ఆ వార్తను నిజం చేసేసిన మాజీ క్రికెటర్‌ | Imran Khan Third Marriage with his Spiritual Adviser | Sakshi
Sakshi News home page

Feb 19 2018 8:11 AM | Updated on Feb 19 2018 8:11 AM

Imran Khan Third Marriage with his Spiritual Adviser - Sakshi

ఇస్లామాబాద్‌ : మాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో వివాహం చేసేసుకున్నారు. ఆధ్మాత్మిక గురువు బుష్రా మనేకాను పరిణాయమాడినట్లు పీటీఐ అధికారికంగా వెల్లడించింది.

ఆదివారం లాహోర్‌లోని బుష్రా మనేకా(పింకీ పీర్‌) సోదరుడి ఇంట్లో ఈ వేడుక జరిగినట్లు పీటీఐ అధికార ప్రతినిధి పవాద్‌ చౌదరి వెల్లడించారు. కాగా, గత జనవరి నుంచి వీరిద్దరి వివాహం గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు రాగా.. పీటీఐ వాటిని ఖండిస్తూ వస్తోంది. 

1992లో పాక్‌ జట్టుకు క్రికెట్‌ ప్రపంచ కప్‌ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్‌.. తొలుత బ్రిటిష్‌ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఖాన్‌.. జర్నలిస్టే అయిన రేహమ్‌ను(2015లో) రెండోపెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. కొంతకాలంగా ఆయన ఒంటరిగా ఉంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement