాయుష్షు సర్కారులే. బేనజీర్ భుట్టో మూడు దఫాలు ప్రధానిగా చేసినా ఎప్పుడూ పూర్తి కాలం కొనసాగలేకపోయారు. ఆమాటకొస్తే నవాజ్ షరీఫ్ ఎంతోకొంత నయం. ఆయన తొలిసారి ప్రధాని అయిన కొంతకాలానికే ముషార్రఫ్ సైనిక తిరుగు బాటు జరిపి ప్రభుత్వాన్ని కూలదోశారు. చివరకు అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరగటంతో 2008లో ఎన్నికలు నిర్వహించక తప్పలేదు. అప్పటినుంచీ సైన్యం పంథా మార్చుకుంది. అందువల్లే ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అయిదేళ్లూ నిరాటంకంగా పాలించింది. అనంతరం 2013 ఎన్నికల్లో నెగ్గిన నవాజ్ షరీఫ్ సైతం పూర్తికాలం అధికారంలో కొనసాగారు. అలాగని ఆయన నిర్భయంగా పాలించారనడానికి లేదు. సైన్యం నీడలోనే పాలన సాగింది. భారత్‌తో చెలిమికి ఆయన ప్రయత్నించినప్పుడల్లా చొరబాటుదార్లను మన దేశంలో ప్రవేశ పెట్టి విధ్వంసాలకు దిగటం, అధీనరేఖ వద్ద కాల్పులు జరపటం సైన్యానికి పరిపాటయింది. జనంలో అంతగా పలుకుబడిలేని ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ)కు అండదండలందించి 2018 ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి దోహదపడింది. ఆ ఎన్నికల్లో సైన్యం జరిపిన రిగ్గింగ్ వల్లే అదంతా సాధ్యమైందని ఆరోపణలొచ్చాయి. కానీ మూడేళ్లు గడిచేసరికే ఇద్దరికీ చెడింది. నిరుడు ఏప్రిల్‌లో తెరవెనక తతంగం నడిపి విపక్షాలను ఏకంచేసి ఇమ్రాన్‌పై జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గేలా చేసి ఆయన్ను పదవి నుంచి దించగలిగింది. సైన్యం సాగించిన దౌష్ట్యాన్ని సామాజిక మాధ్యమాల్లో, కొన్ని చానెళ్లలో చూసిన పాక్ భగ్గుమంటోంది. పలు నగరాలు, పట్టణాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. లాహోర్‌లోని సైనిక కోర్ కమాండర్ నివాసంపై ఆందోళనకారులు దాడి చేయగా, అనేకచోట్ల విధ్వంసం చోటుచేసుకుంది. సైనిక తిరుగుబాటులో అధికారం చేజిక్కించుకుని, బూటకపు ఎన్నికల్లో దేశాధ్యక్షుడైన జియా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి మతోన్మాదాన్ని ప్రోత్సహించిన నాటినుంచీ పాక్‌లో మతానిది పైచేయి అయింది. ఆ తర్వాత అధికారంలోకొచ్చినవారు సైతం ఆ బాటనే పోతున్నారు. మరోపక్క దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఐఎంఎఫ్ నుంచి రావాల్సిన 650 కోట్ల డాలర్ల రుణం గత నవంబర్‌నుంచి పెండింగ్‌లో పడింది. వచ్చే నెలలో అది మురిగిపోతుంది. ఇక విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పాక్ వద్ద 445 కోట్ల డాలర్లు మించి లేవు. ఆ మొత్తం మహా అయితే ఒక నెల దిగు మతులకు సరిపోతుంది. ఈ సంక్షోభాన్ని అధిగమించడ మెలాగో తెలియక ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ అయోమయంలో కూరుకుపోగా, సైన్యం ఇమ్రాన్ జోలికిపోయి చేజేతులా మంట రాజేసింది. తాజా పరిణామాల పర్యవసానంగా అది సైనిక పాలనలోకి జారుకున్నా ఆశ్చర్యం లేదు. మన పొరుగు నున్న దేశం కనుక మనం అత్యంత అప్రమత్తంగా ఉండకతప్పదు. -
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్...ఇస్లామాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
-
కారు అద్దాలు బద్దలు కొట్టి, కాలర్ పట్టుకొని లాక్కెళ్లి.. ఇమ్రాన్ అరెస్టు
ఇస్లామాబాద్/లాహోర్: అధికారంలో ఉన్నప్పుడు భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్(70)ను పారామిలటరీ రేంజర్లు మంగళవారం అరెస్టు చేశారు. ఇదే కేసులో ఇస్లామాబాద్ హైకోర్టులో విచారణకు హాజరైన ఆయనను న్యాయస్థానం ఎదుటే అదుపులోకి తీసుకున్నారు. తనను హత్య చేసేందుకు పాకిస్తాన్ సైన్యం కుట్ర పన్నుతోందంటూ ఆరోపించిన మరుసటి రోజే ఇమ్రాన్‌ను అరెస్టు చేయడం గమనార్హం. కోర్టుకు హాజరయ్యేందుకు ఆయన లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. కోర్టులో ప్రవేశించేందుకు తన వాహనంలో కూర్చొని బయోమెట్రిక్ ప్రక్రియ నిర్వహిస్తుండగా పారామిలటరీ రేంజర్లు రంగప్రవేశం చేశారు. వాహనం గ్లాస్ డోర్‌ను పగులగొట్టి, ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ భద్రతా సిబ్బందిని, లాయర్లను రేంజర్లు దారుణంగా కొట్టారని పీటీఐ సీనియర్ నేత షిరీన్ మజారీ ఆరోపించారు. ఇమ్రాన్ పట్ల రేంజర్లు అనుచితంగా ప్రవర్తించినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వా రా వెల్లడయ్యింది. కాలర్ పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లి, జైలు వ్యాన్‌లోకి విసిరేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 1న అరెస్టు వారెంట్ ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీకి చెందిన అల్–ఖదీర్ ట్రస్టుకు బాహ్రియా పట్టణంలో రూ.53 కోట్ల విలువైన భూమిని బదిలీ చేసిన కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసినట్లు ఇస్లామాబాద్ పోలీసులు ప్రకటించారు. మంగళవారం ఉదయమే అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆయనను నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(ఎన్ఏబీ)కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇమ్రాన్ అరెస్టు వారెంట్‌ను ఈ నెల 1న జారీ చేసినట్లు దానిపై ఉన్న తేదీని బట్టి తెలుస్తోంది. అవినీతి వ్యవహారాల్లో ఆయన నిందితుడని అందులో పేర్కొన్నారు. అరెస్టు తర్వాత ఇమ్రాన్‌ను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా ట్విట్టర్లో వెల్లడించారు. ఇమ్రాన్‌ను హింసించారంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాలేదని, అందుకే ఎన్ఏబీ ఆ యనను అదుపులోకి తీసుకుందని తెలియజేశారు. ఇమ్రాన్ వాహనం అద్దాలు పగులగొట్టి ఆయనను అదుపులోకి తీసుకుంటున్న పారామిలటరీ రేంజర్లు. అనంతరం బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కిస్తున్న దృశ్యం Imran Khan’s lawyer badly injured inside the premises of IHC. Black day for our democracy and country. pic.twitter.com/iQ8xWsXln7 — PTI (@PTIofficial) May 9, 2023 140కి పైగా కేసులు ఇమ్రాన్ అరెస్టు పట్ల పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రాంగణంలోనే లాయర్లపై రేంజర్లు దాడి చేశారని, దేశంలో అరాచకం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. కస్టడీలో ఉన్న ఇమ్రాన్‌ను దారుణంగా హింసిస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఇమ్రాన్ పదవి కోల్పోయారు. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అవినీతి, ఉగ్రవాదం, దైవదూషణ, హత్య, హింసకు ప్రేరేపించడం వంటి ఆరోపణల కింద ఇమ్రాన్‌పై 140కిపైగా కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ అరెస్టు నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జైలుకు వెళ్లడానికి సిద్ధం: ఇమ్రాన్ ఇమ్రాన్ అరెస్టయిన తర్వాత.. ముందుగా రికార్డు చేసిన ఓ వీడియోను పీటీఐ విడుదల చేసింది. ‘‘నా మాటలు మీకు చేరుకునేలోపు ఎలాంటి ఆధారాల్లేని కేసులో నన్ను అరెస్టు చేస్తారు. పాకిస్తాన్లో ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యానికి సమాధి కట్టినట్లు దీనిద్వారా తేటతెల్లమవుతుంది. అవినీతికి పాల్పడినట్లు నేను అంగీకరించాలని వారు(పాక్ పాలకులు) కోరుకుంటున్నారు. దిగుమతి అయిన ప్రభుత్వాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దారు. వారెంట్ ఉంటే నన్ను అరెస్టు చేసుకోండి. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా’’ అని ఆ వీడియోలో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్ అనుచరుల విధ్వంసం పాకిస్తాన్లో అవాంఛనీయ దృశ్యాలు కనిపించాయి. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పీటీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయన అనుచరులు వీధుల్లోకి వచ్చారు. విధ్వంసానికి పాల్పడ్డారు. రావల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన గేటును ధ్వంసం చేశారు. సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ప్రధాన గేటును ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి. లాహోర్‌లో సైనిక కమాండర్ నివాసాన్ని సైతం నిరసనకారులు దిగ్బంధించారు. సైనిక కంటోన్మెంట్లో గుమికూడి నినాదాలు చేశారు. రహదారులపై బైఠాయించడంతో లాహోర్ నుంచి చాలాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఇమ్రాన్ అరెస్టు వార్తా ఉదయమే దావానలంగా వ్యాపించింది. వెంటనే ఆయన అనుచరులు వివిధ నగరాలు, పట్టణాల్లో ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇమ్రాన్‌ను పారామిలటరీ రేంజర్లు శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని నినదించారు. నిరసనలు హింసాత్మకంగా మారాయి. పెషావర్, కరాచీ, హైదరాబాద్, క్వెట్టా తదితర ప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పింది. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి, ఇమ్రాన్ మద్దతుదారులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చదవండి: 150 కిలోల పేలుడు పదార్థాలు.. క్షణాల్లో నేలమట్టమైన బ్రిడ్జి.. వీడియో వైరల్ LIVE: Former Pakistan Prime Minister Imran Khan Arrested Live Updates Read @ANI | https://t.co/KTWAOqwf83#ImranKhan #ImranKhanArrested #Pakistan pic.twitter.com/R8Y8PZC3kk— ANI Digital (@ani_digital) May 9, 2023 -
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధం!
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం లాహోర్‌లోని జమాన్ పార్క్‌లో ఉన్న ఆయన నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. తోషాఖానా కేసులో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పీటీఐ కార్యకర్తలు అక్కడికి భారీ ర్యాలీతో చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే.. పీటీఐ నేత, పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌద్రి, ఇమ్రాన్ ఇంటి వద్దకు భారీగా చేరుకోవాలని కార్యకర్తలకు ట్విటర్ ద్వారా పిలుపు ఇచ్చారు. అంతేకాదు ఖాన్‌ను అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారాయన. ఇదిలా ఉంటే.. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి జఫర్ ఇక్బాల్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు. ఫిబ్రవరి 28వ తేదీతో ఆ వారెంట్ ఉంది. కోర్టుకు గైర్హాజరు అవుతుండడంపై మండిపడ్డ న్యాయస్థానం ఈ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. పీడీఎం ప్రభుత్వం పాక్‌లో కొలువు దీరాక.. ఇమ్రాన్ ఖాన్ హయాంలో జరిగిన అవినీతి కూపి లాగడం ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ప్రభుత్వానికి దక్కిన కానుకలను ఇమ్రాన్ ఖాన్ సొంతంగా ఉపయోగించుకున్నారని, వాటి వివరాలను.. లెక్కలను కూడా ఎక్కడా రికార్డుల్లో భద్రపరచ్చలేదని తేల్చింది. పాక్ ఎన్నికల సంఘం సైతం ఇదే విషయాన్ని నిర్ధారించింది. తోషాఖానా(కేబినెట్ పర్యవేక్షణలోని ప్రభుత్వానికి దక్కిన కానుకలను పర్యవేక్షించే విభాగం) కేసుగా ఇది ప్రాముఖ్యత దక్కించుకుంది. -
తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకు పడ్డ ఆజం ఖాన్.. 42 బంతుల్లోనే..
Pakistan Super League, 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో యువ బ్యాటర్ ఆజం ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 230కి పైగా స్ట్రైక్‌రేటుతో 97 పరుగులు సాధించాడు. తద్వారా ఇస్లామాబాద్ యునైటెడ్ భారీ స్కోరు చేసి గెలుపొందడంలో ఆజం ఖాన్ సహాయపడ్డాడు. అద్భుత ఆట తీరుతో 24 ఏళ్ల ఈ రైట్ హ్యాండర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కాగా పీఎస్ఎల్-2023లో భాగంగా కరాచీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఇస్లామాబాద్, క్వెటా గ్లాడియేటర్స్‌తో తలపడింది. ఆరంభంలో తడ‘బ్యా’టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇస్లామాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ 8 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్ బ్యాటర్ వాన్ డెర్ డసెన్ ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ కోలిన్ మున్రో 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఐమల్ ఖాన్ అతడిని తొందరగానే పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ షాదాబ్ ఖాన్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆజం ఖాన్ అద్భుత ఇన్నింగ్స్ ఇలాంటి సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ ఆజం ఖాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఆజంకు తోడుగా అసిఫ్ అలీ 42 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇస్లామాబాద్ 220 పరుగులు స్కోరు చేసింది. ఆరు వికెట్లు నష్టపోయి ఈ మేర భారీ స్కోరు సాధించింది. రెండో స్థానానికి ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్ 19.1 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఇస్లామాబాద్‌కు 63 పరుగుల తేడాతో విజయం దక్కింది. ఇస్లామాబాద్ బౌలర్లు ఫజల్హక్ ఫారూకీ(అరంగేట్రం), హసన్ అలీ మూడేసి వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్, షాబాద్ ఖాన్ షాదాబ్ ఖాన్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఇస్లామాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. చదవండి: WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో.. Asif aur Azam ka kamaal 🪄 Just stand and admire. #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/6zrlpJpM7Z — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 Epic finale to a sizzling innings 👏 #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/VVY81pWBiq — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
పాకిస్తాన్లో ఆహార సంక్షోభం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఆహార సంక్షోభం సైతం మొదలయ్యింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధానంగా గోధుమ పిండి కొరత వేధిస్తోంది. రాయితీపై ప్రభుత్వం అందించే గోధుమ పిండి కోసం జనం ఎగబడుతున్నారు. ఖైబర్ పఖ్తూంక్వా, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాట, తోపులాట దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పిండి కోసం తరలివచి్చన జనంతో మార్కెట్లు నిండిపోయాయి. మార్కెట్లలో రాయితీ గోధుమ పిండి కోసం జనం గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సి వస్తోంది. నిత్యం వేలాది మంది వస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. కిలో గోధుమ పిండి రూ.160 పాకిస్తాన్ ప్రధాన ఆహారమైన గోధుమలు, గోధుమ పిండి ధర విపరీతంగా పెరిగిపోయింది. కరాచీలో కిలో పిండి ధర రూ.160కు చేరింది. ఇస్లామాబాద్, పెషావర్‌లో 10 కిలోల గోధుమ పిండి బ్యాగ్‌ను రూ.1,500కు విక్రయిస్తున్నారు. 15 కిలోల బ్యాగ్ ధర రూ.2,050 పలుకుతోంది. గత రెండు వారాల వ్యవధిలోనే ధర రూ.300 పెరిగింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారడం ఖాయమన్న సంకేతాలను బలూచిస్తాన్ ఆహార మంత్రి జమారక్ అచాక్జాయ్ ఇచ్చారు. గోధుమ నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యానని చెప్పారు. ఆహార శాఖ, పిండి మిల్లుల నడుమ సమన్వయ లోపమే కొరతకు కారణమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలు పాకిస్తాన్‌ను ద్రవ్యోల్బణం హడలెత్తిస్తోంది. గత ఏడాది సంభవించిన భీకర వరదల వల్ల కష్టాలు మరింత పెరిగాయి. కేవలం గోధుమలే కాదు ఉల్లిపాయలు, తృణధాన్యాలు, బియ్యం ధరలు సైతం పైకి ఎగబాకుతున్నాయి. కిలో ఉల్లిపాయల ధర 2022 జనవరి 6న రూ.36.7 కాగా, 2023 జనవరి 5 నాటికి ఏకంగా రూ.220.4కు చేరింది. అంటే ఏడాది వ్యవధిలోనే 501 శాతం పెరిగింది. అలాగే డీజిల్ ధర 61 శాతం, పెట్రోల్ ధర 48 శాతం పెరిగింది. బియ్యం, తృణధాన్యాలు, గోధుమల ధర 50 శాతం ఎగబాకింది. 2021 డిసెంబర్లో పాక్ ద్రవ్యోల్బణం 12.3 శాతం కాగా, 2022 డిసెంబర్లో 24.5 శాతం నమోదయ్యింది. ఆహార ద్రవ్యోల్బణం ఒక ఏడాదిలోనే 11.7 శాతం నుంచి 32.7 శాతానికి చేరింది. పాకిస్తాన్లో విదేశీ మారక నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. 2021 డిసెంబర్లో 23.9 బిలియన్ డాలర్లు ఉండగా, 2022 డిసెంబర్లో కేవలం 11.4 బిలియన్ డాలర్లు ఉన్నాయి. రష్యా గోధుమల దిగుమతి రష్యా నుంచి గోధుమలు పాకిస్తాన్‌కు చేరుకోవడం కొంత ఊరట కలిగిస్తోంది. రెండు ఓడల్లో వేలాది టన్నుల గోధుమలు తాజాగా కరాచీ రేవుకు చేరుకున్నాయి. అదనంగా 4,50,000 టన్నులు రష్యా నుంచి గ్వాదర్ పోర్టు ద్వారా త్వరలో రానున్నాయని పాక్ అధికారులు వెల్లడించారు. గోధుమల కొరతను అధిగమించడానికి వివిధ దేశాల నుంచి 75 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం సరుకు ఈ ఏడాది మార్చి 30 నాటికి పాకిస్తాన్‌కు చేరుకుంటుందని అంచనా. -
పార్లమెంటులో ఎంపీలు తినే ఆహారంలో బొద్దింకలు.. పాకిస్థాన్‌లో దుస్థితి
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్లో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా దేశ పార్లమెంటు భవనంలో ఎంపీలు తినే ఆహారంలోనే బొద్దింకలు దర్శనమిచ్చాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎంపీలు.. రెండు క్యాంటిన్ల నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఇస్లామాబాద్ జిల్లా అధికారులు పార్లమెంటు హౌస్‌లోని క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించారు. మేనేజ్మెంట్ అస్సలు పరిశుభ్రత పాటించడం లేదని గుర్తించారు. కిచెన్‌లో ఆహారం పక్కన బొద్దింకలు ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే రెండు క్యాంటిన్లను సీజ్ చేశారు. ఈ రెండు క్యాంటిన్లలో నిర్వహణ బాగాలేదని, పరిశుభ్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఎంపీలు ఆరోపించారు. భోజనం కూడా రుచిగా లేదని ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అందుకే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడమే మానేసినట్లు పేర్కొన్నారు. పాక్ ఎంపీల ఆహారంలో బొద్దింకలు రావడం ఇది కొత్తేం కాదు. 2014లో సాస్ బాటిల్లోనూ బొద్దింకను చూసి ఓ ఎంపీ షాక్ అయ్యారు. అలాగే 2019లో ఇక్కడి క్యాంటిన్లలో ఆహారం బాగాలేదని, పరిశుభ్రత అసలు లేదని స్వయంగా ఎంపీలే నిరసనలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వ ఆస్తులను విక్రయించాల్సిన దుస్థితి తలెత్తింది. చదవండి: Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షా..? -
నడిరోడ్డుపై కామాంధుడి వికృత చేష్టలు
వైరల్: ఇంటా.. బయటా.. ఎక్కడ కూడా మనిషికి రక్షణ లేకుండా పోతోంది. అందునా ప్రత్యేకించి మహిళలు పట్టపగలు.. అంతా చూస్తుండగానే వేధింపులకు, దాడులకు గురవుతున్నారు. కఠిన చట్టాలు, త్వరగతిన చర్యలు తీసుకోనంత వరకు పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా.. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన సీసీ ఫుటేజీ ద్వారా బయటకు వచ్చింది. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. వెనుక నుంచి వెళ్లి ఆమె పట్టుకుని.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విడిపించుకునేందుకు బాధితురాలు ప్రతిఘటించినా లాభం లేకపోయింది. వేధించిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు దుండగుడు. పాక్ సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్ ట్విటర్ ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేశారు. నిందితుడి కఠినంగా శిక్షించి.. ఇలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పాలని కోరారు. ఒంటరిగా వెళ్తున్న ఆమెను దుండగుడు ఫాలో అవుతున్నట్లు అంతకు ముందు గల్లీలో ఉన్న సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. అయినా సోషల్ మీడియా విమర్శలతో ఫిర్యాదు స్వీకరించామని స్థానిక పోలీసులు వెల్లడించారు. سیکٹر آئی 10 اسلام آباد میں حوس کے پجاری درندہ صفت شخص کی حرکت دیکھیں ۔ حکام اس پر پوری نوٹس لے۔ @ICT_Police By @IslamabadNewz pic.twitter.com/N2xFbv3MRA — Zobia Khurshid Raja (@ZobiaKhurshid) July 18, 2022 పాక్‌లో గత కొంతకాలంగా మహిళలపై దాష్టికాలు చోటుచేసుకున్నాయి. ఈ మధ్యే ఓ మెట్రో స్టేషన్ బయటకు యువతిని కొందరు కిరాతకంగా వేధించి.. దాడికి పాల్పడిన ఘటన వైరల్ అయ్యింది. కిందటి ఏడాది స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఓ టిక్‌టాకర్‌ను చుట్టుముట్టి వందల మంది ఆమెను లైంగికంగా వేధించారు. ఆమె దుస్తులు చించి వికృత చేష్టలకు పాల్పడుతూ దాడి చేశారు. ఆటోలో వెళ్తున్న ఓ యువతిపైనా అంతా చూస్తుండగానే కొందరు వేధించిన వీడియో సైతం వైరల్ అయ్యింది. మరోవైపు పాక్‌లో పని చేసే చోట 70 శాతం మంది వేధింపులు ఎదుర్కొంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. -
మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ సర్కార్
-
చివరి బంతి వరకూ పోరాడుతా..
ఇస్లామాబాద్: పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని కచ్చితంగా ఎదుర్కొంటానని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(69) సంకేతాలిచ్చారు. ఆయన గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఫలితంతో సంబంధం లేకుండా బలీయమైన శక్తిగా తిరిగి వస్తానని చెప్పారు. రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, అసలు ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. తాను క్రీడాకారుడినని, 20 ఏళ్లపాటు క్రికెట్ ఆడానని, చివరి బంతి వరకూ పోరాడుతూనే ఉంటానని అందరికీ తెలుసని చెప్పారు. జీవితంలో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదని చెప్పారు. తమ విధానాలు అమెరికాకు, యూరప్‌కు, భారత్‌కు వ్యతిరేకం కాదని అన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని విమర్శించారు. భారత్–పాక్ మధ్య ఉన్న అతిపెద్ద వివాదం కశ్మీర్ అంశమేనని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాతే భారత్‌కు పాక్ వ్యతిరేకంగా మారిందన్నారు. అవినీతిపరులు కావాలా? పాకిస్తాన్‌పై విదేశీ శక్తుల పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. కొందరు పాక్ ప్రతిపక్ష నేతలు విదేశీ శక్తులతో అంటకాగుతున్నారని మండిపడ్డారు. డబ్బు కోసం, అధికారం కోసం దేశాన్ని అమ్మేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ అధ్యక్షుడు షెహజాద్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో–చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ, జామియత్ ఉలెమా–ఇ–ఇస్లామా నేత మౌలానా ఫజలుర్ రెహ్మాన్‌పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. కుట్రదారుల ఆటలు సాగవని హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రయాణం ఎటువైపు అన్నది అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ తర్వాత తేలిపోతుందని వ్యాఖ్యానించారు. నోరుజారిన ఇమ్రాన్ తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలో భాగంగా అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు లేఖ పంపిందని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఇన్నాళ్లూ కేవలం విదేశాల కుట్ర అని ఆరోపిస్తున్న ఆయన పొరపాటున అమెరికా పేరును బయటపెట్టారు. ఆ లేఖ కేవలం తనకు వ్యతిరేకంగా ఉందని, తన ప్రభుత్వానికి కాదని చెప్పారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో ప్రధాని 342 మంది సభ్యులున్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)లో అవిశ్వాస తీర్మాన పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ నెగ్గాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, తమకు 175 మంది ఎంపీలు మద్దతిస్తున్నారని ప్రతిపక్ష కూటమి చెబుతోంది. పాకిస్తాన్ చరిత్రలో ఇప్పటిదాకా ఇద్దరు ప్రధానమంత్రులు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఎవరూ ఈ తీర్మానంలో ఓడిపోలేదు. అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ రికార్డుకెక్కారు. పాక్ పార్లమెంట్ 3కు వాయిదా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) సెషన్ అనూహ్యంగా ఆదివారానికి వాయిదా పడింది. గురువారం దిగువ సభ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ‘గో ఇమ్రాన్ గో’ అంటూ నినాదాలు చేశారు. శాంతించాలంటూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి చేసిన వినతిని వారు పట్టించుకోలేదు. దీంతో సభను ఆదివారం ఉదయం 11.30 వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్ జరుగనుంది. పాక్‌కు ఎలాంటి లేఖ పంపలేదు: అమెరికా తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వెనుక అమెరికాతో సహా ఇతర దేశాల కుట్ర ఉందంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలను అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖండించారు. ఇమ్రాన్ చెబుతున్నట్లుగా పాకిస్తాన్‌కు తమ ప్రభుత్వ సంస్థలు గానీ, అధికారులు గానీ ఎలాంటి లేఖ పంపలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్లో తాజా పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అమెరికా ప్రభుత్వాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. జాతీయ అసెంబ్లీ రద్దుకు తెరవెనుక ముమ్మర యత్నాలు 342 సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో మెజారిటీని కోల్పోయిన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన పరువు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ప్రతిపక్షాలతో రాజీకోసం ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. జాతీయ అసెంబ్లీ రద్దు కోసం ప్రతిపక్షాలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై అధికార తెహ్రిక్–ఇ–ఇన్సాఫ్ ప్రభుత్వం, ప్రతిపక్షాల నడుమ చర్చలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు ఉపసంహరించుకోవడం, అందుకు ప్రతిఫలంగా పార్లమెంట్‌ను రద్దు చేసి, మళ్లీ తాజాగా ఎన్నికలకు వెళ్లడం.. ఇదే ఈ చర్చ ఏకైక ఎజెండా అని వెల్లడించాయి. అయితే, ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదన పట్ల ప్రతిపక్షాలు అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయి, ఎన్నికలు రావాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్‌కు ‘సేఫ్ ప్యాకేజీ’ ఇవ్వొద్దని ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో గురువారం అన్నారు. పార్లమెంట్లో మెజారిటీని కోల్పోయిన ఇమ్రాన్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. -
యూపీలో పోలింగ్‌కు... ఇస్లామాబాద్ సిద్ధం!
ఇదెక్కడి చోద్యం... పాకిస్తాన్ రాజధాని వాసులకు ఉత్తరప్రదేశ్‌లోని అసెంబ్లీ ఎన్నికలతోసంబంధమేమిటని ఆశ్చర్యపోతున్నారా? మీరునుకుంటున్నట్లు ఇది పాక్‌లోని ఇస్లామాబాద్ కాదు. యూపీలోని జిల్లా కేంద్రమైన బిజ్నౌర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేజర్ గ్రామపంచాయతీ. జనాభా వదివేలు. ఓటర్లు దాదాపు 4,700 మంది ఉంటారు. ‘పేరులో నేముంది’.. మాకున్న సమస్యల్లా ఇరుకురోడ్లు మెరుగుపడాలి, అభివృద్ధి జరగాలి... ఇవి చేసే అభ్యర్థికే మా ఓటు అంటున్నారు ఇస్లామాబాద్ గ్రామ పెద్ద విజేంద్ర సింగ్. ఇస్లామాబాద్ పేరుండటం మూలంగా మీలో అభద్రతాభావం లాంటిది తలెత్తదా? అని అడిగినపుడు... అసలు మాకు అది శత్రుదేశపు రాజధాని పేరు అనేదే గుర్తుకురాదు. గ్రామంలో ప్రధానంగా చౌహాన్లు, ప్రజాపతి సామాజికవర్గాల జనాభా అధికమని, 400 మంది దాకా ముస్లింలు కూడా ఉంటారని... అంతా కలిపిమెలిసి ఉంటామని చెప్పుకొచ్చారు విజేంద్ర సింగ్. (చదవండి: ప్రతిష్టాత్మక పోరు: ‘కైరానా’ మే హైరానా!) -
ఎయిర్‌పోర్టులో కొడుకును చెప్పుతో కొట్టిన తల్లి.. వైరల్ వీడియో..
ఇస్లామాబాద్: సాధారణంగా ఎవరైన మనవారు విదేశాల నుంచి వస్తే.. ఎయిర్‌పోర్టులో చేసే స్వాగత సత్కారాలు మాములుగా ఉండవు. కొందరు పూల బోకేలు ఇచ్చి స్వాగతం పలికితే.. మరికొందరు సర్ప్రైజ్ గిఫ్ట్‌లు, ఫ్లెక్సీలు, బ్యాండ్లను ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కొందరైతే తమ వారిని చూడగానే.. ఎమోషనల్‌గా ఫీలై వారిని ఆనందంతో గట్టిగా హత్తుకుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా వేరేదేశం నుంచి స్వస్థలానికి వచ్చిన.. ఒక తల్లి ఎయిర్‌పోర్టులో తనకు స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు పట్ల వెరైటీగా స్పందించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఘటన పాక్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. కాగా, అన్వర్ జలాని అనే వ్యక్తి ఎయిర్ పోర్టులో తన తల్లికోసం బోకే పట్లుకోని, మిస్‌యూ అమ్మ.. అంటూ ఫ్లకార్డు పట్టుకోని మరీ ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అతని తల్లి బయటకు వచ్చింది. అప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు అన్వర్‌ను ఆ తల్లి చెప్పుతో చితక్కొట్టింది. ఆ తర్వాత.. ఎమోషనల్‌తో అతడిని హత్తుకుంది. దీన్ని అన్వర్ జిలానీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘ వావ్.. ఎంతలా మిస్ అయ్యిందో..’,‘ భలే.. కొట్టింది.. ఆ తల్లి..’, ‘నవ్వు ఆపుకోలేక పోతున్నాం..’, ‘నిన్ను ఇలా ఆశీర్వదించింది..’, ‘నీకు వెరైటీగా థైంక్స్ చెప్పిందంటూ..’ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anwar Jibawi (@anwar) -
కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!
కరాచి: పాకిస్తాన్‌లోని కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు ప్రబలుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇది డెంగ్యూ జ్వరం మాదిరిగానే రోగుల్లో ప్లేట్లెట్స్, తెల్ల రక్త కణాల తగ్గిపోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తాము డెంగ్యూ కోసం పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయని డౌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో మాలిక్యులర్ పాథాలజీ హెడ్ ప్రొఫెసర్ సయీద్ ఖాన్ అన్నారు. (చదవండి: వావ్ ఏంటీ అద్భుతం... ఆకాశంలో హ్యారీపాటర్ సినిమాలో మాదిరి ఎగురుతోంది!!) పైగా నగరంలోని వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, హేమాటో-పాథాలజిస్టులతో సహా ఇతర నిపుణులు కూడా కరాచీలో డెంగ్యూ వైరస్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందుతోందని ధృవీకరించారు. అయితే ఈ వైరల్ జ్వరాలు డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుంది కానీ ఇది డెంగ్యూ జ్వరం కాదని పరమాణు శాస్త్రవేత్త డాక్టర్ ముహమ్మద్ జోహైబ్ వెల్లడించారు. ఈ మేరకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తాజాగా 45 కొత్త డెంగ్యూ జ్వరం కేసులు నమోదయ్యాయని జిల్లా ఆరోగ్య అధికారి (డీహెచ్ఓ) పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సీజన్లో ఫెడరల్ క్యాపిటల్‌లో దాదాపుగా 4 వేలకు పైగా ఈ కొత్తరకం డెంగ్యూ వైరల్ కేసులు నమోదవుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. (చదవండి: నువ్వే స్టెప్ వేస్తే అదే స్టెప్ వేస్తా!!:వైరల్ అవుతున్న క్యూట్ వీడియో) -
అఫ్గనిస్తాన్‌కి తక్షణ సాయం కావాలి: యూఎన్
ఇస్లామాబాద్: దశాబ్దాల నుంచి నిర్విరామ యుద్ధంతో విసిగిపోయిన అఫ్గనిస్తాన్ ప్రజలకు తక్షణ సాయం అవసరమని, వారికి మానవతా దృక్పథంతో కూడిన సాయం కావాలంటూ.. ఐక్య రాజ్య సమితి (యూఎన్ఓ) శరణార్థుల హై కమిషనర్ ఫిలిప్పో గ్రాండి పిలుపునిచ్చారు. అఫ్గనిస్తాన్‌ని ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: "ఇది మా తప్పిదమే": యూఎస్ ప్రస్తుతం అఫ్గాన్ వాసులకు తక్కణ మానవతా సహాయంతోపాటు, ఆహారం, నివాసం, వైద్యం అత్యవసరమని ఇస్లామాబాద్ పత్రికా సమావేశంలో నొక్కి చెప్పారు. తాలిబిన్ల పరిపాలన విధానం, వారు విధించిన ఆంక్షాల కారణంగా మానవతా సాయం రాజకీయాలకు లోబడి ఉండకూడదంటూ సూచించారు. ప్రస్తుతం అక్కడ డబ్బు కొరత కారణంగా ప్రజా సేవలకు ఆస్కారమే ఉండదన్నారు. దీంతో అక్కడ మానవతా సంక్షోభం ఏర్పడి భయానకంగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రస్తుతం 18 మిలియన్ల మంది అఫ్గాన్ ప్రజలకు తక్షణ సాయం అవసరమని పేర్కొన్నారు. చదవండి: స్నేక్ అటెంప్ట్ మర్డర్ అంటే ఇదేనేమో? -
ఇమ్రాన్ ఖాన్ మేధోశక్తి.. భారత్ జనాభా 13 వందల కోట్లు అంటా?: వైరల్
ఓ ఉద్యోగం సంపాదించాలంటే.. ఎన్నో వడపోతలు ఉంటాయి. రాత పరీక్ష, ముఖాముఖి ఇంటర్వ్యూ, బృంద చర్చలు అని వివిధ దశల్లో పరీక్షిస్తారు. మరి రాజకీయ ఉద్యగం పొందాలంటే. ఇవేవి అవసరం లేదు. ఓ పార్టీ పెట్టి, ప్రజల్లో మంచి ఇమేజ్ సంపాదిస్తే చాలు. కానీ ఓ దేశ ప్రధాని అంటే ఎలా ఉండాలి. కనీసం ఏం మాట్లాడుతున్నామో అనే అవగాహన అయినా ఉండాలి. చుట్టు పక్కల దేశాల్లో పరిస్థిలపై ఓ అవగాహన ఉండాలి. ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మేధోశక్తిని మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశ జనాభా ‘‘వన్ బిలియన్ అండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్’’ అని అన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్‌కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక ఇంతకు మందు జపాన్, జర్మనీ పొరుగు దేశాలు అని తెలిపిన ఇమ్రాన్.. చైనాను పాకిస్తాన్ పొరుగు దేశంగా కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా ఇమ్రాన్ క్రికెట్ గురించి మాట్లాడుతూ.. క్రికెట్లో రెండు ప్రపంచకప్‌లు ఒకటి టెస్ట్ క్రికెట్, రెండోది వన్డే క్రికెట్ ఉన్నాయని ఈ వీడియోలో తెలిపారు. అంతేకాకుండా జూన్‌లో జరిగిన ఐసీసీ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌ను ప్రశంసించాడు. అయితే భౌగోళికంగా జపాన్, జర్మనీ దేశాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ పాకిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి. అంతే కాకుండా 2019 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 136 కోట్లు. దీంతో ఈ వీడియోకు సంబంధించి నెటిజన్లు ఇమ్రాన్ ఖాన్ భౌగోళిక పరిజ్ఞానాన్ని లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేస్తున్నారు. ఓ ఉద్యోగం సంపాదించాలంటే.. ఎన్నో వడపోతలు ఉంటాయి. మరి రాజకీయ నాయకులకు వద్దా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆలోచించి మాట్లాడవయ్యా బాబు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. India’s population is one billion and 300 crore- Pakistani Prime Minister Imran Khan pic.twitter.com/oP0G9O9kh4 — Shama Junejo (@ShamaJunejo) August 1, 2021 -
పీఓకేలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ విజయం
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్–బల్టిస్తాన్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ విజయం సాధించింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 45 సీట్లకుగానూ 25 సీట్లను పీటీఐ గెలుచుకుంది. దీంతో ఏ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల సీట్లు పీటీఐ గెలుచుకున్నట్లు అయింది. పీఓకేలో ఇమ్రాన్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోవడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 11 సీట్లను, పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) 6 సీట్లను గెలుచుకోగా.. ముస్లిం కాన్ఫరెన్స్ (ఎంసీ), జమ్మూకశ్మీర్ పీపుల్స్ పార్టీ (జేకేపీపీ)లు చెరో సీటును గెలుచుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, రిగ్గింగ్ కారణంగానే ఇమ్రాన్ పార్టీ గెలిచిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. అయితే ఆయా పార్టీలు తమను నిందించే బదులు వారి పనితీరును పరిశీలించుకోవాలంటూ పీటీఐ తిప్పికొట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడాన్ని భారత్ గతంలోనే తప్పుబట్టింది. ఆయా ఎన్నికలకు న్యాయ ప్రాతిపదిక లేదంది. -
పాక్‌లో దారుణం: మాజీ దౌత్యవేత్త కుమార్తె హత్య..
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో దారుణం చోటుచేసుకుంది. అక్కడ సామాన్యులకే కాదూ.. వీవీఐపీలకు అక్కడ రక్షణ లేకుండా పోయింది. తాజాగా, పాక్ మాజీ దౌత్యవేత్తగా కుమార్తెను కొంత మంది దుండగులు అతికిరాతకంగా హతమార్చారు. ప్రస్తుతం ఈ వార్త దేశంలో సంచలనంగా మారింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన శౌకత్ ముకద్దమ్ గతంలో దక్షిణ కొరియా, కజికిస్తాన్‌లకు దౌత్యావేత్తగా పనిచేశారు. ఈ క్రమంలో కొంత మంది దుండగులు.. ఆయన కుమార్తె నూర్ ముకద్దమ్‌ను కిడ్నాప్‌చేసి అతి దారుణంగా చంపేశారు. ఆమె మృతదేహన్ని ఇస్లామాబాద్‌లోని ఎఫ్ 4 సెక్టార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. దీంతో, పాక్ పోలీసులు ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, కుటుంబ సభ్యులు ఈ హత్య కేసులో ఆమె మిత్రుడిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జహీర్ జఫ్పర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటనతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొన్ని రోజుల క్రితమే.. పాక్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్తగా పనిచేసిన నజిబుల్లా అలిఖిల్ కుమార్తె సిల్సిలా అలిఖిల్‌ను ఇస్లామాబాద్‌లో దుండగులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైనా సిల్సిలా.. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటుంది. ఈ చర్యలను పలుదేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తక్షణమే దీనివెనుక ఉన్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. పాక్ మద్దతుతోననే తాలిబన్లు దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని పలుదేశాలు ఆరోపిస్తున్నాయి. -
పాక్‌లో దారుణం: అఫ్గాన్ దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్.. చిత్రహింసలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. సామాన్యులనే కాకుండా ఏకంగా దౌత్యవేత్తలపై కూడా దారుణాలకు పాల్పడుతున్నారు అక్కడి నేరస్తులు. తాజాగా పాకిస్తాన్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్త కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి.. చిత్రహింసలకు గురి చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ లేఖ విడుదల చేసింది. ఆ వివరాలు.. పాకిస్తాన్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్త నజిబుల్లా అలిఖిల్ కుమార్తె సిల్సిలా అలిఖిల్‌ను కొద్ది రోజుల క్రితం ఇస్లామాబాద్‌లో దుండగులు కిడ్నాప్ చేశారు. సూపర్‌మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా దుండగులు ఆమెను ఎత్తుకెళ్లారు. అనంతరం సిల్సిలాను చిత్రహింసలకు గురి చేశారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతన్న స్థితిలో ఉండగా వదిలేశారు. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. విడుదల చేసిన లేఖలో తెలిపింది. ఈ చర్యలను అఫ్గాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్లో ఉన్న తమ దేశ దౌత్యవ్తేతలు, వారి కుటుంబాల భద్రతపై అఫ్గాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక సిల్సిలాను కిడ్నాప్ చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలానే తమ దేశ దౌత్యవేత్తలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. పాక్-అఫ్గాన్ల మధ్య ఏం జరుగుంది.. గత కొద్ది వారాలుగా అఫ్గాన్‌లోని పలు జిల్లాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడోంతుల దేశాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్.. పాక్‌పై ఆరోపణలు చేస్తోంది. ఆ దేశ మద్దతుతోనే తాలిబన్లు తమ దేశంలో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ‘‘స్పిన్ బోల్డాక్ ప్రాంతం నుంచి తాలిబాన్లను తొలగించే చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని’’ పాక్ వాయుసేన తమ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్‌ని హెచ్చరించినట్లు అఫ్గనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సాలెహ్ తెలిపారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్తను కుమార్తె కిడ్నాప్‌కు గురి కావడం సంచలనంగా మారింది. -
మలాలాపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్
ఇస్లామాబాద్: నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్పై పాకిస్తాన్‌లోని ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్ విద్యార్థులకు విషం నూరిపోస్తోంది. ఇందుకోసం ఆ సంఘం ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం సోమవారం విద్యా కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ను లక్ష్యంగా చేసుకుని యువతలో ఆమె పట్ల వ్యతిరేకత కలగడానికి ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. మతం, పెళ్లి, పశ్చిమ దేశాల అజెండా అమలు విషయంలో ఆమె తీరును దీనిలో ప్రస్తావించారు. కాగా, మలాలా సోమవారం 24వ పుట్టిన రోజు జరుపుకొన్నారు. ఇక సోమవారం పాకిస్థాన్‌లోని గుల్‌బెర్గ్‌లోని కార్యాలయంలో ఆల్ పాకిస్తాన్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. దీని అధ్యక్షుడు కసీఫ్ మిర్జా మాట్లాడుతూ ‘‘ ఐ యామ్ నాట్ మలాలా డాక్యుమెంటరీ చిత్రంలో.. ఆమెకు మతం, పెళ్లిపై ఉన్న వివాదాస్పద అభిప్రాయాలు, పశ్చిమ దేశాల అజెండా అమలు వంటి అంశాలను వెల్లడించారు. యువతలో ఆమె అసలు రూపాన్ని బహిర్గతం చేయడమే మా లక్ష్యం. మహిళల హక్కుల కోసం పోరాడుతుందనుకొని యువత ఆమె పట్ల ఆకర్షితులు కాకుండా చేయడమే మా ఉద్దేశం. మా దేశంలోని 2,00,000 ప్రైవేట్ పాఠశాలల్లోని 20 మిలియన్ల విద్యార్థులకు దీనిని చూపిస్తాం’’ అని పేర్కొన్నారు. మలాలా పెళ్లిని వ్యతిరేకిస్తోంది మలాలా పెళ్లిని వ్యతిరేకిస్తూ సహజీవనాన్ని సమర్థిస్తోందని కసీఫ్ మిర్జా ఆరోపించారు. దేశంలోని వివాహ వ్యవస్థపై ఆమె దాడి చేస్తోందని పేర్కొన్నారు. మలాలా రాసిన ‘ఐ యామ్ మలాలా’ పుస్తకంలోని పలు అంశాలను ఆయన తప్పుపట్టారు. పాక్ పాఠశాలల్లో మతపరమైన విద్యను బోధించడం, అలీ జిన్నా గురించి చెప్పడంపై ఆమె వ్యతిరేకత వ్యక్తం చేశారన్నారు. ఈ పుస్తకాన్ని పశ్చిమ దేశాల అజెండా అమలు కోసం రాసినట్లు ఉందన్నారు. ఇక "మలాలా తండ్రి జియావుద్దీన్ ఒక టీవీ కార్యక్రమంలో తన బ్లాగును బీబీసీ కరస్పాండెంట్ అబ్దుల్ హై కాకర్ రాశారని, 'ఐ యామ్ మలాలా' పుస్తకం క్రిస్టినా లాంబ్ రాసినట్లు ఒప్పుకున్నారు." అని ఆయన అన్నారు. -
భారత ఎంబసీపై డ్రోన్ చక్కర్లు
న్యూఢిల్లీ: ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై గతవారం ఒక డ్రోన్ చక్కర్లు కొట్టిన ఘటన భారత్ స్పందించింది. ఆ ఘటనపై విచారణ జరపాలని, అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. ఈ ఘటనపై పాక్‌లోని భారత హై కమిషన్ కూడా పాకిస్తాన్‌కు ఘాటుగా లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ కార్యాలయ భవనంపై జూన్ 26న ఒక డ్రోన్ ఎగురుతుండడాన్ని గుర్తించాం. దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా పాకిస్తాన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పాకిస్తాన్ విచారణ జరుపుతుందని, ఇలాంటి భద్రతాపరమైన లోపాలు మళ్లీ తలెత్తకుండా చూస్తుందని భావిస్తున్నాం’ అని శుక్రవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరింధమ్ బాగ్చీ మీడియాకు తెలిపారు. జమ్మూ విమానాశ్రయంలోని వైమానిక దళ కేంద్రంపై జూన్ 27న జరిగిన డ్రోన్ దాడి ఉగ్రవాదుల దుశ్చర్యేనని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా శుక్రవారం పేర్కొన్నారు. అది భారత్ తప్పుడు ప్రచారం భారత హైకమిషన్ కార్యాలయంపై డ్రోన్ చక్కర్లు కొట్టిందన్న ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. అది భారత్ చేస్తున్న తప్పుడు ప్రచారమని ఎదురుదాడి చేసింది. భారత హై కమిషన్ కార్యాలయ భవనంపై ఎలాంటి డ్రోన్లు తిరగలేదని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌధరి చెప్పారు. డ్రోన్ చక్కర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలను కూడా భారత్ తమకు అందించలేదన్నారు. జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిపై ఆయన స్పందించలేదు. కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం భద్రత బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒక డిస్ట్రిక్ట్ కమాండర్ కూడా ఉన్నాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒక జవాను, అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొది లారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో శుక్రవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా, రాజ్‌పొరా ప్రాంతంలో ఉన్న హంజిన్ గ్రామం వద్ద భద్రత బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను తీవ్రంగా గాయపడ్డారని కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఘటన స్థలానికి అదనపు బలగాలు చేరుకుని టెర్రరిస్ట్‌లపై కాల్పులు జరిపాయన్నారు. ఈ కాల్పుల్లో లష్కరే జిల్లా కమాండర్ నిషాజ్ లోన్ సహా ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. హతుల్లో ఒక పాకిస్తానీ కూడా ఉన్నాడన్నారు. పాక్ డ్రోన్‌పై కాల్పులు జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఒక డ్రోన్‌పై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. అది పాకిస్తానీ నిఘా డ్రోన్‌గా అనుమానిస్తున్నారు. జమ్మూ శివార్లలోని ఆర్ని యా సెక్టార్లో శుక్రవారం తెల్లవారు జామున ఈ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. వెంటనే ఆ డ్రోన్‌పై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం, ఆ డ్రోన్ మళ్లీ పాక్ భూభాగంలోకి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంపై నిఘా వేసేందుకు ఆ డ్రోన్‌ను ప్రయోగించి ఉంటారని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని కీలక రక్షణ స్థావరాలపై సోమ, మంగళ, బుధవారాల్లో రాత్రి సమయంలో పలు డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. -
పాకిస్తాన్‌లోని ఇండియన్ ఎంబసీలో డ్రోన్ కలకలం
-
మీకు తెలుసా..? డయాబెటీస్ పేషెంట్లకు ప్రత్యేక మామిడి పండ్లు
మారుతున్న జీవన శైలి కారణంగా మనిషి శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారింది. ఈ వ్యాధులలో ఒకటి డయాబెటీస్. దీన్నే మధుమేహం, డయాబెటీస్, చక్కెర వ్యాధి అని అంటారు. డయాబెటీస్.. చాపకింద నీరులా సోకే వ్యాధి. ఇక డయాబెటిస్ ఉన్నవారు ఏవైనా పండ్లు తీసుకోవాలనుకుంటే.. ముఖ్యమైన మామిడి పండ్లను తినాలంటే చక్కెర స్థాయి అధికంగా ఉంటుందేమో అని ఆందోళన చెందుతారు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ మార్కెట్లో చక్కెర స్ఠాయిలు తక్కువగా ఉండే మామిడి పండ్లను విక్రయిసున్నారు. ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కి చెందిన మామిడి పండ్ల నిపుణుడు గులాం సర్వర్ చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే మామిడి పండ్లను కనుగొన్నారు. పాకిస్తాన్లో 'ఆమ్ ఆద్మీ' కోసం తక్కువ ధరలకు , ముఖ్యంగా డయాబెటీస్ పేషంట్స్ కోసం ఈ మామిడి పండ్లను విక్రయిసున్నారు. ప్రస్తుతం ఈ పండ్లు సోనారో, గ్లెన్, కీట్ పేర్లతో సింధ్ టాండో అల్లాహార్‌లోని ఎంహెచ్ పన్వర్ ఫార్మ్స్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నారు. పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150 ‘‘సింధ్రీ, చౌన్సా వంటి రకాల్లో 12 నుంచి 15శాతం చక్కెర ఉండగా, పన్వర్ ఫార్మ్‌లో కొన్ని రకాలు కేవలం 4 నుంచి 5శాతం చక్కెర స్థాయిని కలిగి ఉన్నాయి. కీట్ రకంలో అత్యల్ప చక్కెర స్థాయి 4.7 శాతం వరకు ఉంది. సోనారో, గ్లెన్ చక్కెర స్థాయి వరుసగా 5.6శాతం, 6శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మామిడిపండ్లు పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150కు లభిస్తున్నాయి." అని మామిడి పండ్ల నిపుణుడు గులాం సర్వర్ తెలిపారు. 300 ఎకరాల పొలంలో 44 రకాలు దీనిపై ఎంహెచ్ పన్వర్ మేనల్లుడు మాట్లాడుతూ.. ‘‘ మామిడి, అరటితో సహా ఇతర పండ్లకు సంబంధించిన పరిశోధనల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం పన్వర్‌కు సీతారా-ఇ-ఇమ్తియాజ్‌ను ప్రదానం చేసంది. అతని మరణం తర్వాత, నేను ఆ పనిని కొనసాగిస్తున్నాను. ఇక ఇక్కడి వాతావరణం, మట్టిని పరీక్షించిన తరువాత వివిధ రకాల మామిడి సండ్లను దిగుమతి చేసుకుని మార్పులు చేశాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేకున్నా ప్రాజెక్టును వ్యక్తిగత ప్రాతిపదికన నడుపుతున్నామని, ప్రస్తుతం తమకు ఉన్న 300 ఎకరాల పొలంలో 44 రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి.’’ అని తెలిపారు. చదవండి: లాడెన్ అమరవీరుడంటూ నోరు జారిన ఇమ్రాన్.. వరుస వివరణలు పుల్వామాలో ఉగ్రదాడి కలకలం -
పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీ కొనడంతో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. సింధ్ ప్రాంతంలోని ఘోట్కిలోని రెటి, దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలు మిల్లట్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. దీంతో మిల్లాట్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు బోల్తాపడ్డాయి. ఘోట్కి, ధార్కి, ఒబారో, మీర్పూర్ మాథెలో పాంత్రాల్లోని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఘోట్కి డిప్యూటీ కమిషనర్ ఉస్మాన్ అబ్దుల్లా తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 13 నుంచి 14 బోగీలు పట్టాలు తప్పగా.. ఆరు నుండి ఎనిమిది పూర్తిగా నాశనమైనట్లు ఆయన పేర్కొన్నారు. గాయపడిన ప్రయాణికులకు వైద్య సహాయం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బందిని విధుల్లోకి రావాల్సిందిగా పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. అంతేకాకుండా సహాయ చర్యల కోసం రోహ్రీ నుంచి రైలు బయలుదేరిందని పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. (చదవండి: ఈ మామిడి పండు ఖరీదు రూ.1000 గురూ!) -
ఫ్లైట్‌లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టస్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ఒక కపుల్ విమానంలో చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విమానంలో ఉన్నామన్న సంగతి మరిచి వారిద్దరు ముద్దుల్లో మునిగిపోయారు. అయితే ఇది చూసిన తోటి పాసింజర్ సివిల్ ఏవియేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మే 20న చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే కరాచీ- ఇస్లామాబాద్‌కు వెళ్తున్న పీఏ-200 ఫ్లైట్‌లో ఒక కపుల్ నాలుగో వరుసలో కూర్చున్నారు. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఆ దంపతులు ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు. వారి వెనకాలే కూర్చున్న ఒక వ్యక్తి వారి చర్యలకు ఇబ్బంది పడి ఎయిర్ హోస్టస్‌ను పిలిచి చెప్పాడు. ఆమె వెళ్లి మీ చర్యలతో చుట్టుపక్కల వాళ్లకు అభ్యంతరం ఉందని.. ఇలాంటివి చేయకూడదని వివరించింది. అయినా వారు పట్టించుకోకుండా తమ పనిలో మునిగిపోయారు. దీంతో ఎయిర్ హోస్టస్ వారికి బ్లాంకెట్ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయింది. అయితే బిలాల్ ఫరూక్ ఆల్వీ అనే అడ్వకేట్ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ దంపతులు చేసే పనిపై ఎలాంటి చర్యలు తీసుకోని విమాన సిబ్బందిపై సివిల్ ఏవియేషన్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో సీఏఏ విమాన సిబ్బందితో ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని మందలించారు. అయితే అప్పటికే ఈ వార్త సోషల్ మీడియాకు పాకడంతో వైరల్‌గా మారింది. విమానంలో కపుల్ చేసిన పనిపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో మీమ్స్, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: వైరల్: వేలంలో 213 కోట్లు పలికిన ‘‘ది సాకురా’’ Live scenes from Airblue. pic.twitter.com/FkVbzpLXfT — 𝕾 🇵🇸 (@seennzoned) May 25, 2021 Air-host to other Passengers after giving blanket to kissing couple on #AirBlue pic.twitter.com/OqtwTxoiJw — Junaid Khawar (@jjkhawar) May 25, 2021 Air Hostess gives blanket to kissing couple in #Airblue flight. Single me: pic.twitter.com/gUvNWAiBVY — Malik Muzamil (@mozammalnawaz) May 26, 2021 #Airblue Guy on seat no. 5 : pic.twitter.com/K6F01ah5Wc — ابرار ابنِ عزیز (@ballisays) May 25, 2021 -
ఇమ్రాన్ లేఖ: ‘కశ్మీర్’ పరిష్కారమైతేనే శాంతి
ఇస్లామాబాద్: నిర్మాణాత్మక చర్చలు ప్రారంభమయ్యేందుకు ముందుగా ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడాల్సిన అవసరం ఉందని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ సహా అన్ని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి అది ఎంతో అవసరమని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. పాకిస్తాన్ డే సందర్భంగా పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని రాసిన లేఖకు సోమవారం ఇమ్రాన్ సమాధానమిచ్చారు. పాకిస్తాన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ, పాక్ ప్రజలు కూడా భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో శాంతియుత, సహకారాత్మక సంబంధాలనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. శాంతి నెలకొనాలంటే ముందుగా ఉగ్రవాద రహిత వాతావరణం ఏర్పడాలన్న మోదీ వ్యాఖ్యకు స్పందనగా.. కశ్మీర్ సహా అన్ని సమస్యలు పరిష్కారమైతేనే శాంతి సాధ్యమని ఇమ్రాన్ స్పష్టం చేయడం గమనార్హం. చదవండి: (ప్రమాదంలో యావత్ దేశం.. కరోనా తీవ్రతతో పరిస్థితి విషమం) -
కేక్ కోసం చొంగ కార్చుకున్న పాక్ మంత్రి, వైరల్
ఇస్లామాబాద్: భారత్‌పై విషాన్ని చిమ్మి వార్తల్లో నిలిచే పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఈసారి ఓ బిత్తిరి చర్యతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. పాకిస్తాన్‌లోని ముల్తాన్‌లో ఇటీవల నిర్మించిన రోడ్డును ప్రారంభించడానికి వచ్చిన ఖురేషీ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి వార్తల్లో నిలిచారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఒక పెద్దకేకును కట్ చేశారు. కరోనా నిబంధనల్ని మరచి.. కేక్ కావాలా తీసుకొండని మంత్రి అక్కడున్న జనానికి సూచించారు. దీంతో కారక్రమానికి హజరైనవారు కేక్ ముక్క కోసం ఎగబడ్డారు. వారిలో ఏఒక్కరు కూడా సామాజిక దూరం పాటించలేదు. మాస్క్‌లు ధరించలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాస్కు ధరించిన మంత్రి ఖురేషీ కూడా కేక్ కోసం అర్రులు చాచాడు. తన నోటికి మాస్కు ఉందన్న సంగతి మరచి.. కేక్ తినేందుకు ఆరాటపడ్డాడు. మంత్రిగారి వ్యవహారానికి సంబంధించిన వీడియోను పాక్ జర్నలిస్ట్ నాయ్లా ఇనాయత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఖురేషీ ప్రవర్తన పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో బాధ్యత గల పదవిలో ఉండి ఇవే పిల్ల చేష్టలు అని తిట్టిపోస్తున్నారు. చదవండి: భారీగా తగ్గిన అంతర్జాతీయ వలసలు! -
ఇంగ్లీష్ మాట్లాడలేదని అవహేళన.. నెటిజన్లు ఫైర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు యువతులు తమ మేనేజర్‌పై ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేనేజర్ మాట్లాడిన ఇంగ్లీష పదాలను అవహేళన చేస్తూ సదరు మహిళలు చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వస్తే.. ఉజ్మా, దియా అనే ఇద్దరు యువతులు ఇస్లామాబాద్‌లో కన్నోలి కేఫ్ ఆఫ్ సోల్‌కు ఓనర్స్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా గురువారం బోర్ కొడుతుందని కేఫ్‌కు వచ్చిన వీరిద్దరు ఒక టేబుల్‌పై కూర్చొని హోటల్ మేనేజర్ ఒవైస్‌ను పిలిచి స్టాఫ్‌ను పరిచయం చేయాలని చెప్పారు. అయితే దియా.. ఒవైస్ మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారని ఇంగ్లీష్‌లో అడిగింది.. దానికి ఒవైస్ 9 సంవత్సారాలు అని చెప్పాడు. అతని ఇంగ్లీష్‌లో తేడా గమనించిన దియా.. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్ని క్లాసులు తీసుకున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తాను మూడు కోర్సులు చదివానని ఒవైస్ సమాధానమిచ్చాడు. వెంటనే ఉజ్మా అందుకుంటూ.. మరి మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించండి అని తెలిపారు.చదవండి: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెస్టారెంట్ ఒవైస్ ఇంగ్లీష్ మాట్లాడుతుండగానే దియా.. ఉజ్మాలు గట్టిగా నవ్వుతూ..'గుర్తుంచుకోండి.. ఈయనే మా మేనేజర్. అతను మాట్లాడే అందమైన ఇంగ్లీష్ ఇదే. దానికి మేము మంచి జీతం చెల్లిస్తున్నాం అంటూ' ఒవైస్‌ను చులకన చేస్తూ మాట్లాడారు. అయితే దీనిని వీడియో తీసిన జర్నలిస్ట్ రాజా అహ్మద్ రుమీ ట్విటర్లో షేర్ చేశారు. 'ఇది చాలా విచారకరమైన విషయం. పెత్తదారుతనం.. పనివాళ్లపై యజయాని చులకన భావం.. వివక్ష ఇలా అన్ని నాకు ఒకే ఫ్రేములో కనిపించాయి. వాస్తవానికి ఇక్కడ అసలైన హీరో మేనేజర్ .. ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న అతని కృషి, అంకితభావం, పట్టుదలకు ఇదే నా సలాం! అంటూ 'క్యాప్షన్ జత చేశాడు. మేనేజర్‌పై యువతులు వ్యవహరించిన తీరు నెటిజన్లకు కోపం తెప్పించింది. తమ కేఫ్‌లో పనిచేసే మేనేజర్‌పై మహిళలు ఇద్దరు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని కామెంట్లు పెడుతున్నారు. -
అంధకారంలో పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ చిమ్మచీకట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. విద్యుత్ సరఫరా గ్రిడ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో అంధకారం నెలకొంది. కరాచి, రావల్పిండి, ఇస్లామాబాద్, లాహోర్, ముల్తాన్, ఫైజలాబాద్ తదితర ప్రధాన నగరాల్లో శనివారం అర్ధరాత్రి ఒకే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే కొన్ని నగరాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు పాకిస్తాన్ ఇంధన శాఖ మంత్రి ఒమర్ అయూబ్ ఖాన్ ఆదివారం వెల్లడించారు. సింధ్ ప్రావిన్స్‌లోని గుడ్డు పవర్ ప్లాంట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం అర్ధరాత్రి 11.41 గంటలకు గ్రిడ్ కుప్పకూలిపోయింది. ఈ గ్రిడ్ నుంచే అత్యధిక నగరాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, కొన్ని నగరాల్లో పాక్షికంగా విద్యుత్‌ని పునరుద్ధరించారు. పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరగడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అత్యంత పురాతనమైనది కావడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి షిబ్లిఫరాజ్ అన్నారు. -
పాక్ మాజీ ప్రధాని కన్నుమూత
ఇస్లామాబాద్ : పాక్ మాజీ ప్రధాని మీర్ జఫారుల్లా ఖాన్ జమాలి కన్నుమూశారు. బుధవారం రావల్పిండిలోని ఓ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారని జమాలి కుమారుడు మొహమ్మద్ ఖాన్ జమాలి వెల్లడించారు. 76 ఏళ్ల జమాలీ కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురికావడంతో.. రావల్పిండిలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ (ఏఎఫ్‌ఐసీ- ఎన్ఐహెచ్‌డీ)లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ వస్తున్నారు. కాగా జమాలి ఆరోగ్యం మరింత విషమించి మరోసారి గుండెపోటు రావడంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. (చదవండి : 2024లో పోటీ చేస్తాను: ట్రంప్) మాజీ మిలటరీ నియంత పర్వేజ్ ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2002 నవంబర్ నుంచి 2004 జూన్ వరకు జమాలీ ప్రధానిగా కొనసాగారు. కాగా ఆ తర్వాత ముషారఫ్‌తో వచ్చిన విభేదాల కారణంగా 2004లో ప్రధాని పదవికి అర్థంతరంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. -
కేఫ్‌ను లాంచ్ చేసిన పాక్ 'వైరల్' చాయ్‌వాలా!
ఇస్లామాబాద్: ఒక్కఫొటోతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిన నీలి కళ్ల 'చాయ్‌వాలా' అర్షద్ ఖాన్ గుర్తున్నాడా? పాకిస్తాన్లో దాదాపు నాలుగేళ్ల క్రితం జియా అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో క్రేజీగా వైరల్ అవడంతో అర్షద్ ఏకంగా మోడల్‌గా మారిపోయాడు. 'చాయ్‌వాలా ఆఫ్ పాకిస్తాన్'గా విపరీతమైన పాపులారిటీతోపాటు డబ్బు సంపాదించాడు. ఇప్పుడు సొంతంగా ఇస్లామాబాద్‌లో ఓ అధునాతన కేఫ్‌ను ప్రారంభించాడు. ఓ చిన్న దుకాణంలో టీ కాచుకునే అర్షద్ నాలుగేళ్లు గిర్రున తిరిగేసరికి ఓ భారీ కేఫ్‌కు యజమానిగా మారిపోయాడు. 'కేఫ్ చాయ్‌వాలా రూఫ్ టాప్' పేరుతో ప్రారంభించిన ఈ కేఫ్ గురించి అర్షద్ ఖాన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. 'కేఫ్ పేరులోని చాయ్‌వాలా అనే పదాన్ని తొలగిస్తే మేలని చాలా మంది సలహాలిచ్చారు. కానీ నేను ఎవరి మాటా వినలేదు. ఆ చాయ్‌వాలా అనే పదమే నాకు ఇంతటి గుర్తింపును తీసుకొచ్చింది' అని అర్షద్ చెప్పాడు. కేఫ్ పేరు మోడర్న్‌గా ఉన్నా లోపల ఇంటీరియర్స్‌ను మాత్రం సంప్రదాయం ఉట్టిపడేలా తీర్చిదిద్దామని ఆయన తెలిపాడు. వివిధ వెరైటీల కాఫీ, టీలతోపాటు 20 రకాల డిషెస్ తమ హోటల్లో లభిస్తాయని చెప్పాడు. కేఫ్‌ను ప్రారంభించినప్పటి నుంచి అర్షద్‌ఖాన్‌ను నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడని, లుక్స్‌తోపాటు మాటతీరులోనూ పరిణితి సాధించాడని ప్రశంసిస్తున్నారు. (చదవండి: పాక్ పావురాన్ని విడిచి పెట్టిన భారత్) -
ఇస్లామాబాద్‌లో హిందూ ఆలయ నిర్మాణం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తొలిసారి హిందూ ఆలయాన్ని నిర్మించనున్నారు. పది కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఇస్లామాబాద్‌లోని హెచ్-9 ప్రాంతంలో సుమారు 20 వేల చదరపు గజాల స్థలంలో శ్రీ కృష్ణ మందిర్ ఆలయ నిర్మాణం కోసం బుధవారం శంకుస్థాపన చేశారు. పాక్ పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మల్హీ కార్యక్రమానికి హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్హీ మాట్లాడుతూ.. ఇస్లామాబాద్‌లో 1947కు ముందు కట్టిన అనేక హిందూ ఆలయాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. వాటిలో సైద్పూర్ గ్రామంతో పాటు రావాల్ నది దగ్గరలో పలు పురాతన ఆలయాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో వాడకంలో లేవన్నారు. (నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా!) ఆలయ నిర్మాణం కోసం కావాల్సిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మత వ్యవహారాల శాఖా మంత్రి పీర్ నూరుల్ హక్ ఖాద్రి తెలిపారు. ప్రస్తుతం పది కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణం మొదలుపెట్టామన్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుమతితోనే ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. కాగా ఇస్లామాబాద్‌లో ఉన్న హిందూ పంచాయత్ కొత్త ఆలయానికి శ్రీ కృష్ణ మందిర్ అని పేరు పెట్టింది. ఆలయం నిర్మిస్తున్న స్థలాన్ని క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ 2017లో హిందూ పంచాయత్‌కు అప్పగించింది. ఆలయం సమీపంలో హిందూ శ్మశానవాటికను కూడా నిర్మించనున్నారు. -
‘రాడ్లతో కొట్టారు.. మురికి నీరు తాగించారు’
న్యూఢిల్లీ: తమను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దుండగులు.. రాడ్లతో కొట్టారని, మురికినీరు తాగించారని పాకిస్తాన్‌లోని ఇండియన్ ఎంబసీ ఉద్యోగులు ఇద్దరు తమ అనుభవాలను మీడియాకు వెల్లడించారు. సోమవారం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి కనిపించకుండా పోయి వీరు రాత్రికి ఎంబసీ సమీపంలోని పెట్రోల్ స్టేషన్ వద్ద పడి వున్నారు. ఈ క్రమంలో సదరు ఉద్యోగులు మాట్లాడుతూ.. ‘గుర్తుతెలియని దుండగులు 15-16 మంది మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కళ్లకు గంతలు కట్టారు. ఎంబసీ నుంచి పది నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ మమ్మల్ని తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. రాడ్లు, కర్రలతో విపరీతంగా కొట్టారు. మురికినీరు తాగిపించారు. వారంతా ముఖాలకు మాస్కులు ధరించి ఉన్నారు. వాళ్ల చేతిలో నరకం అనుభవించాం. ఏదో అంశం గురించి ఒప్పుకోవాలంటూ మమ్మల్ని చితకబాదారు' అని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు కనిపించకుండా పోయిన ఈ ఇద్దరు ఉద్యోగులు దాదాపు 12 గంటల తర్వాత ఎంబసీకి సమీపంలోని పెట్రోల్ స్టేషన్ వద్ద పడివుండగా గుర్తించి కార్యాలయానికి తీసుకొచ్చారు. వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా.. మెడ, ముఖం, తొడల మీద గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రాణాలకు ప్రమాదం కలిగించే దెబ్బలు లేవన్నారు. (పాక్‌లో భారత అధికారులు మిస్సింగ్) అయితే దీని గురించి పాక్ మరోలా ప్రచారం చేస్తుంది. నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని ఎంబసీ అధికారులు తమ వాహనంతో ఢీకొట్టడంతో వారిని అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొన్నది. కాగా తమ సిబ్బందిని ఆక్సిడెంట్ చేసినట్లు ఒప్పుకోమని తీవ్రంగా కొట్టి వీడియోలు తీశారని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. తమ ఉద్యోగులు కనిపించకుండా పోయారని న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్‌ను పిలిచి తీవ్రంగా నిరసన తెలిపారు. దాంతో పాకిస్తాన్ అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకొని వారిని విడిచిపెట్టేలా చేయడం గమనార్హం. ఆక్సిడెంట్ చేసిన కారులో పాకిస్తాన్‌కు చెందిన కొంత నగదు లభించిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే అవన్నీ నిరాధారమైన ఆరోపణలే అంటూ పాకిస్తాన్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఖండించింది. గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో గత నెల 31న ఇద్దర పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగులను దేశం విడిచి వెళ్లిపోవాలని భారత అధికారులు ఆదేశించింన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పాక్ కుట్రపన్ని తమ ఇద్దరు సిబ్బందిని కిడ్నాప్ చేసినట్లు భారత విదేశాంగ శాఖ భావిస్తున్నది. -
పాక్‌లో భారత అధికారులు మిస్సింగ్
ఇస్లామాబాద్ : దాయాది దేశం పాకిస్తాన్లో విధులు నిర్వర్తిస్తున్న భారత్‌కు చెందిన ఇద్దరు దౌత్యవేత్తలు అదృశ్యమయ్యారు. ఓ జాతీయ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు రెండు గంటలుగా కనిపించడంలేదు. స్థానిక అధికారులు పాక్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారి కోసం సిబ్బంది గాలిస్తున్నప్పటికీ ఆచూకీ ఇంకా లభ్యంకాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇద్దరు దౌత్యవేత్తల మిస్సింగ్‌పై భారత ప్రభుత్వం ఆరా తీసింది. అక్కడి అధికారులను సంప్రదించి వివరాలను సేకరిస్తోంది. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. (పాకిస్తాన్ మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్) -
పీటీఎం నేత ఆరిఫ్ వజీర్ దారుణ హత్య
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో పష్తూన్ తహఫ్పూజ్ ఉద్యమ(పీటీఎం) నేత ఆరిఫ్ వజీర్ శనివారం దారుణ హత్యకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చిన ఆరిఫ్పై శుక్రవారం అర్థరాత్రి ఖైబర్ పక్తుంఖ్వా రాష్ట్రం దక్షిణ వజీరిస్తాన్లోని తని నివాసంలో గుర్తుతెలియని దుండగడులు కాల్పులు జరిపారు. దీంతో ఆరిఫ్‌కు తీవ్రగాయాలు కాగా, వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆయన మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, 2017లో ఆరిఫ్ కుటుంబ సభ్యులు కూడా హత్యకు గురయ్యారు. ఆరిఫ్‌తో గొడవపడ్డ కొందరు ఉగ్రవాదులు అతని కుంటుంబంలో ఏడుగురు వ్యక్తులను కాల్చిచంపారు. పష్తూన్ తహఫ్పూజ్ మూవ్మెంట్ 2014లో ప్రారంభమైంది. పష్తీన్ అనే ఒక యువకుడు దీనిని ప్రారంభించాడు. గిరిజన సమాజానికి జరుగుతున్న అన్యాయంపై, ముఖ్యంగా పష్తూన్ల హక్కుల కోసం పీటీఎం పనిచేస్తోంది. మొదట్లో ఇది ప్రజలను తమవైపు ఆకర్షించడంలో అంత విజయవంతం కాలేకపోయింది. కానీ మెల్లమెల్లగా దాని మద్దతుదారులు ఎంతగా పెరిగారంటే.. ఇప్పుడు వారు పాకిస్తాన్ ప్రభుత్వానికే పెను సవాలుగా నిలిచారు. -
వైరల్: 2,3,4.. మగాళ్ల కోసం బంపర్ ఆఫర్!!
-
వైరల్: 2,3,4.. మగాళ్ల కోసం బంపర్ ఆఫర్!!
ఇస్లామాబాద్ : కొత్తగా ఏదైనా షాపు కానీ, హోటల్ గానీ ఓపెన్ చేసినపుడు కస్టమర్లను ఆకర్షించటం కోసం ఆఫర్లు పెట్టటం పరిపాటి. వ్యాపారం ఏదైనా ఆఫర్లతో తమ కస్టమర్లను ఆకర్షించటం అన్నది ప్రస్తుత మార్కెటింగ్ స్ట్రాటెజీ. అదే విధంగా పాకిస్తాన్‌లోని బహవాల్పుర్లో కొత్తగా తెరవనున్న ఓ ఫంక్షన్ హాలు కూడా తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు, మూడు, నాలుగో సారి పెళ్లి చేసుకోవాలనుకునే మగవారికి పెద్ద మొత్తంలో డిస్కౌంట్ ఇస్తామంటోంది. మగాళ్లను ఆకర్షించటానికి ఓ ప్రచార వీడియోను సైతం తయారు చేసి జోరుగా ముందుకు దూసుకుపోతోంది. ‘‘ దమ్ముంటే మైదానంలోకి దిగండి. ఇంకో పెళ్లి చేసుకుని చూపించండి. బహవాల్పుర్లో తెరవబోతున్న కొత్త ఫంక్షన్ హాల్ మీకు బంపర్ ఆఫర్ ఇస్తోంది’’ అంటూ వాయిస్ ఓవర్ కలిగిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదేదో బాగుందనుకుంటే పొరపాటే! ఫంక్షన్ హాల్ కండీషన్లు చదివితే మన మతి పోతుంది. రెండో పెళ్లి చేసుకోవాలనుకునే ఆ వ్యక్తి మొదటి భార్య వచ్చి ఫంక్షన్ హాల్ బుకింగ్ చేయాలి. 3,4 పెళ్లిళ్లకు కూడా ఇదే కండీషన్ వర్తిస్తుంది. ఎవరైతే ఈ కండీషన్లు సక్రమంగా పూర్తి చేస్తారో వారికి బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది. పాకిస్తాన్ నలుమూలలనుంచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. రెండో పెళ్లి చేసుకునేవారికి 50 శాతం డిస్కౌంట్, మూడో పెళ్లి చేసుకునేవారికి 75 శాతం డిస్కౌంట్, నాలుగో పెళ్లి చేసుకునేవారికి వాలిమా ఉచితమని నిర్వహకులు తెలిపారు. -
'ఆ టిక్‌టాక్ స్టార్‌తో నాకు ఏ సంబంధం లేదు'
ఇస్లామాబాద్ : టిక్‌టాక్ స్టార్ హరీమ్షాతో తనకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి పవాద్ చౌదరి ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. ' పదవులనేవి వస్తుంటాయి. పోతుంటాయి. కానీ ఒక వ్యక్తి మీద వ్యక్తిగతంగా దాడులు చేయడం నేను భరించలేను. మనందరం మనుషులం.. ఎవరైనా మనపై తప్పుడు ఆరోపణలు చేస్తే స్పందించే హక్కు మనందరికి ఉంటుందని' చౌదరి పేర్కొన్నారు. అంతకుముందు టీవీ యాంకర్ ముబాషీర్ లుక్మాన్ను 'షేమ్ జర్నలిస్ట్'గా అభివర్ణిస్తూ ఆయన చెంప చెల్లుమనిపించారు. పవాద్ తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నాని, ఎందుకంటే తాను ముందు ఒక మనిషినని, ఆ తర్వాతే మంత్రినని మీడియాతో పేర్కొన్నారు. "ముబాషీర్ లుక్మాన్ లాంటి వ్యక్తులకు జర్నలిజంతో ఎటువంటి సంబంధం లేదు. అతని వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేయడం నా కర్తవవ్యంగా భావించానంటూ" చౌదరి రీట్వీట్ చేశారు. టీవీ షోలో లుక్మాన్ తన తోటి యాంకర్ రాయ్ సాకిబ్ ఖరాల్ మాట్లాడుతూ.. టిక్ టాక్ స్టార్ హరీమ్ షాతో పవాద్ చౌదరి ఉన్న అసభ్య వీడియోలు ఉన్నాయని పేర్కొన్నాడు. అంతేగాక తాను ఈ వీడియోలను వ్యక్తిగతంగా చూశానని పేర్కొన్నాడు. పవాద్ చౌదరి ఈరకంగా ప్రవర్తించడం ఆయనకు కొత్తేం కాదు. గతేడాది జూన్‌లో ఒక వివాహానికి హాజరైన పవాద్ చౌదరి టీవీ హోస్ట్ సామి ఇబ్రహీంను ఇదే విధంగా చెంపదెబ్బ కొట్టారు. -
మోదీ విమానానికి అనుమతి లేదు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మరోసారి తన వక్ర బుద్దిని చాటుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన నేపథ్యంలో భారత్ చేసిన అభ్యర్థనను పాక్ తోసిపుచ్చింది. మోదీ ప్రయాణం చేసే విమానాన్ని తమ గగనతలం మీదుగా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్లో మానవహక్కులను ఉల్లఘించిదన్న కారణాన్ని సాకుగా చూపిస్తూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. అనుమతి నిరాకరణకు సంబంధించిన విషయాన్ని లిఖిత పూర్వకంగా భారత హైకమిషనర్‌కు తెలియజేయనున్నట్లు ఖురేషీ తెలిపారు. మరోవైపు కశ్మీరీలకు మద్దతుగా ఈరోజు పాక్ బ్లాక్‌డే నిర్వహిస్తోంది. అంతర్జాతీయ బిజినెస్ ఫోరంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సోమవారం సౌదీ పర్యటనకు వెళ్లనున్నారు. దీంతోపాటు పలువురు సౌదీ నేతలను కూడా కలవనున్నారు. గత నెలలో మోదీ అమెరికా పర్యటన, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐస్‌ల్యాండ్ పర్యటన సందర్భాల్లోనూ పాక్ ఇదే రీతిలో వ్యవహరించింది. బాలాకోట్ దాడుల తర్వాత తన గగనతలాన్ని మూసివేసిన పాక్ కొంతకాలం తర్వాత మళ్లీ తెరిచింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ భారత్‌కు చెందిన విమానాలను రానీయకుండా తమ గగనతలాన్ని మరోసారి మూసివేసింది. -
పేస్ పునరాగమనం!
న్యూఢిల్లీ: భద్రతా కారణాలదృష్ట్యా పాకిస్తాన్లో డేవిస్ కప్ మ్యాచ్ ఆడేందుకు పలువురు భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారులు విముఖత చూపిన నేపథ్యంలో... వెటరన్ స్టార్, 46 ఏళ్ల లియాండర్ పేస్ ముందుకొచ్చాడు. డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1లో భాగంగా నవంబర్ 29, 30వ తేదీల్లో ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ కోసం తాను అందుబాటులో ఉంటానని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వర్గాలకు తెలిపాడు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) కోరిక మేరకు... ఈ పోటీలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన భారత ఆటగాళ్లకు వీసాలు జారీ చేసేందుకు అవసరమైన పత్రాలను పాకిస్తాన్ అధికారులకు పంపించామని ఏఐటీఏ జనరల్ సెక్రటరీ హిరణ్మయ్ చటర్జీ తెలిపారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ మైనేనితోపాటు అర్జున్ ఖడే, విజయ్ సుందర్ ప్రశాంత్, శ్రీరామ్ బాలాజీ, సిద్ధార్థ్ రావత్, మనీశ్ సురేశ్ కుమార్, శశికుమార్ ముకుంద్ ఉన్నారు. -
ఇమ్రాన్! నా విమానాన్ని తిరిగిచ్చేయ్
ఇస్లామాబాద్ : ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో తిరిగి న్యూయార్క్‌లోనే అత్యవసరంగా ల్యాండ్ అయ్యారు. అయితే తాజాగా అసలు కారణం విమాన సాంకేతికలోపం కాదని తేలింది. కాగా ఈ వ్యవహారంపై సౌదీ యువరాజు మహ్మద్‌బిన్ సల్మాన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పాకిస్తాన్ పత్రిక ప్రైడే టైమ్స్ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లడానికి ముందు ఇమ్రాన్ రెండు రోజులు సౌదీ అరేబియాలో పర్యటించారు. తమ దేశానికి అతిథిగా వచ్చిన ఇమ్రాన్‌ను కమర్షియల్ విమానంలో పంపడం ఇష్టం లేక యువరాజు సల్మాన్ తన ప్రైవేట్ జెట్‌ను ఇచ్చారు. దీంతో ఇమ్రాన్‌తో పాటు ఆయన ప్రతినిధి బృందం ప్రైవేట్ జెట్‌లోనే అమెరికా పర్యటనకు వెళ్లారు. సమవేశాలు ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో జెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి న్యూయార్క్ వెళ్లి అక్కడి నుంచి కమర్షియల్ ప్లైట్‌లో ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అయితే దీనిపై పాకిస్తాన్‌కు చెందిన ప్రైడేటైమ్స్ పత్రిక మాత్రం ఈ వాదనతో పూర్తిగా విభేదించింది.పాక్ ప్రధాని ఇమ్రాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్‌తో కలిసి ఇస్లామిక్ దేశాల వాదనను వినిపించాలనుకోవడం సౌదీ యువరాజుకు నచ్చలేదని పేర్కొంది. పైగా తన అనుమతి లేకుండా ఇరాన్‌తో చర్చలు జరపడంపై సౌదీ యువరాజు గుర్రుగా ఉన్నట్లు ఫ్రైడే టైమ్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో సల్మాన్ తన విమానాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఇమ్రాన్‌పై అసంతృస్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. -
పీవోకేలో భారీ భూకంపం
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో సంభవించిన తీవ్ర భూకంపంతో 26 మంది మృతి చెందగా 300 మందికిపైగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పాక్ రాజధాని ఇస్లామాబాద్‌తోపాటు ఉత్తర ప్రాంతంలోని పలు నగరాల్లో భూమి కంపించింది. దీని ప్రభావంతో భారత్‌లో..రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌ల్లోనూ భూమి కంపించింది. తీవ్ర ప్రకంపనలు రాకవడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాలు వదిలి రోడ్లపైకి పరుగులు తీశారు. పంజాబ్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతం జీలం కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని పాక్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే, దీని తీవ్రత 7.1 వరకు ఉందని సైన్స్ శాఖ మంత్రి ఫవాద్ ఛౌదరి అన్నారు. భూకంప కేంద్రం పీవోకేలోని న్యూ మీర్పూర్ సమీపంలో ఉందని అమెరికా తెలిపింది. పీవోకేలోని మిర్పూర్లో మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్రంగా భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. మీర్పూర్లో ఓ భవనం కుప్పకూలింది. ఓ మసీదు కూడా దెబ్బతింది. భూకంపంతో మీర్పూర్, చుట్టుపక్కల జరిగిన విధ్వంసంలో 26 మంది మృతి చెందగా, మహిళలు, చిన్నారులు సహా 300 మంది వరకు గాయపడ్డారని మీర్పూర్ డీఐజీ గుల్ఫరాజ్ ఖాన్ తెలిపారు. భారీగా రోడ్లు ధ్వంసమయ్యాయి. పగుళ్లిచ్చిన రోడ్లలో కార్లు ఇరుక్కుపోయాయి. పెషావర్, రావల్పిండి, లాహోర్, ఫైసలాబాద్, సియాల్కోట్, అబోటాబాద్, ముల్తాన్, నౌషెరాల్లో భూమి కంపించింది. పరిపాలనా యంత్రాంగానికి తోడుగా తక్షణమే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావెద్ బజ్వా సైన్యాన్ని ఆదేశించారు. వైమానిక దళం, వైద్య బృందాలను పంపినట్లు సైన్యం తెలిపింది. నష్టం ఎక్కువగా మీర్పూర్, జీలం ప్రాంతాల్లో జరిగిందని జాతీయ విపత్తుల నిర్వహణ విభాగం చైర్మన్ లెఫ్టినెంట్ మొహమ్మద్ అఫ్జల్ తెలిపారు. అయితే, మీర్పూర్ సమీపంలో ఉన్న మంగ్లా జలాశయానికి ఎటువంటి ముప్పు లేదన్నారు. జలాశయం వద్దనున్న 900 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని అధికారులు ముందు జాగ్రత్తగా మూసివేశారు. ప్రకంపనల కారణంగా జీలం కాల్వకు గండ్లు పడటంతో నీరు లోతట్టు ప్రాంత గ్రామాలను ముంచెత్తింది. ఉత్తర భారతంలోనూ అలజడి ఉత్తర భారతంలోని దేశ రాజధాని ప్రాంతం సహా పలు ప్రాంతాల్లో భూకంప తీవ్రత 6.3గా ఉందని అధికారులు ప్రకటించారు. అయితే, ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని వెల్లడించారు. ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, హరియాణాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాలను వదిలి రోడ్లపైకి చేరుకున్నారు. -
46 పాక్ విమానాలు ఖాళీగా తిరిగాయి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినట్లు ఒక ఆడిట్ నివేదిక వెల్లడించింది. 2016 - 17లో ఇస్లామాబాద్ విమానాశ్రయం నుంచి పీఐఏకి చెందిన 46 విమాన సర్వీసులు ప్రయాణికులు లేకుండానే ఖాళీగా తిరిగినట్లు పేర్కొంది. దీనివల్ల ఆ దేశానికి సుమారు రూ.18 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఈ విషయం సంబంధిత ఎయిర్‌లైన్స్ అధికారులకు తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. అంతేగాక హజ్, ఉమ్రా ప్రాంతాల్లో కూడా 36 విమానాలు ప్రయాణికులు లేకుండానే ఖాళీగా తిరిగినట్లు నివేదికలో తేలింది. కాగా, కొన్ని నెలల క్రితం నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు పీఐఏ ఎయిర్‌లైన్స్ సంస్థ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. -
మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్: ఇమ్రాన్
ఇస్లామాబాద్ : కశ్మీర్లో విధించిన ఆంక్షలు తొలగించే వరకు భారత్‌తో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తేలేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి దాయాది దేశం పాకిస్తాన్ భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌తో కొనసాగుతున్న దౌత్య సంబంధాలను సైతం నిలిపివేసింది. అయితే తాజాగా పాక్ ప్రధాని మరోసారి రెచ్చిపోయారు. బుధవారం అక్కడి ప్రాంతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్లో ఆంక్షలు ఎత్తివేసిన తర్వాతే భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుతాం. అప్పటి వరకు భారత్‌తో ఎలాంటి చర్చలు జరపం.’ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆర్టికల్ 370 రద్దు జరిగిందని భారత్ అనేకసార్లు స్పష్టంచేసినప్పటికీ పాక్ భారత్‌పై తన మొండి వైఖరిని మార్చుకోవడంలేదు. అంతటితో ఆగకుండా మాటల యుద్ధానికి దిగుతోంది. అయితే కశ్మీర్ అంశం దేశ అంతర్గత విషయమని ఈ విషయంలో జోక్యం చేసుకోడానికి పాకిస్తాన్‌కు ఏ హక్కు లేదని భారత ప్రభుత్వం అనేకసార్లు పాక్‌కు తెలిపిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై కూడా ఇదే విషయాన్ని పలుమార్లు గుర్తుచేసింది. -
'అవును ఉగ్రవాదులకు వేలకోట్లు ఇచ్చాం'
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ దేశీయాంగ మంత్రి బ్రిగేడియర్ ఇజాజ్ అహ్మద్‌షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిషేదిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవాకు చెందిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కేటాయించిందని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.అంతకుముందు జూలైలో తొలి అమెరికా పర్యటన సందర్భంగా, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశంలో 30వేల నుంచి 40వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని పేర్కొన్నట్లు తెలిపారు. వీరంతా పూర్తి స్థాయిలో శిక్షణ పొంది దేశం తరపున ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్లో పోరాడారని చెప్పుకొచ్చారు. ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ఇమ్రాన్ తమ సరిహద్దుల్లో 40 వేర్వేరు మిలిటెంట్ గ్రూపులు పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఇమ్రాన్‌ఖాన్ పాలన తమ దేశాన్ని నాశనం చేస్తోందని, పాక్‌ను పాలిస్తున్న నేతల తీరుతో దేశం భ్రష్టు పడుతోందని అహ్మద్‌షా విమర్శించారు. సెస్టెంబర్ 10న జెనీవాలో జరిగిన 42వ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమీషన్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కశ్మీర్‌ను భూమి మీదే అతిపెద్ద జైలుగా మార్చేశారని ఖురేషీ వ్యాఖ్యానించడమే ఇమ్రాన్ పాలనకు నిదర్శనంగా చెప్పవచ్చని అహ్మద్ షా పేర్కొన్నారు. -
భారత్‌లో అలజడి సృష్టించండి
న్యూఢిల్లీ: కశ్మీర్‌కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత్ రద్దుచేయడంపై పాకిస్తాన్ కోపంతో రగిలిపోతోంది. కశ్మీర్లో రక్తపాతం సృష్టించడం ద్వారా అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ను ఇటీవల జైలు నుంచి విడుదలచేసిన పాకిస్తాన్, తాజాగా మరో కుట్రకు తెరలేపింది. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రసంస్థలతో పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఇస్లామాబాద్‌లో అత్యున్నత సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి పాక్‌లోని ఉగ్రసంస్థలతో పాటు ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్(కేజెడ్ఎఫ్) వంటి వేర్పాటువాద సంస్థల ముఖ్యనేతలు హాజరైనట్లు భారత నిఘావర్గాలు తెలిపాయి. కశ్మీర్లో దాడులతో అలజడి సృష్టించాలని ఈ సందర్భంగా ఉగ్రమూకలకు ఐఎస్ఐ ఆదేశాలు జారీచేసిందని వెల్లడించాయి. కశ్మీర్లో భద్రతాబలగాలు, ప్రభుత్వ ఆస్తులు లక్ష్యంగా విధ్వంసానికి పాల్పడటం ద్వారా ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించేందుకు పాక్ కుట్ర పన్నుతోందని పేర్కొన్నాయి. సాంబా జిల్లాలోని బరీబ్రహ్మణ ఆర్మీ క్యాంప్, జమ్మూలోని సుంజ్వాన్, కలుచక్ ఆర్మీ బేస్‌లు లక్ష్యంగా నలుగురు లష్కరే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. లష్కరే మద్దతుదారుల అరెస్ట్ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న 8 మంది లష్కరే తోయిబా మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదుల పేరిట వీరు పోస్టర్లు అంటించారు. ప్రజలంతా శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టాలనీ, స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ఈ పోస్టర్లలో పిలుపునిచ్చారు. -
‘పుల్వామా’తరహా దాడి జరగొచ్చు
ఇస్లామాబాద్: కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో పుల్వామా తరహా దాడి జరగొచ్చంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ పరిణామాలపై చర్చించేందుకు మంగళవారం సమావేశమైన పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘పుల్వామా తరహా దాడి జరిగేందుకు అవకాశం ఉంది. వాళ్లు(భారత్) నింద మనపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు మళ్లీ మనపై దాడి చేయవచ్చు. అయితే, మనం తిప్పి కొడతాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు గెలుస్తారు? ఎవరూ గెలవలేరు. ఆ తీవ్ర ప్రభావం మాత్రం అంతర్జాతీయంగా ఉంటుంది. ఇది అణ్వస్త్ర దేశం బెదిరింపు కాదు’అని ఇమ్రాన్ అన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. కశ్మీరీలు నిరసనలు తెలిపితే భారత్ వారిని అణచివేయవచ్చు. కశ్మీర్ పరిస్థితులను గమనిస్తూ ఉండాలి’అని ఆయన అంతర్జాలతీయ సమాజాన్ని కోరారు. కశ్మీరీలకు అవసరమైన ఎలాంటి సాయం చేసేందుకయినా తమ సైన్యం సిద్ధంగా ఉందని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా తెలిపారు. ఈ బాధ్యతను నెరవేర్చేందుకు ఎంతదాకైనా వెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని జనరల్ బజ్వా పేర్కొన్నారు. కశ్మీర్ ప్రత్యేకప్రతిపత్తిని రద్దు చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోందని హెచ్చరిస్తూ పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి గత వారమే ఐరాసకు లేఖ రాశారు. -
పాక్ మాజీ అధ్యక్షుడు అరెస్టు
ఇస్లామాబాద్ : నకిలీ బ్యాంకు అకౌంట్ల ద్వారా భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అలీతో పాటు.. ఆయన సోదరి ఫర్యాల్ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని పీటీఐ వెల్లడించింది. కాగా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న అలీ నిర్వహిస్తున్న లావాదేవీలపై నేషనల్ అకౌంటబిలిటి బ్యూరో(అవినీతి నిరోధక శాఖ) అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పలు నకిలీ అకౌంట్ల ద్వారా సోదరితో కలిసి సుమారు 150 మిలియన్ డాలర్ల నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో అలీతో పాటు ఆయన సోదరిని అదుపులోకి తీసుకోవాలని ఎన్ఏబీ నిర్ణయించింది. దీంతో ఆయనను సోమవారం అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ముందస్తు బెయిల్ తెచ్చుకున్న అలీ.. దానిని పొడిగించాలని కోరుతూ ఇస్లామబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈసారి అత్యున్నత న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అలీని అరెస్టు చేసిన పోలీసులు.. ఆయన సోదరిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. -
భారత్ ఇఫ్తార్ విందులో పాక్ ఓవరాక్షన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆ దేశ భద్రతా సిబ్బంది వివాదాస్పదంగా ప్రవర్తించారు. ఇప్తార్ విందుకు హాజరైన అతిథులతో అత్యంత అమర్యాదగా వ్యవహరించారు. రంజాన్ సందర్భంగా ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్లో భారత హైకమిషన్ అధికారులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయగా, దానికి పలువురు అతిథులు వచ్చారు. అయితే, భద్రతా కారణాల పేరుతో పాక్ సెక్యూరిటీ.. గెస్ట్‌లను వేధింపులకు గురిచేశారు. భద్రత పేరుతో అతిథులకు తీవ్ర అసహం కలిగించారు. ఓ అతిథి మీద చేయి కూడా చేసుకున్నట్లు సమాచారం. మరికొందరు గెస్ట్‌ల కార్లను పార్కింగ్ స్థలం నుంచి తొలగించగా.. మరికొందరి వాహనాలను హోటల్లోకి అనుమతించలేదు. దీంతో కొందరు ముఖ్యలు కార్యక్రమానికి రాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా క్షమాపణ చెప్పారు. ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలంటూ పదే పదే భారత్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీలు ఈ తరహాలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. ఇతర దేశస్తులు ఎవరైనా పాకిస్తాన్లో అడుగుపెట్టినా.. వారినికూడా ఇదే విధంగా వేధింపులకు గురిచేస్తోంది. ముఖ్యంగా రంజాన మాసం కావడంతో.. అనువనవూ గాలింపు చేపడుతున్నారు. -
బైక్‌పై ఆవును ఎక్కించుకుని ప్రయాణం
-
ఇలాంటి ప్రయాణం ఎప్పుడూ చేసుండరు: వైరల్
ఇస్లామాబాద్ : మామూలుగా బైక్‌పై పెంపుడు కుక్కలను ఎక్కించుకుని ప్రయాణం చేసేవాళ్లను చూసుంటారు. చాలా కుక్కలు యాజమాని బైక్‌పైకి ఎక్కిన తర్వాత బుద్ధిగా కూర్చుని, రోడ్డుపై వెళ్లేవాళ్లను, పరిసరాలను చూస్తుంటాయి. ఇది అంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. కానీ! ఓ యువకుడు మాత్రం ఇందుకు భిన్నంగా తన బైక్‌పై ఆవును ఎక్కించుకుని ప్రయాణం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌కు చెందిన ఓ యువకుడు ఆవును తన బైక్‌పై ఎక్కించుకుని ప్రయాణం చేశాడు. ఆ ఆవుకూడా అలవాటున్న దానిలా ఏ బెరకూలేకుండా ప్రయాణం చేసింది. ఈ వింతను అతని పక్కగా ప్రయాణిస్తున్న వారు వీడియో తీసి, సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెడీగా స్పందించారు. ‘‘ అసలైన కౌబాయ్ అంటే ఇతడే.. ఇలాంటివి కేవలం పాకిస్తాన్లో మాత్రమే జరుగుతాయి.. పాకిస్తాన్‌కి మీకు స్వాగతం.. మీ పందుల్ని, కుక్కల్ని, ఆవుల్ని తీసుకురండి, అద్భుతమైన ప్రయాణం చేయండ’’ని కామెంట్లు చేశారు. -
తీరు మార్చుకోని పాకిస్తాన్
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో మరో భారత రాయబారికి చేదు అనుభవం ఎదురైంది. ఇస్లామాబాద్‌లో భారత రాయబారి నివాసంలో పాకిస్తాన్ అధికారులు ఉద్దేశపూర్వకంగా నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. డిసెంబర్ 25న జరిగిన ఈ ఘటనపై భారత హైకమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ విదేశాంగ శాఖకు లేఖ రాసింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఇస్లామాబాద్‌లో కొత్తగా నిర్మించిన భారత హైకమిషన్ నివాస సముదాయానికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు పాకిస్తాన్ నిరాకరిస్తున్న సమయంలోనే తాజా విద్యుత్ కోత ఘటన వెలుగుచూడటం గమనార్హం. కొత్త భవనాలకు టెలికాం కనెక్షన్లు సమకూర్చని పాకిస్తాన్.. భారత్ పంపిన సామగ్రిని సరిహద్దుల్లోనే నిలిపేసిన సంగతి తెలిసిందే. -
గురుద్వారలో భారత అధికారులకు నో ఎంట్రీ
ఇస్లామాబాద్ : లాహోర్ సమీపంలోని ఫరూఖాబాద్ గురుద్వారను సందర్శించే భారత యాత్రికులను కలుసుకునేందుకు భారత హైకమిషన్ అధికారులను పాకిస్తాన్ మరోసారి అడ్డగించింది. నాన్కన సాహిబ్, గురద్వార వద్ద గురునానక్ దేవ్ 550వ జయంతోత్సవాలు నిర్వహిస్తుండగా రంజిత్ సింగ్, సునీల్ కుమార్ల నేతృత్వంలో ఇస్లామాబాద్ నుంచి చేరుకున్న భారత దౌత్య బృందాన్ని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారులు నిలువరించారు. మరోవైపు గురుద్వార వెలుపల సైతం వారి పట్ల పాక్ అధికారులు అమర్యాదకరంగా వ్యవహరించారు. భారత అధికారులను గురుద్వార లోనికి రాకుండా సిక్కుల రూపంలో ఐఎస్ఐ ఏజెంట్లు అడ్డుకున్నారు. భారత్‌లో ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఎన్నో గురుద్వారాలు ఉన్నా ఎక్కడా వాటిలో ప్రవేశించేందుకు నియంత్రణలు లేవని, గురుద్వారలోనికి రాకుండా కొందరు అడ్డుతగలడం తాము తొలిసారిగా చూస్తున్నామని భారత దౌత్యవేత్త చెబుతున్న వీడియో పాక్ దమననీతిని వెల్లడించింది. గురుద్వార పవిత్రతకు భంగం వాటిల్లేలా పాక్ అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. మరోవైపు సాధారణ యాత్రికుల తరహాలోనే తమను గురుద్వారలోకి అనుమతించాలని భారత దౌత్యవేత్త పాకిస్తాన్ అధికారులను కోరగా పంజాబి సిఖ్ సంఘటన్ చీఫ్ గోపాల్ సింగ్ చావ్లా ఆయనతో వాదనకు దిగి మరో రోజు గురుద్వారను సందర్శించాలని సూచించారు. ఇక భారత దౌత్యవేత్తలను తాము గురుద్వారలోకి అనుమతించే పరిస్థితిలో లేమని సిక్కు ప్రముఖులు రమేష్ సింగ్ అరోరా, తారా సింగ్ ప్రధాన్‌లు తేల్చిచెప్పారు. కాగా పాకిస్తాన్‌ను సందర్శించే సిక్కు యాత్రికులను కలుసుకునేందుకు భారత హైకమిషన్ అధికారులను పాకిస్తాన్ నిలువరిస్తుంటే పాకిస్తాన్ యాత్రికులతో కలిసి సర్హింద్ షరీఫ్‌లో చద్దర్ సమర్పించేందుకు భారత్‌లో పాక్ హైకమిషనర్‌ను భారత్ అనుమతించింది. -
పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం
-
పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రధానిగా సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, పొరుగు దేశాలతో విభేదాలు ఒకవైపు.. ఉగ్రవాదంపై పోరులో వైఫల్యంతో అంతర్జాతీయ ఆంక్షల ముప్పు మరోవైపు పొంచి ఉన్న సమయంలో పాకిస్తాన్ పాలనా పగ్గాలు చేపట్టారు. పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) చైర్మన్‌గా ఉన్న ఇమ్రాన్ ఖాన్(65) దేశ 22వ ప్రధానిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష కార్యాలయంలో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్‌తో పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ప్రమాణం చేయించారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా, భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ, పలు దేశాల దౌత్యవేత్తలు, ఇతర ప్రత్యేక ఆ హ్వానితులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇమ్రాన్ సారథ్యంలో 1992 క్రికెట్ ప్రపంచకప్ సాధించిన పాక్ జట్టులోని వసీం అక్రంతో పాటు ఇతర క్రికెటర్లు కూడా ప్రమాణ స్వీకారాన్ని తిలకించారు. ఉర్దూ పదాలు పలకలేక తడబాటు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్ర మాణ స్వీకారం 40 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. నలుపు, బూడిద రంగు షేర్వానీ ధరించిన ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం సమయంలో కొంత ఉద్వేగానికి లోనయ్యారు. కొన్ని ఉర్దూ పదాల్ని పలకడంలో తడబడ్డారు. ప్రమాణస్వీకారం అనంతరం ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఇమ్రాన్ సైనిక వందనం స్వీకరించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌ను తిరిగి పట్టాల మీదకు తీసుకురావడంపై ప్రథమంగా దృష్టిపెడతానని ఆయన తెలిపారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాను తన అభిమాన నేతగా పేర్కొన్న ఇమ్రాన్.. అవినీతిలో కూరుకుపోయిన పాక్‌ను ముస్లిం సంక్షేమ రాజ్యంగా మారుస్తానని ప్రకటించారు. గతేడాది పాకిస్తాన్ కరెన్సీ రూపాయి విలువ దారుణంగా దిగజారింది. ద్రవ్యోల్బణం ప్రమాదకర స్థాయికి చేరుకోగా.. దేశ వాణిజ్య లోటు ఊహించనంతగా పెరిగింది. భారీగా పేరుకున్న రుణాలు, తరిగిపోతున్న విదేశీ మారక నిల్వలపైనే ఇమ్రాన్ తక్షణం దృష్టిసారించాల్సి ఉంది. ఆ రెండు పార్టీల ఆధిపత్యానికి చెక్ ఆక్స్‌ఫర్డ్‌లో విద్యనభ్యసించిన ఈ పస్తూన్ నాయకుడు శుక్రవారం పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని పదవికి జరిగిన ఎన్నికలో ప్రతిపక్ష పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) చీఫ్ షాబాజ్ షరీఫ్‌ను ఓడించారు. ఇమ్రాన్‌కు 176 ఓట్లు రాగా, షాబాజ్‌కు కేవలం 96 ఓట్లు మాత్రమే దక్కాయి. పాక్ ప్రధాని అయ్యేందుకు 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో 172 మంది మద్దతు కావాలి. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో 54 మంది సభ్యులున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఓటు వేయకపోవడంతో ప్రధానిగా ఇమ్రాన్ ఎన్నిక లాంఛనప్రాయమైంది. జూలై 25న జరిగిన పాక్ ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం స్వతంత్రుల మద్దతు, మహిళలు, మైనార్టీలకు కేటాయించిన రిజర్వ్ సీట్లతో ఆ సంఖ్య 158కి చేరింది. గత కొన్ని దశాబ్దాలు పాకిస్తాన్లో అధికారాన్ని పీఎంఎల్–ఎన్, పీపీపీ పార్టీలే పంచుకున్నాయి. మధ్యలో 2001 నుంచి 2008 వరకూ ముషార్రఫ్ నేతృత్వంలో సైనిక పాలన కొనసాగింది. భారత్–పాక్ శాంతి ప్రక్రియకు దోహదం: సిద్ధూ ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని కావడం భారత్–పాకిస్తాన్ శాంతి ప్రక్రియకు లాభిస్తుందని భారత మాజీ క్రికెటర్ సిద్ధూ అభిప్రాయపడ్డారు. ‘పాక్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో నవోదయం మొదలైంది. అది ఆ దేశ గమ్యాన్ని మార్చేయగలదు’అని ఆయన ఆకాంక్షించారు. ప్రమాణస్వీకారానికి ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బజ్వాను సిద్ధూ ఆలింగనం చేసుకుని కొద్దిసేపు ముచ్చటించారు. వారిద్దరు చిరునవ్వులు చిందించుకోవడంతో పాటు.. మరోసారి ఆలింగనం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. శుక్రవారం వాఘా సరిహద్దు నుంచి లాహోర్ చేరుకున్న సిద్ధూ శనివారం ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతిచర్చల ప్రక్రియ కోసం ఇమ్రాన్ ఖాన్ చొరవ తీసుకోవాలని.. తాను పాక్‌కు ఓ స్నేహితుడిగానే వచ్చాననీ, ప్రేమ సందేశాన్ని తీసుకొచ్చానని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇమ్రాన్‌కు బహుమతిగా ‘కశ్మీర్ శాలువ’ను కూడా బహూకరించారు. కాగా ఇమ్రాన్ ఆహ్వానం పంపినప్పటికీ మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లు వ్యక్తిగత కారణాలతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. 1996 నుంచి అలుపెరగని పోరాటం క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కల నెరవేరేందుకు దాదాపు 22 ఏళ్లు పట్టింది. పాక్ క్రికెటర్లలో మేటిగా పేరుపడ్డ ఇమ్రాన్ 1992లో పాకిస్తాన్‌కు క్రికెట్ వరల్డ్ కప్ సాధించిపెట్టారు. నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పీఎంఎల్–ఎన్, బెనజీర్ భుట్టో పార్టీ పీపీపీకి చెక్‌పెట్టే లక్ష్యంతో 1996లో పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ)ను స్థాపించారు. 2002, 2013ల్లో పాక్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. అయితే 2013 ఎన్నికల్ని రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ.. నవాజ్ షరీఫ్ రాజీనామా కోసం డిమాండ్ చేస్తూ ఆగస్టు 2014లో లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఎన్నికల అక్రమాలపై విచారణకు న్యాయ కమిషన్ ఏర్పాటుకు షరీఫ్ ప్రభుత్వం దిగివచ్చింది. అవినీతిపై ఉక్కుపాదం మోపుతానని, పేదరిక నిర్మూలన పథకాలకు శ్రీకారం చుడతానని, విద్య, ఆరోగ్యం మెరుగుపరుస్తానని 2018 ఎన్నికల ప్రచారంలో హామీలిచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఇమ్రాన్ ఖాన్.. మొదటి భార్య జెమీమాతో 2004లో తెగ దెంపులు చేసుకున్నారు. అనంతరం టీవీ యాంకర్ రెహం ఖాన్‌తో వివాహ బంధం 10 నెలలకే ముగిసింది. ఈ ఏడాది తన ఆధ్యాత్మిక మార్గదర్శి బుష్రా మనేకాను ఇమ్రాన్ పెళ్లి చేసుకున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా అల్వీ పార్టీ సీనియర్ చట్టసభ్యుడు డాక్టర్ అరిఫ్ అల్వీని పాక్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నామినేట్ చేశామని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ తెలిపింది. సెప్టెంబర్ 4న అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని పాక్ ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో పీటీఐ తన అభ్యర్థిని ప్రకటించింది. దంతవైద్యుడైన అల్వీ పీటీఐ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. -
పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ 22వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ఇమ్రాన్ ఖాన్(65)కు మార్గం సుగమమైంది. ఇస్లామాబాద్‌లోని పాక్ జాతీయ అసెంబ్లీలో శుక్రవారం ప్రధాని పదవికి జరిగిన ఎన్నికలో ఇమ్రాన్‌కు 176 ఓట్లు రాగా, ప్రతిపక్ష పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) చీఫ్ షాబాజ్ షరీఫ్‌కు కేవలం 96 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ నేపథ్యంలో శనివారం అధ్యక్ష భవనంలో ఇమ్రాన్ చేత పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఓటింగ్ సందర్భంగా బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో 54 మంది సభ్యులున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఓటు వేయకపోవడంతో ప్రధానిగా ఇమ్రాన్ ఎన్నిక లాంఛనప్రాయమైంది. ఎన్నిక సందర్భంగా తమకు ఓటేయాలని పీఎంఎల్–ఎన్ నేత షాబాజ్ వ్యక్తిగతంగా చేసిన విజ్ఞప్తిని సైతం బిలావల్ భుట్టో తిరస్కరించారు. ముత్తహిద క్వామీ మూమెంట్(7), బలూచిస్తాన్ అవామీ పార్టీ(5), పాకిస్తాన్ ముస్లిం లీగ్(3), గ్రాండ్ డెమొక్రటిక్ అలయెన్స్(3), అవామీ ముస్లిం లీగ్(1), జమోరి వతన్ పార్టీ(1)లు ఇమ్రాన్‌కు మద్దతు ఇచ్చాయి. అంతేకాకుండా 9 మంది స్వతంత్ర అభ్యర్థులు ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) పార్టీలో చేరడం, మహిళలకు రిజర్వు చేసిన 60 సీట్లలో 28 స్థానాలను, మైనారిటీలకు కేటాయించిన 10 సీట్లలో ఐదింటిని పీటీఐ దక్కించుకుంది. దీంతో ఇమ్రాన్ మద్దతుదారుల బలం జాతీయ అసెంబ్లీలో ఏకంగా 176 సీట్లకు చేరుకుంది. పాక్ ప్రధాని అయ్యేందుకు 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో 172 మంది మద్దతు కావాలి. ఈ ఎన్నికలో ఇమ్రాన్ గెలిచినట్లు పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ కైసర్ ప్రకటించగానే, ప్రతిపక్ష పీఎంఎల్–ఎన్ సభ్యులు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో నినాదాలు చేశారు. మరోవైపు నలుపు రంగు షేర్వానీలో ఇమ్రాన్ శనివారం ప్రమాణస్వీకారం చేస్తారని పీటీఐ అధికార ప్రతినిధి ఫైజల్ జావేద్ తెలిపారు. లాహోర్‌కు చేరుకున్న సిద్ధూ మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు శుక్రవారం లాహోర్‌కు చేరుకున్నారు. నీలిరంగు సూట్, గులాబీ రంగు తలపాగా ధరించిన సిద్ధూ వాఘా సరిహద్దు మీదుగా పాక్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా లాహోర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతిచర్చల ప్రక్రియ కోసం ఇమ్రాన్ ఖాన్ చొరవ తీసుకోవాలని కోరారు. తాను పాక్‌కు ఓ స్నేహితుడిగానే వచ్చాననీ, ప్రేమ సందేశాన్ని తీసుకొచ్చానని వెల్లడించారు. ఆటగాళ్లు, కళాకారులు ఇరుదేశాల ప్రజలను దగ్గరచేయడంలో సాయపడతారని వ్యాఖ్యానించారు. తన స్నేహితుడు ఇమ్రాన్ సంతోషంలో భాగం పంచుకునేందుకే వచ్చానని సిద్ధూ అన్నారు. ఇమ్రాన్ కోసం బహుమతిగా ‘కశ్మీర్ శాలువ’ను తీసుకొచ్చినట్లు సిద్ధూ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. శనివారం ఇస్లామాబాద్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం సిద్ధూ ఇస్లామాబాద్‌కు వెళ్లనున్నారు. కాగా ఇమ్రాన్ ఆహ్వానం పంపినప్పటికీ మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లు వ్యక్తిగత కారణాలతో ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. -
షరీఫ్ కూతురి కామాలు, ఫుల్‌స్టాపులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరయమ్ నవాజ్‌పై జడ్జిలు అసహనం వ్యక్తం చేశారు. అవన్‌ఫీల్డ్ అవినీతి కేసు వ్యవహారంలో కోర్టు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసింది. అయితే ఆమె ప్రకటన చదివి వినిపిస్తున్న సమయంలో కామాలు, ఫుల్స్టాపులను కూడా చదువుకుంటూ పోయారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన జడ్జి వాటిని వదిలేసి ఉన్న మ్యాటర్ చదవాలంటూ ఆమెను కోరారు. అయినా మరయమ్ మాత్రం అలానే చదువుకుంటూ వెళ్లారు. వెటకారం చేస్తున్నారా? అంటూ ఒకానోక దశలో జడ్జి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫుల్‌స్టాపులు, కామాలు చదవకపోతే మొత్తం అర్థాలు మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని కూడా చదివి వినిపిస్తున్నా’ అంటూ ఆమె ప్రశాంతంగా బదులిచ్చి కూర్చున్నారు. ఈ కేసులో జడ్జి అడిగిన మొత్తం 128 ప్రశ్నలలో 46కు మాత్రమే సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. మరయమ్ కంటే ముందు నవాజ్ షరీఫ్‌ను కూడా జడ్జి ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ రికార్డు చేశారు. -
ఇస్లామాబాద్‌లో భారత బృందం
ఇస్లామాబాద్: భారత్–పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపేందుకు, అనధికార రాయబార విధానం పునరుద్ధరణకు భారత ప్రతినిధుల బృందం గత నెలలో పాకిస్తాన్లో పర్యటించింది. ఇటీవల భారత్–పాక్‌ల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో తాజా చర్చలు జరగ్గా, భారత బృందానికి విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వివేక్ కట్జూ నేతృత్వం వహించారు. ప్రముఖ విద్యావేత్త జేఎస్ రాజ్‌పుత్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. పాకిస్తాన్ బృందానికి ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఇనాముల్ హాక్ నేతృత్వం వహించారు. ఏప్రిల్ 28 నుంచి 30 వరకు జరిగిన ఈ భేటీలో ఏ విషయాలు చర్చించారనేది అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ద్వైపాక్షిక సంబంధాలపై అన్ని కోణాల్లోనూ చర్చలు జరపడంతోపాటు సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘నిమ్రానా∙డైలాగ్’గా పిలిచే ఈ అనధికార చర్చలు 1990ల్లోనే మొదలయ్యాయి. రాజస్తాన్‌లో ఉండే నిమ్రానా కోటలో తొలిసారి ఈ చర్చలు జరగడంతో వీటికి ఆ పేరు వచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా కూడా ఈ చర్చలు జరిగాయి. మోదీ ప్రధాని అయ్యాక 2015లో ఒక్కసారే జరిగాయి. -
స్నేహితుల బ్రేకప్ పార్టీ..వైరల్!
-
బ్రేకప్: దోస్తుకు కిర్రాక్ పార్టీ!
స్నేహితులు అంటే అంతే.. బాధయినా ఆనందమైనా కలిసి పంచుకుంటారు. విజయాలు సాధించినప్పుడు భుజాలపై మోస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నంటి నడుస్తారు. అలాంటి వారే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్.. బ్రేకప్ చేసుకొని బాధలో ఉన్న స్నేహితుడిని ఎలా ఒంటరిగా వదిలేస్తారు. అందుకే బ్రేకప్ చేసుకున్నా... ఇదిగో ఈ విధంగా గ్రాండ్‌గా పార్టీ చేశారు పాకిస్థాన్ కుర్రాళ్లు. ఇస్లామాబాద్ కాలేజీకి చెందిన ఓ కుర్రాడు ఇటీవల బ్రేకప్ చేసుకున్నాడు. ఆ విషయం తెలియడంతో బాధలో తమ స్నేహితుడిలో జోష్ నింపేందుకు తోటి విద్యార్థులు బ్రేకప్ పార్టీ ఇచ్చారు. బ్రేకప్ అయిన మిత్రుడికి పూలదండతో స్వాగతం చెప్పి.. అతడితో రుచికరమైన చాక్లెట్ కేక్‌ను కట్ చేయించి.. అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. మిత్రుడికి ‘ఆజాదీ’ (స్వాతంత్ర్యం) వచ్చిందంటూ.. అతడి ప్రియురాలు పారిపోయిందంటూ నినాదాలు చేస్తూ.. హంగామా చేశారు. ఇస్లామాబాద్‌లోని కమ్శాట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఐఐటీ)లో ఈ ఘటన చోటుచేసుకుంది. చూడటానికి సరదాగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
భారత రాయబారికి అవమానం
న్యూఢిల్లీ : దాయాది పాకిస్తాన్ మరోసారి తన వంకరబుద్ధిని బయటపెట్టుకుంది.భారత రాయబారి అజయ్ బిసారియాను ఉద్దేశపూర్వకంగా అవమానించింది.పలు దేశాల రాయబారులు, ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండే ఇస్లామాబాద్ క్లబ్లో బిసారియా చేరకుండా అడ్డుకునేయత్నం చేసింది. సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో ముగిసే ప్రయను నెలలు గడుస్తున్నా వాయిదావేస్తూవచ్చింది. గతంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న పరిస్థితుల్లోనూ ఇలా ఎప్పుడూ జరగలేదు. కొంతకాలంగా సరిహద్దులో వరుస కాల్పులు, ఉద్రక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ తాజా చర్య మరింత రెచ్చగొట్టినట్లైంది. రాయబారుల అడ్డా ఇస్లామాబాద్ క్లబ్ : పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రాయబార కార్యాలయాలకు సమీపంగా ఇస్లామాబాద్ క్లబ్ ఉంది. 350 ఎకరాల సువిశాల ప్రాగణంలో గోల్ఫ్, స్విమ్మింగ్, రెస్టారెంట్ సహా సకల సదుపాయాలుంటాయి. పాక్‌లో పనిచేసే అన్ని దేశాల రాయబారులు, వారి కుటుంబాలు, అత్యున్నతాధికారులకు అదొక రిక్రియేషన్ ప్లేస్. ఏ దేశం నుంచైనా కొత్తగా రాయబారి నియమితులయ్యారంటే, గంటల వ్యవధిలోనే ఆ క్లబ్లో మెంబర్ కావడం రివాజుగా వస్తోంది. అలా ఇస్లామాబాద్ క్లబ్ రాయబారుల అడ్డాగా పేరుపొందింది. కాగా, గత డిసెంబర్లో అజయ్ బిసారియా పాకిస్తాన్లో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం ఇస్లామాబాద్ క్లబ్ మెంబర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నప్పటికీ పాక్ అధికారులు ఆయనకు సభ్యత్వం ఇవ్వలేదు. భారత రాయబారుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలన్న ఉద్దేశంలోనే పాక్ ఈ రీతిగా వ్యవహరిస్తున్నది. మరి భారత్‌లో పాక్ రాయబారి సంగతేంటి? : వేర్పాటువాద నేతలతో వరుస భేటీలు నిర్వహించి వివాదాస్పదుడిగా పేరుపొందిన అబ్దుల్ బాసిత్ పదవీ విరమణ అనంతరం భారత్‌లో పాక్ రాయబారిగా సోహైల్ మొహమ్మద్(గతేడాది మేలో) నియమితులైన సంగతి తెలిసిందే. బాసిత్ అనుభవం దృష్ట్యా సోహైల్ కార్యకలాపాలకు సంబంధించి భారత ప్రబుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ఢిల్లీ శివారు నోయిడా, గురుగ్రామ్‌లలో పర్యటనకు ఆయనను అనుమతించడంలేదు. దీంతో పాకిస్తాన్కూడా అదే తరహా ఆంక్షలకు తెరలేపింది. -
ఆ వార్తను నిజం చేసేసిన మాజీ క్రికెటర్
ఇస్లామాబాద్ : మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ మూడో వివాహం చేసేసుకున్నారు. ఆధ్మాత్మిక గురువు బుష్రా మనేకాను పరిణాయమాడినట్లు పీటీఐ అధికారికంగా వెల్లడించింది. ఆదివారం లాహోర్‌లోని బుష్రా మనేకా(పింకీ పీర్) సోదరుడి ఇంట్లో ఈ వేడుక జరిగినట్లు పీటీఐ అధికార ప్రతినిధి పవాద్ చౌదరి వెల్లడించారు. కాగా, గత జనవరి నుంచి వీరిద్దరి వివాహం గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు రాగా.. పీటీఐ వాటిని ఖండిస్తూ వస్తోంది. 1992లో పాక్ జట్టుకు క్రికెట్ ప్రపంచ కప్ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్.. తొలుత బ్రిటిష్ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఖాన్.. జర్నలిస్టే అయిన రేహమ్‌ను(2015లో) రెండోపెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. కొంతకాలంగా ఆయన ఒంటరిగా ఉంటున్నారు. Wishing Chairman @ImranKhanPTI and his wife a happy married life . May Allah bless the couple. #MubarakImranKhan pic.twitter.com/BYHQ9CCaA8 — PTI (@PTIofficial) 18 February 2018 -
హఫీజ్‌కు పాక్ బిగ్ షాక్
ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కర్-ఇ-తాయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ పాకిస్థాన్ పెద్ద షాక్ ఇచ్చింది. హఫీజ్‌ను ఉగ్రవాదిగా గుర్తిస్తూ... అతనికి చెందిన సంస్థలపై నిషేధం విధించింది. గతంలో ఐక్యరాజ్యసమితి హఫీజ్‌కు చెందిన లష్కర్-ఇ-తాయిబా, జమాత్ ఉద్ దవా లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలోనే నిధుల సేకరణ అనుమతికి నిరాకరించిన పాక్.. ఇప్పుడు పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. 1997 ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సవరణలు చేసి మొత్తం 27 సంస్థలను ఉగ్రవాద జాబితాలో జత చేర్చింది. గత వారమే అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఆర్డినెన్స్ పై సంతకం చేసినప్పటికీ.. సోమవారం ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. తక్షణమే ఈ నిషేధం అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. అయితే హఫీజ్‌ను అరెస్ట్ చేసే విషయంపై మాత్రం పాక్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, 26/11 ముంబై దాడులకు హఫీజ్ ప్రధాన సూత్రధారి. అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా హఫీజ్‌గా గుర్తించి అతనిపై 10 మిలియన్ డాలర్ల నజరానాను కూడా ప్రకటించింది. ఐరాస ఒత్తిడి మేరకు 297 రోజులపాటు అతన్ని గృహ నిర్భందం చేసిన పాక్ ప్రభుత్వం, లాహోర్ కోర్టు ఆదేశాల మేరకు చివరకు విడుదల చేయాల్సి వచ్చింది. పాక్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్న తరుణంలో హఫీజ్‌కు తాజా నిర్ణయం ఊహించని దెబ్బే. -
నియంతృత్వ పాలన దిశగా పాక్?!
పాకిస్తాన్లో మళ్లీ నియంతృత్వ పాలన రానుందా? పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పూర్తికాలం మనుగడ సాగించలేవా? ప్రజా ప్రభుత్వాలకంటే.. నియంతృత్వ పాలకులే మేలని ప్రజలు అనుకుంటున్నారా? పారిణామాలు చూస్తుంటే.. ఏదైనా జరగవచ్చు అని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇస్లామాబాద్ : ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. దేశం సైనిక పాలన దిశగా మళ్లుతున్న అనుమానాలు వస్తున్నాని అంతర్జాతీయ ఆన్లైన్ న్యూస్ మ్యాగజైన్ ప్రకటించింది. ప్రస్తుతంపాకిస్తాన్లో అత్యంత కుట్రపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని ఆ మేగజైన్ పేర్కొంది. పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ఏర్పాటు చేసిన గ్రాండ్ అలయెన్స్, అదే సమయంలో ఆయన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు మద్దతు పలకడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయని మేగజైన్ తెలిపింది. ముంబై దాడులు సూత్రధారి హఫీజ్ సయీద్ ఇప్పటికే 2018 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే గృహనిర్భంధంలో ఉన్న సమయంలోనే హఫజ్ సయీద్ మిల్లీ ముస్లిం లీగ్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. హహీజప్ సయీద్ గృహనిర్భంధాన్ని పొడిగించాలన్న పంజాబ్ ప్రభుత్వం అభ్యర్థనను పాక్ న్యాయవ్యవస్థ తోసిపుచ్చడం కూడా అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. పాకిస్తాన్ సైన్యం, మత సంస్థలు.. తమ మధ్యనున్న వివాదాలను పరిష్కరించుకునే దిశగా అడుగులే వేస్తున్నాయి. ఇదే అత్యంత ప్రమాదకర పరిణామాలకు సంకేతాలని మేగజైన్ తెలిపింది. హఫీజ్ సయీద్ విడుదల తరువాత పాకిస్తాన్లో జీహాదీ గ్రూపులు మరింత ధైర్యంగా, స్వేచ్ఛగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటివరకూ మతసంస్థల అధిపతులగా ఉన్న వ్యక్తులంతా.. హఫీజ్ సయీద్ బాటలో.. ప్రధాన రాజకీయ స్రవంతిలోకి వస్తున్నారు. ఇదిలా ఉండగా.. మాజీ మిలటరీ పాలకుడు ముషారఫ్ త్వరలోనే పాకిస్తాన్లో తిరిగి అడుగు పెటడుతున్నట్లు జీహాదీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ముషారఫ్ పాక్‌లో అడుగు పెడితే.. పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
పాక్ సైన్యం దళారీ పాత్ర
మూడు వారాలుగా పాకిస్తాన్‌లోని ప్రధాన నగరాలను దిగ్బంధించి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఛాందసవాద బృందాలదే చివరకు పైచేయి అయింది. ‘దైవదూషణ’ ఆరోపణలొచ్చిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి జహీద్ హమీద్ పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. ఆందోళనకారుల ఇతర డిమాండ్లకు సైతం ప్రభుత్వం తలొగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొత్తగా తీసుకొచ్చిన ప్రజా ప్రాతినిధ్య చట్టంలో వాడిన ఒక పదం ఇంత చేటు ఆందోళనకూ, హింసకూ కారణమైందంటే నమ్మ బుద్ధికాదు. కానీ పాకిస్తాన్ రాజకీయాల తీరే అంత. అక్కడ ప్రజలెన్నుకున్న పార్లమెంటు కంటే... దేశాన్నేలే ప్రభుత్వం కంటే ఈ ఛాందసవాద బృందాల ఆధిపత్యమే అధికంగా కనిపిస్తుంది. వాటికి పాకిస్తాన్ సైన్యం అండదండలీయడం కూడా రివాజే. నిజానికి ఈ ధోరణులే కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ సమాజాన్ని దిగజారుస్తున్నాయి. క్రమేపీ దాన్ని ఉగ్రవాద ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఈసారి కూడా అలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. ఈ మూడువారాలూ పాక్ నగరాలు తీవ్ర హింసను చవిచూశాయి. ఇస్లామాబాద్–రావల్పిండి నగరాల మధ్య నున్న ముఖ్యమైన ఫ్లైఓవర్‌ను ఆక్రమించుకున్న 2,000మంది ఆందోళనకారులు నిత్యావసరాలు మొదలుకొని వేటినీ కదలనీయలేదు. ప్రభుత్వం అక్షరాలా స్తంభిం చిపోయింది. అంతర్జాతీయంగా పరువుపోతున్నదని అర్ధమయ్యాక సైన్యాన్ని పిలిపించడానికి ప్రయత్నిస్తే అది బేఖాతరు చేసింది. ఆందోళనకారులతో మాట్లాడి ఒక ఒప్పందానికి రావాలని సలహా ఇచ్చింది. నిజానికి ఇరు పక్షాలూ ఒక అవ గాహన కొస్తే కుదిరేదాన్ని ఒప్పందం అంటారు. ఇది ఆ బాపతు కాదు. ఆందో ళనకారులు రాసిచ్చిన డిమాండ్ల కాగితంపై ఒప్పుకుంటున్నట్టు ప్రభుత్వం చేత పాక్ సైన్యం సంతకం పెట్టించింది. పరువు నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై చివరకు ఛాందసవాద బృందాల ముందు పాలకులు సాగిలపడవలసి వచ్చింది. పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ కుటుంబం విదేశాల్లో వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిందని పనామా పత్రాల్లో వెల్లడయ్యాక ఆయనను పాకిస్తాన్ సుప్రీంకోర్టు అనర్హుడిగా తేల్చడంతో నవాజ్ పదవినుంచి దిగపోయారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న దేశం ఆ తర్వాత మరింత అనిశ్చితిలోకి జారుకుంది. ఆయన స్థానంలో వచ్చిన షహీద్ ఖాకాన్ అబ్బాసీ పరిస్థితి అయోమయంగా ఉంది. చాన్నాళ్లనుంచి రాజకీయాల్లో ఉంటున్నా, మంత్రి పదవులు చేసినా ఆయనేమీ సమర్ధుడన్న పేరు తెచ్చుకోలేదు. నిజానికి అలాంటి వ్యక్తి ఆ పదవిలో ఉంటేనే తన మాట చెల్లుబాటవుతుందని, వెనకుండి నడిపించవచ్చని షరీఫ్ భావించినట్టు న్నారు. ఆయన ముందస్తు జాగ్రత్తల మాటెలా ఉన్నా పాకిస్తాన్ ప్రజలు మాత్రం నానా అగచాట్లూ పడుతున్నారు. పాలన ఏమైపోయిందో తెలియక గందరగోళ పడుతున్నారు. ఈలోగా బరేల్వీ సున్నీ ఛాందసవాదులు మహమ్మద్ ప్రవక్తకు అపచారం జరిగిందంటూ రోడ్డెక్కారు. ఇంతకూ ఏమిటా అవమానం? పాక్ సైనిక దళాల చీఫ్‌గా పనిచేసి ఆ తర్వాత దేశాధ్యక్షుడైన పర్వేజ్ ముషార్రఫ్ తన ఏలు బడిలో ప్రజా ప్రాతినిధ్య చట్టం తీసుకొచ్చారు. అబ్బాసీ సర్కారు దాని బదులు ఎన్నికల చట్టం పేరిట కొత్త చట్టాన్ని తెచ్చింది. ప్రజాప్రతినిధులుగా పోటీచేసేవారు ఇవ్వాల్సిన డిక్లరేషన్‌లోని ఒక పదాన్ని ఆ చట్టం మార్చింది. మహమ్మద్ ప్రవక్త పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి సంబంధించిన డిక్లరేషన్‌లో ‘ప్రగాఢ విశ్వాసంతో ప్రమాణం చేస్తున్నాను...’ అనడానికి బదులు ‘ఇందుమూలంగా ప్రక టిస్తున్నాను...’ అని ఉంది. ఇది ప్రవక్తను కించపరచడం కిందికొస్తుందని, దేశంలో ముస్లిమేతరులుగా ముద్రబడ్డ అహ్మదీయాలకు లబ్ధి చేకూర్చడమే దీని ఉద్దేశమని ఛాందసవాదుల ఆరోపణ. అహ్మదీయాలు 1889లో తమ తెగకు ఆద్యుడైన మీర్జా గులాం అహ్మద్‌ను కూడా ప్రవక్తగానే భావిస్తారు. జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం 1974లో రాజ్యాంగ సవరణ చేసి అహ్మదీయాలను ఎన్నికల్లో పోటీకి అనర్హుల్ని చేసింది. వారు ఓటర్లయినా, ఓటు హక్కున్నా పోటీ చేయడం కుదరదని ఆ సవరణ చెబుతోంది. అలాగే ముస్లింల కోసం, ముస్లిమేతరుల కోసం రెండు వేర్వేరు ఓటర్ల జాబితాలు రూపొందించాలని నిర్దేశించారు. 2002లో ముషార్రఫ్ తెచ్చిన ప్రజా ప్రాతినిధ్య చట్టం ఒకే ఓటర్ల జాబితాకు పరిమితమవ్వాలని చెప్పినా ఆచరణలో అహ్మదీయాలపై ఉన్న వివక్షను తొలగించలేదు. ఆ చట్టం కూడా అహ్మదీయాలను పోటీకి అనర్హులుగానే పేర్కొంది. అబ్బాసీ ప్రభుత్వం పదాలను మార్చడం మినహా ఇందులో మౌలికంగా చేసిన మార్పేమీ లేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం పర్యవసానంగా ఛాందసవాద సంస్థలన్నీ రెచ్చిపోయాయి. చట్టం తెచ్చిన న్యాయ మంత్రి తప్పుకోవాలని, ఆయనపై దైవదూషణ కేసు పెట్టాలని డిమాండ్ చేశాయి. వారి కోసమని ప్రభుత్వం దిగొచ్చి పాత పదజాలాన్ని , పాత సెక్షన్లను యధాతథంగా ఉంచుతూ సవరణ చట్టాలు తెచ్చింది. అయినా వారు శాంతించ లేదు. చివరకు సైన్యం దళారీగా మారి వారి కోర్కెలను ప్రభుత్వం ఆమోదించేలా చేసింది. చట్టసభలను భ్రష్టు పట్టించడం, వాటికి విలువ లేకుండా చేయడం... తమ విశ్వాసాలే పవిత్రమని, అవి మాత్రమే అధికార భావజాలంగా ఉండాలని కోరుకోవడం పాకిస్తాన్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అలాగని వేరే దేశాల్లో అంతా సవ్యంగా ఉందని చెప్పలేం. గతంలో శ్రీలంక, ఇప్పుడు మయన్మార్ కూడా ఈ ధోరణులకు ప్రతీకలు. ఇలాంటి పోకడలు మన దేశంలో కూడా బయ ల్దేరుతున్నాయని ఇటీవలకాలంలో ప్రజాస్వామికవాదులు ఆందోళనపడుతున్నారు. ప్రజల సమస్యలు చర్చించడానికి, పరిష్కార మార్గాలు అన్వేషించడానికి చట్టసభలున్నప్పుడు వాటిని బేఖాతరు చేయడం, మూకలదే పైచేయి కావడం అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. అరాచకాన్ని తీసు కొస్తుంది. అందువల్లే ప్రైవేటు వ్యక్తుల, బృందాల తీరు పట్ల ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలి. వారికి సాష్టాంగపడే పాలకుల విషయంలో జాగురూకతతో మెలగాలి. -
పాక్ వింత నిర్ణయం కోళ్లు, ఆవుల మీద పన్ను
-
కోళ్లు, ఆవులపై పాక్ వింత నిర్ణయం
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రభుత్వం తుగ్లక్ పాలనను తలపించేలా ప్రజలపై పన్నులు విధిస్తోంది. పెంచుకునే కోళ్లు, ఆవులు, ఇతర పెంపుడు జంతువుల మీద పన్నులు చెల్లించాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాక్ ప్రభుత్వ ఆదేశాలపై గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇటువంటి పన్నులను చెల్లించేది లేదని తెగేసి చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు షాక్ ఇచ్చారు. చిరువర్తకుల వ్యాపారాలపై పాకిస్తాన్ ప్రభుత్వం కొత్తగా విధించిన పన్నును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. శనివారం నాడు వేల సంఖ్యలో ప్రజలు దుకాణాలు మూసివేసి రోడ్లమీదకు వచ్చి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమపై అక్రమ పన్నులు విధిస్తోందని.. ప్రజలు పేర్కొన్నారు. నిరసనల సందర్భంగా బిల్గిత్, బల్టిస్తాన్‌లలో వ్యాపారులు పూర్తిగా దుకాణాలు మూసివేశారు. పన్నులను ఉపసంహించేంతవరకూ అంతేకాక ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేదిలేదని వ్యాపారులు తేల్చి చెప్పారు. ఇళ్లలో పెంచుకునే కోళ్లమీద, పాడి ఆవులు, బర్రెల మీద మేం పన్నులు చెల్లించాలా? ఇంట్లో 5 మందికన్నా అధికంగా ఉంటే పన్నులు కట్టాలా? ఇటువంటి పన్నులు ఎక్కడైనా ఉంటాయా? అని స్కుర్దు ప్రజలు ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే.. రేప్పొద్దున గడ్డం పెంచకపోతే పన్ను.. పెంచితే పన్ను వేస్తారేమోనని వ్యగ్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ పన్నులను ఎట్టి పరిస్థితుల్లో చెల్లించేది లేదని.. అవసరమైతే.. ఇస్లామాబాద్‌ను ముట్టడిస్తామని గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. -
పాక్-చైనా అనుబంధం సాటిలేనిది: పాక్ ఆర్మీ ఛీఫ్
ఇస్లామాబాద్: పాక్ - చైనా అనుబంధంపై ఇరు దేశాలు ఆడుతున్న దాగుడు మూతలాట బయట పడింది. సాక్షాత్తు పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావీద్ బజ్వా తమ అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. తమ అనుబంధానికి ప్రపంచంలో సాటిలేదని పాక్ ఆర్మీ ఛీఫ్ చెప్పుకురావడం విశేషం. పాకిస్తాన్, ఇస్లామాబాద్‌లోని చైనా దౌత్యకార్యాలయంలో మంగళవారం జరిగిన చైనా 90వ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో జావీద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డోక్లాం వద్ద భారత్- చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితు మధ్య ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈసందర్భంగా పాక్ ఆర్మీ ఛీఫ్ మాట్లాడుతూ పాక్ చైనాల మధ్య అనుబంధానికి సమానమైనది ప్రపంచంలో ఏదీ లేదన్నారు. భారత్‌కు పక్కలో బల్లెంలా తయారైన చైనాను తన సోదర దేశంగా అభివర్ణించారు. ఈసందర్భంగా చైనా అంబాసిడర్‌గా పనిచేస్తున్న ఆసిఫ్ గఫూర్ రెండు దేశాల మధ్య పరస్పర సైనిక సహకారం, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మూల స్తంభం అని సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్టు చేశారు. వీటన్నింటినీ పాకిస్తాన్ మీడియా ప్రముఖంగా పేర్కొన్నాయి. -
ఇండియాకు పాకిస్తాన్ వార్నింగ్
ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి కాల్పుల వ్యవహారం భారత్-పాకిస్తాన్ల మధ్య మరోసారి దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ఎల్వోసీని ఆనుకుని ఉన్న గ్రామాలపై భారత బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నాయని పాకిస్తాన్ ఆరోపించింది. దీనికి సమాధానం చెప్పాలంటూ ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్‌కు పాక్ విదేశాంగ శాఖ సోమవారం సమన్లు జారీచేసింది. తక్షణమే కాల్పులు ఆపకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ‘జూన్ 10, 12 తేదీల్లో ఎల్వోసీలోని సచిరికోట్, హాట్‌స్పైరింగ్ సెక్టార్లపైకి భారత బలగాలు జరిపిన కాల్పులు ముగ్గురు పౌరులు చనిపోయారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ పదేపదే ఉల్లంఘిస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇండియన్ డిప్యూటీ కమిషనర్ జేపీ సింగ్‌కు సార్క్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఫైజల్ సమన్లు జారీచేశారు’ అని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. సైన్యం కూడా పౌరులు చనిపోయిన విషయాన్ని నిర్ధారించిందని, భారత్ చర్యను మానవహక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. -
‘తుపాకీ గురిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు’
ఇస్లామాబాద్: తలకు తుపాకీని గురిపెట్టి మరీ పాకిస్థాన్ వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని ఓ భారతీయురాలు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. తిరిగి తనను మాతృదేశం(భారత్) పంపించే వరకు వెళ్లబోనంటూ స్పష్టం చేసింది. మరోపక్క, ఆమె భర్త మాత్రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక వర్గాల సమాచారం ప్రకారం ఉజ్మా అనే భారతీయ మహిళకు తాహిర్ అలీ పాక్ వ్యక్తికి మలేషియాలో పరిచయం అయింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో తన బంధువులను చూసేందుకు వెళుతున్నానని చెప్పి ఉజ్మా వాఘా సరిహద్దు గుండా మే 1న పాక్‌కు వెళ్లింది. అక్కడే వారి వివాహం మే 3న అయినట్లు తెలుస్తోంది. అయితే, అతడికి అంతకు ముందే వివాహం అయినట్లు, నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం ఉజ్మాకు తెలియదు. పైగా, కేవలం చూసేందుకు వెళ్లిన తనపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా బెదిరించి, తుపాకీ గురి పెట్టి మరి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, అప్పటి నుంచి శారీరకంగా, లైంగికంగా హింసిస్తున్నాడంటూ భారత హైకమిషనర్‌ను ఆశ్రయించింది. వెంటనే తనను భారత్ పంపించాలని, తన వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ దస్తా వేజులు కూడా వారు దొంగిలించారని ఆరోపించింది. ఈ విషయంపై అటు ఇండియాలోని పాక్ హైకమిషనర్, పాక్‌లోని భారత హైకమిషనర్ సమన్వయ పరుస్తున్నాయి.


